ఢిల్లీ: ఆల్‌ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు AIMPLB ప్రెసిడెంట్ రాబే హసానీ నద్వి(94) ఇక లేరు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న నద్వి.. గురువారం కన్నుమూశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న నద్విని చికిత్స కోసం రాయ్‌బరేలీ నుంచి లక్నోకు తరలించారు. అయితే దాలిగంజ్‌లోని నద్వా మదరాసాకు ఆయన్ని తరలించగా.. అక్కడే ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. సున్నీ ఇస్లామిక్ స్కాలర్ అయిన నద్వి.. ముస్లిం విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం విపరీతంగా కృషి చేశారు.
ఉత్తర ప్రదేశ్ రాయ్‌బరేలీ టాకియా కలాన్‌లో జన్మించిన రబే హసానీరాబే హసానీ నద్వి.. 2018 నుంచి ఏఐఎంపీ చీఫ్‌గాను పని చేస్తూ వచ్చారు. దారుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమా ఛాన్సలర్‌గా పని చేశారీయన. విద్యా రంగానికి నద్వి అందించిన సేవలకు మంచి పేరు దక్కింది. ప్రతీ సంవత్సరం ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన ముస్లింల జాబితాలో ఈయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది.
యూపీ ప్రభుత్వం నుంచి పలు ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు అరబిక్ భాషకు, సాహిత్యానికి చేసిన కృషికిగానూ రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. నద్వి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment