లక్నో: ఒకే దేశం ఒకే చట్టం ఆవశ్యకతపై ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మంగళవారం రాత్రికి రాత్రి సమావేశమైంది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన బోర్డు సభ్యులు యూసీసీకి వ్యతిరేకంగా న్యాయపరమైన పోరాటంపై వ్యూహ రచన చేయనున్నట్టు చెప్పారు.
ఈ అంశంలో ఏర్పాటు చేసిన 22వ లా కమిషన్‌కు సమరి్పంచాల్సిన ముసాయిదా పత్రంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా ఏఐఎంపీఎల్‌బీ సభ్యుడు ఖలీద్ రషీద్ వెల్లడించారు. న్యాయ కమిషన్ ఎదుట అభ్యంతరాలను వెల్లడించడానికి చివరి తేదీ జూలైæ 14 అని, అందుకే దీనిపై విస్తృతంగా చర్చించామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండే యూసీసీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. భారత్‌లో ఎన్నో మతాలు, సంస్కృతులకు ఉన్నాయని ఉమ్మడి పౌరచట్టాన్ని తీసుకువస్తే ముస్లింలతో పాటు హిందువులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, యూదులు ఇలా అందరిపై ప్రభావం చూపిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment