డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్ సింగ్ ధామికి సమరి్పంచింది. అందులో కీలక ప్రతిపాదనలు చేసింది.
‘‘రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్ చేయించాల్సిందే. విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయి. భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరం. బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయి. సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ, పురుషులిద్దరూ డిక్లరేషన్‌ను సమరి్పంచాలి’’ అని పేర్కొంది. ఈ నిబంధనల నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు.
యూసీసీ ముసాయిదా రూపకల్పన కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 202లో ఈ కమిటీని వేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల హామీ అమలు దిశగా ఇదో కీలక అడుగని ధామీ అభివరి్ణంచారు. ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో యూసీసీ బిల్లును తెచ్చి ఆమోదించి చట్టం చేస్తామన్నారు. యూసీసీ అమలైతే వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా సమాన చట్టాలు అమలవుతాయి.
మేమూ అదే బాటలో: అసోం సీఎం
బహుభార్యత్వం విధానాన్ని రద్దుచేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి çహిమంత బిశ్వ శర్మ కూడా ప్రకటించారు. ‘‘అసోంలో యూసీసీ అమలుపై గతేడాదే మాకు నివేదిక అందింది. దానిని న్యాయశాఖ పరిశీలిస్తోంది. కుదిరితే ఫిబ్రవరి ఐదున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టి చట్టంగా తెస్తాం’’ అని హిమంత అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment