Cohabiting Partners
-
ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వం రద్దు!
డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్ సింగ్ ధామికి సమరి్పంచింది. అందులో కీలక ప్రతిపాదనలు చేసింది. ‘‘రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్ చేయించాల్సిందే. విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయి. భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరం. బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయి. సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ, పురుషులిద్దరూ డిక్లరేషన్‌ను సమరి్పంచాలి’’ అని పేర్కొంది. ఈ నిబంధనల నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు. యూసీసీ ముసాయిదా రూపకల్పన కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 202లో ఈ కమిటీని వేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల హామీ అమలు దిశగా ఇదో కీలక అడుగని ధామీ అభివరి్ణంచారు. ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో యూసీసీ బిల్లును తెచ్చి ఆమోదించి చట్టం చేస్తామన్నారు. యూసీసీ అమలైతే వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా సమాన చట్టాలు అమలవుతాయి. మేమూ అదే బాటలో: అసోం సీఎం బహుభార్యత్వం విధానాన్ని రద్దుచేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి çహిమంత బిశ్వ శర్మ కూడా ప్రకటించారు. ‘‘అసోంలో యూసీసీ అమలుపై గతేడాదే మాకు నివేదిక అందింది. దానిని న్యాయశాఖ పరిశీలిస్తోంది. కుదిరితే ఫిబ్రవరి ఐదున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టి చట్టంగా తెస్తాం’’ అని హిమంత అన్నారు. -
సహజీవనం చేస్తున్న మహిళపై.. ఇద్దర్ని హతమార్చి.. మరొకర్ని చంపబోతూ
ఒంగోలు/కలిగిరి: సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెంచుకున్నాడు. ఆ ఇద్దరిమధ్యా తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆ మహిళ తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబంపై కత్తిదూసిన హంతకుడు ఆమె సోదరుడి భార్యను, కుమారుడిని పట్టపగలే చంపేశాడు. అక్కడి నుంచి ఒంగోలు చేరుకుని తాను సహజీవనం చేసిన మహిళతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో కత్తితో మరో వ్యక్తి గొంతు కోసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. శనివారం చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన నూర్జహాన్‌కు నెల్లూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కొంతకాలానికి భర్తతో విడిపోయింది. కాగా, కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన సమీప బంధువు షేక్ రబ్బానీ సోదరితో నూర్జహాన్ సోదరుడికి వివాహమైంది. ఆ తర్వాత నూర్జహాన్, అవివాహితుడైన రబ్బానీ మధ్య సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు. వయసు ఇప్పుడు ఆరేళ్లు. అనుమానం పెనుభూతమై.. రబ్బానీ ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులో టీ దుకాణం నిర్వహిస్తూ నూర్జహాన్, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. రబ్బానీ స్థానిక సత్యన్నారాయణపురానికి చెందిన మండ్ల కాశీకుమార్ అనే యువకుడిని తన టీ దుకాణంలో పనిలో పెట్టుకున్నాడు. కాగా, నూర్జహాన్‌తో కాశీకుమార్ చనువుగా ఉండటంతో వారిద్దరిపైనా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై రబ్బానీ, నూర్జహాన్ మధ్య విభేదాలొచ్చాయి. దీంతో నూర్జహాన్ అంబటివారిపాలెంలోని తన మరో సోదరుడు మస్తాన్ ఇంట్లో ఉంటోంది. నూర్జహాన్ను తన నుంచి దూరం చేసేందుకే కనిపించకుండా చేశారని భావించిన రబ్బానీ.. మస్తాన్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. అంబటివారిపాలెంలోని మస్తాన్ ఇంటికి శనివారం చేరుకున్నాడు. ఆ సమయంలో మస్తాన్ నెల్లూరు వెళ్లగా.. మస్తాన్ భార్య మీరమ్మ (45)తో గొడవపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో మీరమ్మ మెడపై నరికాడు. తల్లిపై దాడిని అడ్డుకోబోయిన ఆమె కుమారుడు అక్బర్ ఆలీఫ్ (23)ని పొడిచాడు. తల్లీకుమారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో హత్య చేయబోయి.. అనంతరం రబ్బానీ మోటార్ సైకిల్‌పై ఒంగోలు చేరుకున్నాడు. తన టీ దుకాణంలో పనిచేసిన మండ్ల కాశీకుమార్‌పై మంగమ్మ కాలేజీ జంక్షన్ సమీపంలో దాడిచేసి కత్తితో గొంతు కోశాడు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ హుటాహుటిన అక్కడకు చేరుకుని రబ్బానీని అదుపులోకి తీసుకుని తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన కాశీకుమార్‌ను రిమ్స్‌కు తరలించారు. తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నూర్జహాన్ను ఆరు నెలలుగా కాశీకుమార్ నెల్లూరులో దాచి అక్కడకు వెళ్లి వస్తున్నాడని, వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అందుకే కడతేర్చేందుకు యత్నించినట్లు పేర్కొన్నాడు. నూర్జహాన్ ఎక్కడ ఉందనేది తెలిసినా మీరమ్మ చెప్పనందునే ఆమెను, అడ్డువచ్చిన ఆమె బిడ్డనూ చంపేసినట్లు పోలీసులతో చెప్పినట్టు తెలిసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
మూవీ బుజ్
లవ్వాటలో లోపెజ్ తెలివి ఇదివరకు పెటాకులైన పెళ్లిళ్లు, సహజీవన భాగస్వాములతో తలెత్తిన పొరపొచ్చాలు లవ్వాటలో తనను మరింత తెలివిగా మార్చాయని పాప్ గాయని జెన్నిఫెర్ లోపెజ్ చెబుతోంది. గడచిన రెండేళ్లుగా కాస్పెర్ స్మార్టతో సహజీవనం సాగించిన లోపెజ్, ఇటీవలే అతగాడితో అనుబంధానికి ఫుల్స్టాప్ పెట్టేసింది. అయితే, ఇదివరకటి కంటే ఎక్కువగా తానిప్పుడు ప్రేమను నమ్ముతున్నానని, ప్రేమ విషయంలో ఇప్పుడు తాను కాస్త తెలివిగా మారానని అంటోంది. సల్మాన్ సరిగమ... కండల వీరుడు సల్మాన్‌ఖాన్ మరోసారి గొంతు సవరించుకున్నాడు. హ్యాంగ్ఓవర్ సినిమా కోసం సల్మాన్ గళమెత్తాడు. శ్రేయాగోషాల్తో కలిసి యుగళ గీతం ఆలపించాడు. ఇప్పటి వరకు డజనుకు పైగా పాటలకు గాత్రం అందించిన ఈ ‘బాడీగార్డ్’ తాజాగా మరోసారి రాగం ఎత్తుకున్నాడు. నన్నొదిలేయండి ప్లీజ్ బాలీవుడ్లో షార్ట్ పిరియడ్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించిన రణవీర్ సింగ్ ఇప్పుడు తలపట్టుకుంటున్నాడు. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న గాసిప్స్‌తో మనోడికి పిచ్చెక్కుతోందట. కో స్టార్లతో లింకప్‌లు, బ్రేకప్‌లతో మస్త్ మసాలా పంచుతున్న యంగ్ హీరో.. నన్నొదిలేయండి ప్లీజ్ అంటున్నాడు.