draft
-
ఇక ఈ–కామర్స్ గాడిలో..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ను మరింత జవాబుదారీగా చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ షాపింగ్ రంగంలో మోసపూరిత పద్ధతుల నుండి వినియోగదారులను రక్షించడానికి.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు స్వీయ–నియంత్రణ చర్యలను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ’ఈ–కామర్స్–ప్రిన్సిపుల్స్ అండ్ గైడ్‌లైన్స్ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్’ పేరుతో ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఈ నియమాలను రూపొందించింది. భాగస్వాముల నుంచి ఫిబ్రవరి 15లోపు అభిప్రాయాలను కోరింది. లావాదేవీకి ముందు, ఒప్పందం, కొనుగోలు తదనంతర దశలను కవర్ చేస్తూ మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టారు. ఈ నియమాలు అమలులోకి వస్తే కస్టమర్లు, ఈ–కామర్స్ కంపెనీల మధ్య జరిగే లావాదేవీల్లో పారదర్శకత మరింత పెరగనుంది. నిషేధిత ఉత్పత్తుల విక్రయాలకు అడ్డుకట్ట పడుతుంది. అట్టి ఉత్పత్తులు ఏవైనా లిస్ట్ అయితే ఫిర్యాదులకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మార్గదర్శకాల ప్రకారం.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా వ్యాపార భాగస్వాముల సంపూర్ణ కేవైసీని నిర్వహించాలి. ముఖ్యంగా థర్డ్ పార్టీ విక్రేతల పూర్తి వివరాలు ఉండాల్సిందే. ఉత్పత్తుల ప్రయోజనం, ఫీచర్లను అంచనా వేయడంలో వినియోగదారులకు సహాయం చేయడానికి టైటిల్, విక్రేత చిరునామా, గుర్తింపు సంఖ్య, వీడియోల వంటి సపోరి్టంగ్ మీడియాతో సహా వివరణాత్మక ఉత్పత్తి జాబితాను తప్పనిసరి చేస్తారు. ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నట్టయితే దిగుమతిదారు వివరాలు, ప్యాకింగ్ చేసిన కంపెనీ, విక్రేతల వివరాలు ఉండాల్సిందే. ప్రాసెసింగ్ చార్జీలు ముందే వెల్లడించాలి. ఒప్పంద సమయంలో కస్టమర్ సమ్మతి, లావాదేవీని సమీక్షించే అవకాశం, క్యాన్సలేషన్‌కు, ఉత్పత్తి వెనక్కి ఇవ్వడానికి, రిఫండ్స్‌కు పారదర్శక విధానం అమలు చేయాల్సి ఉంటుంది. లావాదేవీల పూర్తి వివరాలను నమోదు చేయాలి. చెల్లింపులు పూర్తి సురక్షితంగా జరిగేలా పేమెంట్ సిస్టమ్ అమలులోకి తేవాలి. చట్టాలకు లోబడి కస్టమర్లకు ఈ సమాచారం అందుబాటులో ఉంచాలి. విక్రేతలందరినీ కంపెనీలు సమానంగా చూడాల్సిందే. ఏ విక్రేతకూ ప్రాధాన్యత ఇవ్వకూడదు. -
అప్పీల్‌కు అవకాశం.. ఉచిత న్యాయ సహాయం..
సాక్షి, హైదరాబాద్: ముసాయిదాలో పెట్టిన కొన్ని నిబంధనలను మారుస్తూ, కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిని ‘తెలంగాణ భూభారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం–2024’గా పిలుస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన ప్రభుత్వం దీనికి సంబంధించిన ముసాయిదాను విడుదల చేసింది. అందులో 20 సెక్షన్లు ఉండగా.. తాజాగా సవరణలు, మార్పులతో అసెంబ్లీ ముందు పెట్టిన బిల్లులో 23 సెక్షన్లు ఉన్నాయి.ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పహాణీలో సాగుదారుకాలమ్, రెవెన్యూ మాన్యు వల్ రికార్డుల నిర్వహణ, ఉచిత న్యాయ సహాయం, ఇప్పటివరకు దరఖాస్తులు అందిన సాదాబైనామాల క్రమబద్ధీకరణ, తప్పుచేసిన అధికారులకు శిక్షలు, కోర్టుకు వెళ్లడంపై స్పష్టత వంటి కొత్త నిబంధనలను దీనిలో చేర్చారు. ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగానే భూభారతిలోకి వస్తాయని... రానున్న రోజుల్లో ఈ రికార్డుల సంపూర్ణ ప్రక్షాళన ఉంటుందని అందులో పేర్కొన్నారు. ముసాయిదాలో పేర్కొన్న విధంగా మ్యుటేషన్ చేసే అధికారం ఆర్డీవోలకు, రిజి్రస్టేషన్ తర్వాత మ్యుటేషన్ సమయంలో విచారణ, తప్పులుంటే మ్యుటేషన్ నిలిపివేత, పరిష్కార బాధ్యతలు కలెక్టర్ల నుంచి ఆర్డీవోలకు బదలాయింపు, ప్రతి భూకమతానికి భూదార్, ఆబాదీలకూ హక్కుల రికార్డు, హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదు, భూముల రీసర్వే వంటివి కొనసాగించారు. మళ్లీ రెవెన్యూ ట్రిబ్యునళ్లు భూభారతి ద్వారా రెవెన్యూ ట్రిబ్యునళ్లు మళ్లీ ఏర్పా టు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఈ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయ వచ్చు. ఎన్ని, ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలన్న వె సులుబాటు ప్రభుత్వానికే ఉంటుంది. అవి ఏర్పాట య్యేంత వరకు సీసీఎల్ఏనే ల్యాండ్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. తహసీల్దార్లు, సబ్రిజి్రస్టార్లు తీసు కునే నిర్ణయాలపై 60 రోజుల్లోగా ఆర్డీవోకు దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డీవోల నిర్ణయాలపై 60 రోజుల్లోగా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. భూదార్ కార్డుల జారీ, పట్టాదారు పాసు పుస్తకాల జారీకి సంబంధించిన అప్పీళ్లను ఆర్డీవోకు చేసుకోవాలి.ఈ క్రమంలో ఆర్డీవోలు తీసుకునే నిర్ణయంతో విభేదిస్తే.. 30 రోజుల్లోపు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవాలి. కలెక్టర్ల నిర్ణయాలతో విభేదిస్తే 30 రోజుల్లోపు ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ విషయంలో ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ట్రిబ్యునల్స్ లేదా అప్పిలేట్ అథారిటీలకు అప్పీల్ చేసుకునే పరిస్థితి లేని రైతులకు ప్రభుత్వం ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది. కోర్టుకు వెళ్లడంపై స్పష్టత.. సర్వే నంబర్లను అవసరానికి అనుగుణంగా సబ్ డివిజన్ చేసుకునేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్, అసైన్డ్, లావణి భూముల వివాదాలపై సుమోటోగా, లేదంటే ఏదైనా దరఖాస్తు ద్వారా తీసుకుని విచారించి రికార్డులను సరిచేసే అధికారం, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి బదిలీ తిరిగి ప్రభుత్వానికి దఖలు పరుచుకునే అధికారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు ఉంటుంది.అప్పిలేట్ అథారిటీలు, రివిజన్ అథారిటీలకు సివిల్ కోర్టులకుండే అధికారాలను ఈ చట్టం ద్వారా కల్పిస్తున్నారు. భూరికార్డులను తారుమారు చేసిన, హక్కుల రికార్డు విషయంలో తప్పులు చేసిన అధికారులను సరీ్వసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇక కేవలం యాజమాన్య హక్కుల గురించి మాత్రమే సివిల్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని... రికార్డుల్లో సవరణలు, తప్పొప్పుల గురించి కోర్టుకు వెళ్లడం కుదరదని ఈ చట్టంలో స్పష్టం చేశారు.వైఎస్ హయాంలో పెట్టిన పేరు.. ‘భూభారతి’తెలంగాణలో అమల్లోకి రానున్న కొత్త ఆర్వోఆర్ చట్టానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన ఒక భూసంబంధిత ప్రాజెక్టు పేరును ఖరారు చేయడం గమనార్హం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే తొలి భూరికార్డుల ఆధునీకరణ పైలట్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారు. ఆ ప్రాజెక్టుకు ‘భూభారతి’అని పేరుపెట్టారు. తాజాగా కొత్త చట్టానికి భూమాత, భూభారతి, వెబ్‌ల్యాండ్, మాభూమి అని నాలుగు పేర్లను ప్రతిపాదించారు. ఇందులో ప్రభుత్వం భూభారతిని ఖరారు చేసింది. సర్క్యులేషన్ విధానంలో మంత్రివర్గ ఆమోదం తీసుకుని ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ చట్టం ఎందుకు తెస్తున్నామంటే!కొత్త చట్టాన్ని తెచ్చేందుకు కారణాలను అసెంబ్లీలో పెట్టిన బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ప్రస్తుత చట్టం కారణంగా భూయజమా నులకు ఇబ్బంది కలిగిందని, ధరణి పోర్టల్‌లో లెక్కలేనన్ని పొరపాట్లు ఉన్నాయని పేర్కొంది. ఆ పొరపాట్లను సరిదిద్దే వెసులుబాటును ఆ చట్టం కల్పించలేదని, భూమి రికార్డులను సరిదిద్దుకునేందుకు సివిల్ కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితులను కలి్పంచిందని తెలిపింది. సాదాబైనామాల క్రమబద్ధికరణకు కావాల్సిన వెసులుబాటు అందులో లేదని పేర్కొంది.సభ ముందు ఉంచిన కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు, భూ ముల వివాదాలు తగ్గుతాయని.. ప్రజలు వారి ఆ స్తులు, భూములను వారి అవసరాలకు వినియోగించుకునేందుకు, వారికి ఆర్థిక స్థిరత్వం కలిగించేందుకు ఉపయోగపడుతుందని ప్రభు త్వం తెలిపింది.ప్రభుత్వ భూముల రక్షణ, సులభతరంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూరికార్డుల పోర్టల్ నిర్వహణ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, ప్రతి భూమికి భూదార్ నంబర్, కార్డుల జారీ, వ్యవసాయేతర భూములు, ఆబాదీల హ క్కుల కోసం రికార్డు తయారీ, హక్కుల రికార్డులో మ్యుటేషన్ పద్ధతిని సరిదిద్దడం, భూరికార్డుల పో ర్టల్లో నమోదైన తప్పులను సరిచేసే వ్యవస్థను నెలకొల్పడం, పార్ట్–బీలో పెట్టిన భూముల సమస్యలను పరిష్కరించడం, ప్రస్తుత రికార్డులను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు భూముల రీసర్వే నిర్వహించి కొత్త రికార్డు తయారు చేయడమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తెస్తున్నామని స్పష్టం చేసింది.24 సార్లు సవరణలు చేసి.. సభ ముందుకు..భూభారతి చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. ఈ ఏడాది ఆగస్టు 2న ముసాయిదాను విడుదల చేసింది. అన్ని వర్గాల నుంచి ఆన్లైన్ ద్వారా సలహాలు, సూచనలు స్వీకరించింది. జిల్లాస్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకుంది. ఆయా అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి.. ముసాయిదాను 14 సార్లు సవరించింది. సీఎం, రెవెన్యూ మంత్రి, ఉన్నతాధికారులతో చర్చిస్తూ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా సవరించుకుంటూ వచ్చారు.మొత్తంగా 24 సార్లు సవరించి.. 24వ ముసాయిదాను ఫైనల్ చేసి భూభారతి–2024 చట్టం బిల్లును అసెంబ్లీ ఆమోదానికి ఉంచారు. అటు ముసాయిదా, ఇటు అసెంబ్లీ ముందు పెట్టిన బిల్లు రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్ ప్రత్యేక కృషి చేయగా... రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డి కీలకపాత్ర పోషించారు. -
ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వం రద్దు!
డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్ సింగ్ ధామికి సమరి్పంచింది. అందులో కీలక ప్రతిపాదనలు చేసింది. ‘‘రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్ చేయించాల్సిందే. విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయి. భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరం. బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయి. సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ, పురుషులిద్దరూ డిక్లరేషన్‌ను సమరి్పంచాలి’’ అని పేర్కొంది. ఈ నిబంధనల నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు. యూసీసీ ముసాయిదా రూపకల్పన కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 202లో ఈ కమిటీని వేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల హామీ అమలు దిశగా ఇదో కీలక అడుగని ధామీ అభివరి్ణంచారు. ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో యూసీసీ బిల్లును తెచ్చి ఆమోదించి చట్టం చేస్తామన్నారు. యూసీసీ అమలైతే వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా సమాన చట్టాలు అమలవుతాయి. మేమూ అదే బాటలో: అసోం సీఎం బహుభార్యత్వం విధానాన్ని రద్దుచేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి çహిమంత బిశ్వ శర్మ కూడా ప్రకటించారు. ‘‘అసోంలో యూసీసీ అమలుపై గతేడాదే మాకు నివేదిక అందింది. దానిని న్యాయశాఖ పరిశీలిస్తోంది. కుదిరితే ఫిబ్రవరి ఐదున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టి చట్టంగా తెస్తాం’’ అని హిమంత అన్నారు. -
హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ముకుతాడు
ముంబై: ఆర్థిక అంశాల విషయంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)లకు నిబంధనలను కఠినతరం చేయాలని బ్యాంకింగ్ రెగ్యులేటర్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్ డిపాజిట్ల మెచ్యూరిటీ వ్యవధిని ఐదేళ్లకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ఒక ముసాయిదా సర్క్యులర్‌ను జారీ చేసింది. కొన్ని నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తున్నట్లు ఒకవైపు స్పష్టం చేస్తూనే మరోవైపు ఫిబ్రవరి 29వ తేదీలోపు ఈ ముసాయిదా పత్రంపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేసింది. హెచ్ఎఫ్సీల డిపాజిట్ల చెల్లింపులకు సంబంధించి నిధుల లభ్యత అవసరాల నిర్వహణను మెరుగుపరచుకోవడంపై కూడా ఈ సర్క్యులర్‌లో ఆర్బీఐ దృష్టి సారించింది. ప్రతిపాదిత తాజా ముసాయిదా ప్రకారం, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్‌లు లేని హెచ్ఎఫ్సీలు పబ్లిక్ డిపాజిట్లను స్వీకరించలేవు. అదే సమయంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంతో పాటు నిర్దిష్ట రుసుము ఆధారిత కార్యకలాపాలలోకి హెచ్‌ఎఫ్‌సీలను అనుమతించే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ముందస్తు అనుమతితో, రిస్క్ షేరింగ్ లేకుండా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులతో కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి కొన్ని హెచ్ఎఫ్సీలకు అనుమతి లభిస్తోంది. ఇది రెండు సంవత్సరాల ప్రారంభ కాలానికి వర్తిస్తుంది. అటుపై దీనిపై సమీక్ష, దీనికి అనుగుణంగా తదుపరి అనుమతులు ఉంటాయి. ప్రస్తుతం, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం (120 నెలల లోపు) తర్వాత తిరిగి చెల్లించే విధంగా పబ్లిక్ డిపాజిట్లను ఆమోదించడానికి లేదా పునరుద్ధరించడానికి అనుమతిఉంది. తక్షణం అమలు... 120 నెలల వరకూ డిపాజిట్ల ఆమోదం లేదా పునరుద్ధరణకు వీలుంది. దీనిని 5 సంవత్సరాలకు తగ్గించాలన్నది తాజా ముసాయిదా ఉద్దేశం. అయితే ఈ నిబంధన తక్షణం అమల్లోకి వచి్చనట్లు కూడా ఆర్బీఐ సర్క్యులర్ పేర్కొనడం గమనార్హం. ‘‘ఇకమీదట, ఈ సర్క్యులర్ తేదీ నుండి హెచ్ఎఫ్సీలు ఆమోదించిన లేదా పునరుద్ధరించిన పబ్లిక్ డిపాజిట్లను 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ గడువు 60 నెలలకు పరిమితం అయ్యింది. అయితే ఇప్పటికే అరవై నెలల కంటే ఎక్కువ మెచ్యూరిటీతో ఉన్న డిపాజిట్లు ఆయా హెచ్ఎఫ్సీల ప్రస్తుత రీపేమెంట్ ప్రొఫైల్ ప్రకారం తిరిగి చెల్లించడం జరుగుతుంది’’అని ఆర్బీఐ సర్క్యులర్ పేర్కొంది. ఒకవేళ ఆయా కంపెనీల క్రెడిట్ రేటింగ్ కనీస పెట్టుబడి గ్రేడ్ కంటే తక్కువగా ఉంటే, అటువంటి హెచ్ఎఫ్సీలు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్ పొందే వరకు ఇప్పటికే ఉన్న డిపాజిట్లను పునరుద్దరించలేవని, లేదా తాజా డిపాజిట్లను అంగీకరించలేవని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక డిపాజిట్ తీసుకునే హెచ్ఎఫ్సీలు కలిగి ఉన్న పబ్లిక్ డిపాజిట్ల పరిమాణ సీలింగ్ (పరిమితి) ప్రస్తుతం తమ సొంత నికర నిధుల్లో 3 రెట్లు ఉంటే, దీనిని తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 1.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. కాగా, తాజా ముసాయిదా ప్రకారం వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు లేదా ప్రకృతి వైపరీత్యాలు/విపత్తుల కారణంగా ముందస్తు–మెచ్యూర్ ఉపసంహరణ అనుమతులకు హెచ్ఎఫ్సీలకు వీలుకలుగుతోంది. ఎన్బీఎఫ్సీ నిబంధనలతో సమన్వయం.. తాజా చర్యల ద్వారా ఇతర నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) బాటలోకి హెచ్‌ఎఫ్‌సీలను తీసుకురావాలని భావిస్తోంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నుండి హెచ్ఎఫ్సీల నియంత్రణను బదిలీ చేసిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ 2020 అక్టోబర్ 22వ తేదీన తొలిసారి ఈ సంస్థల కోసం సవరించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. హెచ్ఎఫ్సీలు –ఎన్‌బీఎఫ్‌సీల నిబంధనల మధ్య మరింత సమన్వయం తీసుకురావడం కోసం దశలవారీగా ప్రయత్నం జరుగుతుందని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్ట చేసింది. ఏప్రిల్ నుంచి తాజా రుణ ‘చార్జీ’ నిబంధనల అమలు... బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)రుణ ఎగవేతలపై జరిమానా చార్జీలను ఆదాయ వృద్ధి సాధనంగా ఉపయోగించడాన్ని నిషేధించిన సవరిత ‘ఫెయిర్ లెండింగ్ విధానం’ ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ సోమవారం తెలిపింది.బ్యాంకులు– నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జరిమానా వడ్డీని ఆదాయ పెంపు సాధనంగా ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆర్బీఐ గత ఏడాది ఆగస్టు 18న ఇందుకు సంబంధించిన నిబంధనలను సవరించింది. దీని ప్రకారం బ్యాంకులు రుణ పునఃచెల్లిపుల్లో వైఫల్యం వంటి ‘‘సహేతుకమైన’’ ప్రాతిపదికపై మాత్రమే జరిమానా చార్జీలను విధించడానికి వీలవుతుంది. ఇటువంటి జరిమానా చార్జీలు బ్యాంకుల బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం వివక్షత లేని పద్ధతిలో డిఫాల్ట్ కింద ఉన్న మొత్తంపై మాత్రమే అమలువుతాయి. అటువంటి చార్జీలపై వడ్డీని లెక్కించడం జరగదు. బ్యాంకింగ్ రెగ్యులేటర్ సూచనలు క్రెడిట్ కార్డ్‌లు, అంతర్జాతీయ వాణిజ్య రుణాలు, వాణిజ్య రుణాలకు వర్తించదు. -
భూకంప జోన్లో మల్లన్నసాగర్
సాక్షి, హైదరాబాద్: తగిన అధ్యయనాలు, పరిశోధనలు చేయకుండానే మల్లన్నసాగర్ రిజర్వాయర్ డ్రాయింగ్లను ఆమోదించి, నిర్మాణం చేపట్టారని ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంత భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా చీలికలు, కదలికలు ఉన్నాయని.. భూకంపాలకు అవకాశం ఉందని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) తమ ప్రాథమిక నివేదికలో పేర్కొందని గుర్తు చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ సిఫార్సులను పట్టించుకోకుండా.. తగిన సర్వేలు, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని తప్పుపట్టింది. ఒకవేళ భూకంపం వస్తే సమీప ప్రాంతాల ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మూడేళ్లుగా సమగ్ర ఆడిట్ నిర్వహించిన కాగ్.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలివీ.. సగం ఆయకట్టు మల్లన్నసాగర్ కిందే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద జలాశయమైన మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీని కింద 10.3లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన మొత్తం ఆయకట్టులో ఇది సగానికికన్నా ఎక్కువ. 2017 అక్టోబర్‌లో మల్లన్నసాగర్ నిర్మాణాన్ని ప్రారంభించగా.. మార్చి 2022 నాటికి రూ.6,126 కోట్లు విలువైన పనులు చేశారు. గత సీఎం 2020 ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. అధ్యయనం జరపాలని కోరినా... మల్లన్నసాగర్ ప్రాథమిక డ్రాయింగ్స్‌ను 2016 ఆగస్టులో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు. అయితే నిర్మాణం ప్రారంభించడానికి ముందే ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించడానికి ఉన్న అవకాశాలపై (సైట్ స్పెసిఫిక్ సీస్మిక్ స్టడీస్) నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వంటి సంస్థలతో అధ్యయనం జరిపించాలని సూచించారు. దీంతో సంబంధిత అధ్యయనాలు నిర్వహించాలని నీటిపారుదల శాఖ హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ డైరెక్టర్‌కు లేఖలు రాసింది. కానీ ఆ అధ్యయన నివేదిక వచ్చే వరకు వేచిచూడకుండానే.. 2017లో ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించింది. తర్వాత ఎన్జీఆర్ఐ నివేదిక ఇచ్చింది. భూకంపాలకు అవకాశం ఉందంటూ.. దేశంలో భూకంపాల సంభావ్యత తక్కువగా ఉండే సీస్మిక్ జోన్–2లో తెలంగాణ ఉన్నా.. 1967లో కోయినాలో, 1993లో లాతూర్‌లో 6.3 తీవ్రతతో వచ్చిన భూకంపాలతో.. జోన్–2 ప్రాంతం కూడా భూకంపాలకు అతీతం కాదని తేలిందని ఎన్జీఆర్ఐ నివేదికలో పేర్కొంది. ఇటీవలికాలంలో ఒంగోలు, లాతూర్‌లో వచి్చన భూకంపాలతో తెలంగాణలోనూ ప్రకంపనలు వచ్చాయని, ఇక్కడి నిర్మాణాలకు స్వల్పంగా నష్టం జరిగిందని తెలిపింది. 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచి్చన భూకంపంతో దక్షిణ భారతదేశం అంతా ప్రకంపనలు కనిపించాయని పేర్కొంది. 1983 జూన్‌లో హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ ప్రాంతంలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని.. దాని ప్రభావం 200 కిలోమీటర్ల వరకు కనిపించిందని గుర్తు చేసింది. నాటి భూకంప కేంద్రం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందని స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఇక్కడ 5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే తట్టుకునేలా కట్టని (నాన్ ఇంజనీర్డ్) నిర్మాణాలు దెబ్బతింటాయని పేర్కొంది. మల్లన్నసాగర్ ప్రాంతంలోని భూగర్భంలో చాలా లోతు వరకు నిలువునా మూడు జతల చీలికలు (3 సెట్స్ ఆఫ్ డామినెంట్ లీనమెంట్) ఉన్నాయని.. కదలికలు కూడా చోటుచేసుకుంటున్నాయని నివేదికలో తెలిపింది. వీటితో పడే ప్రభావంపై సమగ్ర సర్వే, పరిశోధనలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పట్టించుకోకుండా, అధ్యయనాలు చేపట్టకుండానే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో నీటిపారుదల శాఖ ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో మల్లన్నసాగర్ దృఢత్వం, భూకంపం వస్తే జరిగే విపత్తు తీవ్ర ఆందోళన కలిగించే అంశాలేనని కాగ్ పేర్కొంది. అత్యవసరంగా డ్రాయింగ్స్కు ఆమోదం మల్లన్నసాగర్ నిర్మిత ప్రాంతంలో భూకంపాల సంభావ్యతపై అధ్యయనాలు లేవని.. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అత్యవసర పరిస్థితిలో రిజర్వాయర్ డ్రాయింగ్స్‌ను ఆమోదిస్తున్నామని సీడీఓ చీఫ్ ఇంజనీర్ పదేపదే పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ డ్రాయింగ్స్ సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, ఐఐటీ–రూర్కి’ల నుంచి ఈ డ్రాయింగ్స్కు తదుపరి ఆమోదం(వెట్టింగ్) తీసుకోవాలని కూడా సూచించారు. కానీ నీటిపారుదల శాఖ సదరు సంస్థలతో వెట్టింగ్ చేయించినట్టు ఎలాంటి రికార్డులు లేవని కాగ్ పేర్కొంది. మల్లన్నసాగర్ నిర్మాణం 95శాతం పూర్తయ్యాక 2021 జనవరిలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలైన డిజైన్లు, స్థిరత్వ విశ్లేషణలు, డిజైన్లకు వెట్టింగ్ కోసం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడం విడ్డూరమని స్పష్టం చేసింది. ఆ కమిటీ ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు జరపలేదని, ఎలాంటి నివేదిక సైతం ఇవ్వలేదని పేర్కొంది. ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం ఒకవేళ ఏదైనా విపత్తు సంభవించి మల్లన్నసాగర్ డ్యామ్ దెబ్బతింటే.. ప్రాణ, ఆస్తి నష్టం నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్’ ఓ నివేదిక సమర్పించింది. మల్లన్నసాగర్లో నీళ్లు నింపడానికి ముందే ఈ నివేదికలోని అంశాలకు అనుగుణంగా ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేయాలని సూచించింది. మల్లన్నసాగర్లో 2021 ఆగస్టు నుంచి నీళ్లు నింపడం ప్రారంభించగా.. ఇప్పటివరకు ఎమర్జెన్సీ ప్లాన్‌ను తయారు చేయలేదని కాగ్ ఆక్షేపించింది. ఒకవేళ్ల మల్లన్నసాగర్‌కు ప్రమాదం జరిగితే.. సమీప ప్రాంతాల్లోని ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు ఉంటుందని హెచ్చరించింది. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,06,42,333
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333కు చేరింది. అందులో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/ కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 19 వరకు గడువు ఉందని తెలిపారు. సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ ఓటర్ల జాబితానే వినియోగించనున్నారు. ఇక రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుండగా, ముసాయిదా జాబితాలో 3,06,26,996 మంది సాధారణ ఓటర్లతో పాటు మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సరీ్వసు ఓటర్లున్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. కొత్త ఓటర్లు 8,31,520 మంది ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 8,31,520 మంది ఓటర్లను నమోదు చేశారు. 1,82,183 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటు తొలగిస్తే 15 రోజుల్లోగా అప్పీల్ చేయాలి ముసాయిదా జాబితాలో ఎవరిదైన పేరును తప్పుగా తొలగిస్తే బాధిత ఓటర్లు 15 రోజుల గడువులోగా జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవాలని సూచించారు. లేకుంటే మళ్లీ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం–6 దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ‘ఓటర్ల’ అధికారుల బదిలీలపై నిషేధం సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా రూ పకల్పనలో పాలుపంచుకుంటున్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల నమోదు అధికారులు, సహాయ ఓటర్ల నమోదు అధికారులు తదితర స్థాయి అధికారుల బదిలీలపై ఈ నెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు నిషేధం అమల్లోకి ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీ బాధ్యతల్లోని అధికారులను బదిలీ చేస్తే జాబితా నాణ్యతపై ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా అధికారిని బదిలీ చేయాల్సివస్తే స్పష్టమైన వివరాలు అందజేసి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) వరకు బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఈ నిబంధన లు వర్తిస్తాయన్నారు. దీర్ఘకాలిక సెలవు ల్లో వెళ్లడానికి ముందు ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందాలని అధికారులను సూచించారు. -
మళ్లీ ఐపీవోకు టీవీఎస్ సప్లై చైన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మొబిలిటీ గ్రూప్ కంపెనీ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 2 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడం ద్వారా సెబీ నుంచి అదే ఏడాది మే నెలలో లిస్టింగ్‌కు అనుమతి పొందింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఐపీవో యోచనకు స్వస్తి పలికింది. నిబంధనల ప్రకారం అనుమతి పొందాక గడువు(ఏడాది)లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టకుంటే తిరిగి తాజాగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
కామారెడ్డి ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌పై తీవ్ర నిరసన: భూమిని మింగే ప్లానొద్దు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ మాస్టర్‌ప్లాన్ ముసాయిదా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముసాయిదాకు వ్యతిరేకంగా నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు గురువారం తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘రైతు కుటుంబ సమేత ర్యాలీ’చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. రైతులు భారీగా తరలివస్తుండటంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. అయితే పోలీసులను దాటుకుని రైతులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలో ఐదుగురు రైతులు గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఏఎస్పీ అనోన్య, డీఎస్పీ సోమనాథం తమతో దురుసుగా మాట్లాడారంటూ రైతులు మండిపడ్డారు. కొందరు రైతులు, మహిళా రైతులు.. పోలీసులపైకి చెప్పులు విసిరారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ధర్నా కార్యక్రమం కొనసాగింది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ బయటకు వచ్చి తమ గోడు వినాలని, వెంటనే మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ బయటకు రాకపోవడంతో ఆయన తీరుపై మండిపడ్డారు. కలెక్టర్ వచ్చేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. అక్కడే వంటావార్పు నిర్వహించి భోజనాలు చేశారు. దీంతో కలెక్టరేట్‌లోకి రాకపోకలు నిలిచిపోయాయి. చీకటి పడుతుండగా టెంట్లు, కార్పెట్లు వేసుకుని.. ఎంత రాత్రైనా కలెక్టర్ వచ్చే వరకు కదలబోమంటూ బైఠాయించారు. రైతులకు బీజేపీ నేతలు వెంకటరమణారెడ్డి, రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు సుభాష్‌రెడ్డి, జమునా రాథోడ్, టీజేఎస్ నేత నిజ్జన రమేష్ తదితరులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. ఐదుగురు లేదా పది మంది రైతులు కలెక్టర్ వద్దకు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని చెప్పారు. అయినా రైతులు వినలేదు. కలెక్టర్ వచ్చి స్వయంగా తమకు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. రాత్రి 8 గంటల తర్వాత కూడా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బయటకు రాకపోవడంతో ఆయన దిష్టి»ొమ్మకు వినతిపత్రం సమరి్పంచారు. మహిళలు కలెక్టర్ దిష్టి»ొమ్మపై ఏడు దోసిళ్ల మట్టిని విసిరారు. అనంతరం రైతులు ఆందోళన విరమించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గం బంద్‌కు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. సర్పంచ్ భర్తపై దాడి రైతులు ర్యాలీ నిర్వహిస్తుండగా ఇందిరాచౌక్ వద్ద అడ్లూర్ ఎల్లారెడ్డి సర్పంచ్ జానకి భర్త పైడి జనార్దన్ వారికి కన్పించారు. దీంతో కొందరు మహిళా రైతులు ఆయనపై దాడి చేశారు. ప్లకార్డులు, కర్రలతో చితకబాదారు. నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పించుకుని పరుగులు పెట్టిన జనార్దన్ పక్కనే ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లి దాక్కున్నారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని శాంతింపజేశారు. కేటీఆర్ స్పందించాలి: ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రైతులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాస్టర్‌ప్లాన్ ప్రకారం ఇండ్రస్టియల్ జోన్లోకి మారుతున్న 2,500 ఎకరాల రైతుల భూములను వదిలేయాలని డిమాండ్ చేశారు. పుష్కలంగా పంటలు పండే భూములను ఇండ్రస్టియల్ జోన్‌గా మార్చుతారా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ స్పందించి రైతులకు న్యాయం చేయాలన్నారు. వేలాది మంది రైతులు కలెక్టరేట్‌కు వస్తే వినతిపత్రం స్వీకరించకపోగా, రైతు ఉద్యమాన్ని హేళన చేసిన కలెక్టర్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి కామారెడ్డికి వస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరి్వంద్‌ను పోలీసులు 44 నంబర్ జాతీయ రహదారిపై పట్టణ శివారులో అడ్డుకున్నారు. గుంట భూమి పోయినా పోటీ చేయను: ఎమ్మెల్యే సురేందర్ మాస్టర్‌ప్లాన్‌లో రైతులకు సంబంధించి గుంట భూమి పోయినా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వమని ఆయన అన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ఎవరి భూమీ పోకుండా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని చెప్పారు. కొందరు నాయకులు అనవసరంగా రైతులను రెచ్చగొట్టి రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. -
డిజిటల్ బిల్లు ముసాయిదా కమింగ్ సూన్
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా బిల్లు ముసాయిదా డిసెంబర్ ఆఖరు కల్లా సంప్రదింపుల కోసం సిద్ధం కాగలదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వ్యక్తిగతయేతర డేటా యాజమాన్య అధికారాలు, డేటా పోర్టబిలిటీ తదితర అంశాలు కూడా ఇందులో ఉంటాయని ఆయన వివరించారు. సమకాలీనమైనదిగా, అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా చట్టం ఉంటుందని మంత్రి చెప్పారు. 22 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం స్థానంలో కేంద్రం దీన్ని ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం ఇటీవలే డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు ముసాయిదా విడుదల చేసింది. మరోవైపు, ’వేరబుల్స్’ (వాచీలు మొదలైనవి)కి కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వర్తింప చేసే యోచన ఉందని చంద్రశేఖర్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో వేరబుల్స్ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. -
ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్‌కి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాలను కొనుగోలు చేసే దిశగా ఓపెన్ ఆఫర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓపెన్ ఆఫర్ లెటర్ ముసాయిదాను పరిశీలించి, అభిప్రాయాలు తెలపాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరింది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలిచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ (వీసీపీఎల్) అనే సంస్థను ఈ ఏడాది ఆగస్టులో కొనుగోలు చేయడం ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ 29.18 శాతం వాటాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మైనారిటీ షేర్‌హోల్డర్ల నుండి మరో 26 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 17న ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు అప్పట్లో వీసీపీఎల్ తెలిపింది. కానీ డీల్‌పై ఎన్డీటీవీ ప్రమోటర్ అయిన ఆర్ఆర్పీఆర్ అనుసరిస్తున్న ప్రతికూల వైఖరి కారణంగా సాధ్యపడలేదని తాజాగా పేర్కొంది. ఓపెన్ ఆఫర్ ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 294 చొప్పున దాదాపు 1.67 కోట్ల షేర్లను (26 శాతం) వీసీపీఎల్ కొనుగోలు చేస్తుందంటూ ఇష్యూని నిర్వహిస్తున్న జేఎం ఫైనాన్షియల్ గతంలో ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్ని బట్టి ఓపెన్ ఆఫర్ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 1న ముగియాలి. మరోవైపు, బుధవారం ఎన్డీటీవీ షేరు రూ. 332.90 వద్ద క్లోజయ్యింది. ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. -
Madanapalle: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్
సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి సంబంధించి కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. అమృత్ పథకంలో భాగంగా పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ(పీకేఎం–ఉడా) ఆధ్వర్యంలో స్కై గ్రూప్ కన్సల్టెంట్ సహకారంతో జీఐఎస్(జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ఆధారిత మాస్టర్‌ప్లాన్–2041 రూపకల్పన జరిగింది. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి రూపొందించే మాస్టర్‌ప్లాన్‌ను పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, పట్టణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్రంగా తయారుచేయించారు. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రజల పరిశీలన కోసం 15 రోజుల పాటు పీకేఎం–ఉడా కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచి అభ్యంతరాలు తెలపాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో చేయాల్సిన మార్పులపై సుమారు 25వరకు అర్జీలు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరణ చేసిన ప్లాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్(డీటీసీపీ)కు పంపుతామని, అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొత్త మాస్టర్‌ప్లాన్ ఆధారంగా చేసుకుని నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం. జిల్లాలో అతిపెద్ద పట్టణం మదనపల్లె. 35వార్డులు, 44 వార్డు సచివాలయాలు, 14.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. సుమారు 2లక్షలకు పైగా జనాభా ఉన్నారు. పట్టణంలో గృహ, వాణిజ్యసముదాయాల నిర్మాణాలకు సంబంధించి జీఓ.ఎం.ఎస్.నెం.447, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.5.10.2001న ఆమోదించిన మాస్టర్‌ప్లాన్‌ను ఆధారంగా చేసుకుని అనుమతులు మంజూరుచేస్తున్నారు. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలుకు ముందు డ్రాఫ్ట్‌ప్లాన్‌ను ప్రజల పరిశీలనకు ఉంచి, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని డీటీసీపీ అనుమతులతో అమలుచేయాల్సి ఉంటుంది. మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించి రానున్న 20 ఏళ్లలో ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ పథకం కింద అధునాతన సాంకేతికత సహాయంతో జియోగ్రాఫిక్ ఇన్ఫరేషన్ సిస్టమ్(జీఐఎస్) పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్–2041ను సిద్ధంచేశారు. రూపకల్పన జరిగిందిలా.. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో భాగంగా స్కై గ్రూప్ ఏజెన్సీ వారు మొదట పట్టణాన్ని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. పట్టణ అభివృద్ధి దృష్ట్యా మెయిన్‌రోడ్లు ఎంత వెడల్పు ఉండాలో అంచనా వేసుకున్నారు. మున్సిపల్ లిమిట్స్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్ యూజ్, ఇండస్ట్రియల్, పబ్లిక్, సెమీపబ్లిక్, రిక్రియేషన్ జోన్లను గుర్తించారు. గతానికి, ఇప్పటికి చేయాల్సిన మార్పులను గుర్తించి, వాటిని కొత్త మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ పరిధి 14.20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అలాగే కనపరుస్తూ విస్తరణ చేయాలనుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఏఓఐ(ఏరియా ఆఫ్ ఇంటరెస్ట్) కింద అన్నివైపులా మూడుకిలోమీటర్ల రేడియస్ పెంపుతో 37.26 చదరపుకిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌లో మార్పులు పట్టణంలోని కోమటివానిచెరువు పాతమాస్టర్‌ప్లాన్‌లో రిక్రియేషన్ గ్రీన్‌లో ఉండేది. కొత్తప్లాన్‌లో చెరువుచుట్టూ ప్రాంతాన్ని బఫర్‌జోన్‌గా మార్చారు. గతంలో రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న కదిరిరోడ్డు, చౌడేశ్వరిగుడి పరిసరప్రాంతాలు, గొల్లపల్లెరోడ్డు, నిమ్మనపల్లెరోడ్డు, సీటీఎంరోడ్డు, బెంగళూరురోడ్డు, పుంగనూరురోడ్డు ప్రాంతాలన్నీ కమర్షియల్‌లోకి మార్పు జరిగాయి. ఇన్నాళ్లు వీటిలో రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకుని కమర్షియల్ నిర్మాణాలు జరపాలంటే టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకపై ఆ సమస్య ఉండదు. రెడ్డెప్పనాయుడు కాలనీలో కొంతభాగం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేది. ప్రస్తుతం దాన్ని రెసిడెన్షియల్ జోన్లోకి మార్చారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 40–60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్స్‌గా ఏర్పాటుచేశారు. 60అడుగుల రోడ్లను 80–100 అడుగులుగా, పట్టణం మీదుగా వెళుతున్న స్టేట్ హైవేను 100 అడుగుల రోడ్లు చేయాలని ప్రతిపాదనలు పెట్టారు. (క్లిక్: థ్యాంక్యూ.. సీఎం సార్) సమగ్రంగా పరిశీలించాకే ఫైనల్ ప్లాన్ ఖరారు.. పట్టణ మాస్టర్‌ప్లాన్–2041కు సంబంధించి ప్రధానంగా పట్టాభూములను రిక్రియేషన్ జోన్లో పెట్టారని, వాటిని డిలీట్ చేయాల్సిందిగా, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అనుమతిలేని లేఔట్లను మార్చమని, రోడ్ల వెడల్పు మార్చాల్సిందిగా, జోనింగ్‌లకు సంబంధించి, ఎగ్జిస్టింగ్ రోడ్లను మాస్టర్‌ప్లాన్‌రోడ్డుగా చేయమని అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పీకేఎం–ఉడా అధికారులకు పంపాం. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్నాక సవరణలు చేసి డీటీసీపీ అనుమతులకు పంపి ఫైనల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రకటిస్తారు. – కే.ప్రమీల, మున్సిపల్ కమిషనర్, మదనపల్లె -
మెగా ఐపీవోకి ఎల్ఐసీ రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రతిపాదిత మెగా పబ్లిక్ ఇష్యూ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందుకు సంబంధించి.. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే .. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ విషయం తెలిపారు. దాదాపు 5% వాటాకి సరిసమానమైన 31.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నట్లు వివరించారు. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించవచ్చని మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ..ఐపీవోలో కొంత భాగాన్ని అర్హత కలిగిన ఉద్యోగులు, పాలసీదారులకు కేటాయించనున్నారు. పబ్లిక్ ఇష్యూలో ఉద్యోగులకు కేటాయించే వాటా గరిష్టంగా 5%, పాలసీదారులకు 10%గా ఉంటుంది. నిర్దిష్ట మదింపు విధానం కింద 2021 సెప్టెంబర్ 30 ఆఖరు నాటికి ఎల్ఐసీ విలువ సుమారు రూ. 5.4 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంతర్జాతీయ యాక్చువేరియల్ సంస్థ మిల్లిమన్ అడ్వైజర్స్ లెక్క వేసింది. ఐపీవో ద్వారా వచ్చే నిధులు మొత్తం ప్రభుత్వానికే వెడతాయి. పూర్తిగా ప్రభుత్వ షేర్లనే విక్రయిస్తుండటంతో ఈ ఐపీవో 100% ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపం లో ఉండనుంది. ఎల్ఐసీ కొత్తగా షేర్లను జారీ చేయదు. ‘2021 మార్చి ఆఖరు నాటి గణాంకాల ప్రకారం కొత్త ప్రీమియంల విషయంలో ఎల్ఐసీకి 66% మార్కెట్ వాటా ఉంది. అలాగే 28.3 కోట్ల పాలసీలు, 13.5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు‘ అని పాండే పేర్కొన్నారు. అయితే, ఎల్ఐసీ మార్కె ట్ వేల్యుయేషన్ గురించి గానీ పాలసీదారులు లేదా ఎల్ఐసీ ఉద్యోగులకు గానీ ఎంత డిస్కౌంట్ ఇచ్చేదీ ప్రాస్పెక్టస్‌లో వెల్లడించలేదు. భారీ మార్కెట్ వాటా .. ప్రస్తుతం దేశీయంగా 24 జీవిత బీమా కంపెనీలు ఉండగా ప్రభుత్వ రంగంలో ఎల్ఐసీ ఒక్కటే ఉంది. అదే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్కసారి లిస్టయ్యిందంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా ఎల్ఐసీ దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఆవిర్భవిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఎల్ఐసీ లాభం రూ. 1,437 కోట్లుగా నమోదైంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనాల ప్రకారం.. 2020 గణాంకాలు బట్టి దేశీయంగా మొత్తం స్థూల ప్రీమియంలలో 64.1 శాతం వాటాతో ఎల్ఐసీ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఉంది. ఈ వాటాల విలువ 56.405 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. తద్వారా ప్రీమియంలపరంగా ఎల్ఐసీ .. అంతర్జాతీయంగా టాప్ జీవిత బీమా సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఎస్బీఐ లైఫ్‌కి 8 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇలా మొదటి, రెండో స్థానాల్లోని కంపెనీల మార్కెట్ వాటాల్లో ఇంత భారీ వ్యత్యాసం ప్రపంచంలో ఎక్కడా లేదని క్రిసిల్ తెలిపింది. చైనా మార్కెట్‌కు సంబంధించి పింగ్ యాన్ ఇన్సూరెన్స్‌కు అక్కడ అత్యధికంగా 21 శాతం, రెండో స్థానంలోని చైనా లైఫ్ ఇన్సూరెన్స్‌కు 20 శాతం వాటా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ప్రాతిపదికన భారత జీవిత బీమా పరిశ్రమ విలువ రూ. 5.7 లక్షల కోట్ల నుంచి రూ. 6.2 లక్షల కోట్లకు చేరింది. మార్చిలో ఇష్యూకి అవకాశం .. ఎల్ఐసీ ఐపీవోకు గతేడాది జూలైలోనే ఆమోదముద్ర వేసింది. షేర్ క్యాపిటల్‌ను రూ. 100 కోట్ల నుంచి రూ. 6,325 కోట్లకు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీవోని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూ మార్చిలో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 78,000 కోట్ల నిధులు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఎయిరిండియాలో విక్రయం, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 12,030 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం వాటాలు (632,49,97,701 షేర్లు) ఉన్నాయి. -
ఆ బిల్లును అడ్డుకుందాం.. సీఎం జగన్‌కు లేఖ రాసిన స్టాలిన్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2021 ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్ పోర్టుల విషయంలో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని కోరుతూ 8 తీరప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా లేఖ రాశారు. చిన్నతరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు(ఎంఎస్డీసీ) కట్టబెట్టేలా కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించేందుకు ఎంఎస్డీసీ ఈ నెల 24న సమావేశాన్ని తలపెట్టిందని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్ పోర్ట్స్ యాక్ట్–1908 ప్రకారం.. మైనర్‌పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి అధికారాలను ఎంఎస్డీసీకి బదిలీ చేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోంది’’ అని స్టాలిన్ వెల్లడించారు. రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లుపై అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో సహా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే చిన్నతరహా ఓడరేవుల విషయంలో ఇక రాష్ట్రాలకు ప్రాధాన్యమైన పాత్ర ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలను హరించే బిల్లును కలిసికట్టుగా అడ్డుకుందామని తీరప్రాంత రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ నెల 24న జరిగే ఎంఎస్డీసీ సమావేశంలో మన గళం వినిపిద్దామన్నారు. -
న్యాయస్థానాల్లో విచారణల ప్రత్యక్ష ప్రసారాలపై సూచనలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో విచారణల ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్లపై సుప్రీంకోర్టు ఈ–కమిటీ నమూనా నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. ముసాయిదాను పబ్లిక్ డొమైన్ ఉంచి దీనిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని భాగస్వాములను కోరింది. న్యాయ ప్రక్రియలో పారదర్శకతను, సంబంధిత పక్షాల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా... ఈ సదుపాయాన్ని తెస్తున్నారు. నమూనా నిబంధనలను బాంబే, ఢిల్లీ, మద్రాస్, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులతో కూడిన కమిటీ రూపొందించింది. ‘‘నమూనా నిబంధనల ముసాయిదా తయారీకి ఉపకమిటీ విస్తృతమైన చర్చలు చేసింది. స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీంకోర్టు కేసులో 2018లో ఇచ్చిన తీర్పులో పేర్కొన్న అంశాలు పరిగణనలోకి తీసుకుంది. న్యాయవాదులు, సాక్షుల గోప్యత, ఇతరత్రా గోప్యతలకు సంబంధించిన అంశాలు, కొన్ని సందర్భాల్లో కేసు సున్నితత్వం కారణంగా ప్రజా ప్రయోజనాన్ని కాపాడడంతోపాటు విచారణపై కేంద్ర, రాష్ట్ర చట్టాల నియంత్రణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది’’ అని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది. నమూనా నిబంధనల ముసాయిదా ఈ–కమిటీ వెబ్సైట్లో లభ్యమవుతాయని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఈ–కమిటీ ఛైర్ పర్సన్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. సలహాలు, సూచనలు ఇవ్వాలని లేఖ రాశారు. ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ సమన్యాయం హక్కులో భాగంగా ఈ ప్రత్యక్షప్రసారాలు అందుబాటులో ఉండనున్నాయని లేఖలో నొక్కి చెప్పారు. నమూనా నిబందనలపై సూచనలు సలహాలు ఈ నెల 30 లోగా ecommissione ree@aij.gov.inకు పంపాలని సూచించింది. ముసాయిదాలో ముఖ్యాంశాలు ►కోర్టు హాలులో ఐదు కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఒకటి నేరుగా ధర్మాసనం వైపునకు ఉంటుంది. రెండు కెమెరాలు న్యాయవాదుల వైపు ఉంటాయి. నాలుగో కెమెరా అవసరమైన సమయంలో నిందితుడి కోసం వినియోగిస్తారు. ఐదో కెమెరా సాక్షలు వైపు ఉంటుంది. ►ఏ క్షణంలోనైనా ప్రత్యక్ష ప్రసారం నిలిపివేయడానికి ధర్మాసనంలోని న్యాయమూర్తి వద్ద రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ధర్మాసనం అనుమతించిన తర్వాత న్యాయవాదులు, సాక్షులు, నిందితులు లేదా ఇతరత్రా వ్యక్తులు కోర్టులో సంభాషించడానికి మైక్రోఫోన్లు అందిస్తారు. ►ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్ నిమిత్తం ప్రతి కోర్టు కాంప్లెక్స్‌లోనూ డెడికేటెడ్ కంట్రోల్ రూమ్ (డీసీఆర్) ఏర్పాటు చేస్తారు. ►రిజిస్ట్రార్ (ఐటీ) పర్యవేక్షణలో సాంకేతిక నిపుణులు ప్రత్యక్ష ప్రసారాలను సమన్వయం చేస్తారు. ►వివాహ సంబంధ అంశాలు, బదిలీ పిటిషన్లు, లైంగిక వేధింపుల కేసులు, ఐపీసీ సెక్షన్ 376 ప్రొసిడీంగ్స్, మహిళలపై లింగ వివక్ష దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో ప్రత్యక్షప్రసారాలు ఉండవు. ప్రధాన న్యాయమూర్తి లేదా ధర్మాసనంలోని న్యాయమూర్తి సూచనల మేరకు ఇతర అంశాల్లోనూ ప్రత్యక్షప్రసారాలను అనుమతించరు. శాంతి భద్రతల ఉల్లంఘనలకు దారితీసే వర్గాల మధ్య విభేదాల కేసులు కూడా ధర్మాసనం అనుమతి ఉంటేనే ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ►విచారణకు ముందే ప్రత్యక్ష ప్రసారంపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పార్టీలకు కోర్టు మాస్టర్/రీడర్ తెలియజేస్తారు. ఆయా అభ్యంతరాలు సంబంధిత ధర్మాసనానికి పార్టీలు తెలియజేయాల్సి ఉంటుంది. ►ప్రత్యక్ష ప్రసారం చేయని కేసుల రికార్డింగులు కోర్టు నిర్వహణలో భాగంగా భద్రపరుస్తారు. ►విచారణలకు హాజరయ్యే విజిటర్లు, మీడియా వ్యక్తులు ఆడియో, వీడియో రికార్డు చేయడానికి అనుమతి ఉండదు. ►విచారణ సమయంలో అందరూ న్యాయమూర్తి సూచనలు తప్పకుండా పాటించాలి. ►నిబంధనలు ఉల్లంఘించి వారికి చట్ట ప్రకారం ప్రాసిక్యూషన్‌తోపాటు కమ్యూనికేషన్ పరికరాలను సీజ్ చేస్తుంది. ►ట్రాన్స్‌స్రిప్ట్‌లను ఆంగ్లంతోపాటు ఇతర భారతీయ భాషల్లోకి అనువదిస్తారు. -
అగ్గిరాజుకున్న లక్షద్వీప్: సముద్రగర్భంలోకి వెళ్లి నిరసన
‘డెవలప్మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్ (2021)’పై లక్షద్వీప్ ఒక్కసారిగా భగ్గుమంది. ద్వీపకల్ప భూమిలో ఆ డ్రాఫ్ట్ అగ్గి రాజేసింది. దీనిపై లక్షద్వీపకల్పవాసులు సోమవారం 12 గంటల పాటు నిరసనల హోరు చేపట్టారు. ప్రజలతో పాటు ప్రముఖులందరూ ‘లక్షద్వీప్‌ను రక్షించండి (సేవ్ లక్షద్వీప్)’ అని నినదిస్తూ విభిన్న రీతిలో తమ నిరసన తెలిపారు. ఆ డ్రాఫ్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ నిరసనలో భాగంగా కొందరు యువకులు సముద్ర గర్భంలోకి వెళ్లి నిరసన తెలిపారు. (చదవండి: ప్రధాని మోదీకి 93 మంది మాజీ ఐఏఎస్‌లు లేఖ) సేవ్ లక్షద్వీప్ అని ఆంగ్ల, మలయాళంలో రాసి ఉన్న పత్రాలు పట్టుకుని నీటిలోనే నినాదాలు చేస్తూ డ్రాఫ్ట్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్లజెండా కూడా ప్రదర్శించారు. ఇక సాధారణ ప్రజలు కూడా నిరసన తెలిపారు. కరోనా నేపథ్యంలో మాస్క్‌లు ధరిస్తూనే ఎవరికీ వారు ఉన్నచోటనే ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జిలు.. నల్ల వస్త్రాలు.. నలుపు మాస్క్‌లు ధరించి లక్షద్వీప్‌ను పరిరక్షించండి అని డిమాండ్ చేశారు. వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను వెనక్కి తీసుకోవాలని నినదించారు. లక్షద్వీప్ అడ్మినస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ పై డ్రాఫ్ట్‌ను తీసుకువచ్చారు. అభివృద్ధి పేరుతో తమను ఇబ్బంది పెట్టడం సరికాదని స్థానికులు చెబుతున్నారు. ద్వీపాల పర్యావరణ పవిత్రతను అణగదొక్కడానికి, భూ యాజమాన్య హక్కులను కాలరాయడానికి ఈ ముసాయిదా తీసుకువచ్చారని నిరాహార దీక్ష చేస్తున్న వారు ఆరోపించారు. ఈ ముసాయిదాను కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డ్రాఫ్ట్‌ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల 90 మంది ఐఏఎస్‌లు డ్రాఫ్ట్ విరమించుకోవాలని లేఖ కూడా రాశారు. కేరళకు పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న 32 చదరపు కిలోమీటర్ల మేర లక్షద్వీప్ ఉంది. లక్షద్వీప్ పాలనా వ్యవహారకర్తగా గుజరాత్ బీజేపీ నేత ప్రఫుల్ ఖోడా పటేల్ నియమితులైనప్పటి నుంచి వివాదం రాజుకుంది. "We will keep protesting until he #Patel is revoked from the post of administrator." Students' underwater demonstration against Administrator at #Lakshadweep#SaveLakshadweep pic.twitter.com/ji0pXBwjil — AFROZ ALAM SAHIL (@afrozsahil) June 7, 2021 -
కరువు ఛాయలు
జిల్లాలో కరువు విలయ తాండవం చేస్తోంది. తాగు, సాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జిల్లాలో నాలుగేళ్లుగా కరువుతో రైతుల బాధలు వర్ణనాతీతం. వరుణుడు సైతం కరుణించక పోవడంతో పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కన్నా సగం కూడా పడక పోవడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో నాలుగేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. 2015లో వరదలు వచ్చి వేసిన పంటలు కొట్టుకోని పోయాయి. చెరువులకు గండ్లు పడి చుక్క నీరు లేకుండా పోయింది. 2016లో తీవ్ర అనావృష్టితో రైతులు అవస్థలు పడ్డారు. పెన్నా డెల్టాకింద తప్ప జిల్లా మొత్తం సాగు విస్తీర్ణం తగ్గింది. 2017లో ఓ మోస్తరు వర్షాలు పడ్డా నీరు భూమిలోకి ఇంకి పోవడంతో నీటి చుక్క ఎక్కడా నిల్వ లేదు. 2015లో 33, 2016లో 27 మండలాలను కరువు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2017లో 15 మండలాల్లో కరువు ఉన్నట్లు అధికారులు నివేదిక పంపారు. ఇప్పటి వరకు శాశ్వత నివారణ చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. కరువు మండలాల్లోని రైతులకు పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సింది పోయి ఇంత వరకు వ్యవసాయ శాఖ తరపున ఒక్క రూపాయి కూడా చెల్లించిన దాఖలాల్లేవు. ఈ ఏడాది 45 మండలాలు జిల్లాలో మొత్తం 46 మండలాలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది 45 మండలాల్లో తీవ్రంగా కరువు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపారు. దీంతో జిల్లా మొత్తం కరువు ఛాయల్లో చిక్కుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 173.3 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది. అయితే 77.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. పరిహారం ఎక్కడ? ప్రభుత్వం నుంచి కరువు మండలాల్లోని రైతులకు ఎటువంటి పరిహారం అందిన దాఖలాల్లేవు. నాలుగు సంవత్సరాలుగా కరువుతో రైతులు అల్లాడుతున్నా వారికి బ్యాంకులలో రుణాలు కూడా ఇవ్వడం లేదు. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కరువు ప్రాంతాల్లో రుణాలను రీషెడ్యుల్ చేస్తామని ప్రభుత్వ ప్రకటనలు నీటిమూటలుగా మారాయనే విమర్శలున్నాయి. జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదనే ఆరోపణలున్నాయి. నివేదిక పంపుతున్నాం జిల్లాలో కరువు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, నమోదైన వర్షపాతం, ఏయే పంటలు దెబ్బతిన్నాయి. వాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నాం. పరిహారం అందించే విషయం ఉన్నతాధికారులు చూసుకుంటారు. –శివనారాయణ, వ్యవసాయ శాఖ ఇన్చార్జి జేడీ సాయం లేదు కరువు ప్రాంతాల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రధానంగా పంటకు పెట్టిన పెట్టుబడి రాలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. –కె.వెంకటకృష్ణారెడ్డి, డీసీ పల్లె, మర్రిపాడు నాలుగేళ్లుగా ఇంతే నాలుగు సంవత్సరాలుగా వరిపంట వేసి నీరు లేక ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం నేలపాలు అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో రుణం కూడా ఇవ్వడం లేదు. పూర్తిగా రుణమాఫీ కాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. –పసుపులేటి వెంకటేశ్వర్లు, వెన్నవాడ, ఆత్మకూర -
40 లక్షల మందికి దక్కని పౌరసత్వం
గువాహటి : అస్సాంలో స్థానికుల్ని, స్థానికేతరుల్ని గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) ముసాయిదాను విడుదల చేసింది. 3.29 కోట్ల మంది జనాభాలోలో 2.89 కోట్ల మందికి పౌరసత్వం లభించింది. ఎన్ఆర్సీలో 40 లక్షల మందికి పౌరసత్వం దక్కలేదు. అంతకుముందు ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్, దిమా హసొవ్, సోనిట్‌పుర్, కరీమ్గంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌తో పాటు నిషేధాజ్ఞల్ని విధించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్ఆర్సీ జాబితాను సోమవారం ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉండే ఎన్ఆర్సీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్ఆర్సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్ హజేలా తెలిపారు. 1971, మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసం ఉన్నవారినే స్థానికులుగా గుర్తించారు. అస్సాం ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందినే అస్సాం పౌరులుగా గుర్తించి జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన జాబితాతో 2,89,83,677 మందికి పౌరసత్వం లభించింది. ప్రస్తుతం విడుదల చేసింది ప్రభుత్వం గుర్తించిన జాబితా అని, తుది జాబితా మాత్రం కాదని ప్రతీక్ హజేలా అన్నారు. అక్రమ వలసల్ని నిరోధించేందుకు ఈ ముసాయిదాను ప్రకటించామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మైనార్టీల అక్రమ వలసలు కొనసాగడం వల్లే పౌరసత్వ జాబితాను రూపొందించాల్సి వచ్చిందిన నార్త్ ఈస్ట్ జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్ తెలిపారు. తాజా ముసాయిదా జాబితాలో పౌరసత్వం దక్కని వలస మైనార్టీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
నేడు ఎన్ఆర్సీ తుది ముసాయిదా విడుదల
గువాహటి: అస్సాంలో స్థానికుల్ని, స్థానికేతరుల్ని గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నేడు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) తుది ముసాయిదాను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు తలెత్తకుండా రాష్ట్రమంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్, దిమా హసొవ్, సోనిట్‌పుర్, కరీమ్గంజ్, గోలాఘాట్, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌తో పాటు నిషేధాజ్ఞల్ని విధించారు. ఈ జాబితాను సోమవారం ఉదయం 10 గంటలకు స్థానికంగా ఉండే ఎన్ఆర్సీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తెస్తామని ఎన్ఆర్సీ అస్సాం సమన్వయకర్త ప్రతీక్ హజేలా తెలిపారు. 1971, మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసం ఉన్నవారినే స్థానికులుగా గుర్తిస్తామన్నారు. అస్సాం ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో.. మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందినే అస్సాం పౌరులుగా గుర్తించి జాబితాలో చేర్చింది. -
‘కావేరి’పై సుప్రీంకు ముసాయిదా
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ముసాయిదాను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనానికి సోమవారం సమర్పించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కేంద్రం ప్రతిపాదించిన ప్రణాళిక ఫిబ్రవరి 16 నాటి తమ తీర్పుకు అనుగుణంగా ఉందా లేదా అనేది ఈ నెల 16న పరిశీలించి, ఆమోదం తెలుపుతామని పేర్కొంది. కావేరీ నదీ జలాల నిర్వహణ సంస్థను బోర్డు అనాలా? కమిటీ అనాలా? అథారిటీ అనాలా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కావేరి జలాల పంపిణీ కోసం బెంగళూరు కేంద్రంగా 9 మంది సభ్యులుగాగల ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కమిటీలో కేంద్రం నియమించే ఓ చైర్మన్, ఇద్దరు శాశ్వత సభ్యులు, ఇద్దరు తాత్కాలిక సభ్యులతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిల నుంచి ఒక్కోప్రతినిధి ఉంటారు. కావేరి నదీ జలాల పంపిణీని మార్చడంతోపాటు కావేరి మేనేజ్మెంట్ బోర్డును ఆరు వారాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 16నే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. అయినా ఇన్నాళ్లూ కేంద్రం జాప్యం చేయడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ నెల 8న కేసును విచారిస్తూ కేంద్రం చర్యలు పూర్తిగా కోర్టు ధిక్కారం కిందకు వస్తాయనీ, ఈ నెల 14న (సోమవారమే) కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి స్వయంగా హాజరై ముసాయిదాను సమర్పించకపోతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ముసాయిదాను సమర్పించింది. -
తల్లిదండ్రుల జోలికెళ్తే...
సాక్షి, న్యూఢిల్లీ: వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007కి కీలక సవరణలు చేసింది. తల్లిదండ్రుల(60 ఏళ్లపైబడిన వారిని)ను నిర్లక్ష్యం చేసినా లేక వేధించినా ఇది వరకు మూడు నెలల శిక్ష విధించేవారు. కానీ, తాజా ముసాయిదా చట్టం ప్రకారం దానిని ఆరు నెలలకు మార్చారు. అంతేకాదు తల్లిదండ్రులకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను ఉల్లంఘించిన వారికి నెల రోజుల శిక్ష విధించేలా సవరణలు చేశారు. ఈ మేరకు ట్రిబ్యూనల్స్‌కు అధికారాలు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. గతేడాది ఓ సర్వేలో వెల్లవైన వివరాల ప్రకారం.. 44 శాతం మంది వృద్ధులు తమ పిల్లలు తమ పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారంటూ వెల్లడించారు. దుర్భషలాడటం, చెయ్యి చేసుకోవటం లాంటి పరిణామాలు ఎదురయ్యాయని చాలా మంది తెలిపారు. దీంతో ఈ సర్వేను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు దత్తత తీసుకున్న వారిని, అలుళ్లు, కోడళ్లు, మనవళ్లు-మునిమనవరాళ్లను కూడా వారసుల జాబితా పరిధిలోకి తీసుకురానుంది.ఈ చట్టం అమలులోకి వస్తే గనుక నిస్సహయులైన వృద్ధులకు వారి వారి వారసులు రూ.10 వేల నెలనెలా భరణంగా చెల్లించటం తప్పనిసరి అవుతుంది. -
నాలుగు కీలక డ్రాఫ్ట్‌లకు జీఎస్టీ కౌన్సిల్ ఒకే
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చే చర్యల్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ నాలుగు డ్రాఫ్ట్‌లను ఆమోదించింది. జీఎస్టీ రాజ్యాంగ సవరణ కింద ఈ నాలుగు కీలకమైన అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాష్ట్రాల పరిహార బిల్లుతో సహా నాలుగు డ్రాఫ్ట్ లను ఒకే చేసినట్టు చెప్పారు. ఏకీకృత పన్ను పాలనకు రూపొందించిన ఫైనల్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలపడానికి ఉదయ్ పూర్ లో శనివారం భేటీ అయిన కౌన్సిల్ సమావేశమైంది. సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడిన జైట్లీ పరిహారం ముసాయిదా బిల్లుతో పాటు ముఖ్యమైన బిల్లులను న్యాయ పరిశీలనకు పంపనున్నట్లు లిపారు. జీఎస్టీ బిల్లుకు సంబందించిన తుదిమెరుగులను తదుపరి సమావేశంలో దిద్దనున్నట్టుచెప్పారు. వివిధ వస్తు సేవలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, కేంద్ర జిఎస్టీ చట్టాల ముసాయిదాలను ఆమోదం కోసం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 4 -5 తేదీల్లో ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశాల్లో ఆమోదం పొందుతుందన్నారు. అలాగే మార్చి 9 న మొదలయ్యే బడ్జెట్ సమావేశాల ద్వితీయార్థంలో పార్లమెంటులో ఆమోదం పొందనుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే వివిధ వస్తు సేవలకు సంబంధించి శ్లాబ్‌ల ఆమోదం కోసం మరోసారి సమావేశం అయితే సరిపోతుందని చెప్పారు. గతంలో లేవనెత్తిన 57 అంశాలను ఈ నాటి సమావేశంలో పరిష్కరించినట్టు కమిటీ ప్రకటించింది. కాగా పన్ను నియంత్రణపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి అమలుచేయాల్సిన జీఎస్టీ వాయిదాపడింది. దీంతో 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. -
‘కృష్ణా’ ముసాయిదాపై మొదలైన కసరత్తు!
-
‘కృష్ణా’ ముసాయిదాపై మొదలైన కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల నియంత్రణపై ముసాయిదా సమర్పించాలన్న బోర్డు సూచనపై రాష్ట్ర ప్రభుత్వం తన కసరత్తు ప్రారంభించింది. ఏయే అంశాలను ముసాయిదాలో పొందుపరచాలన్న దానిపై ప్రాథమిక చర్చలు మొదలుపెట్టింది. ఈ చర్చల అనంతరం వారంరోజుల్లో ముసాయిదాను బోర్డుకు సమర్పించనుంది. కాగా ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాల్లో స్పష్టత వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి చేర్చే విషయంలో తొందర అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసే అవకాశాలున్నాయి. ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై స్పష్టత వచ్చాకే బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరనుందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక కేవలం బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాల్సి ఉంటుందని, అదీగాక బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులను నిర్ధారించాల్సిందిగా సూచించారని, ఎవరి వాటా ఎంత, వినియోగం ఏరీతిన ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే బోర్డు ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకోవాలని సూచించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. నికర జలాల కేటాయింపులపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ పథకానికి సమాన స్థాయిలో నీటి కేటాయింపులు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా తెలంగాణ డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటే నీటి వినియోగ, అవసర షెడ్యూల్‌ను ముందుగానే బోర్డుకు అందించే విషయంలో కచ్చితత్వాన్ని పాటించేలా నిబంధనలు పెట్టాలని కోరే అవకాశాలున్నాయి. -
కరువుపై కసరత్తు
మహబూబ్‌నగర్ వ్యవసాయం : జిల్లాలో నెల రోజులుగా వర్షాలు మోహం చాటేశాయి.దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.. దీంతో కరువు తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని జేడీఏ బాలునాయక్ ఇప్పటికే ఏఓలను ఆదేశించారు.. అందుకనుగుణంగా వారు ఆయా మండలాల్లో తిరుగుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. జిల్లా ఖరీఫ్ సగటు వర్షపాతం 604.6మి.మీ కాగా ఇప్పటివరకు 268.6మి.మీ. మాత్రమే నమోదైంది. జూన్‌లో 71.2మి.మీ. కురవాల్సి ఉండగా 136.6మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం కన్నా 91.2శాతం అదనంగా కురిసింది. జూౖలñ లో 146.6మి.మీ కురవాల్సి ఉండగా 104.1మి.మీ. మాత్రమే కురిసి, 29శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టులో 121మి.మీ కురవాల్సి ఉండగా కేవలం 27.9మి.మీ. కురిసి 76.9శాతం లోటుకు చేరుకుంది. ఇక వంగూరు, ఉప్పునుంతల మండలాల్లో సగటు వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం కురిసింది. మరో 21 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ మండలాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఏడీఏ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను పరిశీలించేందుకు అధికారులు ముందుకు కదిలారు. 10మండలాల్లో పరిశీలన ప్రస్తుతం కల్వకుర్తి, వంగూరు, ఉప్పునుంతల, మాడ్గుల, తలకొండపల్లి, వెల్దండ, ఆమన్‌గల్, మిడ్జిల్, భూత్పూర్, బిజినేపల్లి మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మండలాల్లో ఇప్పటికే మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలు ఎండుముఖం పట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిసినా పంటలకు ఎలాంటి ఉపయోగంలేదు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. సాధారణంగా ఒక మండలంలో 2.5మిల్లీమీటర్ల కన్నా తక్కువగా వరుసగా 21రోజులు వర్షం కురియకుంటే దానిని డ్రై స్పెల్‌గా నిర్ణయిస్తారు. చాలా మండలాల్లో సాధారణ వర్షపాతం కన్నా అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణం కన్నా చాలా తక్కువ స్థాయిలో దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు గుర్తించారు. ఎండుతున్న పంటలు ఖరీఫ్ సీజన్ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 7.67లక్షల హెక్టార్లు కాగా గతేడాది 5.31లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. కాగా ఈసారి రైతులు 6.6లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో 1.93లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, 1.72లక్షల హెక్టార్లలో కంది, 1.23లక్షల హెక్టార్లలో పత్తి, 0.4లక్షల హెక్టార్లలో ఆముదం, 0.28లక్షల హెక్టార్లలో జొన్న సాగు చేస్తున్నారు. కాగా వర్షాలు రోజురోజుకూ మొహం చాటేయడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. లోటు వర్షపాతం నమోదైన 23 మండలాల్లో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో గతేడాదిలాగే కరువు పరిస్థితులు ఏర్పడితే తమ బతుకులు ఏమవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే నివేదికలు ఇవ్వాలి జిల్లాలో తక్కువ వర్షపాతం కురిసి, రైతులు సాగున పంటలు ఎండుముఖం పట్టిన పది మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఏఓలకు సూచించాం. వారు ఈ నివేదికలను తయారుచేసిన తర్వాత కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తాం. – బాలునాయక్, జేడీఏ, మహబూబ్‌నగర్ -
పాతాళంలో గంగ!
భారీగా పడిపోతున్న భూగర్భజలాలు నిండు వేసవిని తలపిస్తున్న నీటిమట్టాలు గతేడాదితో పోలిస్తే 3.84మీటర్ల లోతుకు పతనం సరిగ్గా ఏడు నెలల క్రితం.. మేలో భూగర్భ జలమట్టం 14.96 మీటర్లు.. నవంబర్ నెలాఖరులో నమోదైన భూగర్భ నీటిమట్టం 15.20 మీటర్లు.. అంటే ఎండాకాలంలోకంటే మరింత లోతుకు పాతాళగంగపడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే వేసవినాటికి ఈ మట్టాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఊహించడమే కష్టంగా ఉంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాతాళంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నడివేసవికి ఇంకా ఆరు నెలల సమయమున్నప్పటికీ.. భూగర్భంలో జలసిరి ఆందోళనకరంగా మారింది. సాధారణంగా నిండు ఎండాకాలంలో భూగర్భజలాలు అట్టడుగు స్థాయికి పడిపోతాయి. కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. వేసవి సీజన్లో కంటే మరింత లోతుకు భూగర్భజలాలు పతనమయ్యాయి. ఈ ఏడాది మే నెలలో భూగర్భంలో జలమట్టం 14.96 మీటర్లు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడాల్సి ఉండగా.. మరింత అడుగుకు పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ నెలాఖరు నాటికి జిల్లాలో సగటు భూగర్భ జలాల లోతు ఏకంగా 15.20మీటర్ల లోతుకు పడిపోయినట్లు ఆ శాఖ తాజాగా వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ నెలలో 3.84మీటర్ల లోతుకు పడిపోయాయి. లోటు వర్షపాతం... లోపలికి జలం.. జిల్లాలో ఆరు నెలలుగా భూగర్భజలాలు క్రమంగా పతనమవుతున్నాయి. సాధారణంగా వేసవిలో లోతుకు పడిపోయినప్పటికీ.. ఆ తర్వాత కురిసిన వర్షాలతో పైకివస్తాయి. కానీ ఈ సారి తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పాతాళగంగ లోలోపలికి పోతోంది. నాలుగు నెలలుగా పరిశీలిస్తే సగటున ప్రతినెలా అరమీటరు లోతుకు పడిపోతున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. గత ఖరీఫ్ సీజన్ ముగిసే నాటికి జిల్లాలో 58.3సెంటీమటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 29.1 సెంటీమీటర్లే కురిసింది. ప్రస్తుత రబీ సీజన్లో 28సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటికీ చినుకుజాడ లేదు. వర్షపాతలోటు.. దానికితోడు భూగర్భజలాల వినియోగం పెరగడంతో నీటిమట్టాలు రోజురోజుకు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అధ్వానం.. జిల్లాలో అన్నిచోట్ల భూగర్భజలాల తీరు ఆందోళన కరంగానే ఉంది. గ్రామీణ మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాగుకు, తాగునీటికి రెండు విధాలా భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుండడంతో నీటిమట్టాలు భారీగా పడిపోతున్నాయి. బంట్వారం మండలంలో సగటు మట్టం 38.07మీటర్లుగా నమోదైంది. మొయినాబాద్ మండలంలో 27.01 మీటర్లు, మర్పల్లిలో 23.50మీటర్లు, మల్కాజ్గిరి, మహేశ్వరం మండలాల్లో 20మీటర్లకంటే ఎక్కువ లోతులో జలమట్టాలు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ నెలలో బంట్వారం మండలంలో 23.30 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పతనం కావడం గమనార్హం. ఇక కీసర, శేరిలింగంపల్లి మండలాల్లో భూగర్భంలో రాళ్లురప్పలు తేలినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి.