న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చే చర్యల్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్‌టీ కౌన్సిల్ నాలుగు డ్రాఫ్ట్‌లను ఆమోదించింది. జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ కింద ఈ నాలుగు కీలకమైన అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాష్ట్రాల పరిహార బిల్లుతో సహా నాలుగు డ్రాఫ్ట్ లను ఒకే చేసినట్టు చెప్పారు. ఏకీకృత పన్ను పాలనకు రూపొందించిన ఫైనల్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలపడానికి ఉదయ్ పూర్ లో శనివారం భేటీ అయిన కౌన్సిల్ సమావేశమైంది.
సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడిన జైట్లీ పరిహారం ముసాయిదా బిల్లుతో పాటు ముఖ్యమైన బిల్లులను న్యాయ పరిశీలనకు పంపనున్నట్లు లిపారు. జీఎస్‌టీ బిల్లుకు సంబందించిన తుదిమెరుగులను తదుపరి సమావేశంలో దిద్దనున్నట్టుచెప్పారు. వివిధ వస్తు సేవలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, కేంద్ర జిఎస్టీ చట్టాల ముసాయిదాలను ఆమోదం కోసం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 4 -5 తేదీల్లో ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశాల్లో ఆమోదం పొందుతుందన్నారు. అలాగే మార్చి 9 న మొదలయ్యే బడ్జెట్ సమావేశాల ద్వితీయార్థంలో పార్లమెంటులో ఆమోదం పొందనుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే వివిధ వస్తు సేవలకు సంబంధించి శ్లాబ్‌ల ఆమోదం కోసం మరోసారి సమావేశం అయితే సరిపోతుందని చెప్పారు. గతంలో లేవనెత్తిన 57 అంశాలను ఈ నాటి సమావేశంలో పరిష‍్కరించినట్టు కమిటీ ప్రకటించింది. కాగా పన్ను నియంత్రణపై కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి అమలుచేయాల్సిన జీఎస్టీ వాయిదాపడింది. దీంతో 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీని అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే.
నాలుగు కీలక డ్రాఫ్ట్‌లకు జీఎస్‌టీ కౌన్సిల్ ఒకే
Published Sat, Feb 18 2017 7:14 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
Advertisement