సాక్షి, న్యూఢిల్లీ: 22వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో ఈ కౌన్సిల్ నేడు సమావేశమైంది. వివిధ వర్గాలకు దీపావళి కానుకగా ఈ సమావేశంలో 60 వస్తువులపై పన్నులు భారం తగ్గించబోతున్నారని తెలుస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు వస్త్ర పరిశ్రమకూ ఊరట కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఈ మేరకు నేడు జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఒక్కరోజు ముందు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో అత్యవసరంగా సమావేశమయ్యారు. జీఎస్టీ అమలుతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించాల్సిందిగా అధికారులను కోరాననీ, వాటిని త్వరలోనే సరిదిద్దుతామని ప్రధాని ఇప్పటికే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment