
గ్రేటర్‌లో 150 డివిజన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ని 150 వార్డుల (డివిజన్ల)తో పునర్వ్యవస్థీకరించారు. గత నెల 28న జారీ చేసిన ముసాయిదాకు ఆయా రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అందిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వు జారీ చేసింది.
వార్డుల పునర్వ్యవస్థీకరణ తుది జాబితాకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సమర్పించిన నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వు వెలువరించింది. ఈ జీవో (నం.166) మేరకు ఫారం-6 ద్వారా వార్డుల విభజనపై శుక్రవారం తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ముసాయిదా జాబితాపై మొత్తం 635 అభ్యంతరాలు, సూచనలు అందాయి.
వీటిల్లో వార్డుల పేర్లు, సరిహద్దులు మార్చాల్సిందిగా అందిన అభ్యంతరాల్లో 65 ఫిర్యాదులు, సలహాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. మరో 38 ఫిర్యాదుల్ని పాక్షికంగా పరిశీలించామని, సహేతుకత లేకపోవడంతో 532 దరఖాస్తుల్ని తిరస్కరించినట్లు తెలిపారు.
జనాభా... భౌగోళిక సరిహద్దులు: ప్రస్తుతమున్న 150 డివిజన్ల(వార్డుల) సంఖ్యలో మార్పు లేనప్పటికీ జనాభా ప్రాతిపదికన భౌగోళిక సరిహద్దుల ఆధారంగా కొత్త డివిజన్లను వెలువరించారు. పాతవి కనుమరుగయ్యి కొత్తగా 27 డివిజన్లు చేరాయి. గతంలో కొన్ని డివిజన్లలో 20 వేల జనాభా ఉంటే మరికొన్నింటిలో 70 వేలకు పైగా ఉంది. ప్రస్తుతమలా కాకుండా దాదాపు అన్నింటా సగటున 44 వేల జనాభా ఉందని చెబుతున్నారు. అయితే ఆయా డివిజన్లలోని జనాభాను కానీ, వాటికి సంబంధించిన మ్యాపుల్ని కానీ అధికారికంగా విడుదల చేయలేదు.
మార్పులిలా: ముసాయిదాకు, తుది జాబితాకు నాలుగు డివిజన్ల పేర్లలో మార్పు జరిగింది. ముసాయిదాలోని బర్కత్‌పురా, మోతీనగర్ డివిజన్లు తుది నివేదికలో కనుమరుగయ్యాయి. అలాగే కొత్త డివిజన్‌గా అవతరిస్తుందనుకున్న అబిడ్స్ కూడా తెరమరుగైంది. ముసాయిదాలో మోతీనగర్‌గా ఉన్న డివిజన్ పేరును మూసాపేటగా రూపాంతరం చేశారు.
మూసాపేట పేరుతో ఉన్న డివిజన్‌ను బాలాజీనగర్‌గా కొత్తగా చేర్చారు. బర్కత్‌పురా డివిజన్ పేరును కాచిగూడగా మార్చారు. అబిడ్స్ డివిజన్‌కు పాత పేరైన గన్‌ఫౌండ్రినే ఉంచారు. కొద్ది డివిజన్ల సరిహద్దుల్లో మాత్రం స్వల్ప మార్పులు జరిగాయి. అంతకుమించి భౌగోళిక సరిహద్దులు, ఇతరత్రా అంశాల్లో పెద్దగా మార్పుల్లేవు.
కనుమరుగైన డివిజన్లు: 1.కర్మన్‌ఘాట్, 2.పీ అండ్ టీ కాలనీ, 3.సలీంనగర్, 4.నూర్‌ఖాన్‌బజార్, 5.అలియాబాద్, 6.ఫతేదర్వాజ, 7.హుస్సేనిఆలం, 8.ధూల్‌పేట, 9.శివరాంపల్లి, 10.మురాద్‌నగర్, 11.చింతల్‌బస్తీ, 12.విద్యానగర్, 13.సుల్తాన్‌బజార్, 14.బాగ్‌లింగంపల్లి, 15.దోమలగూడ, 16.పంజగుట్ట, 17.బల్కంపేట, 18.శ్రీనగర్‌కాలనీ, 19.షాపూర్‌నగర్, 20.యాప్రాల్, 21.డిఫెన్స్‌కాలనీ, 22.సఫిల్‌గూడ, 23.చిలకలగూడ, 24.పద్మారావునగర్, 25.మారేడ్‌పల్లి, 26.మోతీనగర్, 27.బర్కత్‌పురా.
తాజా విభజన మేరకు ఇకపై జీహెచ్‌ఎంసీలోని డివిజన్లు ఇవీ...
1. కాప్రా(కొత్త), 2. డా.ఎ.ఎస్.రావు నగర్, 3. చర్లపల్లి, 4. మీర్‌పేట హెచ్‌బీకాలనీ (కొత్త), 5. మల్లాపూర్, 6. నాచారం, 7. చిలుకానగర్(కొత్త), 8. హబ్సిగూడ, 9. రామంతాపూర్, 10. ఉప్పల్, 11. నాగోల్ (కొత్త), 12. మన్సూరాబాద్, 13. హయత్‌నగర్, 14. బీఎన్‌రెడ్డి నగర్(కొత్త), 15. వనస్థలిపురం, 16. హస్తినాపురం(కొత్త), 17. చంపాపేట, 18. లింగోజిగూడ(కొత్త), 19. సరూర్‌నగర్, 20. రామకృష్ణాపురం, 21. కొత్తపేట, 22. చైతన్యపురి (కొత్త), 23. గడ్డిఅన్నారం, 24. సైదాబాద్, 25. మూసారాంబాగ్, 26. ఓల్డ్ మలక్‌పేట, 27. అక్బర్‌బాగ్, 28. ఆజంపురా, 29. చావ్‌నీ, 30. డబీర్‌పురా, 31. రెయిన్‌బజార్, 32. పత్తర్‌ఘట్టి, 33. మొఘల్‌పురా, 34. తలాబ్ చంచలం, 35. గౌలిపురా, 36. లలిత్‌బాగ్, 37. కుర్మగూడ, 38. ఐఎస్ సదన్, 39. సంతోష్‌నగర్, 40. రియాసత్‌నగర్, 41. కంచన్‌బాగ్, 42. బార్కాస్, 43. చాంద్రాయణగుట్ట, 44. ఉప్పుగూడ, 45. జంగమ్మెట్, 46. ఫలక్‌నుమా, 47. నవాబ్‌సాహెబ్‌కుంట, 48. శాలిబండ, 49. ఘాన్సీబజార్, 50. బేగంబజార్, 51. గోషామహల్, 52. పురానాపూల్, 53. దూద్‌బౌలి, 54. జహనుమా, 55. రామ్నాస్‌పురా, 56. కిషన్‌బాగ్, 57. సులేమాన్‌నగర్(కొత్త), 58. శాస్త్రిపురం (కొత్త), 59. మైలార్‌దేవ్‌పల్లి, 60. రాజేంద్రనగర్, 61. అత్తాపూర్, 62. జియాగూడ, 63. మంగళ్‌హాట్, 64. దత్తాత్రేయనగర్, 65. కార్వాన్, 66. లంగర్‌హౌస్, 67. గోల్కొండ (కొత్త), 68.టోలిచౌకి, 69. నానల్‌నగర్, 70. మెహిదీపట్నం, 71. గుడిమల్కాపూర్, 72. ఆసిఫ్‌నగర్, 73. విజయనగర్‌కాలనీ, 74. అహ్మద్‌నగర్, 75. రెడ్‌హిల్స్, 76. మల్లేపల్లి, 77. జాంబాగ్, 78. గన్‌ఫౌండ్రి, 79. హిమాయత్‌నగర్, 80. కాచిగూడ, 81. నల్లకుంట, 82. గోల్నాక, 83. అంబర్‌పేట, 84. బాగ్‌అంబర్‌పేట, 85. అడిక్‌మెట్, 86. ముషీరాబాద్, 87. రామ్‌నగర్, 88. భోలక్‌పూర్, 89. గాంధీనగర్, 90. కవాడిగూడ, 91. ఖైరతాబాద్, 92. వెంకటేశ్వరకాలనీ (కొత్త), 93. బంజారాహిల్స్, 94. షేక్‌పేట, 95. జూబ్లీహిల్స్, 96. యూసుఫ్‌గూడ, 97. సోమాజిగూడ, 98. అమీర్‌పేట, 99. వెంగళ్రావునగర్, 100. సనత్‌నగర్, 101. ఎర్రగడ్డ, 102. రహ్మత్‌నగర్, 103. బోరబండ, 104. కొండాపూర్ (కొత్త), 105.గచ్చిబౌలి, 106.శేరిలింగంపల్లి, 107. మాదాపూర్ (కొత్త), 108.మియాపూర్ (కొత్త), 109.హఫీజ్‌పేట, 110.చందానగర్, 111.భారతీనగర్ (కొత్త), 112.రామచంద్రాపురం, 113.పటాన్‌చెరు, 114.కేపీహెచ్‌బీ కాలనీ, 115.బాలాజీనగర్(కొత్త), 116.అల్లాపూర్ (కొత్త), 117.మూసాపేట, 118. ఫతేనగర్, 119.ఓల్డ్ బోయిన్‌పల్లి, 120.బాలానగర్ (కొత్త), 121.కూకట్‌పల్లి, 122.వివేకానందనగర్ కాలనీ, 123.హైదర్‌నగర్, 124.ఆల్విన్‌కాలనీ(కొత్త), 125.గాజులరామారం, 126.జగద్గిరిగుట్ట, 127.రంగారెడ్డినగర్(కొత్త), 128. చింతల్, 129.సూరారం, 130. సుభాష్‌నగర్(కొత్త), 131.కుత్బుల్లాపూర్, 132.జీడిమెట్ల, 133.మచ్చబొల్లారం, 134. అల్వాల్, 135. వెంకటాపురం(కొత్త), 136.నేరేడ్‌మెట్(కొత్త), 137.వినాయకనగర్(కొత్త), 138. మౌలాలి, 139.ఈస్ట్ ఆనంద్‌బాగ్(కొత్త), 140. మల్కాజిగిరి, 141. గౌతమ్‌నగర్, 142. అడ్డగుట్ట, 143. తార్నాక, 144. మెట్టుగూడ, 145. సీతాఫల్‌మండి, 146. బౌద్ధనగర్, 147.బన్సీలాల్‌పేట, 148. రామ్‌గోపాల్‌పేట, 149. బేగంపేట, 150. మోండా మార్కెట్ (కొత్త).