ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్న మౌలానా రాబే హసనీ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ముస్లిం సమాజంలోని అన్నివర్గాలు ఇస్లాం, షరియత్‌ల పరిరక్షణ కోసం కలసికట్టుగా కృషిచేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా రాబే హసనీ నద్వీ పిలుపునిచ్చారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు మూడు రోజుల ప్లీనరీ సమావేశాలు శుక్రవారం కంచన్‌బాగ్‌లోని సాలారే మిల్లత్ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ముస్లిం ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం బోర్డు అధ్యక్షుడు హసనీ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఇస్లాంతోపాటు షరియత్ చట్టాలను మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముస్లింలపై, షరియత్‌పై దాడులను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.
ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలలోని అన్ని వర్గాలు సంఘటితమై ఎదుర్కొనాల్సిందిగా పిలుపునిచ్చారు. బాబ్రీ మసీదు అంశం కేవలం భూ వివాదం కాదని, ఇస్లాం ధర్మానికి అత్యంత గౌరవమైన విషయమని పేర్కొన్నారు. కాగా, బాబ్రీ మసీదు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున అది ఏ తీర్పు ఇచ్చినా గౌరవిస్తామన్నారు. ప్రస్తుత స్థానంలోనే తిరిగి మసీదును నిర్మించాలని కోరారు. బాబ్రీ మసీదు విషయంలో ఎలాంటి రాజీ పడబోమన్నారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment