లక్నో: ముస్లింలలో ట్రిపుల్ తలాక్‌ను నిషేధించేలా త్వరలో నిఖానామా(వివాహ ఒప్పందం)లో మార్పులు తీసుకురానున్నట్లు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) అధికార ప్రతినిధి మౌలానా ఖలీల్ రెహ్మాన్ చెప్పారు. కొత్త నిఖానామాలో భాగంగా భార్యకు ట్రిపుల్ తలాక్ ఇవ్వబోనని పురుషుడు అంగీకరించాల్సి ఉంటుందన్నారు.
‘‘కొత్త నిఖానామాలో ‘నేను ట్రిపుల్ తలాక్ ఇవ్వను’ అనే నిబంధనను చేరుస్తున్నాం. ఒక్కసారి దీనికి పురుషుడు ఆమోదం తెలిపితే, ట్రిపుల్ తలాక్ ఇవ్వడం కుదరదు. హైదరాబాద్‌లో జరగబోయే బోర్డు జాతీయ వార్షిక సమావేశాల్లో ఇలాంటి సమస్యలపై చర్చిస్తాం’’ అని చెప్పారు. సాధారణంగా నిరక్షరాస్యుల్లో ట్రిపుల్ తలాక్ మహమ్మారి అధికంగా ఉన్నందున గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment