secular
-
రాజ్యాంగ పీఠికనూ పార్లమెంట్ సవరించొచ్చు
న్యూఢిల్లీ: 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ పీఠికలో మార్పులు చేస్తూ తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పీఠికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత (సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ) అనే పదాలను చేర్చుతూ చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ మేరకు వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం నవంబర్ 22తో వాదనలు ముగించి, సోమవారం తీర్పు వెలువరించింది. ‘రిట్ పిటిషన్లపై తదుపరి విచారణ కానీ, తీర్పు కానీ అవసరం లేదు. రాజ్యాంగంలోని పీఠికను కూడా సవరించే అధికారం పార్లమెంట్కుంది. సవరణకు ఇప్పటికే చాలా ఏళ్లు గడిచినందున ఆ ప్రక్రియ రద్దు సాధ్యం కాదు’అని తీర్పులో పేర్కొంది.‘ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని మార్పులకు ఆమోదించిన తేదీ ప్రభుత్వ అధికారాన్ని తగ్గించదు. పైపెచ్చు ఆ అధికారాలను సవాల్ చేయలేం. పీఠికకు సైతం మార్పులు చేపట్టే అధికారం పార్లమెంట్‌కు ఉంది’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇప్పటికే పలు న్యాయపరమైన సమీక్షలు జరిగాయని గుర్తు చేసింది. ఎమర్జెన్సీ సమయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని చెప్పలేమని కూడా పేర్కొంది. ఎన్నో ఏళ్లు గడిచాక పీఠికలో చేసిన మార్పులపై ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతున్నారు?అంటూ ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది.పిటిషనర్ల అభ్యంతరం ఏమంటే..సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలపై చేరిక తనకూ సమ్మతమేనని పిటిషనర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదనల సందర్భంగా తెలిపారు. అయితే, ఆ పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడంపైనే తనకు అభ్యంతరం ఉందన్నారు. రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే పదాల చేరికను ఇందిరాగాంధీ అనంతరం ఎన్నికైన జనతా పార్టీ ప్రభుత్వం కూడా సమర్థించిందని ఇదే అంశంపై వేరుగా పిటిషన్ వేసిన సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. అయితే, 1949లో ఆమోదించిన రాజ్యాంగ పీఠికను యథాతథంగా ఉంచుతూ, 1976లో చేపట్టిన మార్పులను వేరుగా ప్రత్యేక పేరాలో ఉంచాలన్నదే తన ఉద్దేశమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో..ఇందిరా గాంధీ ప్రభుత్వం దేశంలో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేదీ వరకు అత్యవసర పరిస్థితి అమల్లో ఉండటం తెలిసిందే. ఆ సమయంలోనే రాజ్యాంగ పీఠికలోని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర అనే పదాల స్థానంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర అనే వాటిని చేరుస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ కేసులో మొట్ట మొదటిసారిగా 2020లో బలరాం సింగ్ అనే వ్యక్తి విష్ణు శంకర్ జైన్ అనే న్యాయవాది ద్వారా పిటిషన్ వేశారు. ఇదే అంశంపై విస్తృత ధర్మాసనానికి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. సామ్యవాదం అనే పదాన్ని మన దేశానికి వర్తింపజేసుకుంటే సంక్షేమ రాజ్యమనే అర్థమే వస్తుందని వివరించింది. -
‘‘సెక్యులర్‌ను రాజ్యాంగం నుంచి తొలగించాల్సిందే’’
బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తున్నారు. దేశ జనాభాలో 90 శాతం ముస్లింలు ఉన్నందున.. సెక్యులర్ పదాన్ని తొలగించడంతో సహా రాజ్యాంగంలో గణనీయమైన మార్పుల తీసుకురాలని అన్నారాయన. ఈ మేరకు రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీం కోర్టులో జరగుతున్న విచారణ సందర్భంగా ఏజీ హోదాలో తన వాదనలను వినిపించారు. న్యాయమూర్తులు ఫరా మహబూబ్, దేబాశిష్ రాయ్ చౌదరిలు 15వ సవరణ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టారు. ఎండీ అసదుజ్జమాన్ వాదిస్తూ.. ‘‘సవరణలు ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలి. కానీ నిరంకుశత్వానికి కాదు. ఆర్టికల్ 2Aలో దేశంలో అన్ని మతాల ఆచరణలో సమాన హక్కులు, సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ఆర్టికల్ 9 ‘బెంగాలీ జాతీయవాదం’ గురించి చెబుతుంది. ఇది విరుద్ధమైంది. షేక్ ముజిబుర్ రెహమాన్‌ను ‘జాతి పిత’గా పేర్కొనడంతోపాటు అనేక రాజ్యాంగ సవరణలు జాతీయ విభజనకు దోహదపడతాయని , వాక్ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేస్తాయి. దేశ విభజనలో షేక్ ముజిబుర్ రెహమాన్ సహకారాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. అయితే.. సెక్యులర్ అనే పదాన్ని చట్టం ద్వారా అమలు చేయడం విభజనను సృష్టిస్తుంది. లిబరేషన్ వార్, జాతీయ ఐక్యత విలువలను ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలి. 15వ సవరణ రాజ్యాంగబద్ధతను కోర్టు పరిశీలించాలి’ అని వాదనలు వినిపించారు. మరోవైపు.. తాత్కాలిక ప్రభుత్వం దాడులు, వేధింపుల నుంచి తమను రక్షించాలని, హిందూ నాయకులపై దేశద్రోహ ఆరోపణలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెలలో పదివేల మంది మైనారిటీ హిందువులు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 30,000 మంది నిరసనకారులు చటోగ్రామ్‌లో తమ హక్కులను డిమాండ్ చేశారు. విపక్ష విద్యార్థుల నేతృత్వంలోని నిరసనల నడుమ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్‌కు వెళ్లిపోయిన అనంతరం.. హిందూవులు టార్గెట్‌గా దాడులు జరిగిన పలు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని దాదాపు 170 మిలియన్ల జనాభాలో కేవలం 8 శాతం మంది మాత్రమే ఉన్న హిందువులపై ఆగష్టు 4 నుంచి సుమారు 2,000 కంటే ఎక్కువ దాడులను జరిగినట్లు వార్తలు వచ్చాయి. -
భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవడం లేదా?
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చిన సామ్యవాద, లౌకిక( సోషలిస్ట్, సెక్యులర్) పదాలను తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సోమవారం సుప్రీంకోర్టు విచారించి పిటిషన్లపై పలు ప్రశ్నలు సంధించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, లాయర్ విష్ణు శంకర్ జైన్, బలరామ్ సింగ్, లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ తదితరులు దాఖలుచేసిన ఈ పిల్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారించింది. ‘‘సామ్యవాదం అనే పదానికి అర్ధాలను ప్రాశ్చాత్య దేశాల కోణంలో చూడొద్దు. సోషలిజం పదానికి అర్థాన్ని అందరికీ సమాన అవకాశాలు అనే దృక్కోణంలోనే చూడాలి. సెక్యులరిజం అనే పదం భారత రాజ్యాంగంలో భాగమని గతంలో ఎన్నో తీర్పుల్లో న్యాయస్థానాలు తేలి్చచెప్పాయి. సెక్యులర్ పదం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ఫ్రెంచ్ వారి సెక్యులరిజంకు బదులు ఆధునిక భావజాల సెక్యులరిజాన్ని భారత్ సంగ్రహించింది. మీరు భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవాట్లేరా?’’అని జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. దీనికి లాయర్ విష్ణుశంకర్ జైన్ బదులిచ్చారు. ‘‘మేం లౌకిక అనే పదానికి వ్యతిరేకం కాదు. కానీ ఆ పదాన్ని పీఠికలో చేర్చిన విధానాన్ని మాత్రమే సవాల్ చేస్తున్నాం. తప్పుడు మార్గంలో సోషలిజం పదాన్ని చేరిస్తే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రమాదంలో పడుతుందని బీఆర్ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. 1949 నవంబర్ 26నాటి రాజ్యాంగ పీఠికనే కొనసాగిద్దాం. సవరణల ద్వారా పీఠికలో సవరణ చేయకూడదు. అదనపు పదాలను చేర్చడంలో హేతుబద్ధత లోపించింది’అని లాయర్ వాదించారు. ‘‘కొత్తగా చేరిన పదాలు దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాకున్నా ఒక గందరగోళానికి తెరలేపాయి. దీంతో పీఠికలో ఎలాంటి మార్పులైనా చేయొచ్చన్న భావన తదుపరి ప్రభుత్వాల్లో నెలకొంది’’అని లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ వాదించారు. వాదోపవాదనల తర్వాత కేసు విచారణ నవంబర్ 18వ తేదీకి వాయిదాపడింది. -
ఉమ్మడి పౌరస్మృతి ఆమోదయోగ్యం కాదు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తేలి్చచెప్పింది. ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ‘లౌకిక పౌరస్మృతి’ తేవాల్సిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే. మతపరమైన పౌరస్మృతిగా పర్సనల్ చట్టాలను మోదీ అభివర్ణించడంపై ముస్లిం బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. లౌకిక పౌరస్మృతి పక్కా ప్రణాళికతో కూడిన కుట్రని, తీవ్ర విపరిణామాలుంటాయని ముస్లిం బోర్డు అధికార ప్రతినిధి ఎస్.క్యూ.ఆర్.ఇలియాస్ అన్నారు. -
రాజ్యాంగంలో ఆ 'రెండు' పదాలు మిస్సింగ్: అధిర్ రంజన్ చౌదరి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో భాగంగా మొదటిరోజు పాత పార్లమెంటుకు వీడ్కోలు పలకగా రెండో రోజు సభ్యులంతా కొత్త పార్లమెంటు భవనంలో అడుగు పెట్టారు. ఈ సందర్బంగా ఎంపీల చేతికి ఇచ్చిన భారత రాజ్యాంగం ప్రతుల్లో భారత రాజ్యాంగం ముందుమాటలో సాంఘిక, లౌకిక పదాలు లేకపోవడంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజాన్ చౌదరి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఎంపీలంతా కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో వారి చేతికి భారత రాజ్యాంగ ప్రతులను అందించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లోని పీఠికలో పొరపాట్లు ఉన్నాయన్నారు. అధిర్ రంజాన్ చౌదరి మాట్లడుతూ.. మాకు అందిచ్చిన రాజ్యాంగ ప్రతుల ప్రవేశికలో సాంఘిక, లౌకిక అన్న పదాలు ముద్రించలేదన్నారు. ఆ పదాలు రాజ్యాంగ పుస్తకంలో అంతకు ముందు లేవని 1976లో రాజ్యాంగ సవరణ తరవాతే ఆ పదాలను రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచారన్న విషయం నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఎవరైనా మన చేతికి రాజ్యాంగం అందించి అందులో ఈ పదాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిందేనన్నారు. నాకు మాత్రం ఈ విషయం ఆందోళన కలిగించేదే. వారి ఉద్దేశ్యం చూస్తే నాకు అనుమానం కలుగుతోందన్నారు. నాకు ఈ విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. లేదంటే ఈ అంశం గురించి కచ్చితంగా ప్రస్తావించేవాడినని అన్నారు. ఇక ఇండియా పేరును 'భారత్'గా మార్చే అంశంపై మాట్లాడుతూ.. 'ఇండియా' 'భారత్' పేర్లలో ఏదైనా ఒక్కటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియాగా పిలవబడే భారత్, రాష్ట్రాల సమూహం అని కూడా సంబోధించారు. నా దృష్టిలో రాజ్యాంగం బైబిల్, ఖురాన్, భగవత్గీత గ్రంధాలకు ఏమాత్రం తక్కువకాదు. ఆ విషయంలో ఎవ్వరూ ఎటువంటి సమస్యను సృష్టించకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. అధిర్ రంజాన్ చౌదరి, భారత రాజ్యాంగం, సాంఘిక, లౌకిక, రాజ్యాంగ పీఠిక ఇది కూడా చదవండి: పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్ -
ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) ఏర్పాటైంది. ఇందులో సీపీఐ, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ (యూ), ఆర్ఎస్పీ, బీఎల్ఎఫ్, భారత జాతీయ ఉద్యమ సంఘం తదితర అనేక లౌకిక ప్రజాసంఘాలు కలిసి టీఎస్డీ ఎఫ్‌ను ఏర్పాటు చేశాయి. ఈ వేదికకు చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, కో కన్వీనర్లుగా పార్టీకొకరు చొప్పున ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర సమన్వయకర్తగా నైనాల గోవర్ధన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఎస్డీఎఫ్ విధాన పత్రం, ఉమ్మడి కార్యాచరణను నాయకులు ప్రకటించారు. చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరే కంగా వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక సంస్థలు కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది పెట్టు బడిదారులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతిలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్నారు. బీజేపీ మతోన్మాద విధా నాలు, బడా సంపన్న అనుకూల విధానాలు, పేదల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తామ న్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం అడ్డూ అదుపులేని అవినీతికి పాల్పడుతోందని దుయ్య బట్టారు. తెలంగాణలో అవినీతి ప్రపంచ రికార్డు లను కూడా బద్దలు కొట్టిందన్నారు. ఈ అవినీతి తెలంగాణ ప్రజల పురోభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిందని, అందుకే అంతా కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జువ్వాడి చలపతిరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాల మల్లేశ్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకుడు హన్మేష్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తుకారాం, ఇతర నాయకులు గుర్రం విజయ్ కుమార్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్డీఎఫ్ విధాన పత్రం ముఖ్యాంశాలు ఇవీ.. ప్రతి మండలంలో అవసరమైనన్ని నాణ్యమైన పాఠశాలలు స్థాపించాలి. నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఐదు వేల మంది జనాభాకు ఒక రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పాలి. స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగ హక్కును కల్పించాలి. లేకుంటే నిరుద్యోగులందరికీ జీవించే నిరుద్యోగ భృతిని ఇవ్వాలి. భూమిలేని పేదలకు భూములను పంపిణీ చేయాలి. దళితులకు 3ఎకరాల భూమి ఇవ్వాలి. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. కుల ప్రాతిపదికగా జన గణన జరగాలి. చట్టసభల్లో బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. -
Hate Speech: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలకు దేశ లౌకిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే సామర్థ్యం ఉంటుందని వ్యాఖ్యానించింది. అందుకే విద్వేష ప్రసంగాల విషయంలో ఫిర్యాదులు అందకపోయినా కేసు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు సంబంధించి 2022లో ఇచ్చిన ఆదేశాల పరిధిని పెంచింది. అలాగే విద్వేష ప్రసంగాలపై కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కరణ చర్యగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కులం, మతం, వర్గంతో సంబంధం లేదని, చట్టాన్ని అతిక్రమించి ఎవరు విద్వేష ప్రసంగాలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. విద్వేషప్రసంగాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 2022 అక్టోబర్‌లో ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. చదవండి: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. వారిదే నిర్ణయం -
బాలీవుడ్‌పై బాంబ్ పేల్చిన హీరో!
ముంబై: టాప్ హీరో జాన్ అబ్రహం తాజాగా హిందీ చిత్రపరిశ్రమ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఎంతమాత్రం లౌకికవాదం లేదని ఆయన తేల్చిచెప్పారు. బాలీవుడ్ సెక్యులర్‌గా ఉంటుందన్న వాదన ఫేక్ అని ఆయన కొట్టిపారేశారు. తన తాజా సినిమా ‘బాట్లా హౌస్’ ప్రమోషన్లో బిజీగా ఉన్న జాన్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సెక్యులరిజంపై ఆయన మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ సెక్యులర్ పరిశ్రమ అని ఎవరు చెప్పారు మీకు? బాలీవుడ్ వందశాతం సెక్యులర్ కాదు. పరిశ్రమ మతపరంగా చీలిపోయింది. ఇది జీవితకాల సత్యం’ అని పేర్కొన్నారు. ప్రపంచమే మతపరంగా చీలిపోయందని, ప్రస్తుతమున్న ప్రపంచాన్ని మాత్రమే చిత్రపరిశమ్ర ప్రతిబింబిస్తోందని ఆయన వివరించారు. మతపరమైన చీలిక అనేది ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదని, ఇది ప్రపంచమంతటా ఉందని, ఇదే విషయమై తన సినిమాలో డైలాగ్ కూడా ఉందని జాన్ పేర్కొన్నారు. ‘నా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘ఒక వర్గమని కాదు. యావత్ ప్రపంచం ఈ సమస్యను ఎదుర్కొంటోంది. (డొనాల్డ్) ట్రంప్‌ను చూడండి. బ్రెగ్జిట్‌ను చూడండి. బోరిస్ జాన్సన్‌ను చూడండి. ప్రపంచమే నేడు మతపరంగా చీలిపోయింది. మనం ఈ ప్రపంచంలోనే నివసిస్తున్నాం. దీని మనం ఎదుర్కొని తీరాలి’.. ఇక నా వరకు ప్రపంచంలో మనం దేశం ఉత్తమమైనదని, మన చిత్ర పరిశ్రమ కూడా బెస్ట్ అని భావిస్తాను’ అని జాన్ తెలిపారు. నిజజీవిత సంఘటనలు, నిజజీవిత వ్యక్తులు ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని, యూరి, సూపర్ 30 వంటి సినిమాల విజయాలు ఇందుకు నిదర్శనమని జాన్ అభిప్రాయపడ్డారు. -
పవార్ కొత్త ఎత్తుగడ!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించేందుకు ఐక్యం కానున్న ప్రతిపక్షాల కూటమికి తానే నాయకుడిగా తెరముందు ప్రత్యక్షం కావాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. అందులో భాగంగానే ఆయన జనవరి 26వ తేదీన 'సంవిధాన్ బచావో' ర్యాలీ నిర్వహిస్తున్నారని, దానికి అన్ని పార్టీల జాతీయ నాయకులను పిలుస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే తాను ఈ ర్యాలీ నిర్వహిస్తున్నానని శరద్ పవార్ ఇప్పటికే చెప్పుకున్నారు. భారత రాజ్యాంగం పీఠికలోని 'లౌకిక (సెక్యులర్)' పదాన్ని తొలగించేందుకు రాజ్యాంగాన్ని మార్చాల్సిందేనంటూ పలుసార్లు బీజేపీ నేతలు ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఆ పార్టీ ప్రభుత్వం చర్యలేమీ తీసుకోలేదు. అయినప్పటికీ అత్యవసర సమస్యగా భావించి శరద్ పవార్ 'సంవిధాన్ బచావో' ర్యాలీ నిర్వహించడం అంటే ఏదో మతలబు ఉన్నట్లేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూక్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ నాయకుడు డీ రాజా, జేడీయూ మాజీ నాయకుడు శరద్ యాదవ్‌లను శరద్ పవార్ స్వయంగా ఆహ్వానించినట్లు తెల్సింది. రాహుల్ గాంధీని స్వయంగా పిలిచారా, లేదా ? తెలియడం లేదు. కానీ ర్యాలీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రతిపక్ష కూటమికి నాయకుడిని కావాలని ఆశిస్తున్నందునే పవార్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఈ మధ్య సరైన సంబంధాలు లేకుండా పోయాయి. ఆ నాయకత్వాన్ని పవార్ ఆశించడమే కాదని, అందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని పాలకపక్ష శివసేన-బీజేపీ కూటమి మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్ల శివసేన ప్రభుత్వం నుంచి తప్పుకున్న పక్షంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఆదుకునేందుకు కూడా ఎన్సీపీ సిద్ధమైందని, అలాంటి పార్టీ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందంటేనే అసలు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆది నుంచి పాలకపక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాన్ని సమీకరిస్తూ వచ్చిందీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ అనే విషయం తెల్సిందే. కేంద్రంతోపాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి భాగస్వామిగా ఎన్సీపీ కొనసాగినప్పటికీ శరద్ పవార్ అంటే సోనియా గాంధీకి ఎప్పుడూ అనుమానమే. మహారాష్ట్రకు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, ఎన్సీపీలు విడి విడిగానే పోటీ చేశాయి. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ఆందోళన నిర్వహించడానికి, 2017లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు సోనియా గాంధీ ప్రతిపక్షాలను సమీకరించినప్పుడు శరద్ పవార్ హాజరయ్యారు. కానీ గత ఆగస్టులో నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశానికి మాత్రం శరద్ పవాద్ హాజరు కాలేదు. ఆ తర్వాత అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేసినప్పుడు ఎన్సీపీ ఓటేయలేదు. 'కాంగ్రెస్ పార్టీ పెద్దన్న ఫోజు'నచ్చకనే కాంగ్రెస్‌కు శరద్ పవార్ దూరంగా ఉంటున్నారని ఆయన పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయ ప్రతిపక్ష కూటమికి నాయకుడు అయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవార్ తలపెట్టిన ర్యాలీకి ఎలా ప్రాతినిథ్యం వహించడమని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంధిగ్ధంలో పడింది. ర్యాలీని బహిష్కరిస్తే కీలకమైన అంశంపై ప్రతిపక్షంతో చేతులు కలపలేదనే అపవాదు వస్తుందని, పార్టీ సీనియర్ నాయకులను పంపిస్తే శరద్ పవార్ పాత్రను అంగీకరించినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను పంపించడంతోపాటు కాంగ్రెస్ ఆధ్వర్యాన ప్రతి జిల్లాలో ఇలాంటి ఆందోళనలు నిర్వహించడం ఉత్తమ మార్గమని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
భారత రాజ్యాంగంపై ఎందుకీ గొడవ?
సాక్షి, న్యూఢిల్లీ : భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం సవరించాలనుకుంటోందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యానించడం ద్వారా కొత్త వివాదాన్ని రేపారు. ముఖ్యంగా రాజ్యాంగం పీఠికలోని ‘సెక్యులర్’ పదం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే రాజ్యాంగాన్ని ఎన్నో సార్లు మార్చినందున మరోసారి మార్చడం తప్పుకాదని కూడా వాదించారు. ఆయన వాదనను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తూర్పార పట్టడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో, ఏమో హెగ్డే వెనక్కి తగ్గి క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. (సాక్షి ప్రత్యేకం) భారత రాజ్యాంగ పరిషత్తు మూడేళ్లు శ్రమపడి భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పటికీ దీనికి పరిమితులున్నాయని, కాలమాన పరిస్థితులనుబట్టి ప్రజల మనోభావాలకు అనుగుణంగా దీన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చని భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్ బీఆర్ అంబేడ్కర్ స్వయంగా సూచించారు. అయితే ఆయన రాజ్యాంగం మౌలిక స్వరూపం మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కనుకనే రాజ్యాంగానికి కేంద్ర ప్రభుత్వాలు పలు సవరణలు చేస్తూ వచ్చాయి. రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి నుంచి ఇప్పటివరకు వందకుపైగా సవరణలు చోటుచేసుకున్నాయి.(సాక్షి ప్రత్యేకం) అందులో ముఖ్యమైనదే 42వ సవరణ. రాజ్యాంగం పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను చేరుస్తూ నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. అదే సవరణ కింద కొన్ని రాజ్యాంగ అధికరణల్లో, సెక్షన్లలో మార్పులు, చేర్పులు కూడా చేసింది. ఎమర్జెన్సీ కాలంలో ఈ సవరణను తీసుకరావడం వల్ల దాన్ని ‘ఇందిరా రాజ్యాంగం’ అంటూ ప్రతిపక్షం విమర్శించింది. పౌరుల ప్రాథమిక హక్కులను మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదంటూ 1973లో సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ ఇందిర ప్రభుత్వం 42వ సవరణ ద్వారా పౌరుల ప్రాథమిక హక్కుల్లో కూడా సవరణలు తీసుకొచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం పౌరుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరిస్తూ 43, 44వ సవరణలు తీసుకొచ్చింది. (సాక్షి ప్రత్యేకం)అయితే రాజ్యాంగం పీఠికలో పేర్కొన్న ‘సెక్యులర్, సోషలిస్ట్’ పదాలు ‘ఎక్స్ప్రెస్ట్ ఎక్స్ప్లిసిటి వాట్ వాజ్ ఇంప్లిసిట్ (అంతర్లీన భావాన్ని ఎలాంటి సందేహం లేకుండా సుస్పష్టం చేయడం) అనే సుప్రీం కోర్టు వ్యాఖ్యానికి తగ్గట్టుగా ఉండడంతో ఆ రెండు పదాలను మాత్రం జనతా పార్టీ ప్రభుత్వం ఎత్తివేయలేదు. భారత రాజ్యాంగమే సెక్యులర్, సోషలిస్ట్ అని భావించడం వల్ల ఆ పదాల జోలికి ఆ ప్రభుత్వం వెల్లలేదు. భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ పార్లమెంట్‌కు సమర్పించినప్పుడు కూడా చాలా మంది నాయకులు సెక్యులర్ అనే పదాన్ని జోడించాల్సిందిగా సూచించారు. కొంత మంది డిమాండ్ కూడా చేశారు. పౌరల ప్రాథమిక హక్కుల స్వరూపమే లౌకికంగా ఉన్నప్పుడు, ఆ హక్కులను మార్చే అధికారం పార్లమెంట్‌కు లేనప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తే ఎంత, ఉపయోగించకపోతే ఎంత! అని అంబేడ్కర్ ప్రశ్నించారు. భవిష్యత్ తరాలు మనకంటే బాగుండాలి కనుక, వారి వారి కాలమాన పరిస్థితులనుబట్టి రాజ్యాంగాన్ని మార్చుకునే అవకాశం ఉండాలని, వారికి సెక్యులర్, సోషలిస్ట్ పదాలు అడ్డంకి కాకూడదని, వాటికంటే మంచి సిద్ధాంతాలే మున్ముందు రావచ్చని అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఈ అన్ని అంశాలను దష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని పరిశీలించిన భారత సుప్రీం కోర్టు 1980వ దశకంలో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగంగా ఉన్న 42 రాజ్యాంగ సవరణలోని మరిన్ని అంశాలను నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. పౌరులను హక్కును మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదని తెలిపింది.(సాక్షి ప్రత్యేకం) ‘ఎస్ఆర్ బొమ్మై, కేంద్ర ప్రభుత్వం’ మధ్య తలెత్తిన ఇలాంటి ఓ వివాదంలో 1994లో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ ‘భారత రాజ్యాంగం మౌలిక స్వరూపమే లౌకికతత్వమనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని రూలింగ్ ఇచ్చింది. నాడు రాజ్యాంగం పీఠికలో ఇందిర ప్రభుత్వం ‘సెక్యులర్, సోషలిస్ట్’ పదాలను ఎలా చేర్చిందో, అలాగే సంపూర్ణ మెజారిటీ కలిగిన బీజేపీ ప్రభుత్వం అదే పద్ధతిలో, అంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలను ఎత్తివేసినంత మాత్రాన భారత రాజ్యాంగం లౌకిక స్వరూపం మారదు. అలాంటప్పుడు ఎందుకీ గొడవ ? భారత పౌరల ప్రాథమిక హక్కుల్లో మార్పు రాదు. తమ కిష్టమైన మతాన్ని ఎంచుకునే ప్రాథమిక హక్కు భారతీయులకుందికనుక మన రాజ్యాంగంలో హిందూ, ముస్లిం, మైనారిటీ పదాలను తీసుకరావడం, తద్వారా ప్రజల్లో చిచ్చు తీసుకరావడం సాధ్యం కాదు.(సాక్షి ప్రత్యేకం) -
మతాతీత సమాజంతో మానవత్వ వికాసం
– జంధ్యాల రఘుబాబు కర్నూలు (కల్చరల్): మతాతీత సమాజంతో మానవత్వ వికాసం సాధ్యమవుతుందని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు జంధ్యాల రఘుబాబు అన్నారు. స్థానిక పింగళి సూరన తెలుగు తోట ప్రాంగణంలో మత కౌగిలి పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లా వేంపెంట వాస్తవ్యులైన రచయిత నెమలి చంద్రశేఖర్.. మతాల వెనుక దాగి ఉన్న మతలబులను తెలియజేస్తూ చక్కని కవితా సంకలనాన్ని తీసుకొచ్చారన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ..రాబోవు తరాల్లో హేతువాద శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చవలసిన ఆవశ్యకత ఉందన్నారు. మత కౌగిలి పుస్తకాన్ని ప్రముఖ రచయిత ఉద్దండం చంద్రశేఖర్ సమీక్షించారు. మతం రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందని విరసం రచయిత పాణి అన్నారు. పాలకులు..మతాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారని ప్రముఖ కథా రచయిత ఇనాయతుల్లా ఆరోపించారు. పుస్తక రచయిత నెమలి చంద్రశేఖర్, ప్రముఖ కథారయిత వెంకటకృష్ణ, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా నాయకులు డాక్టర్ మండ్ల జయరామ్, సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కెంగార మోహన్, గాయకుడు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బసవరాజు తదితరులు పాల్గొన్నారు. -
గూటుపల్లెలో మతసామరస్య పరిమళం
- 26 నుంచి ఉరుసు - హాజరుకానున్న మహారాష్ట్ర, గోవా, కర్ణాటక భక్తులు గూటుపల్లె (బేతంచెర్ల): ఇద్రూస్‌బాషా ఉరఫ్ పెద్దరాజుల స్వామి ఉరుసుకు బేతంచెర్ల మండలం గూటుపల్లె గ్రామం సిద్ధమైంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉరుసును.. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని భక్తులే కాకుండా మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది రానున్నారు. ఇదీ చరిత్ర.. పెద్దరాజుల స్వామి.. 600 సంవత్సరాల క్రితం సౌది అరేబియా దేశంలోని జిద్దా సమీపంలో గల అదన్ పట్టణంలో సయ్యద్ అబూబకర్ సుభాన్ ఇద్రూస్ వలి మక్కికు జేష్ట పుత్రుడుగా జన్మించారు. లోక కళ్యాణార్థం తొమ్మిదేళ్ల వయస్సులోనే తన తల్లిదండ్రులను వదిలిపెట్టి భారతదేశానికి వచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో కొన్ని సంవత్సరాలు నివాసం ఉండి అనంతరం ఆదోని పట్టణానికి వచ్చారు. ఇద్రూస్బాషాకు ముగ్గురు భార్యలు. వీరిలో ఇద్దరు భార్యలకు సంతానం లేదు. మొదటి భార్యకు ముగ్గురు సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. నాడు ఖుదాపల్లె.. ఆదోని నుంచి గూటుపల్లెకు వచ్చిన స్వామికి.. యాదవులు ఆవులు, గొర్రెలు మేపుతూ కనిపించారు. పెద్దరాజుస్వామి కుమార్తె ఫాతిమా ఉదయాన్నే మిస్వాక్ పుల్లను వజూ చేసిన స్థలంలో ఉంచి నాలుగు రకాలుగా నమాజు చేసిన తర్వాత పుల్ల మొక్కగా మారింది. దీంతో స్వామి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామానికి ఖుదాపల్లె అని నామకరణం చేశారు. కాలక్రమేణ అది గూటుపల్లెగా మారింది. స్వామివారి రెండో కుమారుడు సయ్యద్‌హుస్సేన్ షాబాషా 12వ ఏటనే ఆదోని పట్టణంలో జీవసమాధి అయ్యారు. స్వామివారి మహిమలు .. ఇద్రుస్ బాషా..గూటుపల్లెలో స్థిర నివాసం ఏర్పరచుకున్న తరువాత గొర్రెల కాపరుల భయం పోగొట్టేందుకు పులులను కొండ తీగలతో కట్టి తీసుకొచ్చారు. దీంతో స్వామికి పెద్దరాజు అని పేరు వచ్చింది. స్వామి రెండో కుమారుడు హుస్సేన్ షా బాష.. మొండి గోడను నడిపించారని ప్రతీతి. ప్రతి గురువారం పెద్ద పులి వచ్చి తనతోకతో దర్గాను శుభ్రం చేస్తుందని భక్తుల నమ్మకం. దర్గా ఆవరణలో దయ్యం, భూతం, పిశాచి పీడలు ఉన్న వారు..ఒక్క రోజు నిద్ర చేస్తే తొలిగిపోతాయనే విశ్వాసం ఉంది. గూటుపల్లెను సందర్శించిన ఔరంగజేబు.. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకుడైన ఔరంగజేబు.. 1681లో గూటుపల్లె గ్రామాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కాలంలోనే ఔరంగజేబు.. పెద్దరాజస్వామికి వేలాది ఎకరాలు ఇనాంగా ఇచ్చినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. దర్గా పీఠాధిపతిగా అక్బర్ బాషా ఖాద్రీ ఎంతో చారిత్మ్రాకమైన ఇద్రూసాబాష దర్గాకు నేటికి 13 మంది పీఠాధిపతులుగా వ్యవహరించారు. గత 6 సంవత్సరాల క్రితం 12వ పీఠాధిపతి అయిన సయ్యద్ హఖాని బాషా ఆకాల మరణంతో వంశ పారంపర్యంగా పీఠాధిపతిగా అతని కుమారుడైన సయ్యద్ అక్బర్ బాష ఖాద్రీ ఆరు సంవత్సరాల వయస్సుల్లో బాధ్యతలు చేపట్టారు. విశేషమేమిటంటే గూటుపల్లె పీఠంతో పాటు భారత దేశంలోని 90 పీఠాలకు ఈ బాలుడు పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికలతో మతానికి ముడిపెట్టొద్దు: సుప్రీం
మతం పేరుతో ఓట్లు అడగడం న్యాయ విరుద్ధమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ గురువారం పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు గానీ, అభ్యర్ధులు గానీ, పార్టీ లేదా అభ్యర్ధి తరఫు వారు మతం పేరుతో ఓట్లు వేయమని అడగకూడదని అన్నారు. 1995లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించిన ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం హిందూ మతం పేరుతో ప్రజలను ఓట్లు వేయాలని కోరచ్చనే తీర్పును కొట్టేసింది. ఎన్నికలు లౌకికంగా జరగాలే తప్ప మతం పేరుతో వాటిని ప్రభావితం చేయకూడదని వ్యాఖ్యానించింది. 2013 డిసెంబర్ లో అమల్లోకి వచ్చిన విశాఖ గైడ్ లైన్స్ ను ఈ సందర్భంగా ఉటంకించిన అత్యున్నత న్యాయస్ధానం హిందూ మతం పేరుతో ఎన్నికల్లో ఓట్లు కోరడంపై నడుస్తున్న వివాదం 20 ఏళ్లుగా పార్లమెంటులో పెండింగ్ లోనే ఉందని, శారీరక వేధింపుల గురించి కూడా ఏళ్లుగా పార్లమెంటు స్పందించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రచారంలో రామ మందిర నిర్మాణం లాంటి సమస్యలను లేవనెత్తడం కూడా న్యాయవిరుద్ధమని చెప్పింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్123(3)కింద మతాన్ని చూపుతూ పార్టీలు, అభ్యర్ధులు, పార్టీ లేదా అభ్యర్ధుల కార్యకర్తలు ఓట్లు కోరితే వారిని ఎన్నికల బరిలో నుంచి తప్పించే అవకాశాలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. లౌకికవాదంలోకి మతాన్ని తీసుకురాగాలమా? అంటూ 1994లో మతాన్ని చూపుతూ ఓటు అడగొచ్చని కోర్టులో కేసు వేసిన మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే సుందర్ లాల్ పట్వా తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. మతాలకు అతీతంగా ఎన్నికల చట్టాలను తీసుకువచ్చారని చెప్పిన కోర్టు దేశంలో లౌకికవాదం ఫరిడవిల్లేలా త్వరలో తీర్పును ప్రకటిస్తామని తెలిపింది. పట్వా జైన మతానికి చెందిన వారు కాగా ఆయన అనుచరులు ఎన్నికల ప్రచారంలో రామ మందిరాన్ని నిర్మణానికి సాయం చేస్తామని ప్రచారం చెప్పడాన్ని కోర్టు ఈ సందర్భంగా ఉదహరించింది. రాజకీయం, మతం రెండూ వేరని ప్రతివాది తరఫు లాయర్ కు చెప్పింది. -
ఒకడు తలనరికాడు.. మరొకడు పిస్టల్‌తో కాల్చాడు!
ఢాకా: ఇస్లామిక్ ఛాందసవాదానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో తరచూ పోస్టులు పెడుతున్న ఓ లా విద్యార్థిని బంగ్లాదేశ్‌లో అత్యంత కిరాతకంగా హతమార్చారు. బంగ్లాదేశ్‌లో వరుసగా జరుగుతున్న సెక్యులర్ కార్యకర్తలు, బ్లాగర్స్ హత్యల పరంపరలో తాజా ఘటన ఒకటి కావడం దుమారం రేపుతున్నది. 'నజిముద్దీన్ సమద్‌పై బుధవారం రాత్రి నలుగురు దుండగులు దాడి చేశారు. వారిలో ఒకడు కత్తితో అతని తల నరికేయగా, మరొకడు పిస్టల్‌తో అతి సమీపం నుంచి కాల్చాడు. దీంతో సంఘటన స్థలంలోనే సమద్ ప్రాణాలు విడిచాడు' అని ఢాకా మెటోపాలిటన్ డీసీపీ సయెద్ నురుల్ ఇస్లాం తెలిపారు. ఇది ఉద్దేశపూరితంగా చేసిన హత్యగానే భావిస్తున్నా.. దీనిపై ఎవరూ ఇంతవరకు బాధ్యత ప్రకటించుకోలేదని తెలిపారు. అతని రాతలను వ్యతిరేకిస్తూ ఈ హత్య చేశారా? అన్నది పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. ఈశాన్య నగరమైన సిల్హెట్ నుంచి ఇటీవల ఢాకా వచ్చిన సమద్.. ఇక్కడి జగన్నాథ యూనివర్సిటీలో అతను న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు. వర్సిటీ సమీపంలో రద్దీ రోడ్డుపై సమద్‌ను దారుణంగా హతమార్చారని, ఈ సమయంలో దుండగులు 'అల్లాహు అక్బర్' అని నినదించారని ఢాకా ట్రిబ్యున్ పత్రిక తెలిపింది. సమద్ ఢాకా రాకముందు నుంచే అతని రాతలపై దుండగులు నిఘా పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల హేతువాదుల హత్యలు బాగా పెరిగాయి. 2013 ఫిబ్రవరి 5న రాజిబ్ హైదర్ అనే సెక్యులర్ బ్లాగర్ను ఆయన ఇంటికి సమీపంలోనే దారుణంగా హతమార్చారు. 2015లో మరో నలుగురు బ్లాగర్లు అవిజిత్ రాయ్, వశీకర్ రహ్మన్ బాబు, అనంత బిజోయ్, నీలోయ్ ఛటర్జీలను అతి కిరాతకంగా చంపారు. -
'రాజకీయ రణ క్షేత్రాలుగా యూనివర్సిటీలు'
న్యూఢిల్లీ: మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, నేడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ ఎందుకు రాజకీయ రణ క్షేత్రాలగా మారుతున్నాయి? కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు జోక్యం వల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ రాజకీయ రణ క్షేత్రంగా మారిపోగా, నేడు సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకొని విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయించగా జేఎన్‌యూ రాజకీయ రణ క్షేత్రంగా మారింది. రాజకీయ లబ్ధి కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, యూనివర్శిటీల్లో కల్లోల పరిస్థితులను సృష్టిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. హిందుత్వ శక్తులను కూడగట్టడం ద్వారా రానున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది తక్షణ వ్యూహం కాగా, హిందూ భావజాలాన్ని విద్యార్థుల్లో విస్తరించడం ద్వారా పార్టీ రాజకీయ పునాదులను పటిష్టం చేసుకోవడం దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తోంది. వామపక్ష భావాజాలం ప్రభావాన్ని అరికట్టి, హిందుత్వ భావాజాలంలోకి విద్యార్థులను తీసుకరావడం కోసమే జేఎన్‌యూలో బీజేపీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకొందన్న వాదన వినిపిస్తోంది. దేశాన్ని ధిక్కరిస్తే సహించేది లేదన్న రాజ్‌నాథ్ సింగ్ నిజానిజాల జోలికి వెళ్లకుండా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన విద్యార్థుల వెనక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నారంటూ ట్విట్టర్లో వచ్చిన నకిలీ ట్వీట్‌ను ఉదహరించారు. హఫీజ్ స్పెల్లింగ్‌లో ఉన్న పొరపాటును కూడా గమనించకుడా తొందరపడ్డారంటే వారి ఎజెండా ఏమిటో స్పష్టంగానే తెలుస్తోంది. జేఎన్‌యూ మొదటి నుంచి భావప్రకటనా స్వేచ్ఛకు పెద్ద పీట వేస్తోంది. అందుకే అది పరస్పర భిన్నాభియ్రాల నిలయంగా మారింది. అతివాదులు, మితవాదుల, తీవ్రవాదుల భావాజాలం మధ్య అక్కడ తరచుగా సదస్సులు, సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలో ఏ రాజకీయ పరిణామం చోటు చేసుకున్నా జేఎన్‌యూ స్పందిస్తుంది. అందుకే పోలండ్ సంఘీభావ దినోత్సవాన్ని జరుపుకొంది. చైనాలోని తియాన్మన్ స్క్వేర్‌లో ప్రజాస్వామ్య విగ్రహాన్ని విద్యార్థులు ఆవిష్కరించడాన్ని హర్శించిందీ, గర్హించింది. పర్యవసానంగా చైనా ప్రభుత్వం విద్యార్థులను కాల్చివేయడాన్ని ఖండించింది. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నాన్ని వ్యతిరేకించిన వారూ ఉన్నారు. స్వాగతించిన వారూ ఉన్నారు. ఇదే పరంపరలో అఫ్జల్ గురు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు ఇవ్వడం కూడా కొత్తకాదు. అఫ్జల్ గురు అరెస్టు నాటి నుంచి ఆయనను సమర్థిస్తున్న ఒక వర్గం కూడా యూనివర్శిటీలో ఉంది. అయినా ఈ విషయాలేవి పెద్దగా బయట ప్రపంచానికి తెలిసేవి కావు. యూనివర్శిటీ ఆవరణ వరకే పరిమితమయ్యేవి. ఇప్పుడు రాజకీయ జోక్యం వల్ల బయటకొస్తున్నాయి. కల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? -ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
భాజపా ‘లౌకిక’ భాష్యాలు
రెండోమాట ‘సోషలిస్టు’, ‘సెక్యులర్’ అనే పదాలను తొలి లక్ష్య ప్రకటన (ప్రియాంబుల్)లో అంబేడ్కర్ చేర్చలేదని, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీలో (1976) ఇందిర చేర్చింది కాబట్టి అవి దుర్వినియోగం అయ్యాయని రాజ్‌నాథ్ వాదించారు. ‘లా దినోత్సవం’ సభలో ప్రసంగించిన అటార్నీ జనరల్ ‘సెక్యులర్’ పదాన్ని వదిలేసి పదేపదే ‘సోషలిస్టు ప్రజాస్వామ్య రిపబ్లిక్’గా ఇండియాను ప్రకటిస్తూ ఉపన్యాసం దంచాడు. ఇంకా- ఇంతకుమించి ‘రాజ్యాంగాన్ని సాగదీయొద్దని’, సెక్యులర్ పదాన్ని చేర్చి సాగదీస్తే ‘గందరగోళం, సంక్షోభం’ తలెత్తుతుందనీ బీజేపీ నేతలు అంటున్నారు. ‘దేశాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సభ వారి స్థూలాభిప్రాయం సాధించడం అత్యంత ముఖ్యం. దేశ రాజ్యాంగమే అందుకు పునాది. మా ప్రభుత్వ మతం-ముందు దేశం, రాజ్యాంగం మన పవిత్ర గ్రంథం.’ - ప్రధాని నరేంద్ర మోదీ (డాక్టర్ అంబేద్కర్ 125వ జన్మదినోత్సవం సందర్భంగా 28.11.2015న పార్లమెంటు ప్రసంగంలో) ‘పాలకుడనేవాడు ప్రజల ముందు అందరికన్నా ఎంతో నమ్రతతో, తల వంచుకుని వ్యవహరించాలి. ఇది ఒక్క హైందవానికి చెందిన విలువేకాదు, యావత్తు ప్రపంచం నెలకొల్పిన విలువ, సంప్రదాయం.’ - తథాగత సత్పథి, బిజూ జనతాదళ్ (అదే సభలో సభ్యుల ప్రశంసల మధ్య చేసిన వ్యాఖ్య) దయ్యాలు వేదాలు వల్లిస్తాయా? మనకు తెలియదు! అయితే ‘దెబ్బకు దేవేంద్రలోకం కనపడుతుంద’నీ, ‘దెబ్బకు దెయ్యం జడుస్తుంద’నే సామెత లలో నిజముందా? ఉందని భారత ఎన్నికల చరిత్రలో ఉజ్వల ఘట్టంగా నిరూపించిన బిహార్‌లో బహుజన ఓటర్లు ఇచ్చిన తీర్పుతో రుజువైంది. నిజంగానే బీజేపీ- పరివార్ ప్రభుత్వానికి ‘దెబ్బకు దేవేంద్రలోకం’ కనిపించి నట్లయింది! బహుళ జాతుల, భాషల సమైక్య భారతదేశాన్ని చీలగొట్టే ప్రయ త్నంలో ఉన్న ఆ ప్రభుత్వానికి ఇది హెచ్చరికా? లేదా ఆ పార్టీలో ఆంతరంగిక కల్లోలానికి నిదర్శనంగా భావించాలా? బిహార్ ఫలితాల ప్రభావం విస్తరిం చకుండా, మనసులో ఉన్నా లేకపోయినా తాత్కాలిక ‘వైరాగ్యా’న్ని భాజపా ఆశ్రయించదలచినట్లుంది. ఆ పదాల మీద ఎందుకీ శషభిషలు? రాజ్యాంగంలోని ‘ప్రియాంబుల్’ (లక్ష్య నిర్వచనం)లో దేశాన్ని మతాతీత లౌకిక వ్యవస్థగా, సెక్యులర్, సోషలిస్టు, గణతంత్ర ప్రజాస్వామ్య ‘రిపబ్లిక్’ స్థాపన ధ్యేయం కలిగినదని పేర్కొన్నది. ఈ లక్ష్యానికి తూట్లు పొడవటంలో కాంగ్రెస్ గాని, బీజేపీ- పరివార్ గాని, లేదా ఈ రెండింటి సారథ్యంలో పదవుల కోసం ఎగబడిన యూపీఏ, ఎన్డీఏ కూటాలు గానీ - ఎవరికెవరూ తీసిపోలేదు. పాతతరం నెలకొల్పిన కొన్ని మంచి సంప్రదాయాలతో కాంగ్రెస్ నెట్టుకొచ్చిందే గాని, ‘పాతపుణ్యం’తో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపో యింది. కానీ బీజేపీ - పరివార్ ప్రభుత్వాలకు ఆ మాత్రపు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైన సైద్ధాంతిక మెలకువలు కూడా లేక సంకుచితమైన దృక్పథానికి మళ్లినాయి. బిహార్ ఫలితాల తర్వాత నేడు భారతదేశం లక్ష్యం ‘వసుదైక కుటుంబకం’ అనీ, భారతీయ తత్త్వచింతన ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అనీ మోదీ ప్రకటిస్తున్నారు. సంతోషం. కానీ, దేశంలో బహుళజాతుల, బహుభాషా సంస్కృతులతో వెలుగొందవలసిన బహు జనుల, బహు ధర్మాలకు సరిసమానంగా వర్తించవలసిన వాటిని కేవలం ‘హిందూత్వ’ సిద్ధాంతానికి ఆపాదించడం సరికాదు. అలాగే, ఆయన ప్రాతి నిధ్యం వహిస్తున్న బీజేపీని ఇప్పుడైనా సెక్యులరిజానికి, రాజ్యాంగానికి బద్ధు రాలిని చేయగలుగుతారా? వైరాగ్యాలలో ఆపద మొక్కుల (ఎలాగైనా బయ టపడవేయమని) వైర్యాగం ఒకటి! కాకపోతే, ఇదంతా బిహార్ గాయాల నుంచి తేరుకొనేందుకు పన్నిన తాజా చిట్కా కావచ్చు. ఇదేనిజం కాకుంటే సెక్యులరిజం, రాజ్యాంగం పట్ల ఏకాభిప్రాయం వినిపించకుండాఇప్పటిదాకా బీజేపీ నాయకులు తలా ఒక స్వరం ఎందుకు వినిపించినట్టు? ఒకవైపున ‘రాజ్యాంగం మన పవిత్ర గ్రంథం’ అని మోదీ ప్రకటించారు. ఇంకో వైపు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ‘సెక్యులరిజం’ అన్న పదాన్ని వాడుతున్న తీరుకు ఆక్షేపణ చెప్పారు. అంతకుమించి స్పష్టంగా విశ్లేషించలేకపోయారు. ఈ పదా న్ని ‘దేశంలో దుర్వినియోగం చేస్తూ, వ్యతిరేకిస్తు’న్న వారు బీజేపీ నాయకులు. ఆ నిందను రాజ్‌నాథ్ ఇతరుల మీదకి నెట్టాడు. సహనం కోల్పోయిన పరి వార్; మేధావుల మీద, రచయితల మీద జాతీయ మైనారిటీలపైన, వారి ప్రార్థనా మందిరాలపైన తమ క్యాడర్‌తో దాడులు చేయిస్తూ, ఎదుటివారి కళ్లల్లోని నలుసులు వెతుకుతోంది. పైగా, ‘సోషలిస్టు’, ‘సెక్యులర్’ పదాలను తొలి లక్ష్య ప్రకటన (ప్రియాంబుల్)లో అంబేడ్కర్ చేర్చలేదని, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీ కాలంలో (1976) ఇందిరాగాంధీ చేర్చింది కాబట్టి అవి దుర్వినియోగమయ్యాయని వాదించారాయన. ‘లా దినోత్సవం’ సభలో అదే రోజు ప్రసంగించిన అటార్నీ జనరల్ ‘సెక్యులర్’ పదాన్ని వదిలేసి పదే పదే ‘సోషలిస్టు ప్రజాస్వామ్య రిపబ్లిక్’గా ఇండియాను ప్రకటిస్తూ ఉపన్యాసం దంచాడు. ఇంకా, ఇంతకుమించి ‘రాజ్యాంగాన్ని సాగదీయొద్దని’, సెక్యులర్ పదాన్ని చేర్చి సాగదీస్తే ‘గందరగోళం, సంక్షోభం’ తలెత్తుతుందనీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆ పార్టీ ఎలాంటి గందర గోళంలో పడిందో దీనితో స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా ఒక చారిత్రక సత్యాన్నీ, మారని బీజేపీ మౌలిక ఆలోచననూ గుర్తు చేసుకోవాలి. వాజ్‌పేయి హయాంలో ప్రియాంబుల్నుంచి సెక్యులరిజం పదంతోపాటు ‘సోషలిజం’ అన్న పదాన్ని కూడా తొలగించడానికి ప్రభుత్వ సలహాపైన అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జి చేసిన ప్రయత్నాన్ని మరవరాదు! ఎందుకీ వక్ర భాష్యాలు? హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ మూల పురుషులలో ఒకరు డాక్టర్ బి.ఎస్. మాంజీ నెలకొల్పిన సంకుచిత సంప్రదాయమే నేటికీ బీజేపీలో చిలవలు పలవలుగా అల్లుకొంటున్నది. డాక్టర్ మాంజీ ఇటాలియన్ నియంత ముస్సో లినీని, జర్మన్ ఫాసిస్టు నియంత నాజీ హిట్లర్‌ను కలుసుకుని ‘ఆర్యజాతి’ సిద్ధాంతం గురించి చర్చలు జరిపివచ్చినట్టు విన్నాం. 1948 నవంబర్‌లో బిహార్‌కు చెందిన ప్రముఖుడు ఆచార్య కె.టి. షా ముసాయిదా రాజ్యాం గంలోని 1వ అధికరణ, తొలి క్లాజులోనే ‘సెక్యులర్, ఫెడరల్, సోషలిస్టు’ పదా లను చేర్చాలని సవరణ ప్రతిపాదించగా అంబేద్కర్ నిరాకరించిన విష యాన్ని బీజేపీ నాయకులు ప్రచారంలోకి తెస్తున్నారు. ‘ప్రియాంబుల్’ను మార్చడానికి దానిని ఒక చిట్కాగా చూస్తున్నారు. నిజానికి అప్పటికి రాజ్యాంగ రచనే నిర్దిష్టరూపం తొడగలేదు. ఎందుకంటే ‘ఆదేశిక సూత్రాల’ను (డెరైక్టివ్ ప్రిన్సిపల్స్) రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు దన్నుగా చేర్చారు, వాటి ప్రకారమే పౌరులకు ప్రాథమిక హక్కులను వర్తింపచేయాలి. సెక్యుల రిజం విశ్వవ్యాపిత సత్యమని భావించి, పాలకుల మీద విశ్వాసంతో బహుశా ఆ పదం అవసరాన్ని అంబేడ్కర్ పరిగణనలోనికి తీసుకుని ఉండకపోవచ్చు. అంతేగాదు, పాలకులు రాజ్యాంగాన్ని, ఆదేశిక సూత్రాలను పక్కదోవ పట్టించి పౌరుల ప్రాథమిక హక్కులకే (సొంత ఆస్తుల మోతుబరులకు స్వప్రయోజనపరులకు) రక్షణ కల్పించడంపైన శ్రద్ధ వహించే ప్రమాదముం దని కూడా ఆయన ఊహించలేదు. కాని ఆచరణలో ఆ ప్రమాదం తన కళ్ల ఎదుటే మొగ్గ తొడుగుతున్నందున పార్లమెంటులో చేసిన ప్రసంగంలో అంబే డ్కర్- ‘దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా, ప్రజాబాహుళ్యానికి సామా జిక, ఆర్థిక స్వాతంత్య్రం సమకూరకపోతే ఎంతో శ్రమించి నిర్మించుకున్న ఈ పార్లమెంటును కూల్చివేయడానికి కూడా ప్రజలు సంకోచించర’ని అరవ య్యేళ్ల నాడే చాటిన వాడు అంబేద్కర్. సుప్రీంకోర్టు ఎప్పుడో ఆదేశించింది! పాలకులు ఆదేశిక సూత్రాలను మోసగించి, ప్రైవేట్ ఆస్తుల పరిరక్షణకు రాజ్యాంగాన్ని తాకట్టుపెట్టారు. జీవనోపాధికి, తిండికి, గృహవసతికి అను నిత్యం పాట్లు పడుతూన్న ప్రజా బాహుళ్యానికి వెసులుబాటు కల్పించగల అధికారాన్ని పాలకులకు కట్టబెట్టినవి ఆదేశిక సూత్రాలు. వీటికీ సున్న చుడుతూ, కార్పొరేట్ సామ్రాజ్యాల ఎదుగుదలకు, బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలకు పాలకులు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. సమానత్వ సూత్రాన్ని అడుగడుగునా చాటుతున్న రాజ్యాంగ అధికరణలనూ, హేతువా దాన్నీ, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలన్న విస్పష్టమైన ఆదేశాలనూ పక్కకు నెట్టి, మూఢవిశ్వాసాలను పెంచుతూ రాజకీయ ప్రయోజనాలను కాపాడు కుంటున్నారు. ఈ పరిణామాన్నీ అంబేడ్కర్ ఊహించలేదు. సెక్యులరిజాన్నీ, సోషలిజాన్ని, ప్రజాస్వామిక రిపబ్లికన్ వ్యవస్థనూ రాజ్యాంగ మౌలిక లక్షణంగా సుప్రీం కోర్టు (1973/1974/1997) ఎమర్జెన్సీకి చాలా ముందు గానే పేర్కొన్నదని మరచిపోరాదు. అసలు ‘భారత ప్రజలమైన మేము’ అని దేశ ప్రజలే రాజ్యాంగాన్ని తమకు తాముగా అంకితం చేసుకున్న తరువాత - అదే సర్వసమ్మతమైన ప్రజాభిప్రాయంగా చెలామణీ కావాలన్నదే శాసనం! అదే, దేశ ప్రజలందరి హక్కుల పత్రం, అదే భారతదేశంలో నివసించే వారం దరి సమష్టి భావన, సమన్యాయం! ఇంతకూ సుద్దులు వల్లించే అవకాశవాద రాజకీయులూ, అంబేద్కర్‌ను తమ రాజకీయ అవసరానికి వాడుకోజూచే పాలకులూ అంబేద్కర్ ధర్మచింతనగా వెలువడిన ‘రిడిల్స్ ఆఫ్ హిందూ యిజం’ గ్రంథానికి (హైందవంలో అర్థం కాని చిక్కు ప్రశ్నలు) ఈ క్షణం దాకా సమాధానం ఇవ్వలేకపోవటం భావదారిద్య్రమా? రాజకీయ సంస్థలకు మత సంస్థలతోనూ, మత సంస్థలకు రాజకీయ పార్టీలతోనూ ఎలాంటి సంబంధం ఉండరాదని రాజ్యాంగ ముసాయిదా రచన తుది ఘడియలలో (1946-47) అనంతశయనం అయ్యంగార్ ప్రతిపాదించారు. ఆమోదం కూడా పొందిన ఆ విశిష్ట తీర్మానాన్ని అందరూ కలసి ఏ గంగలో కలిపారో! ఏవో కొన్ని బిల్లులకు ఆమోదముద్ర వేయించుకునేందుకు అవకాశవాద రాజకీయాలకు పాల్ప డడం మంచిది కాదు.! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.com.in -
రాజ్‌నాథ్ సింగ్‌ను తొలగించండి..
న్యూఢిల్లీ: రాజ్యాంగ పీఠికలోని సోషలిస్ట్, సెక్యులర్ పదాలపై చెలరేగిన వివాదం పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా మరోసారి రాజుకుంది. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు శాంతారాం నాయక్ మండిపడ్డారు. లోక్‌సభలో హోంమంత్రి రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. బాధ్యత మర్చిపోయి వ్యవహరించిన ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన సెక్యులర్ పదం దుర్వినియోగమవుతోంని రాజ్‌నాథ్ గురువారం నాడు లోక్‌సభలో చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. ఇలా రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తూ చట్టసభలో మాట్లాడడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని నాయక్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని హోంమంత్రి ఉల్లంఘించారని ఆరోపించారు. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆయనను తొలగించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తిచేశారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యల వల్లే దేశంలో అసహనం వ్యాప్తి చెందిందని నాయక్ మండిపడ్డారు. కాగా రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలన్న శివసేన డిమాండ్‌పై చర్చకు సిద్ధమని గతంలో ప్రకటించి ఎన్డీయే సర్కారు చిక్కుల్లో పడింది. ఆ పదాలు లేని పాత రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని ప్రచురించి ఓ ప్రకటన విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ పదాలను తొలగించే ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. -
ఆదిలోనే అపశృతి
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన రాజ్యాంగ దినోత్సవం సంబరాల్లో ఆదిలోనే అపశృతి దొర్లింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం వివిధ దినపత్రికలలో ఇచ్చిన ప్రకటనలో ఘోరమైన తప్పు దొర్లింది. గురువారం ప్రముఖ దినప్రతికల్లో ప్రచురితమైన ఈ ప్రకటన పీఠికలో 'సామ్యవాద, లౌకిక' అనే పదాలను తొలగించడం వివాదం రేపింది. దీంతో ఆగమేఘాల మీద స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పింది. ఘోరమైన తప్పు దొర్లిందని, విచారణకు అదేశించామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తక్షణ విచారణకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు రోజుల్లో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 26న అధికారులు రాజ్యాంగ పీఠికా ప్రమాణాన్ని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
యోగా.. మతపరమైన అంశం కాదు...
వాషింగ్టన్ : భారతీయులు ప్రాచీన కాలం నుంచి ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నారు. ఈ యోగా కార్యక్రమం ఇతర దేశాలకూ వ్యాప్తిచెందింది. అయితే అమెరికాలో యోగా అంటే ఇష్టం లేని కొందరు మాత్రం దీనిని భారతీయుల మతవిశ్వాసాలకు సంబంధించినదిగా చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక శాన్ డియాగో ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. యోగా అనేది భారతీయుల ప్రాచీన శాస్త్రం అని, దీనిని మత సంబంధ విశ్వాసాలుగా పేర్కొనరాదని కోర్టు తెలిపింది. స్థానిక 4వ జిల్లా జడ్జీ కోర్టు శాన్ డియాగో కి చెందిన ముగ్గురు జడ్జీల ప్యానెల్ ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. ఎన్సినిటాస్ స్కూల్ లో యోగాను నేర్పించడం చూసి కొందరు వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాలకు కారణమైంది. ఆ పాఠశాలలో యోగా నేర్పించడం అనేది లౌకిక విషయం మాత్రమే, ఇది మతపరమైన అంశాలకు దీనితో సంబందం లేదని శాన్ డియాగో కోర్టు శుక్రవారం ఈ విషయాలను కొట్టిపారేసింది. -
లౌకిక, సామ్యవాద పదాలను తొలగించం: కేంద్రం
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక, సామ్యవాద పదాలపై చర్చ జరగాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంగళవారం లోక్‌సభలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జీరో అవర్‌లో జ్యోతిరాదిత్య సింధియా(కాంగ్రెస్) ఈ అంశాన్ని లేవనె త్తారు. మంత్రి వెంక య్యనాయుడు స్పందిస్తూ.ఈ పదాలను తొలిగించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. -
అత్తారింటికి దారిదే అంటున్న వివేక్ ఒబెరాయ్
కుటుంబ సంబంధం రాజకీయ బంధం కంటే గొప్పది. ఈ విషయం నటుడు వివేక్ ఒబెరాయ్ కి బాగా తెలుసు. అందుకే గతంలో ఎన్నో సార్లు నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించినా, ఎన్నికలు వచ్చే సరికి బంధువుల కే నా సపోర్టు అని ప్రకటించేశారు. అందునా సదరు బంధువు పిల్లనిచ్చిన అత్తగారైతే ఇంక చెప్పేదేముంది? రక్త చరిత్ర హీరో వివేక్ ఒబెరాయ్ అత్తగారు నందినీ అల్వా బెంగుళూరు సెంట్రల్ నుంచి జనతాదళ్ సెక్యులర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. దాంతో వివేక్ ఒబెరాయ్ ముంబాయి నుంచి బెంగుళూరు వెళ్లి, అక్కడే మకాం వేశారు. ఆయన ఉత్తరాది ఓటర్లను కలుసుకుని 'మా అత్తగారు మామంచి వారు. మీ ఓట్లు ఆమెకే వేయండి' అని అభ్యర్థిస్తున్నారు. బెంగుళూరు లోని గురుద్వారాలకు వెళ్లి అక్కడి సిక్కు ఓటర్లను కూడా కలుసుకుంటున్నారు. అయితే ఆయన మద్దతు అత్తగారికే తప్ప జనతాదళ్ సెక్యులర్ పార్టీకి కాదట.