న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలకు దేశ లౌకిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే సామర్థ్యం ఉంటుందని వ్యాఖ్యానించింది. అందుకే విద్వేష ప్రసంగాల విషయంలో ఫిర్యాదులు అందకపోయినా కేసు నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు సంబంధించి 2022లో ఇచ్చిన ఆదేశాల పరిధిని పెంచింది.
అలాగే విద్వేష ప్రసంగాలపై కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కరణ చర్యగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కులం, మతం, వర్గంతో సంబంధం లేదని, చట్టాన్ని అతిక్రమించి ఎవరు విద్వేష ప్రసంగాలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది.
విద్వేషప్రసంగాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 2022 అక్టోబర్‌లో ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది.
చదవండి: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. వారిదే నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment