అత్తారింటికి దారిదే అంటున్న వివేక్ ఒబెరాయ్
అత్తారింటికి దారిదే అంటున్న వివేక్ ఒబెరాయ్
Published Mon, Mar 31 2014 10:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM
కుటుంబ సంబంధం రాజకీయ బంధం కంటే గొప్పది. ఈ విషయం నటుడు వివేక్ ఒబెరాయ్ కి బాగా తెలుసు. అందుకే గతంలో ఎన్నో సార్లు నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించినా, ఎన్నికలు వచ్చే సరికి బంధువుల కే నా సపోర్టు అని ప్రకటించేశారు. అందునా సదరు బంధువు పిల్లనిచ్చిన అత్తగారైతే ఇంక చెప్పేదేముంది?
రక్త చరిత్ర హీరో వివేక్ ఒబెరాయ్ అత్తగారు నందినీ అల్వా బెంగుళూరు సెంట్రల్ నుంచి జనతాదళ్ సెక్యులర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. దాంతో వివేక్ ఒబెరాయ్ ముంబాయి నుంచి బెంగుళూరు వెళ్లి, అక్కడే మకాం వేశారు. ఆయన ఉత్తరాది ఓటర్లను కలుసుకుని 'మా అత్తగారు మామంచి వారు. మీ ఓట్లు ఆమెకే వేయండి' అని అభ్యర్థిస్తున్నారు. బెంగుళూరు లోని గురుద్వారాలకు వెళ్లి అక్కడి సిక్కు ఓటర్లను కూడా కలుసుకుంటున్నారు.
అయితే ఆయన మద్దతు అత్తగారికే తప్ప జనతాదళ్ సెక్యులర్ పార్టీకి కాదట.
Advertisement