సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌లపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణనకు వేగవంతం చేసింది. గురువారం ప్రజ్వల్‌పై సిట్ బృందం.. లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయన కనిపించిన వెంటనే అరెస్ట్ చేసే విధంగా సిట్ వారెంట్ జారీ చేసింది.
దేశంలోని అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్లకు లుక్ అవుట్ సర్క్యులర్ ఇచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ విమానాశ్రయం, ఓడరేవు, సరిహద్దు చెక్‌పోస్ట్ కనిపిస్తే.. నిర్బంధించాలని తెలిపింది. కాగా హసన్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ సంబంధించినవిగా కొన్ని అసభ్యకర వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
లైంగిక వేధింపులపై పలువురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ విచారిస్తోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరవ్వాలని తండ్రీ కొడుకులకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్ రేవణ్ణ సిట్ అధికారులను కోరారు. ‘సిట్ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశాడు. అయితే, ప్రజ్వల్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఈ మేరకు గురువారం ఉదయం మరోసారి సమన్లు పంపింది. అనంతరం కొద్దిసేపటికే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు.. ప్రజ్వల్‌ను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment