యోగా.. మతపరమైన అంశం కాదు... | Yoga classes are secular, says US court | Sakshi
Sakshi News home page

యోగా.. మతపరమైన అంశం కాదు...

Published Sun, Apr 5 2015 9:01 AM | Last Updated on Wed, May 29 2019 2:59 PM

యోగా.. మతపరమైన అంశం కాదు... - Sakshi

యోగా.. మతపరమైన అంశం కాదు...

వాషింగ్టన్ : భారతీయులు ప్రాచీన కాలం నుంచి ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నారు. ఈ యోగా కార్యక్రమం ఇతర దేశాలకూ వ్యాప్తిచెందింది. అయితే అమెరికాలో యోగా అంటే ఇష్టం లేని కొందరు మాత్రం దీనిని భారతీయుల మతవిశ్వాసాలకు సంబంధించినదిగా చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక శాన్ డియాగో ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. యోగా అనేది భారతీయుల ప్రాచీన శాస్త్రం అని, దీనిని మత సంబంధ విశ్వాసాలుగా  పేర్కొనరాదని కోర్టు తెలిపింది.

స్థానిక 4వ జిల్లా జడ్జీ కోర్టు శాన్ డియాగో కి చెందిన ముగ్గురు జడ్జీల ప్యానెల్ ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. ఎన్సినిటాస్ స్కూల్ లో యోగాను నేర్పించడం చూసి కొందరు వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాలకు కారణమైంది.  ఆ పాఠశాలలో యోగా నేర్పించడం అనేది లౌకిక విషయం మాత్రమే, ఇది మతపరమైన అంశాలకు దీనితో సంబందం లేదని శాన్ డియాగో కోర్టు శుక్రవారం ఈ విషయాలను కొట్టిపారేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement