
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకేసారి ఎన్నికలను రెండు దశలుగా విభజించి నిర్వహించాలని న్యాయ కమిషన్ సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు, మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను 2024 సాధారణ ఎన్నికల సమయంలో నిర్వహించాలని కమిషన్ సూచించనుంది. లా కమిషన్ అంతర్గతంగా రూపొందించిన ఓ ముసాయిదాలో ఈ విషయం ఉన్నట్లు సమాచారం. ఒకేసారి ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని కొంత కుదించడం, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని పెంచడం చేయాలనీ, ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించాలని కమిషన్ సూచించనుంది.