ఢిల్లీ: జమిలి ఎన్నికలు అనే అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై సాధ్యాసాధ్యాలను లా కమిషన్ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల కోసం ఆచరణాత్మక రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ సమాధానమిచ్చారు.
న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీ కూడా జమిలి ఎన్నికల అంశంపై పరిశీలన చేసిందని అర్జున్ రామ్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సహా వివిధ భాగస్వాములతో చర్చలు జరిపిందని పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలు అనే అంశం దేశాన్ని భాజపా నేతృత్వంలోని కేంద్రం తెరమీదకు తీసుకువచ్చింది.
ఎన్నికలను దేశమంతా ఒకేసారి జరపాలనే ప్రతిపాదన ఎంత వరకు సాధ్యమవుతుంది? అనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. అయితే.. ఈ అంశం గతంలోనూ రాజకీయ వివాదానికి తెరతీసింది. ఒకేసారి ఎన్నికలు జరిపితే.. పలు ప్రాంతీయ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని మేధావులు గతంలో అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..?
Comments
Please login to add a commentAdd a comment