scrutiny
-
సమాజం పట్ల కరుణతోనే న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నా..
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్బాద్లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు. -
పేటీఎంలో చైనా పెట్టుబడులపై ప్రభుత్వ ఫోకస్
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్)లో చైనా నుంచి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పేమెంట్ అగ్రిగేటర్’ లైసెన్స్ కోసం పీపీఎస్ఎల్ 2020 నవంబర్‌లో దరఖాస్తు పెట్టుకుంది. 2022 నవంబర్‌లో ఈ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. ఎఫ్‌డీఐ మార్గదర్శకాల్లోని ప్రెస్‌నోట్ 3 నిబంధనలను పాటించడం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం కంపెనీలో ఎఫ్‌డీఐలకి కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్)లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్‌కు వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ సూచన మేరకు ఎఫ్‌డీఐ ప్రెస్ నోట్3 నిబంధనలను అనుసరించి, ఓసీఎల్‌లో చైనా ఎఫ్‌డీఐకి ఆమోదం కోసం పేటీఎం 2022 డిసెంబర్ 14న దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. పీపీఎస్ఎల్లో చైనా పెట్టుబడులను అంతర్మంత్రిత్వ శాఖ కమిటీ అధ్యయనం చేస్తోందని, సంప్రదింపులు, విస్తృత పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. భారత్‌తో భూ సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకి ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ కేంద్ర సర్కారు లోగడ నిబంధనలు తీసుకువచి్చంది. 2020లో చైనా–భారత్ బలగాల మధ్య గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఈ కఠిన వైఖరికి మళ్లింది. యూజర్ల నుంచి పూర్తి మద్దతు: పేటీఎం మరోవైపు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) వివాదం ఎలా ఉన్నా .. యూజర్ల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తోందని పేటీఎం ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సరీ్వసులను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఫిబ్రవరి 29 నుంచి దాదాపు అన్ని సేవలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నాం.. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గతంలో పేటీఎంలోకి వచి్చన ఎఫ్‌డీఐకి సంబంధించి తప్పనిసరి అనుమతులు పొందాలని ఆర్బీఐ సూచించినట్టు తెలిపారు. ‘‘ఇది నియంత్రపరమైన ప్రక్రియ. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఎవరైనా కానీ, ఎఫ్‌డీఐ ఆమోదం పొందాల్సిందే’’అని చెప్పారు. ఈ నిబంధనలను అనుసరించి అన్ని రకాల పత్రాలతో నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు సమరి్పంచినట్టు తెలిపారు. ఇది పరిష్కారం అయ్యేంత వరకు, కొత్త వరక్తులను చేర్చుకోకుండా, అప్పటికే చేరిన వర్తకులకు పేమెంట్ సేవలు అందించడానికి అనుమతి ఉంటుంది. ‘‘కంపెనీలో యాజమాన్య రూపం మారిపోయింది. పేటీఎం వ్యవస్థాపకుడు (శర్మ) ఇప్పడు కంపెనీలో 24.3 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ఓసీఎల్‌లో యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడి 10 శాతంలోపునకు తగ్గిపోయింది. కనుక పీపీఎస్ఎల్లో చైనా నుంచి ఎఫ్‌డీఐ అన్నదానికి ప్రస్తుతం అర్థం లేదు’’అని పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
TS: పూర్తైన పరిశీలన.. 2,898 నామినేషన్లకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో.. నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఈసీ ఈ వివరాలను మంగళవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించింది. మొత్తం 4,798 మంది నామినేషన్లు దాఖలు కాగా.. 2,898 నామినేషన్లకు ఆమోదం లభించింది. అలాగే 606 తిరస్కరణకు గురయ్యాయి. ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో రేపటితో(నవంబర్ 15తో) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. మధ్యాహ్నాం 3గంటల లోపు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. దీంతో 2,898 మందిలో ఎంత మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారు? ఎన్నికల బరిలో చివరకు ఎంత మంది మిగులుతారు? అనేది రేపు సాయంత్రం కల్లా తేలనుంది. ఇక నామినేషన్ల పరిశీలన తర్వాత ఆమోదించినవాటి లెక్కల ప్రకారం.. కేసీఆర్ పోటీ చేయబోతున్న గజ్వేల్ అత్యధికంగా 114 నామినేషన్లకు ఆమోదం లభించింది. వీళ్లలో 28 మంది విత్‌డ్రా చేసుకోగా(ఇవాళ సాయంత్రం వరకు).. 86 మంది అభ్యర్థులు మిగిలారు. మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 56(కేసీఆర్ పోటీ చేయబోయే రెండో స్థానం), ఎల్బీ నగర్లో 57 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఈనెల 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. 10వ తేదీతో ముగిసింది. మొదటి రోజు 96 మంది, రెండో రోజు 136, 6వ తేదీన 207, 7వ తేదీన 281 మంది, 8వ తేదీన 618 మంది, 9వ తేదీన 1,133 మంది, ఆఖరి రోజు అధికంగా 2,327 మంది వేశారు. అలా.. ఎన్నికల్లో మొత్తం 4,798 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2018 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 2,399 నామినేషన్లు వేయగా అందులో 456 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వాళ్లలో 367 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. చివరకు 1,821 మంది ఎన్నికలో బరిలో నిలిచారు. అయితే.. ఎన్నికల్లో 1,569 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. -
జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: జమిలి ఎన్నికలు అనే అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై సాధ్యాసాధ్యాలను లా కమిషన్ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల కోసం ఆచరణాత్మక రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ సమాధానమిచ్చారు. న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీ కూడా జమిలి ఎన్నికల అంశంపై పరిశీలన చేసిందని అర్జున్ రామ్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సహా వివిధ భాగస్వాములతో చర్చలు జరిపిందని పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలు అనే అంశం దేశాన్ని భాజపా నేతృత్వంలోని కేంద్రం తెరమీదకు తీసుకువచ్చింది. ఎన్నికలను దేశమంతా ఒకేసారి జరపాలనే ప్రతిపాదన ఎంత వరకు సాధ్యమవుతుంది? అనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. అయితే.. ఈ అంశం గతంలోనూ రాజకీయ వివాదానికి తెరతీసింది. ఒకేసారి ఎన్నికలు జరిపితే.. పలు ప్రాంతీయ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని మేధావులు గతంలో అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
ఐటీ నోటీసులను లైట్ తీసుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి..
పన్ను చెల్లింపుదారులు ఎగవేతలకు పాల్పడకుండా ఆదాయపు పన్ను శాఖ నూతన మార్గదర్శకాలతో పట్టు బిగించింది. ఐటీ శాఖ పంపించే నోటీసులను లైట్ తీసుకునేవారి పట్ల కఠిన వైఖరి అవలంభించనుంది. నోటీసులకు స్పందించనివారు పూర్తి స్క్రూటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. పన్ను ఎగవేత చర్యలను కట్టడి చేయడంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త చర్యలను చేపట్టనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ఐటీ నోటీసులకు స్పందించని పక్షంలో ఐటీ శాఖ రంగంలోకి దిగి విచారణ చేపడుతుంది. అంతేకాకుండా పన్ను ఎగవేతకు సంబంధించి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థల నుంచి సమాచారం అందినప్పుడు కూడా లోతుగా పరిశీలించనున్నట్లు సీబీడీటీ తెలిపింది. ఆదాయంలో వ్యత్యాసాలను గుర్తించిన ఐటీ అధికారులు జూన్ 30లోగా ఐటీ చట్టం సెక్షన్ 143(2) కింద రెండో నోటీసు పంపుతారు. అలాగే సెక్షన్ 142 (1), 148 కింద నోటీసులు అందుకున్న వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను ఐటీ శాఖ పరిశీలిస్తుంది. స్క్రూటినీకి మార్గదర్శకాలు ఐటీ శాఖ పరిశీలనకు అనుసరించాల్సిన విధానాలను పేర్కొంటూ సీబీడీటీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఏవైనా చట్టబద్ధమైన సంస్థల నుంచి పన్ను ఎగవేతను సూచించే నిర్దిష్ట సమాచారం అందిన సందర్భంలో ఆ కేసులను ఐటీ శాఖ పరిశీలనకు తీసుకుంటుంది. ఆ పన్ను చెల్లింపుదారు సంబంధిత అసెస్మెంట్ ఇయర్‌కు ట్యాక్స్ రిటర్న్స్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. నోటీసుకు స్పందనగా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పటికీ, సెక్షన్ 148 కింద నోటీసులు అందుకున్న సందర్భంలోనూ ఐటీ శాఖ పరిశీలన చేపడుతుంది. పన్ను చెల్లింపుదారు సెక్షన్ 142 (1) కింద నోటీసుపై రిటర్న్స్ ఫైల్ చేయడంలో విఫలమైతే ఐటీ శాఖ పరిశీలనలోకి వస్తుంది. రిటర్న్ దాఖలుకు సంబంధించి మరింత స్పష్టత కోసం ఆదాయపు పన్ను శాఖ ఈ సెక్షన్ 142(1) కింద నోటీసు జారీ చేస్తుంది. 2021 ఏప్రిల్ 1కి ముందు లేదా తర్వాత ఐటీ శాఖ సోదాలు చేసి సీజ్ చేసి ఉంటే అటువంటి వారు కూడా స్క్రూటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెక్షన్ 12A, 12AB, 35(1)(ii)/(iia)/(iii), 1023(C) మొదలైన వాటి కింద ఐటీ శాఖ ఆమోదించకపోయినా పన్ను మినహాయింపు లేదా తగ్గింపును క్లెయిమ్ చేసిన వారిపై కూడా విచారణ ఉంటుంది. ఇదీ చదవండి: IT Returns: అందుబాటులోకి ఐటీఆర్-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా! -
తండ్రి ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం జగన్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వారి కష్టం ఎట్టకేలకు ఫలించింది. చదివిన చదువు వృథా పోలేదు. తమ బతుకులు ఇంతేనని నిరాశలో ఉన్న వారి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. 1998లో డీఎస్సీ రాయగా అది చెల్లదంటూ అందులో ఎంపికైన వారికి నాటి చంద్రబాబు ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. దీనిపై వారు 22 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. కోర్టుకు వెళ్లారు. చదవండి: ‘అలా చేస్తే చూస్తూ ఊరుకుంటారా.. చంద్రబాబును తరిమి కొడతారు’ తమకు అన్యాయం జరిగిందంటూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిశారు. 1998 డీఎస్సీలో అర్హులైన అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. తర్వాత ఆయన హఠాన్మరణంతో ఆ ఫైల్ ఆగిపోయింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు వారి గోడును పట్టించుకోలేదు. విపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తూ జిల్లాకు వచ్చినప్పుడు డీఎస్సీ అభ్యర్థులు ఆయనను కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ ప్రభుత్వం రాగానే సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అధికార పగ్గాలు చేపట్టాక ఆ మాట నిలబెట్టుకునే దిశగా చర్యలు చేపట్టారు. కోర్టు తీర్పు అనంతరం 1998 డీఎస్సీ అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించేందుకు అన్ని చర్యలూ పూర్తి చేశారు. ఫలితంగా తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని 1998 డీఎస్సీ అభ్యర్థులు 2,807 మంది ఉపాధ్యాయ ఉద్యోగాల్లో చేరనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఉత్తర్వులు అందాయి. అర్హులందరూ అవసరమైన ధ్రువపత్రాలను అప్లోడ్ చేసే పనిలో పడ్డారు. ఈ నెల ఆరు నుంచి 14వ తేదీలోగా వాటి వెరిఫికేషన్ పూర్తి కానుంది. అనంతరం అర్హులైన అందరినీ ఈ నెల 14వ తేదీ తర్వాత ఉపాధ్యాయులుగా నియమించనున్నారు. 6 నుంచి క్వాలిఫైడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కాకినాడ సిటీ/రాయవరం: ఈ నెల 6, 7 తేదీల్లో డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్టు కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి డి.సుభద్ర పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1998 డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూకు హాజరై పోస్టు పొందని అభ్యర్థులు 560 మంది ఉన్నారు. వీరిలో ఆసక్తి ఉన్న క్వాలిఫైడ్ అభ్యర్థులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారి ఒరిజనల్ సర్టిఫికెట్లను కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరిశీలించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే వారు ఆధార్ కార్డు, డీఎస్సీ ఇంటర్వ్యూ లెటర్, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, హాల్ టికెట్/ర్యాంకు కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఎస్ఎస్సీ/ఇంటర్/డిగ్రీ/పీజీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, డీఈడీ/బీఈడీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, స్టడీ/రెసిడెన్స్ సర్టిఫికెట్లు, ఏజెన్సీ ఏరియా సరి్టఫికెట్లు (వర్తిస్తే), పీహెచ్సీ సర్టిఫికెట్లు (అవసరమైన వారు), టీచింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ (అనుభవం ఉన్నవారు) తీసుకుని ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. వీరందరూ మూడు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు కూడా అందజేయాలని డీఈఓ తెలిపారు. అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. హాల్ టికెట్ నంబర్ 4100047 నుంచి 4102488 వరకూ ఉన్న అభ్యర్థులు 6వ తేదీన, 4102489 నుంచి 4105490 వరకూ ఉన్న అభ్యర్థులు 7వ తేదీన ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని డీఈఓ సుభద్ర సూచించారు. -
Income Tax: స్క్రూటినీ కేసుల ఎంపిక
ఈ నెల మొదటి వారంలో ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇన్‌కం ట్యాక్స్ కేసులను ఏయే ప్రాతిపదికన స్క్రూటినీకి ఎంపిక చేస్తారనేది తెలియజేశారు. ఒక కేసును స్క్రూటినీకి ఎంపిక చేశారంటే తగిన కారణం ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో రిటర్ను దాఖలు చేసిన తర్వాత అందులోని అంశాలను పరిశీలిస్తారు. ఆ పరిశీలనలో అన్నీ మామూలుగానే ఉంటే అసెస్ చేసి, కేసుని క్లోజ్ చేస్తారు. రిఫండ్ ఉంటే ఇస్తారు. డిమాండ్ ఉంటే కట్టమని సెలవిస్తారు. తప్పొప్పులు సరి చేసి ఆర్డర్లు తయారు చేస్తారు. తప్పొప్పులు లేకపోతే మీరు ధన్యులు. అసెస్మెంట్ పూర్తయినట్లు. అయితే, అసెస్మెంట్తో సంబంధం లేకుండా కూడా ఈ కింది తరహా కేసులను స్క్రూటినీకి ఎంపిక చేస్తారు. - సర్వే జరిగిన తర్వాత సర్వేలో బైటపడ్డ అంశాలను ఆధారంగా చేసుకుని, రిటర్నులు వేసిన వారి కేసులు - సెర్చి జరిగిన కేసుల్లో, బైటపడ్డ విషయాల ఆధారంగా వేసిన రిటర్నులు - సీజ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న అంశాల ఆధారంగా దాఖలు చేసిన రిటర్నులు - అధికారులు రిటర్నులు వేయమని నోటీసులిచ్చినా రిటర్నులు దాఖలు చేయకుండా దాటవేసిన వారు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నోటీసు ఇచ్చే వేళకు, వారి దగ్గర సమగ్ర సమాచారం, ముఖ్యమైన వివరాలు ఉంటాయి. - ఎగవేత కేసుల్లో నోటీసులు ఇస్తారు. నోటీసుకు బదులుగా రిటర్ను వేసినా, వేయకపోయినా అటువంటి కేసులను స్క్రూటినీకి ఎంపిక చేస్తారు. - కొన్ని సెక్షన్ల ప్రకారం నమోదు చేసుకున్న సంస్థలు వేసే రిటర్నులు (ఈ సంస్థలకు నమోదు చేసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.. అవి దుర్వినియోగం అవుతాయనే అనుమానంతో). ఉదాహరణకు ట్రస్టులు, ధార్మిక సంస్థలు మొదలైనవి. - ఏయే అసెస్మెంట్లలో ‘‘అదనంగా’’ ఆదాయం బైటపడిందో ఆ కేసులు. పెద్ద నగరాల్లో రూ. 25 లక్షలు దాటినా, ఇతర ప్రాంతాల్లో రూ. 10 లక్షలు దాటినా - ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ వారి ద్వారా బైటపడ్డ ఎగవేత కేసులు ఇవి కాకుండా పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలు జరిగినప్పుడు డిపార్ట్మెంట్ .. ఆయా వర్గాల నుంచి సమాచారం సేకరిస్తుంది. ఎన్నో నిర్దేశిత సంస్థలు ప్రతి సంవత్సరం వార్షిక రిటర్నుల ద్వారా సమాచారం తెలియచేయాలి. ఈ రోజుల్లో సమాచారం సులువుగా సేకరించవచ్చు. ఆట్టే కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి వ్యవహారం డిపార్ట్మెంట్ వారికి తెలుసు. వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేయకండి. వ్యవహారాలు జరిగినప్పటికీ సంబంధిత కాగితాలు, తగిన కారణం, సరైన వివరణ ఉంటే కేసులను సజావుగా పరిష్కరించుకోవచ్చు. - కె.వి.ఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) -
రిటర్న్‌ల స్క్రూటినీకి మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నులను స్క్రూటినీకి ఎంపిక చేసే విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. వీటి ప్రకారం పన్ను ఎగవేతకు సంబంధించి ఏ అధికారిక ఏజెన్సీల దగ్గర సమాచారమున్నా స్క్రూటినీ చేపట్టవచ్చు. అయితే, పూర్తి స్థాయి పరీక్షకు నిర్దిష్ట కేసులను ఎంపిక చేసేందుకు ప్రిన్సిపల్ కమిషనర్ / ప్రిన్సిపల్ డైరెక్టర్ / కమిషనర్ / డైరెక్టర్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు చెల్లుబాటయ్యే అనుమతులు లేకుండా చారిటబుల్ ట్రస్టులు మినహాయింపులను క్లెయిమ్ చేసిన కేసుల్లో.. సర్వే, సెర్చి, జప్తులకు సంబంధించిన కేసుల్లో.. నోటీసుల జారీ కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలి. పూర్తి స్థాయి స్క్రూటినీలో భాగంగా పన్ను చెల్లింపుదారులు నిజాయితీగానే మినహాయింపులు పొందారా అన్నది ఆదాయపు పన్ను శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆదాయం తక్కువగా, నష్టాలను ఎక్కువగా చూపడం లాంటివేవీ చేయలేదని ధృవీకరించుకునేందుకు స్క్రూటినీ నిర్వహిస్తారు. -
క్యాబ్ సంస్థలపై కొరడా : దిగిరానున్న చార్జీలు
సాక్షి,న్యూఢిల్లీ: ఓలా ఉబెర్ సహా,ఇతర క్యాబ్ సేవల సంస్థలను నియంత్రించేలా వీటిని మోటారు వాహనాల (సవరణ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. క్యాబ్‌ల నిర్వాహక సంస్థలను చట్టం పరిధిలోకి తీసుకొస్తుంది. కాలుష్య నియంత్రణ,వారి వ్యాపారంలో పారదర్శకత, తదితర ప్రయోజనాల కోసం రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. దీంతో క్యాబ్ సేవలు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. సర్జ్ చార్జ్ వాయింపులకు చెక్, ఇతర నిబంధనలు నవంబర్ 27, శుక్రవారం జారీ చేసిన 26 పేజీల మోటారు వాహన అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌లో ఈ నిబంధనలు రూపొందించింది. ప్రభుత్వం ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లు బాదేస్తున్న సర్జ్‌చార్జీలకు కేంద్రం చెక్ చెప్పింది. అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో 1.5 రెట్లు బేస్ ఛార్జీలకు కోత పెట్టింది. అలాగే అవి అందించే డిస్కౌంట్‌ను బేస్ ఛార్జీలలో 50 శాతానికి పరిమితం చేసింది. స్థానిక ప్రభుత్వం నిర్ణయించని రాష్ట్రాల్లో, బేస్ ఛార్జీ రూ .25/30గా ఉండాలి. అగ్రిగేటర్లతో అనుసంధానమైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలి.. అయితే బేస్ ఛార్జీలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. వెబ్సైట్ లేదా యాప్‌లో అగ్రిగేటర్ నిర్దేశించిన విధంగా చెల్లుబాటు అయ్యే సరైన కారణంగా లేకుండా రైడ్‌ను రద్దు చేసినట్లయితే, మొత్తం ఛార్జీలో 10శాతం పెనాల్టీ ఇద్దరికీ వరిస్తుంది. ఇది 100 రూపాయలకు మించకూడదు. కరోనావైరస్ మహమ్మారితో తీవ్రంగా దెబ్బతిన్న డ్రైవర్లను ఆదుకునేలా ప్రతీ రైడ్ ద్వారా సంపాదించిన ఆదాయంలో కనీసం 80 శాతం వారికి అందాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందించాలి. రూ .10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ మొత్తం ప్రతీ సంవత్సరం 5 శాతం పెంచాలి. డ్రైవర్లు కూడా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఏ డ్రైవర్ కూడా12 గంటలకు మించి పనిచేయడానికి లేదు. తర్వాత 10 గంటల విరామం తప్పనిసరి. ఒకటి కంటే ఎక్కువ కంపెనీలలో పనిచేసే డ్రైవర్లు 12 గంటల పనిదినం నిబంధనను ఉల్లఘించకుండా అగ్రిగేటర్లు చూసుకోవాలి. వారి భద్రత, ప్రయాణీకుల భద్రతకు ఈ పనిగంటలను పర్యవేక్షించేందుకు ఆయా యాప్‌లలో ఒక యంత్రాంగాన్ని తీసుకురావాలని కోరింది. యాప్ ఆధారిత మొబిలిటీ సేవలను అందిస్తున్న సంస్థలు జవాబుదారీతనం వహించేలా చట్టానికి సవరణలు చేసింది. ముఖ్యంగా ‘అగ్రిగేటర్’ అనే పదం నిర్వచనాన్ని చేర్చేందుకు మోటారు వాహనాల చట్టం,1988ను మోటారు వాహనాల సవరణ చట్టం, 2019 ద్వారా సవరించామని రహదారి మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం వీరిని సెంటర్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో తమ ప్రాధమిక లక్ష్యం షేర్డ్ మొబిలిటీ సంస్థల సేవలను నియంత్రించడంతోపాటు ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని నివారించడమని స్పష్టం చేసింది. క్యాబ్ సేవల సంస్థలు కస్టమర్ భద్రత, డ్రైవర్ సంక్షేమంపై బాధ్యత వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా తప్పదని తెలిపింది. సవరించిన సెక్షన్ 93 మార్గదర్శకాల ప్రకారం క్యాబ్ సంస్థలు తమసేవలను, కార్యకలాపాలను ప్రారంభించడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం. వీటి నియంత్రణకోసం కేంద్రం పేర్కొన్న నిబంధనలను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశిస్తుంది.క్యాబ్‌సేవల సంస్థల నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. తద్వారా అగ్రిగేటర్లు జవాబుదారీగా ఉండటంతో పాటు, వారి కార్యకలాపాలకు బాధ్యత వహించేలా నిర్ధారించుకోవాలి. ఉపాధి కల్పన, సౌకర్యవంతమైన, సరసమైన ధరల్లో ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించే లక్ష్యంతో క్యాబ్ సేవల సంస్థల బిజినెస్ సాగాలి. ప్రజా రవాణ వ్యవస్థను గరిష్టంగా వినియోగించడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, వాహనాల ఉద్గార కాలుష్యాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. తద్వారా మానవ ఆరోగ్యానికి హాని తగ్గించడం అనే లక్ష్యాన్ని సాధించాలనేది ప్రభుత్వ వ్యూహం. దీంతోపాటు తాజా సవరణ ప్రకారం వాహన యజమాని (అతడు / ఆమె) మరణించిన సందర్భంలో, తమ వాహనాన్ని నమోదు లేదా బదిలీ చేసే వ్యక్తిని నామినేట్ చేయవచ్చని మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ తెలిపింది. -
గ్రేటర్ వార్: 68 నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. మొత్తం 1,893 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, వీటిల్లో 1,825 మంది నామినేషన్లు సక్రమంగా ఉండటంతో వాటిని ఆమోదించిన అధికారులు, మిగతా 68 అభ్యర్థుల నామినేషన్లలో పొరపాట్లు చోటు చేసుకోవడం... కొందరు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నట్లు దృష్టికి రావడంతో తిరస్కరించారు. తిరస్కరణకు గురైన వాటిలో గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్ ఉంది. శ్రీనివాస్‌గౌడ్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు ఫిర్యాదు అందడంతో ఆయనకు అధికారులు విషయాన్ని తెలిపారు. దాంతో ఆయన సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోగా, తీవ్ర వాదోపవాదాల అనంతరం నిబంధనల మేరకు శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. విషయం తెలిసి ఆయన సోదరుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తదితరులు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాదాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు సరిగ్గా లేకపోవడం, ముగ్గురు పిల్లలు ఉన్నందున రిజెక్ట్ చేశారు. ఆయా పార్టీల తరపున టికెట్ రానివారు భారీసంఖ్యలో నామినేషన్లు వేశారు. వారిని బుజ్జగించే కార్యక్రమం కొనసాగుతోంది. చివరిరోజైన ఆదివారం చాలామంది ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక బరిలో మిగిలేదెవరో తేలనుంది. ఆయా పార్టీలకు రెబెల్స్ బెడదపై స్పష్టత రానుంది. -
2 స్థానాలు.. 33 మంది
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 22న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 5వ తేదీతో ముగియగా.. పట్టభద్రుల స్థానానికి 35, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పది నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లను బుధ, గురువారాల్లో స్క్రూటినీ నిర్వహించిన అధికారులు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి రెండింటిని, పట్టభద్రుల నియోజకవర్గంలో 10 నామినేషన్లను తిరస్కరించినట్లు ప్రకటించారు. దీంతో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 25 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది బరిలో మిగిలారు. కాగా నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగియగా సాయంత్రానికి పోటీలో ఉన్న వారెందరనేది తేలనుంది. చంద్రశేఖర్‌గౌడ్‌కు ‘గులాబీ’ మద్దతు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని పోటీలో పెట్టబోమని టీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ఇస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ఎంపీ కవిత కూడా ఆయనకు ఆశీస్సులు అందించారు. బుధవారం రాత్రి కరీంనగర్లో ఆయన కేటీఆర్‌ను కలవగా పార్టీ నేతల సమక్షంలో గౌడ్‌కు మద్దతు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ నేపథ్యంలో బరిలో నిలిచిన మిగిలిన టీఆర్ఎస్ నాయకులు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ మద్దతు ఆశించి భంగపడిన యాదగిరి శేఖర్‌రావు, జమాలుద్దీన్ నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. ప్రచారంలో నిమగ్నమైన జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఇప్పటికే జిల్లాల్లో ప్రచారం సాగిస్తున్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ నేతలు ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థిగా సుగుణాకర్‌రావు బరిలో ఉన్నారు. ‘యువ తెలంగాణ’ నుంచి రాణిరుద్రమ యువ తెలంగాణ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణిరుద్రమ సైతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. పట్టభద్రుల అండతో విజయం సాధిస్తానని చెపుతున్న ఆమె గురువారం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను కలిసి మద్దతు కోరారు. అభ్యర్థులు వీరే... స్క్రూటినీ అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలో మిగిలిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. టి.జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), పి. సుగుణాకర్‌రావు(బీజేపీ), గోగుల రాణిరుద్రమ(యువ తెలంగాణ పార్టీ)తో పాటు గుర్రం ఆంజనేయులు, ఎడ్ల రవికుమార్, కడారి అనంతరెడ్డి, కల్లెం ప్రవీణ్‌రెడ్డి, గంట సంపత్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్(టీఆర్ఎస్), ఎం.డీ.జమాలుద్దీన్, డొంకెన రవీందర్(తెలంగాణ జన సమితి), దేవునూరి రవీందర్, పరువెల్లి ప్రభాకర్‌రావు, ఎం.బాలనాగసైదులు, యాదగిరి శేఖర్‌రావు, జి.రణజిత్ మోహన్, ఎస్.రవీందర్‌గౌడ్, వై.రామిరెడ్డి, వంజరి శివకుమార్, శ్రీకాంత్ తోడే టి, కె.శ్రీధర్ రాజు, షేక్‌షబ్బీర్, సురేష్, అబ్దుల్ హమీద్ ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూర రఘోత్తంరెడ్డి, బి.కొండల్ రెడ్డి, చార్ల మానయ్య, చిట్యాల రాములు, పాతూరి సుధాకర్‌రెడ్డి, బట్టాపురం మోహన్‌రెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి, జి.వేణుగోపాలస్వామి బరిలో ఉన్నారు. -
అనుమానాస్పద క్లెయిమ్స్‌పై ఐటీ కన్ను
న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్లలో అనుమానాస్పద ఆదాయ పన్ను రీఫండ్ క్లెయిమ్స్ సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా రాజ్యసభకు తెలిపారు. 2016–17లో 9,856గా ఉన్న ఈ సంఖ్య 2018–19 నాటికి 20,874కి చేరిందన్నారు. ఆదాయం, పెట్టుబడులకు పొంతన లేకుండా భారీ రీఫండ్స్ కోసం క్లెయిమ్ చేస్తున్న పన్ను చెల్లింపుదారుల రిటరŠన్స్‌పై ఆదాయ పన్ను శాఖ స్క్రూటినీ జరుపుతోందని మంత్రి వివరించారు. స్క్రూటినీ అనంతరం క్లెయిమ్ తప్పని తేలిన పక్షంలో కేసును బట్టి రీఫండ్‌ను నిరాకరించడంతో పాటు జరిమానా, ప్రాసిక్యూషన్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. 2015–16లో రూ. 1.22 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ రీఫండ్స్ 2018–19 నాటికి రూ. 1.43 లక్షల కోట్లకు పెరిగాయని ఆయన వివరించారు. అనుమానాస్పద క్లెయిమ్స్‌కు ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరగకుండా పక్కకు తీసి పెట్టేలా ఐటీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. మరోవైపు, 2017–18లో 4.63 కోట్ల ఐటీ రిటర్న్‌లు దాఖలు కాగా 2018–19 జనవరి నాటికి ఇది 37% పెరిగి 6.36 కోట్లకు చేరిందని చెప్పారు. 2018–19లో ఐటీఆర్‌లు గడువులోగా ఫైల్ చేయాలంటూ పన్ను చెల్లింపుదారులకు 25 కోట్ల పైచిలుకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపినట్లు శుక్లా తెలిపారు. -
ఒకే ఒక్కడు.. ఇక మిగిలింది ప్రకటనే!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎంపిక ఏకగ్రీవమైంది. గడువు నిన్నటితోనే ముగియటం.. ఇప్పటిదాకా ఒకే ఒక్క నామినేషన్ రావటంతో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ పేరును ప్రకటించటమే మిగింది. రాహుల్‌కి మద్దతుగా మొత్తం 89 నామినేషన్లు వచ్చాయి. అవన్నీ పరిశీలించి సహేతుకంగానే ఉన్నాయని ఎంపీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం రామచంద్రన్ తెలిపారు. ఈ మేరకు అధికారికంగా స్క్రూటినీ నివేదికను విడుదల చేసింది. ఏ క్షణమైన రాహుల్ ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీని 19 ఏళ్లుగా (పదేళ్లపాటు యూపీఏ పాలనతో కలిపి) నడుపుతున్న అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి రాహుల్ పగ్గాలు స్వీకరించబోతున్నారు. 2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితుడైనప్పటినుంచీ రాహుల్‌కు పూర్తిస్థాయి బాధ్యతలపై అడపాదడపా చర్చ జరిగినా.. చివరకు దేశంలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారటం, 2019 ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో పార్టీ కీలక బాధ్యతలు అందుకోనున్నారు. యువరాజు నాయకత్వంలో.. ఇటీవలి కాలంలో వరుస ఓటములతో కుదేలైన పార్టీకి తిరిగి పునర్వైభవం వస్తుందని పలువురు యువ, సీనియర్ నాయకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
ఉత్తర కొరియాలో తొలిసారిగా..
జెనీవా: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల బృందాన్ని తమ దేశ పర్యటనకు ఉత్తర కొరియా అంగీకారం తెలిపింది. కేటలినా డివన్‌డాస్ అగిలర్ నేతృత్వంలోని హక్కుల బృందం ఆ దేశంలో వివిధ కారణాలతో వైకల్యం పొందిన పౌరుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. ఇప్పటి వరకు కొరియా అంతర్జాతీయ స్థాయిలో ఓ పౌర హక్కుల సంఘాన్ని తమ దేశ పర్యటనకు అనుమతించలేదు. ‘ప్రస్తుతం అధికారంలో ఉన్న డీపీఆర్కే (డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా) అక్కడి పరిస్థితులను అంచనా వేయడానికి మాకో ఓ అవకాశం కల్పించింది. అందుకు నా ఆరు రోజుల పర్యటనను పూర్తిగా వినియోగిస్తా’ అని కేటలినా అన్నారు. వచ్చే వారంలో ఈ పర్యటన ఉంటుందని చివరి రోజున నివేదికను ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నట్లు ఆమె తెలిపారు. యూఎన్ ప్రకారం కొరియా లక్షాఇరవైవేల మంది ఖైదీలను సైనిక శిబిరాల్లో క్రూరంగా హింసించిందని అంచనా. -
ఇసుక రేవుల పరిశీలన
నివేదిక తయారు చేయనున్న డ్వామా పీడీ జగత్ కుమార్ రెడ్డి బోనకల్ : మండలంలోని మోటమర్రి గ్రామంలోని మున్నేరులో ఉన్న ఇసుక రేవును డ్వామా పీడీ జగత్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. మోటమర్రి ఇసుక రేవు నుంచి గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని గ్రామస్తులు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. స్పందించిన జేసీ దివ్య.. డ్వామా పీడీని ఇసుక అక్రమ రవాణాపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మోటమర్రి ఇసుక రేవును పరిశీలించిన పీడీ మున్నేరుపై ఇసుక రేవు వద్ద రెండు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని గ్రామస్తులు పీడీ దృష్టికి తీసుకువెళ్లారు. లిఫ్టులు ఉన్నచోట ఇసుక రీచ్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని, నివేదికను జేసీకి సమర్పిస్తానని పీడీ తెలిపారు. లిఫ్టులవద్ద.. ఇసుక రీచ్ ఇవ్వడం వల్ల వాహన రాకపోకలవల్ల లక్షలాది రూపాయలతో నిర్మించిన పైప్లైన్లు పగిలిపోవడంతోపాటు లీకులు ఏర్పడి లిఫ్టుల కింద ఆయకట్టుసాగు ప్రశ్నార్థకమైందని గ్రామస్తులు తెలిపారు. వేలాది ట్రిప్పుల ఇసుక అక్రమ రవాణా జరిగిందని, గ్రామ పంచాయితీవారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఇసుక రీచ్‌పై వచ్చిన నిధులను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదుచేశారు. కూపన్లను సొంతంగా తయారు చేయించి ఇసుక అక్రమ రవాణాకు పంచాయితీ కార్యదర్శి సంతకం లేకుండానే కూపన్లు ఇచ్చారని తెలిపారు. అనంతరం బయ్యారం–మోటమర్రి రోడ్డును పరిశీలించారు. ఎస్సీ కాలనీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, హరితహారం కింద గ్రామ పంచాయితీ మొక్కలు వేయకుండా తమపట్ల వివక్షత చూపారని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. హరితహారం కింద మొక్కలు ఎందుకు నాటలేదో సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని జేసీకి నివేదిక అందజేస్తానని, రెండు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. -
పన్నుల వ్యవస్థ మరింత పారదర్శకం
► రూ. 5 లక్షల లోపు కేసుల స్క్రూటినీ వేగవంతం ► అసెసీలకు నిర్దిష్ట ప్రశ్నావళి సీబీడీటీ ఆదేశాలు న్యూఢిల్లీ: అవినీతిని అరికట్టేందుకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులను కల్పించే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. కేసుల స్క్రూటినీకి సంబంధించి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం స్క్రూటినీ కోసం ఎంపిక చేసిన కేసుల్లో అసెసీలను వివిధ రకాల ప్రశ్నలతో గందరగోళపర్చకుండా నిర్దిష్ట ప్రశ్నావళిని మాత్రమే పంపాలని సూచించింది. లెక్కల్లో చూపని ఆదాయాలు రూ. 5 లక్షల లోపు ఉన్న కేసుల స్క్రూటినీని పరిమిత హియరింగ్స్‌లో అధికారులు వేగవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. లెక్కల్లో చూపని ఆదాయ పరిమాణం రూ. 5 లక్షలు మించినట్లు (హైదరాబాద్ సహా నాలుగు మెట్రోల్లో ఈ పరిమాణం రూ. 10 లక్షలు దాటితే) అసెసింగ్ అధికారి గానీ భావించిన పక్షంలో సదరు కేసులపై పూర్తి స్థాయి స్క్రూటినీ చేపట్టవచ్చని సీబీడీటీ తెలిపింది. -
‘ఎమ్మెల్సీ’ నామినేషన్ల పరిశీలన పూర్తి
హైదరాబాద్: శాసన మండలికి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ముగిసింది. 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసనసభ కార్యదర్శి రాజ సదారాం శుక్రవారం అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించారు. అందరి నామినేషన్ పత్రాలు సక్రమంగానే ఉన్నట్లు తేల్చారు. దీంతో టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి, కాంగ్రెస్ తరఫున ఆకుల లలిత, టీడీపీ నుంచి నరేందర్‌రెడ్డి అభ్యర్థులుగా బరిలో ఉన్నారని రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. టీఆర్ఎస్.. టీడీపీ మధ్య వాదులాట ! నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ నాయకుల మధ్య వాదులాట జరిగింది. టీడీపీ నేతలు పలు అభ్యంతరాలు వ్యక్తం చే శారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న వేం నరేందర్‌రెడ్డి లిఖిత పూర్వకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం విషయంలో సుప్రీం కోర్టులో తుది తీర్పు పెండింగ్‌లో ఉందని, ఆయనకు ఓటు హక్కు లేకున్నా, ఓటరు జాబితాలో ఎలా నమోదు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే గవర్నర్ నామినే ట్ చేసిన ఆంగ్లో ఇండియన్ సభ్యునికి కూడా ఓటు హక్కు ఉండదని, కానీ, ఓటరుగా గుర్తించారని తప్పు బట్టారు. ఈ అంశాలపై టీడీపీ నేతలు ఎన్నికల అధికారికి ఫిర్యాదుచేసిన సమయంలో అక్కడే ఉన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పాటూరి సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకోవడంతో టీడీపీ నాయకులకు, ఆయనకు మధ్య కొద్దిసేపు వాదులాట జరిగింది. గత మండలి ఎన్నికల్లో వారిద్దరూ ఓట్లు వేసినందునే ఓటు హక్కు కల్పించినట్లు అధికారులు తెలిపారు. -
అక్రమ లేఅవుట్లపై పంచ్
రంగారెడ్డి జిల్లాలో అక్రమార్కులకు చెక్ 900 ఎకరాల పంచాయతీ స్థలాల స్వాధీనం రాజధాని శివారు ప్రాంతాల్లో అధికారుల స్పెషల్ డ్రైవ్ 2,700 అక్రమ లేఅవుట్ల గుర్తింపు, కేసులు పెట్టాలని నిర్ణయం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పంచాయతీ స్థలాలను కొల్లగొడుతున్న అక్రమార్కులపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కొరడా విదిల్చింది. లేఅవుట్లు/వెంచర్లలో ఆక్రమణకు గురవుతున్న దాదాపు 900 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. రియల్టర్లతో చేతులు కలిపిన ఇంటిదొంగలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దీంతో సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన భూములు పంచాయతీల పరిధిలోకి వెళ్లాయి. స్థిరాస్తి రంగం ఊపందుకోవడంతో జిల్లాలో అడ్డగోలుగా లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. నిబంధనల ప్రకా రం ప్రజా ప్రయోజనాల కోసం లేఅవుట్ విస్తీర్ణంలో పది శాతం స్థలం కేటాయించాలి. ఈ స్థలాన్ని స్థానిక పంచాయతీకి బదలాయించాలి. అయితే రియల్టర్లు ఈ స్థలాలను కూడా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు కూడా కుమ్మక్కుకావడంతో ఖాళీ స్థలాలన్నీ పరాధీనమయ్యాయి. కొన్నిచోట్ల హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కూడా అక్రమార్కులతో చేతులు కలపడం విశేషం. రాజేంద్రనగర్ మండలం పుప్పాల్‌గూడలో 17.36 ఎకరాల విస్తీర్ణంలోని ఒక వెంచర్‌కు అధికారికంగా అనుమతి మంజూరు చేసిన హుడా.. తాజాగా అదే వెంచర్‌లోని ఖాళీ స్థలంలో ప్లాట్ల విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 8,663.7 చదరపు గజాల జాగా అమ్మకానికి లైన్‌క్లియర్ చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన పంచాయతీ అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో సంబంధిత రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. అధికారుల స్పెషల్ డ్రైవ్ నగర శివార్లలోని 210 గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన లేఅవుట్లపై స్పెష ల్ డ్రైవ్ చేసిన అధికారులు.. వాటిలో 90 శాతం అనుమతుల్లేనివేనని తేల్చా రు. లేఅవుట్లు చేయాలంటే హెచ్ఎండీఏ, డీటీసీపీ(పట్టణ, గ్రామీణ ప్రణాళిక సంచాలకుడు) అనుమతి తప్పనిసరి. అయితే హెచ్ ఎండీఏ మార్గదర్శకాలను పాటించకుండా చాలామంది రియల్టర్లు అనధికార లేఅవుట్లకే మొగ్గు చూపుతున్నారు. నగర శివార్లలో దాదాపు 2,700 అక్రమ వెంచర్లను పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించారు. అనుమతులు పొందిన 300 లేఅవుట్లలోనూ పంచాయతీలకు నిర్దేశించిన 10 శాతం స్థలాలు కబ్జాకు గురైనట్లు తేల్చారు. ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు 20 ఎకరాలను లేఅవుట్‌గా మార్చి విక్రయిం చేం దుకు చేసిన యత్నాలను అధికారులు అడ్డుకున్నారు. ఘట్కేసర్ మండలం మేడిపల్లి పంచాయతీ పరిధిలో పార్కు స్థలాన్ని అమ్మకానికి పెట్టిన కార్యదర్శిపై వేటు వేశారు. కబ్జాదారుపై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించారు. ప్రజోపయోగాలకు కేటాయించిన పది శాతం స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా డీపీవో పద్మజారాణి తెలిపారు. కబ్జాలో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామన్నారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులవి తిరస్కరణ మార్చి 2న ఉపసంహరణ నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. ఈ స్థానానికి పోటీ చేసేందుకు మూడు జిల్లాల నుంచి 27మంది 47 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో ఎన్నికల నియమావళికి లోబడి నామినేషన్ల పరిశీలించిన పిదప 25మంది అభ్యర్థుల నామినేషన్లు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత సాధించాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాల దష్ట్యా తిరస్కరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసే అభ్యర్థిత్వాన్ని కనీసం పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి. కానీ బి.కుమార్ (వరంగల్) నామినేషన్ ముగ్గురు ఓటర్లు మాత్రమే ప్రతిపాదించడంతో దానిని తిరస్కరించారు. అదే విధంగా ఎన్నికల మాన్యువల్ ఆర్టికల్ 173 (బీ) ప్రకారం పట్టభద్రుల స్థానానికి పోటీ చేసే అభ్యర్థి వయస్సు 30 ఏళ్లు ఉండాలి. కానీ ఎల్.చందులాల్ (వరంగల్) వయస్సు 27 ఏళ్లు మాత్రమే ఉండడంతో ఆ నామినేషన్‌ను తిరస్కరించారు. నల్లగొండ జిల్లా నుంచే అధికం.. అర్హత సాధించిన నామినేషన్లలో అత్యధికంగా నల్లగొండ జిల్లానుంచే ఉన్నాయి. వీటిలో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న వారిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), సూరం ప్రభాకర్‌రెడ్డి (వామపక్షాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి) నల్లగొండ జిల్లాకు చెందిన వారు. పల్లా రాజేశ్వరరెడ్డి, ఎర్రబెల్లి రామ్మోహన్రావు వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు. అయితే ఈ అభ్యర్థులు నామినేషన్ పత్రంలో పేర్కొన్న చిరునామా, ఓటర్లు ఉన్న ప్రాంతాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. తీన్మార్ మల్లన్న తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్, సూరం ప్రభాకర్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ చిరునామా పేర్కొన్నారు. రామ్మోహన్రావు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కళ్లెడ చిరునామా పేర్కొన్నారు. మొత్తం దాఖలైన నామినేషన్లు - 27 ఎన్నికల్లో పోటీ కి అర్హత సాధించినవి - 25 -
షోయబ్ బౌలింగ్ సందేహాస్పదం!
కరాచీ: పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉన్నట్లు అంపైర్లు తేల్చారు. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ టోర్నీ ‘కైద్-ఎ-అజమ్ ట్రోఫీ’లో జెడ్‌టీబీఎల్ తరఫున ఆడుతున్న షోయబ్ కొన్ని బంతులు వేసేటప్పుడు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. కరాచీ డాల్ఫిన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శుక్రవారం తొలి రోజు ఆట ముగిసిన తర్వాత బౌలర్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని రిఫరీ, అంపైర్లు సమీక్షించారని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అయితే షోయబ్ విషయం పాక్ క్రికెట్ బోర్డుకు ఇంకా తెలియజేయలేదు. ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఈ ఆల్‌రౌండర్ విదేశీ టి20 లీగ్‌ల్లో సత్తా చాటాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ తొలి రోజు ఆటలో ఐదు వికెట్లు పడగొట్టాడు.