షోయబ్ బౌలింగ్ సందేహాస్పదం!
కరాచీ: పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉన్నట్లు అంపైర్లు తేల్చారు. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ టోర్నీ ‘కైద్-ఎ-అజమ్ ట్రోఫీ’లో జెడ్‌టీబీఎల్ తరఫున ఆడుతున్న షోయబ్ కొన్ని బంతులు వేసేటప్పుడు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. కరాచీ డాల్ఫిన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శుక్రవారం తొలి రోజు ఆట ముగిసిన తర్వాత బౌలర్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని రిఫరీ, అంపైర్లు సమీక్షించారని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అయితే షోయబ్ విషయం పాక్ క్రికెట్ బోర్డుకు ఇంకా తెలియజేయలేదు. ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఈ ఆల్‌రౌండర్ విదేశీ టి20 లీగ్‌ల్లో సత్తా చాటాడు. అదే ఫామ్‌ను కొనసాగిస్తూ తొలి రోజు ఆటలో ఐదు వికెట్లు పడగొట్టాడు.