భారత పేసర్ అర్ష్ దీప్ సింగ్
సెంచూరియన్: పరిస్థితులకు తగ్గట్లు తన బౌలింగ్‌ను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నానని భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న అర్ష్ దీప్ ... ఒత్తిడిలో బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్ దీప్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 58 టి20 మ్యాచ్‌లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. ‘స్పష్టమైన గేమ్ ప్లాన్‌తో మైదానంలో అడుగుపెడతా. పరిస్థితులకు తగ్గట్లు దాన్ని మార్చుకుంటూ ఉంటా.
జట్టుకు ఏం అవసరమో దాన్ని గుర్తిస్తా. వికెట్లు తీయడం ముఖ్యమా... లేక పరుగులు నియంత్రిచాల అనేది చూసి బౌలింగ్‌లో మార్పులు చేసుకుంటా. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ప్రతిసారి మనం అనుకున్న ఫలితం రాదు. అయినా దాని గురించి అతిగా ఆలోచించను. ఆరంభంలో రెండు ఓవర్లు వేసి మళ్లీ చివర్లో రెండు ఓవర్లు వేయడం మధ్య చాలా సమయం దక్కుతుంది. ఆ లోపు జట్టుకు ఏం కావాలో ఆర్థం అవుతుంది. రోజు రోజుకు మెరుగవడంపైనే ప్రధానంగా దృష్టి పెడతా.
ఇటీవలి కాలంలో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా జట్టుకు సహాయ పడేందుకు ప్రయత్నిస్తున్నా. భారీ షాట్లు ఆడటం ఇష్టమే. నెట్స్‌లో కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై కూడా దృష్టి పెట్టా. ఆ దిశగా కష్టపడుతున్నా. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తా. అతడి లాంటి బౌలర్ మరో ఎండ్ నుంచి ఒత్తిడి పెంచుతుంటే వికెట్లు తీయడం చాలా సులువవుతుంది.
మ్యాచ్‌పై పట్టు కొనసాగించడం ముఖ్యం. అది ప్రారంభ ఓవర్ అయినా... లేక చివరి ఓవర్ అయినా ఒకే విధంగా ఆలోచిస్తా’ అని అర్ష్ దీప్ వివరించాడు. పొట్టి ఫార్మాట్‌లో ప్రమాదక బౌలర్‌గా ఎదిగిన అర్ష్ దీప్ ... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment