దక్షిణాఫ్రికా భారీ విజయం | South Africa v England: Hosts race to 280-run consolation win in final Test | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా భారీ విజయం

Published Wed, Jan 27 2016 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

దక్షిణాఫ్రికా భారీ విజయం

దక్షిణాఫ్రికా భారీ విజయం

హడలెత్తించిన రబడ
సెంచూరియన్: రెండో ఇన్నింగ్స్‌లోనూ పేసర్ కగిసో రబడ (6/32) సంచలన బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన ఆఖరిదైన నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో కుక్ సేన ఆధిక్యం 2-1కి తగ్గింది. 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 34.4 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. సఫారీల గడ్డపై ఇంగ్లం డ్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. మ్యాచ్‌లో రబడకు 13 వికెట్లు దక్కాయి.

దీంతో దక్షిణాఫ్రికా తరఫున ఒకే టెస్టులో అత్యధికంగా 13 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అతను రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికా గడ్డపై 11 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ సిరీస్ (2-1)ను గెలవడం విశేషం. రబడకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement