ఫంగిసో బౌలింగ్ శైలిపై ఫిర్యాదు | Phangiso bowling over the nature of the complaint | Sakshi
Sakshi News home page

ఫంగిసో బౌలింగ్ శైలిపై ఫిర్యాదు

Published Fri, Feb 26 2016 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

ఫంగిసో బౌలింగ్  శైలిపై ఫిర్యాదు

ఫంగిసో బౌలింగ్ శైలిపై ఫిర్యాదు

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఆరోన్ ఫంగిసో బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని తేలింది. దేశవాళీ వన్డే టోర్నీలో తను హైవెల్డ్ లయన్స్ తరఫున ఆడుతున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 32 ఏళ్ల ఫంగిసో రెండు వికెట్లు తీసి తన జట్టు సెమీస్ చేరడంలో సహాయపడ్డాడు. అయితే ఫంగిసో బౌలింగ్ శైలిపై ఫిర్యాదు అందిందని క్రికెట్ దక్షిణాఫ్రికా పేర్కొంది.


16 వన్డేలు, తొమ్మిది టి20లు ఆడిన ఫంగిసో నేడు (శుక్రవారం) ఐసీసీ గుర్తింపు పొందిన హై పెర్ఫార్మెన్స్ అకాడమీలో బౌలింగ్ పరీక్షకు హాజరుకానున్నాడు. అయితే ఈ ఫలితం వచ్చేదాకా తను మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. టి20 ప్రపంచకప్‌లో ఆడే దక్షిణాఫ్రికా జట్టులో ఫంగిసో సభ్యుడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement