న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ (పీపీఎస్‌ఎల్)లో చైనా నుంచి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పేమెంట్ అగ్రిగేటర్’ లైసెన్స్ కోసం పీపీఎస్‌ఎల్ 2020 నవంబర్‌లో దరఖాస్తు పెట్టుకుంది. 2022 నవంబర్‌లో ఈ దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించింది. ఎఫ్‌డీఐ మార్గదర్శకాల్లోని ప్రెస్‌నోట్ 3 నిబంధనలను పాటించడం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఇందుకోసం కంపెనీలో ఎఫ్‌డీఐలకి కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్)లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్‌కు వాటాలు ఉన్నాయి. ఆర్‌బీఐ సూచన మేరకు ఎఫ్‌డీఐ ప్రెస్ నోట్3 నిబంధనలను అనుసరించి, ఓసీఎల్‌లో చైనా ఎఫ్‌డీఐకి ఆమోదం కోసం పేటీఎం 2022 డిసెంబర్ 14న దరఖాస్తు చేసుకుంది.
అప్పటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. పీపీఎస్‌ఎల్‌లో చైనా పెట్టుబడులను అంతర్‌మంత్రిత్వ శాఖ కమిటీ అధ్యయనం చేస్తోందని, సంప్రదింపులు, విస్తృత పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. భారత్‌తో భూ సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకి ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ కేంద్ర సర్కారు లోగడ నిబంధనలు తీసుకువచి్చంది. 2020లో చైనా–భారత్ బలగాల మధ్య గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఈ కఠిన
వైఖరికి మళ్లింది.
యూజర్ల నుంచి పూర్తి మద్దతు: పేటీఎం
మరోవైపు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) వివాదం ఎలా ఉన్నా .. యూజర్ల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తోందని పేటీఎం ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సరీ్వసులను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఫిబ్రవరి 29 నుంచి దాదాపు అన్ని సేవలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.
దరఖాస్తు చేసుకున్నాం..
ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గతంలో పేటీఎంలోకి వచి్చన ఎఫ్‌డీఐకి సంబంధించి తప్పనిసరి అనుమతులు పొందాలని ఆర్‌బీఐ సూచించినట్టు తెలిపారు. ‘‘ఇది నియంత్రపరమైన ప్రక్రియ. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఎవరైనా కానీ, ఎఫ్‌డీఐ ఆమోదం పొందాల్సిందే’’అని చెప్పారు. ఈ నిబంధనలను అనుసరించి అన్ని రకాల పత్రాలతో నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు సమరి్పంచినట్టు తెలిపారు.
ఇది పరిష్కారం అయ్యేంత వరకు, కొత్త వరక్తులను చేర్చుకోకుండా, అప్పటికే చేరిన వర్తకులకు పేమెంట్ సేవలు అందించడానికి అనుమతి ఉంటుంది. ‘‘కంపెనీలో యాజమాన్య రూపం మారిపోయింది. పేటీఎం వ్యవస్థాపకుడు (శర్మ) ఇప్పడు కంపెనీలో 24.3 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ఓసీఎల్‌లో యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడి 10 శాతంలోపునకు తగ్గిపోయింది. కనుక పీపీఎస్‌ఎల్‌లో చైనా నుంచి ఎఫ్‌డీఐ అన్నదానికి ప్రస్తుతం అర్థం లేదు’’అని పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment