ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో (Zomato) అనుబంధ సంస్థ అయిన జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్‌ని మంజూరు చేసింది. దీంతో తన ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ-కామర్స్ లావాదేవీల నిర్వహణకు జొమాటోకు అనుమతి లభించింది.
దేశంలో పేమెంట్స్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ZPPL)కు 2024 జనవరి 24న రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికార ధ్రువీకరణ పత్రం మంజూరైంద అని ఫుడ్‌టెక్ సంస్థ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. జొమాటోతోపాటు టాటా పే, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ సంస్థలకు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్ లైసెన్స్ మంజూరైంది.
జొమాటో గత సంవత్సరం ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి తన సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకుంది.
లావాదేవీలను సులభతరం చేయడానికి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ఇతర చెల్లింపు యాప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఇందుకు కారణం. దీంతో థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులతో వచ్చే మర్చెంట్ ఛార్జీలు ఆదా అవుతాయి. కాగా గతంలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను అందించడం కోసం RBL బ్యాంక్‌తో కూడా జొమాటో జతకట్టింది. అయితే గత ఏడాది మేలో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment