aggregator
-
పేటీఎం పేమెంట్స్‌లో పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో (పీపీఎస్ఎల్) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం ఆగస్టు 27న అనుమతులు మంజూరు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. దీంతో పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్సు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు వివరించింది. ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ సేవలను, పేమెంట్ అగ్రిగేటర్ సరీ్వసులను ఒకే కంపెనీ అందించకూడదనే నిబంధన కారణంగా, 2022 నవంబర్‌లో పీఏ లైసెన్సు కోసం పేటీఎం సమరి్పంచిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు సంబంధించిన ప్రెస్ నోట్ 3కి అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రెస్ నోట్ 3 ప్రకారం భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అప్పట్లో పేటీఎంలో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉండేది. తాజాగా మారిన పరిస్థితుల ప్రకారం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రెస్ నోట్ 3 నిబంధనలకు అనుగుణంగా పేటీఎం మరోసారి పీఏ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోనుంది. -
పేటీఎంలో చైనా పెట్టుబడులపై ప్రభుత్వ ఫోకస్
న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ (పీపీఎస్ఎల్)లో చైనా నుంచి వచి్చన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘పేమెంట్ అగ్రిగేటర్’ లైసెన్స్ కోసం పీపీఎస్ఎల్ 2020 నవంబర్‌లో దరఖాస్తు పెట్టుకుంది. 2022 నవంబర్‌లో ఈ దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. ఎఫ్‌డీఐ మార్గదర్శకాల్లోని ప్రెస్‌నోట్ 3 నిబంధనలను పాటించడం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం కంపెనీలో ఎఫ్‌డీఐలకి కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్)లో చైనాకు చెందిన యాంట్ గ్రూప్‌కు వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ సూచన మేరకు ఎఫ్‌డీఐ ప్రెస్ నోట్3 నిబంధనలను అనుసరించి, ఓసీఎల్‌లో చైనా ఎఫ్‌డీఐకి ఆమోదం కోసం పేటీఎం 2022 డిసెంబర్ 14న దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. పీపీఎస్ఎల్లో చైనా పెట్టుబడులను అంతర్మంత్రిత్వ శాఖ కమిటీ అధ్యయనం చేస్తోందని, సంప్రదింపులు, విస్తృత పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటుందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు తెలిపాయి. భారత్‌తో భూ సరిహద్దులను పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకి ముందస్తు ఆమోదం తప్పనిసరి అంటూ కేంద్ర సర్కారు లోగడ నిబంధనలు తీసుకువచి్చంది. 2020లో చైనా–భారత్ బలగాల మధ్య గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఈ కఠిన వైఖరికి మళ్లింది. యూజర్ల నుంచి పూర్తి మద్దతు: పేటీఎం మరోవైపు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) వివాదం ఎలా ఉన్నా .. యూజర్ల నుంచి తమకు పూర్తి మద్దతు లభిస్తోందని పేటీఎం ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపింది. వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా సరీ్వసులను కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఫిబ్రవరి 29 నుంచి దాదాపు అన్ని సేవలు నిలిపివేయాలంటూ పీపీబీఎల్‌ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నాం.. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గతంలో పేటీఎంలోకి వచి్చన ఎఫ్‌డీఐకి సంబంధించి తప్పనిసరి అనుమతులు పొందాలని ఆర్బీఐ సూచించినట్టు తెలిపారు. ‘‘ఇది నియంత్రపరమైన ప్రక్రియ. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఎవరైనా కానీ, ఎఫ్‌డీఐ ఆమోదం పొందాల్సిందే’’అని చెప్పారు. ఈ నిబంధనలను అనుసరించి అన్ని రకాల పత్రాలతో నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు సమరి్పంచినట్టు తెలిపారు. ఇది పరిష్కారం అయ్యేంత వరకు, కొత్త వరక్తులను చేర్చుకోకుండా, అప్పటికే చేరిన వర్తకులకు పేమెంట్ సేవలు అందించడానికి అనుమతి ఉంటుంది. ‘‘కంపెనీలో యాజమాన్య రూపం మారిపోయింది. పేటీఎం వ్యవస్థాపకుడు (శర్మ) ఇప్పడు కంపెనీలో 24.3 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉన్నారు. ఓసీఎల్‌లో యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడి 10 శాతంలోపునకు తగ్గిపోయింది. కనుక పీపీఎస్ఎల్లో చైనా నుంచి ఎఫ్‌డీఐ అన్నదానికి ప్రస్తుతం అర్థం లేదు’’అని పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. -
జొమాటో కొత్త అవతారం.. ఆర్బీఐ అనుమతి!
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో (Zomato) అనుబంధ సంస్థ అయిన జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్‌ని మంజూరు చేసింది. దీంతో తన ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ-కామర్స్ లావాదేవీల నిర్వహణకు జొమాటోకు అనుమతి లభించింది. దేశంలో పేమెంట్స్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ZPPL)కు 2024 జనవరి 24న రిజర్వ్ బ్యాంక్ నుంచి అధికార ధ్రువీకరణ పత్రం మంజూరైంద అని ఫుడ్‌టెక్ సంస్థ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. జొమాటోతోపాటు టాటా పే, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ సంస్థలకు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పేమెంట్స్ అగ్రిగేటర్ లైసెన్స్ లైసెన్స్ మంజూరైంది. జొమాటో గత సంవత్సరం ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి తన సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకుంది. లావాదేవీలను సులభతరం చేయడానికి గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ఇతర చెల్లింపు యాప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఇందుకు కారణం. దీంతో థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసే చెల్లింపులతో వచ్చే మర్చెంట్ ఛార్జీలు ఆదా అవుతాయి. కాగా గతంలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను అందించడం కోసం RBL బ్యాంక్‌తో కూడా జొమాటో జతకట్టింది. అయితే గత ఏడాది మేలో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. -
పేమెంట్ అగ్రిగేటర్‌గా ఎన్‌క్యాష్‌కు అనుమతి
న్యూఢిల్లీ: పేమెంట్ అగ్రిగేటర్‌గా వ్యవహరించేందుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి లభించినట్లు ఎన్‌క్యాష్ సంస్థ తెలిపింది. బిజినెస్–2–బిజినెస్ వ్యవస్థలో ఒలింపస్ బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. నిరంతరాయంగా, వినూత్నమైన, విశ్వసనీయమైన పేమెంట్ సొల్యూషన్స్‌ను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సంస్థ సహ–వ్యవస్థాపకుడు యద్వేంద్ర త్యాగి తెలిపారు. కార్పొరేట్ పేమెంట్స్ సొల్యూషన్స్ సంస్థగా ఎన్‌క్యాష్ 2018లో కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు 2,50,000 పైచిలుకు వ్యాపారాలు తమ కార్పొరేట్ పేమెంట్స్ వ్యవస్థను డిజిటలీకరించుకోవడంలో తోడ్పాటు అందించింది. ఎన్క్యాష్తోపాటు క్యాష్‌ఫ్రీ పేమెంట్స్, ఓపెన్, రేజర్‌పే వంటి ఇతర ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌లను మంజూరు చేసింది. -
పేమెంట్ అగ్రిగేటర్‌గా హిటాచీ: ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
సాక్షి,ముంబై: దేశీయ పేమెంట్ సేవల్లోకి మరో సంస్థ వచ్చి చేరింది. హిటాచీ చెల్లింపు సేవలకు ఆర్బీఐ తాజాగా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. దీంతో B2B కస్టమర్లకు EMI, పేలేటర్, BBPS , లాయల్టీ సొల్యూషన్స్ లాంటి వాల్యూ యాడెడ్ సర్వీస్‌లతో పాటు అన్ని డిజిటల్ చెల్లింపులకు సూత్రప్రాయంగా ఆమోదాన్ని తెలిపిందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఆథరైజేషన్ ద్వారా కస్టమర్లకు వన్ స్టాప్ డిజిటల్ పేమెంట్ సేవలను కూడా అందించనున్నామనివెల్లడించింది. ఆర్బీఐ తమకందించిన పేమెంట్ అగ్రిగేటర్ ఆథరైజేషన్ ద్వారా దేశంలో పటిష్టమైన డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే తమ దృష్టి మరింత బలోపేతం కానుందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రుస్తోమ్ ఇరానీ అన్నారు. తద్వారా దేశ ప్రజలకు సులభమైన డిజిటల్ చెల్లింపులను అందించడంతోపాటు, డిజిటల్ ఇండియా చొరవకు మరింత దోహదపడుతుందనీ, అందరికీ ఆర్థిక సాధికారతను అందిస్తుందని ఇరానీ చెప్పారు. -
పేటీఎంకు ఆర్బీఐ భారీ షాక్
ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. పేమెంట్ ఆగ్రిగేటర్ సర్వీసుల కోసం కొత్తగా లైసెన్స్ అప్లయ్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించినట్లు పేటీఎం తన రెగ్యులరేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. పేటీఎం బ్రాండ్‌తో వన్97 కమ్యూనికేషన్స్ చెల్లింపు సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 2020లో పేమెంట్ ఆగ్రిగేటర్ సర్వీసుల్ని పేటీఎం పేమెంట్స్ సర్వీస్‌కు (పీపీఎస్ఎల్)కు బదిలి చేయాలని ఆర్బీఐని కోరింది. అందుకు సంబంధిత డాక్యుమెంట్లను 2021లో సబ్మిట్ చేసింది. ఆ డాక్యుమెంట్లపై ఆర్బీఐ తాజాగా స్పందించింది. Update: Our 100% subsidiary, Paytm Payments Services Limited will be resubmitting application to RBI for authorization to provide payment aggregator services for online merchants. This has no material impact on our business and revenues. More details: https://t.co/TXh2ABvdBH — Paytm (@Paytm) November 25, 2022 పేటీఎం బదిలీ అనుమతి పొందాలంటే వన్ 97 కమ్యూనికేషన్ గతంలో పెట్టిన పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్‌డీఐ) చట్టాలకు అనుగుణంగా ఉండాలని తెలిపింది. అప్పటి వరకు అనుమతులు మంజూరయ్యే వరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేర్కొంది. దీనిపై పేటీఎం స్పందించింది. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల తమ వ్యాపారంపై పెద్దగా ప్రభావం ఉండబోదని పేర్కొంది. -
ట్యాక్సీ సేవల్లోకి ఇ–యానా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న వీజీ అర్సెడో ఎనర్జీ.. ట్యాక్సీ సేవల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇ–యానా పేరుతో తొలుత కరీంనగర్, వరంగల్‌లో ప్రవేశిస్తోంది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, టూ వీలర్లతో సేవలందించడం దీని ప్రత్యేకత. ఇ–యానా యాప్‌ను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కైనెటిక్ గ్రీన్ ఫౌండర్ సులజ్జ ఫిరోదియా మోత్వానీ మంగళవారమిక్కడ ఆవిష్కరించారు. ప్రస్తుతం రెండు నగరాలకు కలిపి 50 ఆటోలు, 50 స్కూటర్లను కొనుగోలు చేశామని కంపెనీ డైరెక్టర్ సందీప్ వంగపల్లి తెలిపారు. డైరెక్టర్లు విజయ్ కుమార్, నవనీత్ రావు, శశికాంత్ రెడ్డితో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘2020 మార్చినాటికి మరో 200 స్కూటర్లు, 200 ఆటోలు కొంటాం. ఆరు నెలల్లో రూ.50 కోట్ల నిధులు సమకూర్చుకుంటాం. ఇప్పటికే రూ.4.5 కోట్లు ఖర్చు చేశాం. దశలవారీగా ఖమ్మం, నిజామాబాద్, చెన్నై, భువనేశ్వర్‌లో అడుగు పెడతాం. కిలోమీటరుకు చార్జీ త్రీ వీలర్ అయితే రూ.10, టూ వీలర్‌కు రూ.6 ఉంటుంది’ అని చెప్పారు. -
ఇన్సెంటివ్‌లకు చెల్లుచీటీ..?
ప్రోత్సాహకాలు తగ్గించేస్తున్న ట్యాక్సీ అగ్రిగేటర్లు... ⇒ భవిష్యత్‌పై ఆందోళనలో కారు డ్రైవర్లు ⇒ పడిపోతున్న రోజువారీ ఆదాయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెలకు లక్షల్లో ఆదాయం. అదీ ఓ ట్యాక్సీ నడిపితే. ఇంకేముంది.. ఐటీ ఉద్యోగులూ తమ కంపెనీలకు బై బై చెప్పేసి కార్లు కొనుక్కున్నారు. మొదట్లో బాగానే ఉంది. ఇప్పుడే సీన్ రివర్స్ అయింది. ఇబ్బడిముబ్బడిగా ఇన్సెంటివ్‌ల ఆశజూపి యువతను ఆకట్టుకున్న ట్యాక్సీ అగ్రిగేటర్లు ఇప్పుడు తమ ప్రతాపాన్ని నెమ్మదిగా చూపిస్తున్నాయి. అదీ అందరూ ఊహించినట్టుగానే నగదు ప్రోత్సాహకాలను (ఇన్సెంటివ్‌లు) గణనీయంగా తగ్గించివేశాయి. మరోవైపు నిర్దేశిత ట్రిప్పుల సంఖ్యను పెంచాయి. డ్రైవర్లను పెట్టుకుని కార్లను నడుపుతున్న యజమానులకు మాత్రం ఈ పరిణామంతో చుక్కలు కనపడుతున్నాయి. నెల తిరిగితే చేతిలో చిల్లిగవ్వ ఉండడం లేదని కార్ల యజమానులు వాపోతున్నారు. మారుతున్న పథకాలు.. కొన్ని నెలల క్రితం వరకు ఉబెర్ తన డ్రైవర్‌కు రూ.2,600ల వ్యాపారం చేస్తే.. కమీషన్ తగ్గించుకుని ఇన్సెంటివ్ రూపంలో రూ.1,300 చెల్లించేది. డీజిల్, డ్రైవర్ జీతం, ఈఎంఐ, నిర్వహణ ఖర్చులు రూ.2,700 పోను యజమానికి రోజుకు రూ.1,200 దాకా మిగిలేది. ఇప్పుడు బూస్ట్ ఇన్సెంటివ్స్ పేరుతో ఉబెర్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇన్సెంటివ్‌లను పూర్తిగా తొలగించింది. ఉదయం 6–10 మధ్య, సాయంత్రం 5–10 మధ్య ఒకటిన్నర రెట్ల వరకు చెల్లిస్తామని చెబుతోంది. అంటే డ్రైవర్ ఒక ట్రిప్‌కు రూ.100 సంపాదిస్తే, కంపెనీ రూ.50 జోడించి మొత్తం రూ.150 చెల్లిస్తుందన్న మాట. ఇప్పుడు డ్రైవర్లు రోజుకు రూ.2 వేలు సంపాదించడమే గగనమవుతోంది. అంటే రూ.2 వేలు వస్తే కంపెనీ రూ.1,000 జత చేసినా మొత్తం దక్కేది రూ.3,000. రోజువారీ ఖర్చులు పోతే చేతికొచ్చేది రూ.300 మాత్రమే. లక్ష్య పేరుతో నాలుగు రోజుల గడువులో 44 ట్రిప్పులు చేస్తే రూ.1,700 ఇన్సెంటివ్ వస్తుంది. ఇక ఓలా గతంలో 16 బుకింగ్స్‌కు రూ.5,500 చెల్లించేది. ఇప్పుడు 18 ట్రిప్పుల కు రూ.5,000 ఇస్తోంది. ఇన్ని ట్రిప్పులు చేయలేక డ్రైవర్లు చేతులెత్తేస్తున్నారు. నిర్దేశిత ట్రిప్పులు చేస్తేనే ఓలా డ్రైవర్‌కు నగదు ప్రోత్సాహం లభిస్తుంది. లేదంటే కస్టమర్లు చెల్లించిన దానికే సరిపెట్టుకోవాలి. సమస్యల్లా ట్రిప్పులే.. ప్రసుత్తం హైదరాబాద్‌లో ఒక ట్యాక్సీ 24 గంటల్లో సగటున 16 ట్రిప్పులు చేస్తోంది. కారు రోజువారీ సంపాదన రూ.2,000 మించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇబ్బడిముబ్బడిగా ట్యాక్సీలుగా కొత్త కార్లు వచ్చి చేరుతుండడమే. ట్యాక్సీ కంపెనీలు ఔత్సాహిక యువతకు రుణం ఇప్పించి కారు యజమానిని చేస్తున్నాయి. మరి కొందరితో లీజు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. లీజు కాలం ముగిసిన తర్వాత కారును డ్రైవర్ పేరుకు బదలాయిస్తారు. భాగ్యనగరిలో రోజుకు ఎంత కాదన్నా 200 దాకా కార్లు నమోదవుతున్నాయని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలా కొత్తగా వచ్చిన కార్లకే బుకింగ్‌లను ఎక్కువగా ఇస్తున్నాయని చాలా మంది పాత డ్రైవర్లు రోడ్డెక్కి నిరసన, ఆందోళనలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయినప్పటికీ కంపెనీలు కొత్త కార్లను నమోదు చేస్తూనే ఉన్నాయి.