న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో (పీపీఎస్‌ఎల్) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం ఆగస్టు 27న అనుమతులు మంజూరు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది.
దీంతో పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్సు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు వివరించింది. ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ సేవలను, పేమెంట్ అగ్రిగేటర్ సరీ్వసులను ఒకే కంపెనీ అందించకూడదనే నిబంధన కారణంగా, 2022 నవంబర్‌లో పీఏ లైసెన్సు కోసం పేటీఎం సమరి్పంచిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు సంబంధించిన ప్రెస్ నోట్ 3కి అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రెస్ నోట్ 3 ప్రకారం భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అప్పట్లో పేటీఎంలో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉండేది. తాజాగా మారిన పరిస్థితుల ప్రకారం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రెస్ నోట్ 3 నిబంధనలకు అనుగుణంగా పేటీఎం మరోసారి పీఏ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment