Financial Department
-
పేటీఎం పేమెంట్స్‌లో పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో (పీపీఎస్ఎల్) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం ఆగస్టు 27న అనుమతులు మంజూరు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. దీంతో పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్సు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు వివరించింది. ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ సేవలను, పేమెంట్ అగ్రిగేటర్ సరీ్వసులను ఒకే కంపెనీ అందించకూడదనే నిబంధన కారణంగా, 2022 నవంబర్‌లో పీఏ లైసెన్సు కోసం పేటీఎం సమరి్పంచిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు సంబంధించిన ప్రెస్ నోట్ 3కి అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రెస్ నోట్ 3 ప్రకారం భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అప్పట్లో పేటీఎంలో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉండేది. తాజాగా మారిన పరిస్థితుల ప్రకారం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రెస్ నోట్ 3 నిబంధనలకు అనుగుణంగా పేటీఎం మరోసారి పీఏ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోనుంది. -
ఆర్థిక శాఖ ఆదేశాలు: పసిడి రుణాలను సమీక్షించుకోండి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న పసిడి రుణాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుండటంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇలాంటి పలు ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, ఈ నేపథ్యంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియోను సమగ్రంగా సమీక్షించుకోవాలని పీఎస్‌యూ బ్యాంకులన్నింటికీ సూచించింది. ఈ మేరకు బ్యాంకుల చీఫ్‌లకు లేఖ రాసినట్లు ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. బంగారం రుణాలపై ఫీజులు.. వడ్డీల వసూళ్లు.. ఖాతాల మూసివేతలో అవకతవకలు జరుగుతుండటం, తగినంత విలువ గల బంగారాన్ని తనఖా పెట్టించుకోకుండానే రుణాలివ్వడం, నగదు రూపంలో రీపేమెంట్లు తీసుకోవడం తదితర ఉల్లంఘనలపై డీఎఫ్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 31 వరకు మంజూరైన రుణాలపై సమీక్ష జరగనుంది. ఇవి చదవండి: ఈ–స్కూటర్‌కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే
ప్రస్తుతం దేశంలోని ఆర్థికరంగ స్థితిగతుల తీరును బట్టి.. వచ్చే ఏడాది తమ ఆదాయ స్థాయిల్లో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయనే ఆశాభావం దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నగర, పట్టణ కేంద్రాల్లోని నాలుగింట మూడువంతుల దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వినియోగదారుల్లో ఈ నమ్మకం వ్యక్తమవుతోంది. రాబోయే సంవత్సరాల్లో తమ వేతనాలు గణనీయంగా పెరుగుతాయనే ధీమా వారిలో ఏర్పడడానికి దేశీయ ఆర్థికరంగం మరింత పుంజుకుంటుందనే లెక్కలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న క్రమంలో.. ఆర్థికరంగం బలపడుతుండడంతో గతేడాది 52 శాతం అల్పాదాయ వినియోగదారుల ఆదాయాలు పెరగగా, వచ్చే ఏడాది 76 శాతం మంది తమ ఆదాయాలు పెరుగుతాయని, ఆదాయంలో సేవింగ్స్ ఉంటాయని 64 శాతం ఆశిస్తున్నట్టు ఓ అంచనా. హైదరాబాద్ మోస్ట్ ఫేవరబుల్ సిటీ దిగువ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల జీవనానికి దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ’గా నిలుస్తున్నట్టుగా హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ‘ద ఇండియన్ వ్యాలెట్ స్టడీ 2023–అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ కన్జుమర్స్’‘అధ్యయనంలో వెల్లడైంది. అల్పాదాయవర్గాల జనాభా జాతీయ సగటు నెలవారీ వేతనం రూ.30 వేలుగా ఉన్నట్టుగా ఈ సర్వే అంచనావేసింది. ఈ అధ్యయనంలో... నగరాల వారీగా డేటాను పరిశీలిస్తే మాత్రం టాప్–4 మెట్రోనగరాలను తోసిరాజని ప్రథమశ్రేణి నగరాల్లో హైదరాబాద్ లోయర్ ఇన్కమ్గ్రూప్నకు రూ.42 వేల నెలవారీ సగటు వేతనంతో (జాతీయ సగటు కంటే రూ.12 వేలు అధికంగా) ‘మోస్ట్ ఫేవరబుల్ సిటీ’గా నిలిచినట్టు వెల్లడించింది. బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలు కూడా ఢిల్లీ (రూ.30వేలు), ముంబై (రూ.32 వేలు), చెన్నైతో సమానంగా, అంతకంటే ఎక్కువగా అల్పాదాయవర్గాలకు నెలవారీ వేతనాలు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎమర్జె న్సీ, వైద్యఖర్చులు, పిల్లలకు అనారోగ్యం, ఇంటి ఖర్చులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ వర్గాలు సన్నద్ధమౌతున్నట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కొల్కత్తా, బెంగళూరు. హైదరాబాద్, భోపాల్, పటా్న, రాంచీ, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్,జైపూర్, లక్నవూ, లూధియానా, కొచ్చి, పుణెలలోని 18–55 ఏళ్ల మధ్యలోని వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల లోపున్న 2,200 మంది అల్పాదాయ వర్గాలకు చెందిన వారి నుంచి వివిధ అంశాలపై సమాచారం సేకరించారు. ముఖ్యాంశాలు.. ► ముంబై, ఢిల్లీ, చెన్నై, కొల్కత్తా వంటి మెట్రోనగరాల కంటే కూడా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు వంటి ప్రథమ శ్రేణి నగరాల్లో (టైర్–1 సిటీస్) అల్పాదాయవర్గాలకు అధిక ఆదాయాలు వస్తున్నాయి ► ఈ టైర్–1 సిటీస్‌లోని దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వారు స్వయంగా షాపులకు వెళ్లి షాపింగ్ చేయడం ద్వారా వివిధ రకాల వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ► కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు లేదా రుణాలు తీసుకునేపుడు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ►అల్పాదాయవర్గాల వినియోగదారుల నెలవారీ ఆదాయంలో 70 శాతం దాకా ఇంటి అద్దె(11శాతం), నిత్యావసర వస్తువులు (41 శాతం), ఆఫీసులకు రాకపోకలకు (14 శాతం) ఖర్చు అవుతోంది అదేసమయంలో 70 శాతం మంది అనవసర ఖర్చులు (నాన్–ఎసెన్షియల్ స్పెండింగ్)చేసేందుకు ఏమాత్రంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ►వీరికి లోకల్ సైట్ సీయింగ్, హోటళ్లలో తినడం, సినిమాలకు వెళ్లడం వంటివి ప్రధాన రిక్రియేషన్‌గా ఉంటున్నాయి ►ఈ కుటుంబాల్లో ఒకరికి మించి వేతనజీవులు ఉండడం వల్ల వీరంతా కుటుంబఖర్చులను పంచుకుంటున్నట్టుగా ఓ అంచనా. అందులో ఇంటిపెద్ద 80 శాతం దాకా కంట్రిబ్యూట్ చేస్తున్నారు వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో భాగంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కన్జూమర్లు చేసే ఖర్చుల తీరుతెన్నులపై దృష్టి పెట్టాం. కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థికరంగం, వినియోగదారుల వ్యవహారశైలిలో వచి్చన మార్పు, చేర్పులను పరిశీలించాం. ప్రధానంగా దాదాపు వందకోట్ల వినియోగదారులు (అర్భన్ లోయర్ మిడిల్‌క్లాస్)చేసే ఖర్చులు, ఇతర అంశాలపై దృష్టిపెట్టాం. ఈ వర్గం వినియోగదారుల్లో చేసే ఖర్చులు, సేవింగ్స్ విషయంలో సానుకూల దృక్పథం వ్యక్తమౌతోంది. – అశిష్ తివారీ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హోమ్ క్రెడిట్ ఇండియా -
అవినీతిపై రోజుకు 195 ఫిర్యాదులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతికి తగ్గట్లు ప్రజా ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీపీగ్రామ్స్) ఆన్లైన్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. అవినీతికి సంబంధించి ఏకంగా 46,627 ఫిర్యాదులు ఈ పోర్టల్ ద్వారా అందినట్లు ఆగస్టు–2022 నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన రోజుకు 195 ఫిర్యాదులు దఖలుపడ్డాయి. అత్యధికంగా ఫిర్యాదులు ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్ఎస్)పైనే నమోదవడం గమనార్హం. డీఎఫ్ఎస్ పరిధిలోని బ్యాంకింగ్ విభాగంపై అధికంగా 14,934 ఫిర్యాదులు వచ్చాయి. బీమా విభాగంపై 3,306 ఫిర్యాదులు, సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ)పై 2,223, శాస్త్ర,సాంకేతిక విభాగంపై 1,831, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయంపై 1,784, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖపై 1,005 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25 వరకు సీపీగ్రామ్స్ ద్వారా కేంద్రప్రభుత్వానికి మొత్తంగా 7,50,822 ఫిర్యాదులు అందాయి. వీటిలో 7,27,673 ఫిర్యాదులను పరిష్కరించారు. బ్యాంకింగ్ విభాగంలో 1,088, కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖలో 260 ఫిర్యాదుల్ని పరిష్కరించాల్సి ఉంది. -
రిజర్వ్‌బ్యాంక్ వివాదంలో కేంద్రం రాజీమంత్రం
-
ఈ ఎన్‌బీఎఫ్‌సీలన్నీ హైరిస్క్ ఉన్నవే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9,491 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) హై రిస్క్ ఉన్నవిగా పేర్కొంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఓ జాబితా విడుదల చేసింది. ఇవన్నీ యాంటీ మనీ లాండరింగ్ నిబంధనలను పాటించడం లేదని ఆర్థిక శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం (ఎఫ్ఐయూ) గుర్తించింది. తదనంతరం వీటితో ఓ జాబితాను రూపొందించి దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్బీఎఫ్సీలు (కోపరేటివ్ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు) తమ ఆర్థిక కార్యకలాపాల వివరాలను, లావాదేవీల వివరాలను తప్పనిసరిగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన ఎఫ్ఐయూ ప్రధానంగా ప్రిన్సిపల్ ఆఫీసర్‌ను నియమించాలన్న నిబంధనను పాటించడం లేదని గుర్తించింది. సంబంధిత అధికారి రూ.10 లక్షలకు పైబడిన లావాదేవీలను పరిశీలించి అనుమానాస్పదమైతే వాటి గురించి ఎఫ్ఐయూకి నివేదించాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ కంపెనీల లావాదేవీలపై ఎఫ్ఐయూ నిఘా వేసి, పలు మార్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నిబంధనలు పాటించడం లేదని, హైరిస్క్ ఉన్నవిగా నిర్ధారించి జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థలతో లావాదేవీలు నిర్వహించడం ద్వారా నష్టపోవద్దని ప్రజలను అప్రమత్తం చేయడమే ఎఫ్ఐయూ ఉద్దేశం. ఈ సంస్థల పూర్తి జాబితాను www.sakshibusiness.com లో చూడొచ్చు -
మామునూర్ ‘వెటర్నరీ’కి 138 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లోని మామునూర్ వెటర్నరీ సైన్స్ కాలేజీకి 100 రెగ్యులర్ పోస్టులు, 38 ఔట్సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 79 మంది బోధన సిబ్బంది, 21 మంది బోధనేతర సిబ్బంది పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక అసోసియేట్ డీన్‌తోపాటు 17 మంది ప్రొఫెసర్లు, 23 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 11 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 2 సూపరింటెండెంట్, 3 సీనియర్ అసిస్టెంట్, 2 ఫార్మ్ మేనేజర్, క్యాషియర్, రికార్డు అసిస్టెంట్ పోస్టులున్నాయి. -
ప్రభుత్వ రుణ భారం రూ.55.26 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ భారం డిసెంబర్ నాటికి రూ.55.26 లక్షల కోట్లకు చేరింది. త్రైమాసికంగా చూస్తే 3 శాతం పెరిగింది. రుణ నిర్వహణకు సంబంధించి ఆర్థికశాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటన ఈ వివరాలను తెలియజేసింది. మొత్తం రుణంలో అంతర్గత రుణ భారం వాటా త్రైమాసికంగా చూస్తే... 92 శాతం నుంచి 92.2 శాతానికి ఎగసింది. రూపీ డినామినేడెడ్లో మార్కెట్లో ట్రేడయ్యే బాండ్లు, ట్రెజరీ బిల్స్ వాటా 85.3 శాతం నుంచి 85.7%కి ఎగసింది. అంతర్గత రుణం రూ.50,97,016 కోట్లని పేర్కొన్న ప్రభుత్వం, 2015 ముగిసిన జీడీపీ పరిమాణంతో 37.2 శాతంగా తెలిపింది. ఇది సెప్టెంబర్ త్రైమాసికంలో 37.1%. కాగా మార్చి త్రైమాసికంలో ద్రవ్య లభ్యత పరిస్థితులు (లిక్విడిటీ) కఠినంగా కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. -
ఎన్నికల నిధులపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నిధుల విడుదల విషయంలో ఆర్థికశాఖ తీరుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం విస్మయానికి గురైంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 150 కోట్లు విడుదల చేయాల్సిందిగా సీఈవో కార్యాలయం ఆర్థికశాఖను కోరింది. స్పందించిన ఆర్థికశాఖ శుక్రవారం రూ. 150 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను ఎన్నికల నిర్వహణకు జిల్లాల వారీగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పంపిణీ చేసింది. తీరా నిధుల కోసం శనివారం ట్రెజరీలకు బిల్లులు సమర్పించటానికి వెళితే.. నిధుల విడుదలపై ఫ్రీజింగ్ విధించారని, బిల్లులను తీసుకోబోమని ట్రెజరీ అధికారులు స్పష్టంచేశారు. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మళ్లీ ఆర్థికశాఖను ఆశ్రయించింది. ఎన్నికల నిధులకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఎటువంటి ఆంక్షలు విధించరాదని, ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఎన్నికల నిర్వహణకు రూ. 850 కోట్లు... ఇదిలావుంటే.. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రూ. 850 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థికశాఖకు పంపింది. ఈ రూ. 850 కోట్లలో సగం నిధులను కేంద్ర ప్రభుత్వం మిగతా సగం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 2009లో నిర్వహించిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు రూ. 450 కోట్ల వ్యయం అయింది. ఐదేళ్ల తరువాత జరుగుతున్న ఇప్పటి ఎన్నికలకు వ్యయం దాదాపు రెట్టింపు అవటం గమనార్హం. -
యాజవూన్యానిదే తప్పు
ఎన్ఎస్ఈఎల్ సంక్షోభంపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ నివేదిక ఎఫ్టీఐఎల్ బోర్డుకూ భాగస్వామ్యం న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) వ్యవహారంపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ తుది నివేదికను సిద్ధం చేసింది. ఎన్ఎస్ఈఎల్ యాజమాన్యం కొన్ని అంశాలలో కంపెనీల చట్టాన్ని అతిక్రమించినట్లు ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదికను ఇప్పటికే న్యాయ శాఖ, ఆర్థిక శాఖలతోపాటు, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో జరిగిన కొన్ని రకాల అవకతవకలకు ఫైనాన్షియల్ టెక్నాలజీస్ బోర్డు(ఎఫ్టీఐఎల్) సైతం బాధ్యురాలైనట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈఎల్లో ఎఫ్‌టీఐఎల్‌కు 99.99% వాటా ఉంది. పలు అవకతవకలు 2013 నవంబర్‌లో కంపెనీల రిజిస్ట్రార్(ఆర్వోసీ) ఇచ్చిన మధ్యంతర నివేదికలో పేర్కొన్నట్లుగానే ఈ రెండు సంస్థల బోర్డు స్థాయిల్లో అవకతవకలు జరిగినట్లు తాజా నివేదిక సైతం వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్‌ను అనుమతించడంపై డెరైక్టర్లు ఎన్నడూ చర్చించలేదని, వీటిని స్వల్పకాలిక కాంట్రాక్ట్‌లతో అనుసంధానించడం వల్ల చెల్లింపుల సంక్షోభం తలెత్తిందని నివేదిక పేర్కొంది. నిజాలను దాచడం, గిడ్డంగుల నిర్వహణలో లోపాలు, రిస్క్ మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోవడం, చెల్లింపుల్లో విఫలమైన సభ్యులను ట్రేడింగ్‌కు అనుమతించడం వంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు వివరించింది. కార్పొరేట్ పాలన విషయంలో కంపెనీ బోర్డు పూర్తిస్థాయిలో విఫలమైనట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక ఎన్ఎస్ఈఎల్ ఆడిట్ నివేదికలోనూ పలు లోపాలున్నట్లు వెల్లడించింది. తప్పించుకోలేరు.. ఫైనాన్షియల్ టెక్నాలజీస్ గ్రూప్ కంపెనీలలో జిగ్నేష్ షాతోపాటు, జోసెఫ్ మాసే, శ్రీకాంత్ జవల్గే కర్ డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆర్వోసీ నివేదిక తెలిపింది. అయితే ఆయా కంపెనీలలో జరిగిన అవకతవకలు తెలియవన్నట్లు తప్పించుకోవడానికి వీలుండదని కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఇచ్చిన నివేదికలో ఆర్వోసీ స్పష్టం చేసింది కూడా. ఏం జరిగింది? ఎల క్ట్రానిక్ పద్ధతిలో వివిధ కమోడిటీలలో కాంట్రాక్ట్‌లను నిర్వహించేందుకు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్ట్‌లకు సంబంధించి గడువు ముగిసినప్పటికీ ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను పూర్తిచేయలేక ఎక్స్ఛేంజీ సంక్షోభంలో చిక్కుకుంది. దీనికితోడు గిడ్డంగుల్లో సైతం తగిన స్థాయిలో సరుకు నిల్వలు లేకపోవడం సంక్షోభాన్ని పెంచింది. దీంతో గతేడాది ఆగస్టులో ఎక్స్ఛేంజీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దశలవారీ చెల్లింపులకు కోరిన గడువులలో సైతం ఎక్స్ఛేంజీ నగదు సమకూర్చుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. ఇందుకు పలువురు సభ్యులు చెల్లింపుల్లో విఫలంకావడం కారణమైంది. -
రిపోర్ట్ కార్డా..? రాజీనామానా?
-
రిపోర్ట్ కార్డా..? రాజీనామానా?
నేటి ప్రధాని ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఆసక్తి పదేళ్లకాలంలో ఇది మూడో మీడియా సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల పదవీకాలంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మీడియా ముందుకు రానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ రైసినా రోడ్డులోని నేషనల్ మీడియా సెంటర్లో ఆయన పూర్తిస్థాయి విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు. యూపీఏ-1 హయాంలో మొదటిసారి ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఒకసారి, యూపీఏ-2 అధికారంలోకి వచ్చిన తరువాత 2009 మేలో మరోసారి ఆయన విలేకరులతో సంభాషించారు. రాజీనామా ప్రకటన, రాహుల్‌గాంధీకి రంగం సిద్ధం చేసే ప్రయత్నం.. ఇలా పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న పరిస్థితుల్లో.. నేటి ప్రధాని ప్రెస్‌మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అవినీతి, ఆర్థికవ్యవస్థ, విదేశాంగ వ్యవహారాలు.. ఈ మూడు రంగాల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రెస్మీట్లో ప్రధానంగా ప్రధాని ప్రస్తావించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అవినీతి, ధరల పెరుగుదల, విధానపరమైన నిష్క్రియాపరత్వంపై విమర్శలు చెలరేగుతున్న తరుణంలో వాటిని తిప్పికొట్టే దిశగా ఆయన ప్రసంగం సాగవచ్చనుకుంటున్నారు. ముఖ్యంగా లోక్‌పాల్ చట్టం, అవినీతిని అరికట్టే ఉద్దేశంతో రూపొందిస్తున్న ఇతర ప్రతిపాదిత బిల్లులను, ధరల పెరుగుదలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించవచ్చు. విలేకరుల సమావేశం సందర్భంగా రాజీనామా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న ఎవరినుంచైనా వస్తే.. ‘2014 మే తర్వాత రేస్‌లో ఉండను’ అని మన్మోహన్ స్పష్టంగా చెప్పవచ్చని, అలాగే కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ నాయకత్వం వహించాలన్న వైఖరిని పునరుద్ఘాటించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో.. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ‘తరం మార్పు’ను స్వాగతిస్తూ మన్మోహన్ కీలక ప్రకటన చేస్తారా లేక యూపీఏ హయాంపై రిపోర్డు కార్డుతోనే సరిపెడతారా అనేది నేడు తేలనుంది. -
ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమాల నేపథ్యంలో ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకు నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్ ప్రేమచంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్జీఓల సంఘం పిలుపు మేరకు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. వీరిలో ఖజానా శాఖ ఉద్యోగులు కూడా ఉన్నారు. దీంతో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఖజానా కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. జిల్లాలోని ఖజానా శాఖలో కేవలం ఉపసంచాలకులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది డీపీఓ (డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్), డీఈఓలు (డేటా ఎంట్రీ ఆపరేటర్లు) మాత్రమే పని చేస్తున్నారు. సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరవుతున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వంపై పలువురు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగుల జీతాల చెల్లింపునకు నిబంధనలు సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఖజానా శాఖ ఉపసంచాలకులు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో జీతాల చెల్లింపు వ్యవహారం చిక్కుముడిపడింది. ఈ నేపథ్యంలో పెన్షనర్ల తరహాలోనే ఉద్యోగులకు కూడా హైదరాబాద్ నుంచే జీతాలను బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల జీతాల వివరాలతో కన్సాలిడేటెడ్ పే బిల్లును సంబంధిత శాఖ అధికారి ధ్రువీకరించి హైదరాబాద్‌లోని అర్బన్ జిల్లా ఖజానా కార్యాలయానికి పంపించాలి. అక్కడ బిల్లును పరిశీలించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉస్మాన్ గంజ్ శాఖ ద్వారా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జీతభత్యాలను జమ చేస్తారు. ఉదాహరణకు విద్యాశాఖ ఉద్యోగుల టీచర్లకు జిల్లా విద్యాశాఖాధికారి కన్సాలిడేటెడ్ పే బిల్లును సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా సంబంధిత ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు పే బిల్లులు సమర్పిస్తేనే విధులకు హాజరవుతున్న ఉద్యోగులకు జీతాలు వస్తాయి. -
ఎకానమీ మళ్లీ పుంజుకుంటుంది: ప్రణబ్
కోల్‌కతా: దేశ ఆర్థిక వ్యవస్థ గురించి నిరాశచెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే మళ్లీ పుంజుకోగలదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఈ దిశగా పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు, ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. శనివారం జరిగిన బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. రూపాయి మారకం విలువను స్థిరీకరించడంపైనే ప్రస్తుతం విధానకర్తలు ప్రధానంగా దృష్టి సారించారని ప్రణబ్ చెప్పారు. ఈసారి వర్షపాతం మెరుగ్గా ఉండటం వ్యవసాయరంగ వృద్ధిపైన, ఆహార వస్తువుల ధరలపైనా సానుకూల ప్రభావం చూపగలదని ఆయన తెలిపారు. -
నేడు, రేపు కూడా ముందస్తు పన్ను చెల్లించవచ్చు
న్యూఢిల్లీ: ముందస్తు పన్ను చెల్లింపులకు వీలుగా ఆదివారం కూడా కొన్ని బ్యాంకు శాఖలు పనిచేయనున్నాయి. ముందస్తు పన్నులు స్వీకరించే శాఖలను సెప్టెంబర్ 14, 15న పనిచేసే విధంగా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకులను ఆదేశించింది. ఒకవేళ ఈ రెండు రోజుల్లో చెల్లింపులు జరపడంలో విఫలమైతే సోమవారం(సెప్టెంబర్ 16) చెల్లింపులు జరపవచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. మూడు నెలలకు ఒకసారి ముందస్తు పన్ను చెల్లింపుల్లో (అడ్వాన్స్ ట్యాక్స్) భాగంగా సెప్టెంబర్ 15 లోగా వీటిని చెల్లించాలి. -
ఒకే నెలలో రూ.2800 కోట్ల అప్పు
సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యోగుల సమ్మెతో సర్కారు నడ్డి విరిగింది. పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం మొత్తం ఆగిపోయింది. అటువైపు నుంచి ఒక్క రూపాయి కూడా సర్కారు ఖజానాలో జమ కావడంలేదు. దీంతో.. సెక్యురిటీల విక్రయం లాంటి ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ప్రధాన ఖజానా కార్యాలయాలతో పాటు 194 ఉప ఖజానా కార్యాలయాలూ మూతపడడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. సాధారణంగా ఈ 13 జిల్లాల నుంచి ప్రతి రోజూ రూ. 140 కోట్ల నుంచి రూ. 150 కోట్ల మేర ప్రభుత్వానికి రాబడి వస్తుంది. సమ్మెతో ఈ రాబడులు నిలిచిపోయాయి. దీంతో ఆర్థిక సంక్షోభం నెలకొనకుండా చూసేందుకు ఆర్థిక శాఖ ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. సీమాంధ్ర జిల్లాల నుంచి ఆదాయం నిలిచిపోవడంతో ఉద్యోగులకు జీతాలు, అప్పులపై వాయిదాలు, వడ్డీ చెల్లింపులపై కష్టతరం కానున్నది. దీంతో, ఆర్థిక శాఖ ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఒక్క ఆగస్టు నెలలోనే రూ.2,800 కోట్లు అప్పు చేస్తోంది. ఈ నెల 13న ప్రభుత్వ సెక్యురిటీలను విక్రయించడం ద్వారా రూ.1800 కోట్ల రుణాన్ని సేకరించింది. ఈ నెల 27న మరో రూ. వెయ్యి కోట్ల రుణ సేకరణకు సెక్యురిటీలు విక్రయించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఒక్క నెలలో రూ.1,500 కోట్లకు మించి అప్పు చేసిన సందర్భాలు ఇటీవల కాలంలో లేవు. సమ్మె దెబ్బ సర్కారు మీద గట్టిగానే పడుతోంది.