ప్రభుత్వ రుణ భారం రూ.55.26 లక్షల కోట్లు | Opinion: Government debt could bring China's credit party to a halt | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ రుణ భారం రూ.55.26 లక్షల కోట్లు

Published Wed, Mar 23 2016 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

ప్రభుత్వ రుణ భారం రూ.55.26 లక్షల కోట్లు

ప్రభుత్వ రుణ భారం రూ.55.26 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రుణ భారం డిసెంబర్ నాటికి రూ.55.26 లక్షల కోట్లకు చేరింది. త్రైమాసికంగా చూస్తే 3 శాతం పెరిగింది. రుణ నిర్వహణకు సంబంధించి ఆర్థికశాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటన ఈ వివరాలను తెలియజేసింది. మొత్తం రుణంలో అంతర్గత రుణ భారం వాటా త్రైమాసికంగా చూస్తే... 92 శాతం నుంచి 92.2 శాతానికి ఎగసింది. రూపీ డినామినేడెడ్‌లో మార్కెట్‌లో ట్రేడయ్యే బాండ్లు, ట్రెజరీ బిల్స్ వాటా 85.3 శాతం నుంచి 85.7%కి ఎగసింది. అంతర్గత రుణం రూ.50,97,016 కోట్లని పేర్కొన్న ప్రభుత్వం, 2015 ముగిసిన జీడీపీ పరిమాణంతో 37.2 శాతంగా తెలిపింది. ఇది సెప్టెంబర్ త్రైమాసికంలో 37.1%. కాగా మార్చి త్రైమాసికంలో ద్రవ్య లభ్యత పరిస్థితులు (లిక్విడిటీ) కఠినంగా కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement