
ఎకానమీ మళ్లీ పుంజుకుంటుంది: ప్రణబ్
కోల్‌కతా: దేశ ఆర్థిక వ్యవస్థ గురించి నిరాశచెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే మళ్లీ పుంజుకోగలదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. ఈ దిశగా పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు, ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. శనివారం జరిగిన బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
రూపాయి మారకం విలువను స్థిరీకరించడంపైనే ప్రస్తుతం విధానకర్తలు ప్రధానంగా దృష్టి సారించారని ప్రణబ్ చెప్పారు. ఈసారి వర్షపాతం మెరుగ్గా ఉండటం వ్యవసాయరంగ వృద్ధిపైన, ఆహార వస్తువుల ధరలపైనా సానుకూల ప్రభావం చూపగలదని ఆయన తెలిపారు.