
డిజిటల్ ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంలు మొబిక్విక్, క్రెడ్ తాజాగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఈ–రూపీ వాలెట్లను ప్రవేశపెట్టాయి. దీనికి యస్‌బ్యాంక్‌తో జతకట్టాయి. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదును బదలాయించేందుకు, అలాగే వ్యక్తులు.. వ్యాపారవర్గాలకు చెల్లింపులు జరిపేందుకు సర్వీసులు ఉపయోగపడనున్నాయి. 2024లో రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా డిజిటల్ కరెన్సీ ఈ–రూపీని ప్రవేశపెట్టినప్పుడు కేవలం బ్యాంకులకు మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (టీపీఏపీ) కూడా సీబీడీసీ సేవలను అందించేందుకు వెసులుబాటు లభించింది. ఇప్పుడు ఈ–రూపీ వాలెట్ల రోజువారీ లావాదేవీల పరిమితి రూ. 50,000గా ఉండగా, ఒక్కో లావాదేవీ విలువ పరిమితి రూ. 10,000గా ఉంది. అర్థ రూపాయి, 1 రూపాయి నుంచి రూ. 500 వరకు కరెన్సీ డినామినేషన్లలో ఈ–రూపీ అందుబాటులో ఉంటుంది.
ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌తో ముగిసిన సస్తాసుందర్ భాగస్వామ్యం
జెప్టో ‘రివర్స్ ఫ్లిప్’ పూర్తి..
దేశీయంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చే దిశగా క్విక్ కామర్స్ సంస్థ జెప్టో మరో అడుగు ముందుకు వేసింది. తమ హోల్డింగ్ కంపెనీ కిరాణాకార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకుంది. రివర్స్ ఫ్లిప్‌గా వ్యవహరించే ఈ ప్రక్రియకు సంబంధించి సింగపూర్ కోర్టులు, భారత్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి లాంఛనంగా అనుమతులు లభించినట్లు సంస్థ సహ–వ్యవస్థాపకుడు ఆదిత్ పలీచా తెలిపారు. తక్కువ సమయంలోనే దీన్ని సాకారం చేశారని తమ బృందానికి కితాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment