MobiKwik
-
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్‌తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్‌కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్‌కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్‌షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్‌కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్‌తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
ఉన్న ఉద్యోగం వదిలి.. రూ.8000 కోట్ల కంపెనీ స్థాపించి..
ధైర్యం, దృఢ సంకల్పం ఉంటే.. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎంతోమంది నిరూపించారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'మొబిక్విక్' (Mobikwik) కో ఫౌండర్ 'ఉపాసన టకు'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె మొబిక్విక్ ఎప్పుడు స్థాపించారు? నెట్‌వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఉపాసన టకు.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువు పూర్తయిన తరువాత 17 సంవత్సరాలు విదేశాలలో పని చేశారు. సొంతంగా ఏదైనా సంస్థ స్థాపించాలనే ఉద్దేశ్యంతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి వచ్చేసారు.కుటుంబ పరిస్థితి, వ్యాపారంలో వచ్చే ఆటుపోట్ల గురించి తెలిసినప్పటికీ.. ధైర్యంగా నిర్ణయం తీసుకుని, ఆమె భర్త బిపిన్ ప్రీత్ సింగ్‌తో కలిసి మొబైల్ పేమెంట్ / డిజిటల్ వాలెట్ సంస్థ 'మొబిక్విక్'ను 2009లో స్థాపించారు. ఇది అతి తక్కువ కాలంలోనే అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇవ్వగలిగింది.మొబిక్విక్ సీఈఓగా ఉపాసన టకు బాధ్యతలు స్వీకరించి కంపెనీని లాభాల బాటలో పయనించేలా చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ సైన్స్ & ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉపాసన సంస్థను ఉన్నత శిఖరాలకు చేరవేయడానికి కావాల్సిన ప్రయత్నాలను చేశారు.మొబిక్విక్ ప్రారంభించడానికి ముందే ఉపాసన.. పేపాల్, హెచ్ఎస్బీసీ సంస్థల్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేశారు. ఈ అనుభవం మొబిక్విక్ ఎదుగుదలకు ఉపయోగపడింది. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి.. సొంతంగా సంస్థను స్థాపించిన ఉపాసన ఎంతోమంది యువ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలిచారు.ఇదీ చదవండి: ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యంఏదైనా పనిని ధైర్యంతో చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని ఉపాసన టకు నిరూపించారు. మొబిక్విక్ అనేది చిన్న స్టార్టప్ నుంచి ఫిన్‌టెక్ పవర్‌హౌస్‌గా మారింది. నేడు ఈ సంస్థ రూ. 8000 కోట్ల ఆదాయంతో ముందుకు దూసుకెళ్తోంది. -
బ్యాంక్ అకౌంట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్..!
బ్యాంక్ అకౌంట్‌తో పని లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది ఫిన్ టెక్ సంస్థ మొబీక్విక్ (MobiKwik). తన ప్లాట్‌ఫారమ్‌లో 'పాకెట్ UPI' అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇది వినియోగదారులకు బడ్జెట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మెరుగైన నియంత్రణను కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తుందని ఫిన్‌టెక్ కంపెనీ పేర్కొంది. పాకెట్ UPI వినియోగదారులు వారి బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే మొబీక్విక్ వ్యాలెట్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. తద్వారా వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు అదనపు ఎంపికతో వారి చేతుల్లో మరింత శక్తిని ఇస్తుందని వన్ మొబీక్విక్ లిమిటెడ్ (మొబీక్విక్) కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పాకెట్ యూపీఐ యూజర్లు వారి బ్యాంక్ ఖాతా కాకుండా మొబీక్విక్ వాలెట్ నుంచి డబ్బులను బదిలీ చేయడం ద్వారా తప్పు లావాదేవీలు, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు బహిర్గతం పరిమితం అవుతుంది. -
అదానీ వన్‌తో మొబిక్విక్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: విమాన టిక్కెట్లు, సుంకాల రహిత ఉత్పత్తులపై ప్రత్యేక సేవలు అందించడానికి అదానీ గ్రూప్ ట్రావెల్ బుకింగ్ యాప్– అదానీ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ తెలిపింది. మొబిక్విక్ వాలెట్‌తో విమాన బుకింగ్‌లు, డ్యూటీ–ఫ్రీ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తామని కంపెనీ ప్రకటన పేర్కొంది. ‘‘అదానీ వన్ యాప్‌తో భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. సులభమైన చెల్లింపులు, ఇబ్బందులు లేని ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని ఈ భాగస్వామ్యం ద్వారా అందిస్తాము. ప్రమాణానికి సిద్ధమవుతున్నందున కస్టమర్‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సేవలు అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం’’ అని మొబిక్విక్ పేర్కొంది. ఆర్థిక పరిమితుల వల్ల ఎవరి ప్రణాళికలకు ఎప్పుడూ ఆటంకం కలిగించకుండా చూసుకోవడానికి తాము అంకితభావంతో ఉన్నామని మొబిక్విక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు. మొబిక్విక్ వాలెట్‌తో చెల్లింపు చేసినప్పుడు అదానీ వన్‌లో విమాన బుకింగ్‌లపై రూ. 500 తగ్గింపు ఉంటుందని, అలాగే అదానీ వన్ ద్వారా డ్యూటీ–ఫ్రీ ప్రొడక్టులపై రూ. 250 ఫ్లాట్ తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘‘మా సూపర్ యాప్‌లో మోబిక్విక్ సులభతరమైన ఫైనాన్స్ సొల్యూషన్లను ఏకీకృతం చేస్తున్నందున మేము సంతోíÙస్తున్నాము. భారతదేశం అంతటా ట్రావెల్ బుకింగ్‌లు, గ్లోబల్ బ్రాండ్లను సరళమైన ధరలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించడమే మా సమిష్టి లక్ష్యం’’ అని అదానీ వన్ ప్రతినిధి మరో ప్రకటనలో తెలిపారు. -
ఐపీవో బాటలో మొబిక్విక్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ యూనికార్న్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ రెండేళ్ల తర్వాత మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 700 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. కంపెనీ ఇంతక్రితం 2021 జూలైలో రూ. 1,900 కోట్ల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే ఆపై ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. 2021 నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. కాగా.. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 140 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇది జరిగితే ఆమేరకు ఐపీవో పరిమాణం తగ్గనుంది. కంపెనీలో ప్రధాన వాటాదారు పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్‌తోపాటు.. బజాజ్ ఫైనాన్స్, అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు పెట్టుబడులున్నాయి. -
మొబిక్విక్ సిస్టమ్స్, స్పైస్ మనీపై ఆర్బీఐ భారీ జరిమానా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లపై భారీ జరిమానా విధించింది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వన్ మొబిక్విక్ సిస్టమ్స్, స్పైస్ మనీ లిమిటెడ్లపై ఒక్కొక్కరికి కోటి రూపాయల జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007(పీఎస్ఎస్ చట్టం) సెక్షన్ 26(6)లో సూచించిన నేరాలకు పాల్పడినందుకు వన్ మొబిక్విక్, స్పైస్ మనీపై జరిమానా విధించినట్లు ఆర్బీఐ అధికారిక ప్రకటనలో వివరించింది. పిఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 30 నిబంధనల కింద ఆర్బీఐకి ఉన్న అధికారం మేరకు జరిమానాలు విధించనట్లు తెలిపింది. భారత్ బిల్లు చెల్లింపు ఆపరేటింగ్ యూనిట్స్ (బీబీపీఒయులు) నికర విలువ ఆవశ్యకతపై జారీ చేసిన ఆదేశాలను ఈ రెండు సంస్థలు పాటించలేదని, ఆ తర్వాత నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర బ్యాంక్ అభిప్రాయపడింది. విచారణ సమయంలో రాతపూర్వక సమాధానాలను, వ్యక్తిగత విచారణ సమయంలో ఇచ్చిన మౌఖిక సమర్పణలను సమీక్షించింది. ఆ తర్వాత ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదని అభియోగాలు రుజువు కావడంతో జరిమానా విధించినట్లు పేర్కొంది. (చదవండి: వ్యాపారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్..!) -
దూకుడుమీదున్న మార్కెట్లు, ఐపీఓ బాటలో మొబిక్విక్
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు చూపుతున్న దూకుడు నేపథ్యంలో తాజాగా డిజిటల్ చెల్లింపుల స్టార్టప్ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 1,900 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. -
మొబీక్విక్ వినియోగదారులకు షాక్: భారీగా డేటా లీక్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపుల సంస్థ మొబీక్విక్ యూజర్లకు షాకింగ్ న్యూస్. లక్షలమంది మొబీక్విక్ వినియోగదారుల సమాచారాన్ని చోరీ చేసిన హ్యాకర్లు డార్క్‌వెబ్‌లో అమ్మకాని పెట్టారన్న వార్తలు మొబీక్విక్ వినియోగదారుల్లో ప్రకంపనలు రేపింది. 37 మిలియన్ల ఫైళ్లు, 3.5 మిలియన్ల వ్యక్తుల కెవైసీ వివరాలు, 100 మీలియన్ల ఫోన్ నంబర్లు, ఇమెయిళ్ళు, పాస్వర్డ్లు, జియోడేటా, బ్యాంక్ ఖాతాలు,సీసీ డేటా ఉన్నాయనే అంచనాలు యూజర్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. సుమారు 3.5 మిలియన్ల మంది డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. కేవైసీ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటా ఇతర తదితరాలు హ్యాకింగ్ గురయ్యాయని, డార్క్ వెబ్ లింక్‌లో ఈ లీక్‌ను గుర్తించినట్లు తెలిపారు. దీంతో నిధుల సమీకరణలో భాగంగా భారీ ఐపీఓకి ప్లాన్ చేస్తున్న తరుణంలో ఈ డేటాబ్రీచ్ వార్తలతో మొబీక్విక్ ఇబ్బందుల్లో పడింది. ఫిబ్రవరిలో భద్రతా పరిశోధకుడు రాజ్‌శేఖర్ రాజహరియా ఈ లీక్‌ను మొదటిసారి నివేదించారు. ఫిబ్రవరి 26 న లీక్ వివరాలను ట్వీట్ చేశారు: “11 కోట్ల మంది భారతీయ కార్డ్ హోల్డర్ల కార్డ్ డేటా, వ్యక్తిగత వివరాలు, కెవైసి సాఫ్ట్ కాపీ (పాన్, ఆధార్, మొదలైనవి) భారతదేశంలోని కంపెనీ సర్వర్ నుండి లీక్ అయినట్లు తెలిపారు. మొబీక్విక్‌కు సంబంధించి నో-యు-కస్టమర్ వివరాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డ్ డేటాతో సహా 8.2 టెరాబైట్ల (టీబీ) డేటా చోరీ అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి స్క్రీన్షాట్లను కూడా ఆయన పోస్ట్ చేశారు. 1.5 బిట్ కాయిన్ లేదా 86,000 డాలర్లకు ఈ డేటాను విక్రయానికి పెట్టినట్టు సమాచారం. “బహుశా చరిత్రలో అతిపెద్ద కేవైసీ డేటా లీక్.అభినందనలు మొబీక్విక్...’ అంటూ మరోహ్యాకర్ ఇలియట్ హ్యాండర్సన్ కూడా ట్వీట్ చేశారు. లీక్ అయిన డేటాలో ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీ, కేవైసీ వివరాలున్నాయి కాబట్టి స్కామర్లకు ఈజీగా యాక్సెస్ లభిస్తుందని స్వతంత్ర భద్రతా పరిశోధకుడు ఇంద్రజీత్ భూయాన్ వ్యాఖ్యానించారు. Indian payment systems giant "Mobikwik" allegedly suffered what may be considered the largest KYC data leak in history. Over 37m files, KYC of 3.5m individuals, and a whopping 100m phone numbers, emails, passwords, geodata, bank accounts & CC data.@MobiKwik pic.twitter.com/dCFqTHEv1F — Alon Gal (Under the Breach) (@UnderTheBreach) March 28, 2021 Probably the largest KYC data leak in history. Congrats Mobikwik... pic.twitter.com/qQFgIKloA8 — Elliot Alderson (@fs0c131y) March 29, 2021 యూజర్ల డేటా సేఫ్‌గా ఉంది : మొబీక్విక్ అయితే ఈ వార్తలను మొబీక్విక్ ఖండించింది. తమ సెక్యూరిటీ సిస్టంలోఎలాంటి లోపాలులేవని స్పష్టం చేసింది.దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, తమ వినియోగదారుల డేటా పూర్తిగా సురక్షితంగా ఉందని మోబిక్విక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. భద్రతా పరిశోధకులు అని పిలవబడే కొంతమంది సృష్టిస్తున్న పుకార్లని కొట్టిపాడేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 200-250 మిలియన్ డాలర్లను సమీకరించడానికి ఐపీఓకు రావాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
బంపర్ ఆఫర్: గ్రాము గోల్డ్‌కి మరో గ్రాము ఉచితం!
సాక్షి, ముంబై : రానున్న ధంతేరస్ సందర్భంగా ప్రముఖ ఇ-వాలెట్ సంస్థ మొబీక్విక్ తాజాగా ఇలాంటి ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్లో బంగారం కొనుగోలు చేసే వారికోసం ‘మెగా ఎక్స్చేంజ్ వన్.. గెట్ వన్' ఆఫర్ ప్రకటించింది. ఆఫర్లో భాగంగా కస్టమర్లు ఆభరణాల కొనుగోలు కోసం 1 గ్రాము డిజిటల్ గోల్డ్‌ను మార్చుకుంటే.. వారికి ఒక గ్రాము డిజిటల్ గోల్డ్ తిరిగి ఇస్తోంది. దీపావళి, ధన్‌తేరాస్ సందర్భంగా ‘మెగా ఎక్స్చేంజ్ వన్..గెట్ వన్' ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు ప్రముఖ డిజిటల్ గోల్డ్ ప్లాట్పామ్ 'సేఫ్గోల్డ్' సంస్థతో మొబీక్విక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీంతో ఇలా కొనుగోలు చేపిన బంగారం ‘సేఫ్గోల్డ్' అకౌంట్లో జమవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ‘మెగా ఎక్స్చేంజ్ వన్.. గెట్ వన్' ఆఫర్.. పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అక్టోబర్ 23 నుంచి 28 వరకు మాత్రమే ఈ ఆఫర్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని మొబిక్విక్ ప్రకటించింది. యాప్ ద్వారా బంగారం కొనుగోలు చేసిన తర్వాత అది మొబీక్విక్ గోల్డ్ అకౌంట్‌కు వచ్చి యాడ్ అవుతుంది. అలాగే మొబిక్విక్ వాలెట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇలా కొనుగోలు చేసిన డిజిటల్ బంగారాన్ని మళ్లీ ఫిజికల్ గోల్డ్ రూపంలోకి మార్చుకోవచ్చు. అలాగే బంగారాన్ని కొనుగోలుదారులు తమ ఇంటికి కూడా డెలివరీ చేయించుకోవచ్చు. ఆన్లైన్ కొనుగోళ్లు మాదిరిగానే సమయంలో మాదిరిగానే తమ డెలివరీని ట్రాక్ చేయవచ్చు. ఈ ఆఫర్‌పై మొబీక్విక్ సహ వ్యవస్థాపకుడు ఉపసానా టాకు మాట్లాడుతూ బంగారంపై భారతీయులకు ఎప్పుడూ మక్కువ ఉంటుంది, ముఖ్యంగా శుభ సందర్భాలలో, సంస్కృతి, సాంప్రదాయానికి తోడు సంక్షోభ సమయాల్లో ఆర్థిక సాయంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బంగారం కొనుగోళ్లపై ఎక్కువ మొగ్గు చూపుతారు. ఈనేపథ్యంలోనే గత ఏడాది ప్రారంభించిన డిజిటల్ గోల్డ్ సర్వీసులతో ఫెస్టివ్ సీజన్లో విశేష స్పందన లభించిందనీ, తాజా ఆఫర్లో కూడా దేశవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా నుంచి కస్టమర్లనుంచి అధిక స్పందన వస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. -
ఫండ్స్ వయా వ్యాలెట్స్!
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఒకప్పుడు కొన్ని రోజులు పట్టే కార్యక్రమం. కానీ, ఇప్పుడు క్షణాల్లోనే ఇన్వెస్ట్ చేసుకునేందుకు డిజిటల్ సాధనాలు ఉన్నాయి. అందులోనూ అరచేతిలోని స్మార్ట్‌ఫోన్ నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలు కల్పించే సంస్థలు ఎన్నో పుట్టుకొచ్చాయి. పేటీఎం, మొబిక్విక్, ఈటీమనీతోపాటు ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సైతం ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లను ప్రత్యేక యాప్ ద్వారా ఆఫర్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే చాలు... ఎప్పుడంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్, ఉపసంహరణలను ఎంతో సులభం. ఫండ్స్‌లో పెట్టుబడులకు ఈ సాధనాలు దోహదపడతాయని పలువురు భావిస్తున్నారు. అలాగే, కొత్తగా ఫండ్స్ వైపు అడుగులు వేసే వారు అవగాహన లేకుండా వ్యవహరిస్తే వీటితో నష్టాలూ ఉన్నాయంటున్నారు. మొబైల్ నుంచే చిటికెలో పెట్టుబడికి వీలు కల్పిస్తున్న ఈ యాప్స్ వల్ల లాభ, నష్టాలపై నిపుణుల అభిప్రాయాలను అందించే కథనమే ఇది. పేటీఎం, మొబిక్విక్, ఈటీమనీ వంటివి ఎటువంటి చార్జీల్లేకుండానే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. పేటీఎంను 30 కోట్లకు పైగా కస్టమర్లు ఉపయోగిస్తుంటే, మొబిక్విక్ను 10.7 కోట్ల మంది వినియోగిస్తున్నారు. అంటే ఈ రెండు మొబైల్ వ్యాలెట్ల యూజర్లు కలిపితే 40 కోట్లకు పైనే ఉన్నారు. వీరందరికీ తమ వ్యాలెట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉన్నట్టే. మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టుకునే అవగాహన ఈ మధ్య కాలంలోనే విస్తృతమైంది. ఇప్పుడు మొబైల్ యాప్స్ రాకతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మరింత పెరిగేందుకు దోహద పడనుంది. దీంతో ఇప్పటి వరకు నిదానంగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ విస్తరణ వేగాన్ని పుంజుకోనుంది. తమ మొబైల్ వ్యాలెట్ల నుంచే నచ్చిన మ్యూచువల్ ఫండ్ పథకం డైరెక్ట్ ప్లాన్‌లో రూ.100 నుంచీ పెట్టుబడి పెట్టుకునేందుకు అవకాశం ఉంది. పేటీఎం సంస్థ 2018 సెప్టెంబర్‌లో పేటీఎం మనీ యాప్‌ను తీసుకొచ్చింది. ఆరు నెలలు నిండకుండానే పేటీఎం మనీ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కోటి దాటినట్టు పేటీఎం ప్రకటించింది. పేటీఎం తొలుత వ్యాలెట్ల నుంచి కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. విక్రయించినప్పుడు ఆ మొత్తాన్ని యూజర్ బ్యాంకు ఖాతాకు జమ చేసేది. అయితే, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతాను ప్రైమరీ బ్యాంకు ఖాతాగా పేటీఎం మనీలో ఇచ్చుకునే అవకాశం కల్పించింది. దీంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఖాతా ద్వారా పెట్టుబడులు, విక్రయించినప్పుడు అదే ఖాతాకు జమ చేసేందుకు అవకాశం వచ్చింది. అలాగే ఇతర బ్యాంకు ఖాతాలను సైతం ప్రైమరీ ఖాతాగా సెట్ చేసుకోవచ్చు. అలాగే, యూజర్లు నమోదు చేసిన బ్యాంకు ఖాతాకు సంబంధించి యూపీఏ, నెట్ బ్యాంకింగ్, డెబిట్‌కార్డుల ద్వారానూ చెల్లింపులు చేయవచ్చు. ఇక మొబిక్విక్ 2018 అక్టోబర్‌లో క్లియర్ఫండ్స్ను కొనుగోలు చేయడం ద్వారా వెల్త్ మేనేజ్మెంట్ (సంపద నిర్వహణ) వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ కొనుగోలు తర్వాత తన యూజర్లకు నేరుగా మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకునే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈటీమనీ, కార్వీకి చెందిన కేఫిన్కార్ట్, జీరోదా కాయిన్ ఇలా ఎన్నో సంస్థలు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. పదుల సంఖ్యలో సంస్థలు రావడంతో కొత్త ఇన్వెస్టర్లను సొంతం చేసుకుని, వారితో తమ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయించేందుకు ఇవి ఉచిత సేవలతోపాటు ప్రచారం కోసం నిధులను ఖర్చు చేస్తున్నాయి. సులభంగా ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయాలు బాగానే ఉన్నాయి... కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అంటే రిస్క్‌తో కూడుకున్నవే. ముఖ్యంగా ఈక్విటీ పథకాల్లో రిస్క్ అధికంగా ఉంటుంది. డెట్ పథకాల్లో రిస్క్ తక్కువ. మరి ఎంచుకునే పథకాలు తమ రిస్క్ ప్రొఫైల్‌కు సరిపోయేవేనా?, తాము ఆశించిన మేర పెట్టుబడులను ఇచ్చేవేనా? అన్న అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెడుతున్నారా? అన్న సందేహం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. వరమే... సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా పెట్టుబడికి వీలు కల్పించే నూతన విధానాలు ఏవైనా సరే... ఇన్వెస్టర్లకు మరింత సులభతరం లేదా లాభదాయకం ఉంటే అది నిజంగానే మంచి ఆలోచనే అవుతుంది. దేశంలో మిలీనియల్స్‌కు వ్యాలెట్లు ఎంతో అనకూలమైనవిగా రుజువైంది. చిన్న వయసులోనే పెట్టుబడుల అలవాటును నేర్పించి, మిలీనియల్స్ మార్కెట్‌ను చేరుకునే మార్గం కోసం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఇంత కాలం ఎదురు చూస్తోంది. వ్యాలెట్ల ద్వారా పెట్టుబడులకు వీలు కల్పించడం తదుపరి తరం ఇన్వెస్టర్లకు చేరువగా మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వెళ్లడమే. యువ ఇన్వెస్టర్లకు ఇది చిన్న వయసులోనే పెట్టుబడులు ఆరంభించేందుకు సౌకర్యంగా ఉంటుంది. అయితే, ఇన్వెస్టర్లు ముందుగా పెట్టుబడుల ప్రక్రియ, సంబంధిత సాధనాల గురించి పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇన్వెస్టర్లకు అసలైన ప్రయోజనాలు లభిస్తాయి. – శ్రీకాంత్ మీనాక్షి, ఫండ్స్ ఇండియా సహ వ్యవస్థాపకులు నిపుణుల సలహాలతో చేస్తే లాభమే.. మొబైల్ ఫోన్లకు అతుక్కునిపోయే మిలీనియల్స్, ఓలా, స్విగ్గీ, బుక్‌మైషో తదితర వాటిని వినియోగించే వారు... మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు మొబైల్ వ్యాలెట్లను వినియోగిస్తున్నారు. అధిక రాబడులు లేదా పెట్టుబడులకు సౌకర్యంగా ఉందని వ్యాలెట్ల ద్వారా చేస్తున్నారు. తప్పుడు సలహాలు, బ్యాంకులు, ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్ల సరిపడని సూచనలతో గతంలో చేతులు కాల్చుకున్న రిటైల్ ఇన్వెస్టర్లు కూడా... పారదర్శకత ఉందని, స్వీయ నియంత్రణ ఉంటుందని చెప్పి కొనుగోలు చేస్తుండొచ్చు. మొబైల్ వ్యాలెట్ల ద్వారా అయితే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వేగంగా రిడీమ్ చేసుకోవచ్చు. లేదా అస్థిర మార్కెట్లలో అవగాహన లేమితో సిప్‌లను ఆపివేయవచ్చు. కేవలం వ్యయాలు, సౌకర్యం అని కాకుండా, మొబైల్ వ్యాలెట్ల పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల అనుభవమే ఈ విధానం విజయవంతం అవుతుందా, లేదా అన్నది నిర్ణయిస్తుంది. అయితే, ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక సలహాదారు సూచనలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో సలహాలు తీసుకుని ఆ తర్వాతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. – సాధిక్ నీల్గుండ్, నెట్వర్క్ ఎఫ్పీ వ్యవస్థాపకులు అనుకూలమే... 130 కోట్ల దేశ జనాభాకు సుమారు నాలుగు కోట్ల మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు మాత్రమే ఉన్నాయి. వీటిల్లో ఒక ఇన్వెస్టర్‌కు ఉన్న ఒకటికి మించిన ఫోలియోలను తీసివేసి చూస్తే ఇందులో సగం తగ్గిపోతాయి. సంప్రదాయకంగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు బ్యాంకు ఖాతాల నుంచే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. వ్యాలెట్ల కారణంగా చెల్లింపుల పరిశ్రమలో చోటు చేసుకున్న విస్తరణను గమనించే సెబీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను వ్యాలెట్ల ద్వారా అనుమతించింది. అయితే, వీటి వల్ల ఏ మేరకు ప్రయోజనాలు కలుగుతాయన్నది చూడాల్సి ఉంది. 2017 మే 8 నాటి సెబీ ఉత్తర్వుల ప్రకారం... యూజర్లు మొబైల్ వ్యాలెట్లలో లోడ్ చేసుకున్న డబ్బులను మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వినియోగించుకోవచ్చు. దీంతో ఈ వ్యాలెట్లు వినియోగానికి సౌకర్యంగా ఉండడమే కాదు, మార్కెట్ విస్తరణకు ఎంతో దోహదం చేస్తాయి. నూతన తరం డిజిటల్ సాధనాల యూజర్లు పొదుపు చేసుకునేందుకు, నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మెరుగైన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే, నియంత్రణలు సరళీకరించినప్పుడే అది సాధ్యపడుతుంది. వ్యాలెట్లకు లోడ్ చేసుకున్న డబ్బులకు మూలం ఏంటన్నది గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటు రూపంలో సవాలు ఒకటి ఉంది. ఏ వ్యాలెట్ కంపెనీ కూడా యూజర్ల డబ్బుల సోర్స్‌ను (అది సంబంధిత యూజర్ బ్యాంకు ఖాతా నుంచే జమ అవుతుందా? లేదా? అన్నది) గుర్తించే వ్యవస్థను కలిగి లేదు. – సమీత్ సిక్కా, ఎస్క్యూఆర్ఆర్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ యాప్ అనుకూలం కాదు... మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు మొబైల్ వ్యాలెట్లను సూచించడం తగదు. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఎన్నో మార్పులు, పునర్వ్యవస్థీకరణకు లోనయ్యాయి. అవగాహన ఉన్న ఇన్వెస్టర్లకు సైతం అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) చేసిన మార్పులను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. కనుక కొత్త ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం, లక్ష్యాలకు సరిపోయే సరైన పథకాన్ని మొబైల్ వ్యాలెట్ల ద్వారా ఎంచుకోవడం ఓ సవాలే అవుతుంది. సినిమా టికెట్లు లేదా ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునేందుకు, యుటిలిటీ బిల్లుల చెల్లింపునకు మొబైల్ వ్యాలెట్ల వినియోగం వేగవంతం అయింది. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు మొబైల్ వ్యాలెట్ల వినియోగం సున్నితమైన విషయం. మొబైల్ వ్యాలెట్ల ద్వారా పెట్టుబడులు పెట్టే ప్రక్రియ, పోర్ట్‌ఫోలియో పర్యవేక్షణ విషయమై స్పష్టత లేదు. మరింత సులభతర, నిర్మాణాత్మక ప్రక్రియలతో ఉండే పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లు ఎంచుకోవడం నయం. పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షిస్తూ లాభ, నష్టాల గురించి తెలియజేసే ఆర్థిక నిపుణుల సాయం, మార్గదర్శకంతోనే ఇన్వెస్ట్ చేయాలన్నది మా సూచన. వ్యాలెట్లకు బదులు... నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ద్వారా లేదా ఆర్థిక సలహాదారులు సూచించిన పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. – కల్పేష్ ఆషర్, ఫుల్ సర్కిల్ ఫైనాన్షియల్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు -
అదృశ్యమవుతున్న ‘డిజిటల్ వాలెట్స్’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో ‘డిజిటల్ వాలెట్ల’ వ్యాప్తికి దాదాపు తెరపడినట్లేనా? పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ స్ఫూర్తితో డిజిటల్ వాలెట్లు పురోగమించడం మానేసి తిరోగమించడం ఆశ్చర్యకరం. 2006లో ఒకే ఒక్క డిజిటల్ వాలెట్ ఉండగా, 2017 నాటికి వాటి సంఖ్య 60కి చేరుకున్నాయి. వివిధ కారణాల వల్ల ఇప్పుడు వాటి సంఖ్య 49కి పడిపోయాయని భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలియజేసింది. డిజిటల్ మార్కెట్ వ్యవస్థ స్థిరీకరణకు చేరుకోకపోవడం, పోటీ తత్వం పెరగడం, లాభాలు లేక పోవడంతోపాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలు సానుకూలంగా లేకపోవడమే ఈ మార్కెట్ పతనానికి కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు మూసుకుపోగా పెద్ద కంపెనీలు మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయని అ వర్గాలు అంటున్నాయి. తొలి డిజిటల్ వాలెట్ ‘వాలెట్ 365. కామ్’ ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ గ్రూపు ‘ఎస్ బ్యాంక్’తో కలిసి ఈ వాలెట్‌ను 2006లో తీసుకొచ్చింది. ఆ తర్వాత పలు బ్యాంకులు, పలు బ్యాంకేతర ఆర్థిక సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. బిగ్‌బాస్కెట్, గోవర్స్ అనే రిటేల్ సంస్థలు, అమెజాన్ లాంటి ఆన్లైన్ సంస్థలు, ప్రముఖ మెస్సేజింగ్ సంస్థ ‘వాట్సాప్’లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. పేటీఎం, మోబిక్విక్ లాంటి డిజిటల్ వాలెట్ సంస్థలు మార్కెట్లో మంచి వాటాలను కూడా సంపాదించుకున్నాయి. స్మార్ట్ఫోన్ల విప్లవం ఈ మార్కెట్‌ను ముందుగా ప్రోత్సహించాయి. ఆ తర్వాత 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఈ మార్కెట్‌కు మంచి ఊపు వచ్చింది. 2015–2016 సంవత్సరంలోనే ఈ మార్కెట్ 154 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2021–2022 సంవత్సరానికి ఈ మార్కెట్ దేశంలో 30 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఈ వాలెట్ పరిశ్రమ ఆశించింది. పతనం ప్రారంభం ‘చెల్లింపులేవో పెద్ద మొత్తాల్లో జరపాల్సి రావడం, వ్యాపారమేమో చాలా తక్కువగా ఉండడం వల్ల చిన్న కంపెనీలు నిలదొక్కుకోలేక మూతపడ్డాయి. పెద్ద కంపెనీలు ఇప్పటికీ క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి’ అని మోబిక్విక్ సహ వ్యవస్థాపకులు ఉపాసన తెలిపారు. ‘విస్తత స్థాయి కస్టమర్ నెట్వర్క్ లేకపోయినట్లయితే డబ్బులను తగలేసుకోవడం తప్ప, స్థిరత్వం ఎలా సాధించగలం’ అని మొబైల్ వాలెట్ ‘టీఎండబ్లూ’ వ్యవస్థాపకుడు వినయ్ కలాంత్రి చెప్పారు. పెద్ద కంపెనీలకు లాభాలు లేకపోవడంతో చిన్న కంపెనీల నెట్‌వర్క్‌లను కొనుక్కోవాల్సి వస్తోందని, అందుకనే ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘ట్రూపే’ను తాము కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కారణంగానే గత రెండేళ్లలో పలు పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను కొనుగోలు చేశాయి. మొబైల్ ‘ఫర్మ్ ఫ్రీచార్జ్’ని ఆక్సిస్ బ్యాంక్, ఆన్లైన్ పేమెంట్ సంస్థ ‘ఎమ్వాంటేజ్’ను అమెజాన్, ‘ఫోన్‌పే’ను ఫ్లిప్‌కార్ట్ కంపెనీ, ఆఫ్‌లైన్ స్టోర్ల మొబైల్ వాలెట్ ‘మొమో’ను షాప్‌క్లూస్ కంపెనీలు కొనేశాయి. ఆర్బీఐ కొత్త రూల్ వల్ల కూడా డిజిటల్ వాలెట్ కంపెనీలు ఎల్లప్పుడు రెండు కోట్ల రూపాయల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాలనే నిబంధనను ఐదు కోట్ల రూపాయలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ పెంచడం, మూడేళ్ల మొత్తానికి నెట్‌వర్త్ 15 కోట్ల రూపాయలు ఉండాలనే నిబంధన తేవడం వల్ల చాలా కంపెనీలు వెనకడుగు వేశాయి. ఇప్పటికే లైసెన్స్‌లు తీసుకున్న కంపెనీలు కూడా తమ డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించలేదు. అక్రమ చెల్లింపులు జరుగకుండా ‘నో యువర్ కస్టమర్’ కింద స్పష్టమైన వెరిఫికేషన్ ఉండాలనడం, అందుకోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవడం కూడా డిజిటల్ వాలెట్ కంపెనీలను నిరుత్సాహ పరిచాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వల్ల కూడా సరకుల మార్పిడీ లేదా సర్వీసుల కోసం కార్పొరేట్ కంపెనీలు లేదా వ్యక్తులు ఆధార్ కార్డుల సమాచారాన్ని కోరరాదని సుప్రీం కోర్టు గత సెప్టెంబర్ నెలలో ఉత్తర్వులు జారీ చేయడం కూడా ఈ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ‘నో యువర్ కస్టమర్’ ప్రక్రియ క్లిష్టమైనప్పటికీ ఆధార్ కార్డుల ద్వారా అందులో ఉండే బయోమెట్రిక్ ముద్రలను తీసుకొని వినియోగదారులను సులభంగానే గుర్తుపట్టే వాళ్లమని, ఆధార్ కార్డు డేటాను ఉపయోగించ కూడదని సుప్రీం కోర్టు ఉత్తర్వులతో పెద్ద కంపెనీలకు కూడా ‘నో యువర్ కస్టమర్’ ప్రక్రియను అమలు చేయడం కష్టమైపోయిందని మరో వాలెట్ కంపెనీ ‘పేవరల్డ్’ కంపెనీ సీఈవో ప్రవీణ్ దాదాభాయ్ చెప్పారు. -
మొబీక్విక్‌తోనూ పసిడి కొనుగోళ్లు!
న్యూఢిల్లీ: ఇక వినియోగదారులు ఈ–వాలెట్ సంస్థ మొబీక్విక్ ద్వారా కూడా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. పేటీఎం తరువాత ఈ తరహా అవకాశాన్ని మొబీక్విక్ కల్పిస్తోంది. తన ప్లాట్‌ఫామ్ ద్వారా 2018–19 ఆర్థిక సంవత్సరంలో టన్ను పసిడి అమ్మకాలు లక్ష్యంగా మొబీక్విట్ తాజా అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేఫ్‌గోల్డ్‌తో మొబీక్విట్ జట్లుకట్టింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు పసిడి కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. ఫిజికల్ డెలివరీ కూడా తీసుకోవచ్చు. ఈ తాజా చొరవలో భాగంగా మొబీక్విక్ తన యాప్‌పై ‘గోల్డ్’ పేరుతో ప్రత్యేక కేటగిరీనీ ఏర్పాటు చేసింది. ‘‘అన్ని రకాల ఆర్థిక సేవలూ అందించాలన్నది మా లక్ష్యం. ఇందులో భాగంగానే తాజా చొరవను సంస్థ ప్రారంభించింది. రుణాలు, వెల్త్ మేనేజ్మెంట్ తర్వాత సంస్థ ప్రారంభించిన తాజా సేవలు ఇవి’’ అని మొబీక్విక్ తెలిపింది. రూపాయి విలువ నుంచీ... రూపాయి విలువ నుంచీ లేదా గ్రాముల్లో 99.5 శాతం ప్యూరిటీ, 24 క్యారెట్ గోల్డ్ కొనుగోలుకు అవకాశం ఉందని తన ప్రకటనలో పేర్కొంది. అలాగే వినియోగదారులు అప్పటికి కొద్ది వారాల నుంచీ పసిడి ధరల ధోరణి ఎలా ఉందో తెలుసుకోడానికీ వీలు కలుగుతుందని మొబీక్విక్ సహ వ్యవస్థాపకులు, డైరెక్టర్ ఉపాసనా తాకు పేర్కొన్నారు. ఇది తమకు కీలక వాణిజ్య విభాగంగా మారుతుందన్న అభిప్రాయాన్నీ ఆమె ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఎంఎంటీసీ–పీఏఎంపీ భాగస్వామ్యంతో గత ఏడాది తమ ప్లాట్‌ఫామ్ ద్వారా అలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్ ప్రధాన వాటాలున్న పేటీఎం గత ఏడాది పసిడి విక్రయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
భలే ఆఫర్ : పెట్రోల్‌పై 50 శాతం డిస్కౌంట్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులకు వాత పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ధరలు పెరగడమే తప్ప తగ్గడం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వాహనదారులకు డిజిటల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ మొబిక్విక్, పెట్రోల్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేడు పెట్రోల్‌పై 50 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. మొబిక్విక్ ఈ ఫ్లాష్ ఆఫర్ కేవలం రాత్రి 9 గంటల వరకు వర్తించనుంది. పెట్రోల్ ధరలపై వన్-డే ఆఫర్ కింద, మొబిక్విక్ యూజర్లు, 200 రూపాయలు లేదా ఆపై ఎక్కువ మొత్తాలతో లావాదేవీలు జరిపితే 100 రూపాయల సూపర్‌క్యాష్‌ను వాడుకోవచ్చు. 100 రూపాయల లావాదేవీకి కూడా ఈ సూపర్‌క్యాష్‌ను వాడుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం మొబిక్విక్‌తో భాగస్వామ్యమైన పెట్రోల్ పంపులకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌ను పొందేందుకు యూజర్లు, ఫ్యూయల్ స్టేషన్ వద్ద క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేయాలి. ఈ ఆఫర్ వర్తించేందుకు కనీస లావాదేవీ రూ.100గా ఉండాలి. కాగా, ఆగస్టు 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. అత్యధిక క్రూడాయిల్ ధరలు, రూపాయి పతనం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. రూపాయి విలువ పతనంతో, క్రూడాయిల్ ఖరీదైనదిగా ఉంది. నేడు ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేపట్టలేదు. దీంతో నేడు లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.82.16గా, ముంబైలో రూ.89.54గా, చెన్నైలో రూ.85.41గా, కోల్‌కతాలో రూ.84.01గా ఉన్నాయి. పేటీఎం కూడా ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో రూ.7500 క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌కు కనీస లావాదేవి రూ.50గా ఉండాలి. 2019 ఆగస్టు 1 వరకు పేటీఎం ఆఫర్ వాలిడ్‌లో ఉండనుంది. -
ట్రైన్ టిక్కెట్లపై ఐఆర్సీటీసీ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : ట్రైన్ జర్నీ చేయాలని ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఇదే సరియైన సమయమట. తన అధికారిక వెబ్సైట్ www.irctc.co.in ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి అమేజింగ్ డిస్కౌంట్లను దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం లిమిటెడ్ ఆఫర్(ఐఆర్సీటీసీ) చేస్తుంది. పేటీఎం, మొబిక్విక్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారికే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఐఆర్సీటీసీ తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. చివరి నిమిషంలో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా.. అడ్వాన్స్‌గా బుక్ చేసుకునేలా డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది. మొబిక్విక్ ద్వారా రైల్వే టిక్కెట్ బుకింగ్ పేమెంట్లు జరిపే వారికి 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. తన ప్లాట్‌ఫామ్‌పై టిక్కెట్ బుకింగ్స్ జరిపే వారికి 100 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనున్నట్టు పేటీఎం తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే కూడా 100 రూపాయల క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. డిస్కౌంట్ ఆఫర్ పొందడమెలా... ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ www.irctc.co.inకు వెళ్లాలి. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. మీ ప్రయాణ వివరాలు నమోదు చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి, పేమెంట్ ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. పేమెంట్ మోడ్‌లో, ఈ-వాలెట్ ఆప్షన్లను ఎంచుకోవాలి. వాలెంట్ కేటగిరీలో పేటీఎం, ఫ్రీఛార్జ్, మొబిక్విక్ ఎంచుకోవాలి. వీటికి ఐఆర్సీటీసీ ఆఫర్ వర్తిస్తుంది. -
మొబిక్విక్లో ఓలా బుకింగ్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ వాలెట్ యాప్ ‘మొబిక్విక్’ను ఉపయోగిస్తున్న యూజర్లకిది శుభవార్తే. ఇప్పుడు వీళ్లు మొబిక్విక్ యాప్ నుంచే నేరుగా ఓలా రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్ నుంచే ఓలా రైడ్‌కు పేమెంట్ చెల్లించొచ్చు. ఈ సేవల కోసం మొబిక్విక్, ఓలా ఒప్పందం చేసుకున్నాయి. మొబిక్విక్ తన కస్టమర్లకు లాంచ్ ఆఫర్లో భాగంగా తొలి ఐదు రైడ్స్‌పై రూ.50 సూపర్ క్యాష్ అందిస్తోంది. అలాగే యూజర్లు 10 శాతం సూపర్ క్యాష్ ఉపయోగించుకొని ప్రతి ఓలా బుకింగ్‌పై రూ.100 వరకు డిస్కౌంట్ పొందొచ్చని మొబిక్విక్ తెలిపింది. ఇక ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయాల్లో వాలెట్ ద్వారా ఓలా రైడ్ బుక్ చేసుకునే 1000 మంది యూజర్లకు వంద శాతం క్యాష్‌బ్యాక్ అవకాశం అందిస్తున్నామని పేర్కొంది. -
మీ పేటీఎం, మొబిక్విక్ వాలెట్లు పనిచేయవు..
బెంగళూరు : మీ మొబైల్ వాలెట్‌లోకి కొత్తగా ఫండ్స్‌ను పంపించాలనుకుంటున్నారా? అయితే నేటి నుంచి అది సాధ్యపడదట. ఫుల్ కేవైసీ(నో యువర్ కస్టమర్) విధివిధానాలను పూర్తి చేసిన కస్టమర్లకు మాత్రమే ఇది సాధ్యపడుతుందట. ఒకవేళ కేవైసీ వివరాలను సమర్పించిన కస్టమర్లు ఇక తమ వాలెట్లలోకి కొత్తగా ఫండ్స్‌ను పంపించుకోవడం జరుగదు. ఇది డిజిటల్ పేమెంట్స్ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బగా వెల్లడవుతోంది. నేటి నుంచి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విధించిన కేవైసీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో వాలెట్ యూజర్లు తమ లావాదేవీలపై ఆర్బీఐ విధించే పలు నిబంధనలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఫిబ్రవరి 28 వరకు వాలెట్ యూజర్ల నుంచి కేవైసీ వివరాలను పొందాలని డిజిటల్ వాలెట్ కంపెనీలకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఈ గడువును మరింత పొడిగించాలని డిజిటల్ వాలెట్ కంపెనీలు కోరాయి. కానీ కంపెనీల ప్రతిపాదనను ఆర్బీఐ తోసిపుచ్చింది. మరోసారి తుది గడువును పొడిగించేది లేదంటూ తేల్చిచెప్పింది. ప్రస్తుతం నిన్నటితో ఆ గడువు ముగియడంతో, కేవైసీ వివరాలను సమర్పించని కస్టమర్లను వాలెట్ ప్రొవైడర్లు కోల్పోతున్నారు. ఫుల్ కేవైసీ వివరాలు లేకుండా 10 వేల రూపాయల వరకు ఆపరేట్ చేసుకునేలా డిజిటల్ వాలెట్లకు అనుమతి ఇవ్వాలంటూ ఇండస్ట్రి బాడీ పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రిజర్వు బ్యాంకును కోరుతోంది. కానీ ప్రతి పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కేవైసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిదేనంటూ ఆర్బీఐ స్పష్టం చేసింది. దీన్ని బ్యాంకింగ్‌ఎకో సిస్టమ్‌కు కూడా విస్తరించనున్నట్టు పేర్కొంది. ఈ నిబంధనలతో వచ్చే కొన్ని నెలల్లో కస్టమర్ల కూడా భారీగా ప్రభావితం కానున్నారని ది మొబైల్ వాలెట్ ఫౌండర్ వినయ్ కలాంత్రి అన్నారు. కానీ దీర్ఘకాలీన ఇది మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పారు. క్వాలిటీ కస్టమర్లను వాలెట్లు పొందుతాయన్నారు. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం, ప్రభుత్వం ఆమోదించిన డాక్యుమెంట్లను వాలెట్ ప్రొవైడర్లకు సమర్పించిన కస్టమర్లు, తాజాగా ఫండ్స్‌ను తమ వాలెట్లలోకి వేసుకోవడం కుదరదు. అంతేకాక ఇతర వాలెట్లకు ఫండ్స్ ట్రాన్సఫర్ చేయలేరు. అయితే వాలెట్లో ఉన్న ఫండ్స్‌ను కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. వాలెట్ నగదును కోల్పోకుండా.. వాటిని బ్యాంకులకు ట్రాన్సఫర్ చేసుకునేలా కూడా ఆర్బీఐ వీలు కల్పించింది. ప్రీపెయిడ్ వాలెట్ సర్వీసులను వినియోగిస్తున్న 90 శాతం కస్టమర్లు ఇప్పటి వరకు కేవైసీ వివరాలను వాలెట్ ప్రొవైడర్లకు సమర్పించలేదు. దీంతో నేటి నుంచి వీరిపై వాలెట్ల వాడక నిషేధం పడబోతుంది. ఈ చర్యలతో వాలెట్ ప్రొవైడర్లు భారీగా కస్టమర్లు కోల్పోనున్నారు. -
జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి మొబైల్ వాలెట్
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మొబైల్ వాలెట్ మొబిక్విక్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో తమ ప్లాట్‌ఫామ్‌పై జియోఫోన్‌ను విక్రయించనున్నట్టు మొబిక్విక్ ప్రకటించింది. '' జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి మొబైల్ వాలెట్ మాదే కావడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. నాలుగు సులభతరమైన స్టెప్స్‌తో యూజర్లు జియోఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పలు గ్రేట్ ప్రయోజనాలను అందించనున్నాం'' అని మొబిక్విక్ బిజినెస్ హెడ్ బిక్రమ్ బిర్ సింగ్ తెలిపారు. దీంతో జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి ప్లాట్‌ఫామ్ తమదేనని మొబిక్విక్ పేర్కొంది. ఫోన్ నెంబర్ల ద్వారా కూడా జియోఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఎలా బుక్ చేసుకోవాలి... మొబిక్విక్ కస్టమర్లు హోమ్ పేజీలో రీఛార్జ్ ఐకాన్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం ''రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్'' కేటగిరీలో ఉన్న ఫోన్ బుకింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు జియోఫోన్‌ను ఎంపిక చేసుకోని, అవసరమైన వివరాలు నమోదుచేయాలి. గతేడాది జూలైలో రిలయన్స్ ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 500 మిలియన్ మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు డిజిటల్ లైఫ్ ఆఫర్ చేయడానికి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. తెలుగుతోపాటు 22 ప్రాంతీయ భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తోంది. ఇందులో 4 జీబీ ఇంటర్నల్ మెమరీ (128జిబిలకు పెంచుకోవచ్చు) ఉంది. 2.4 అంగుళాల స్ర్కీన్, 512 ఎంబీ ర్యామ్, వెనుక భాగంలో 2 మెగాపిక్సెల్ కెమెరా, ముందు వీజీఏ కెమెరా, 2000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ముందు కెమెరా ఉండటం వల్ల వీడియోకాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ మాప్స్, యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్ వంటి అప్లికేషన్లు కూడా ఉన్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. జియో అందిస్తున్న యాప్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. -
మొబిక్విక్లో బజాజ్ ఫైనాన్స్‌కి 13 శాతం వాటా
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ కంపెనీ మొబిక్విక్లో 12.60 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది. నిజానికి రూ. 225 కోట్లతో 10.83 శాతం వాటా కొనుగోలు చేసేందుకు గతేడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. తాజాగా వాటా పరిమాణం కొంత పెరిగిందని, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల కన్వర్షన్ ధర మారటమే ఇందుకు కారణమని బజాజ్ ఫైనాన్స్ తెలియజేసింది. ఇందుకోసం గతంలో అంగీకరించిన మొత్తమే తప్ప .. కొత్తగా మరింత పెట్టుబడేమీ పెట్టలేదని కంపెనీ తెలిపింది. ఒప్పందం ప్రకారం మొబిక్విక్‌కి చెందిన 10 ఈక్విటీ షేర్లను, 2,71,050 కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను (సీసీసీపీఎస్) బజాజ్ ఫైనాన్స్ కొనుగోలు చేయనుంది. బీఎస్ఈలో మంగళవారం బజాజ్ ఫైనాన్స్ షేరు 3 శాతం క్షీణించి రూ.1,688 వద్ద క్లోజయ్యింది. -
ఆయిల్–గ్యాస్ రెగ్యులేటర్ చీఫ్‌గా దినేశ్ కె సరాఫ్
న్యూఢిల్లీ: పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటర్ బోర్డు (పీఎన్జీఆర్బీ) కొత్త చైర్మన్‌గా దినేశ్ కె సరాఫ్ నియమితులయ్యారు. ఈయన ఓఎన్జీసీ మాజీ సీఎండీ. 2015 ఆగస్ట్‌లో ఎస్.కృష్ణన్ పదవీ విరమణతో పీఎన్జీఆర్బీ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు దినేశ్ సరాఫ్‌ను కొత్త చీఫ్‌గా నియమించింది. సైకిల్ షేరింగ్ సర్వీసులొస్తున్నాయ్! న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ ‘మొబిక్విక్’ మాజీ మార్కెటింగ్ హెడ్ ఆకాశ్ గుప్తా... దేశంలో బైసైకిల్ షేరింగ్ సర్వీస్‌లను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక వారంలోగా ‘మాబ్సీ’ యాప్‌ను ఆవిష్కరించనున్నారు. ‘మెట్రో, బస్సు దిగిన తర్వాత డ్రాప్ పాయింట్ల వద్ద పార్క్ చేసిన బైసైకిల్స్ ఉంటాయి. దానిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను యాప్ సాయంతో స్కాన్ చేస్తే అది అన్‌లాక్ అవుతుంది. తీసుకొని గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. తర్వాత పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాల్లో పార్క్ చేసి లాక్ చేయాలి. అప్పుడు రైడ్ పూర్తవుతుంది’ అని గుప్తా వివరించారు. ‘సబ్స్క్రిప్షన్ పద్ధతిలో సేవలు అందుబాటులో ఉంటాయి. నెలకు రూ.99లతో 60 రైడ్లు పొందొచ్చు. సెక్యూరిటీ డిపాజిట్ రూ.999. ఇది సాధారణ ప్రజలకు. ఇక విద్యార్ధుల విషయానికి వస్తే రోజుకు 4 రైడ్లు ఉంటాయి. నెల ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ మామూలే. అదే రైడ్ టైమ్ గంట దాటితే అదనపు చార్జీలుంటాయి’ అని వివరించారు. -
మొబీక్విక్‌కు భారీ టోకరా
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ కంపెనీ మొబీక్విక్ భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో చోటు చేసుకున్న అక్రమాల కారణంగా మోబిక్విక్ గత మూడున్నర నెలల కాలంలో మొత్తం రు. 19.61 కోట్లు నష్టపోయింది. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా అక్రమాలు చోటుచేసుకున్నాయని కంపెనీ భావిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై గుర్గావ్లో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్నికల్ తప్పిదాన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది వ్యక్తులు తమ డబ్బులను వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారని మొబీక్విక్ న్యాయవాది లోకేశ్ రాజపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ ఖాతాదారుల విలువైన సమాచారం, డబ్బు సురక్షితంగా ఉందని మొబీక్విక్ పేర్కొంది. రికార్డులను, ఖాతాలను స్కాన్ చేసిన తర్వాత భారీ మోసం జరగిందని కనుగొన్నప్పటికీ ..డబ్బు ఎలా పోయిందో మాత్రం గుర్తించలేకపోయింది. రూ. 19 కోట్ల మేరకు మోసం చేశారన్న ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని గుర్గావ్ సైబర్ క్రైమ్ సెల్ చైర్మన్ ఆనంద్ యాదవ్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందనీ, అంతర్గత సిబ్బంది ప్రమేయంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కాగా మొబైల్ రీచార్జ్ తోపాటు, బిల్ చెల్లింపులు, షాపింగ్, వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ లాంటి వాటికోసం మొబీక్విక్ వాలెట్ ఉపయోగించవచ్చు.దేశం ఒకవైపు డిజిటల్ ఎకానమీవైపు పరుగులు పెడుతోంటే.. ఆన్లైన్ మోసాలు, డిజిటల్ లావాదేవీ కంపెనీల డేటా హ్యాకింగ్ వినియోగదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. -
ఫేస్బుక్, మొబిక్విక్‌లతో బీఎస్ఎన్ఎల్ జట్టు
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ తాజాగా ఫేస్బుక్, మొబిక్విక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్.. ఇంటర్నెట్ను ఎక్కువ మందికి చేరువ చేయాలని, తన వాల్యు యాడెడ్ సర్వీసులకు మరింత ప్రాచుర్యం కల్పించాలని భావిస్తోంది. వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భాగస్వామ్యాలు కుదరడం గమనార్హం. ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న ఎంవోయూలో భాగంగా బీఎస్ఎన్ఎల్.. ఫేస్బుక్ ఎక్స్‌ప్రెస్ వై–ఫై ప్రోగ్రామ్‌కు కనెక్టివిటీ సాయం అందించనుంది. కాగా ఫేస్బుక్ తన ఎక్స్‌ప్రెస్ వై–ఫై ప్రోగ్రామ్ కింద టెలికం ఆపరేటర్ల సాయంతో పబ్లిక్ హాట్‌స్పాట్స్ ద్వారా గ్రామీణ ప్రాంత యూజర్లకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనుంది. మరొక ఒప్పందంలో భాగంగా బీఎస్ఎన్ఎల్.. బీఎస్ఎన్ఎల్ మొబైల్ వాలెట్ ఏర్పాటుకు సంబంధించి డిజిటల్ పేమెంట్స్ సంస్థ మొబిక్విక్‌తో కలిసి పనిచేయనుంది. ఇది కేవలం భారత్‌లోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. మొబిక్విక్ అలాగే బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను తన యాప్, వెబ్‌సైట్స్ ద్వారా విక్రయించనుంది. -
మోబిక్విక్ రూ.300 కోట్లు పెట్టుబడులు
సూపర్ క్యాష్‌పేరుతో రివార్డ్ పాయింట్లు న్యూఢిల్లీ: డిజిటల్ వాలెట్ కంపెనీ మోబిక్విక్ ఈ ఏడాది రూ.300 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. లాయల్టీ పాయింట్లు అందించడం, వినియోగదారులు, వర్తకుల సంఖ్యను పెంచుకోవడం కోసం ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నామని మోబిక్విక్ వైస్ ప్రెసిడెంట్ (గ్రోత్) డామన్ సోనీ చెప్పారు. తమ వద్దనున్న నగదు నిల్వలు, తాజా రుణాలతో ఈ నిధులను సమీకరిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది భారత్‌లో తమ వినియోగదారుల సంఖ్య 5.5 కోట్ల నుంచి 15 కోట్లకు, వర్తకుల సంఖ్య 14 లక్షల నుంచి 50 లక్షలకు పెరగగలదని అంచనాలున్నాయని వివరించారు. ఈ ఏడాది మరిన్ని ఆర్థిక సేవలను అందుబాటులోకి తేనున్నామని పేర్కొన్నారు. తాజాగా సూపర్‌క్యాష్ పేరుతో రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తున్నామని వివరించారు. మొబిక్విక్ వాలెట్‌ను ఉపయోగిస్తే వినియోగదారులకు డిస్కౌంట్లు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. వివిధ నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఈ ఏడాది మార్చికల్లా 13 నగరాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులున్నారని, కొన్ని నెలల్లో ఈ సంఖ్యను 1,400కు పెంచుకోనున్నామని పేర్కొన్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా మోబిక్విక్, పేటీఎమ్‌వంటి డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫార్మ్‌ల వినియోగదారుల సంఖ్య జోరుగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత 13 లక్షల మంది వ్యాపారస్తులు, 1.5 కోట్ల మంది వినియోగదారులు పెరిగారని సోనీ వివరించారు. అలీబాబా అండతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పేటీఎమ్‌తో ఈ సంస్థ పోటీ పడుతోంది. ఈ కంపెనీ ఇప్పటివరకూ 8.5 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. మీడియా టెక్, సెక్వోయా క్యాపిటల్, జీఎంఓ వెంచర్ పార్ట్నర్స్, ట్రీలైన్ ఏషియా, సౌత్ ఆఫ్రికా నెట్‌వన్ సంస్థల నుంచి పెట్టుబడులను పొందింది. -
టోల్ ప్లాజాల్లో మొబిక్విక్ ద్వారా చెల్లింపులు
ఎన్హెచ్ఏఐతో సంస్థ ఒప్పందం న్యూఢిల్లీ: మొబైల్ వ్యాలెట్ సంస్థ మొబిక్విక్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 391 టోల్ ప్లాజాల వద్ద తమ కస్టమర్లు మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా టోల్ రుసుములు చెల్లించవచ్చని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అతి త్వరలోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. నగదుకు కొరత నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు తమ కస్టమర్లు మొబైల్ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఎన్హెచ్ఏఐ నుంచి అనుమతి లభించినట్టు సంస్థ తెలిపింది. ‘‘టోల్ ప్లాజాల వద్ద మొబిక్విక్ ద్వారా రుసుము చెల్లించాలనుకునే వారు తమ ఫోన్లోని యాప్‌ను ఓపెన్ చేసి ప్లాజాలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. టోల్ ఆపరేటర్ చెప్పిన నగదును, వాహన నంబర్‌ను ఎంటర్ చేసి ‘పే’ బటన్‌ను ప్రెస్ చేస్తే లావాదేవీ పూర్తవుతుంది’’ అని సంస్థ తెలియజేసింది. మరోవైపు, వాహనాల రద్దీ నేపథ్యంలో డిసెంబర్ 2 వరకు టోల్ రుసుములు రద్దు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. -
వాలెట్ యూజర్లకు సూక్ష్మ రుణాలు
* రూ.500-2,500 రేంజ్లో * అందిస్తున్న మోబిక్విక్ న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ మోబిక్విక్ తన సేవలను మరింతగా విస్తరిస్తోంది. బ్యాలెన్స్ అయిపోయిన వాలెట్ యూజర్లకు తక్షణ సూక్ష్మ రుణాలను (రూ.500-2,500 రేంజ్లో)ఆఫర్ చేస్తోంది. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం జోరు పెంచడానికి ఈ రుణాలను ఆఫర్ చేస్తున్నామని మోబిక్విక్ తెలిపింది. ప్రయోగాత్మకంగా ఈ ఇన్స్టంట్ మైక్రోలోన్స్ను కొన్ని వారాల క్రితమే ప్రారంభించామని మోబిక్విక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఉపాసన తకు చెప్పారు. ఇప్పటికే 25వేల మంది యూజర్లకు ఈ రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ రుణాలు తీసుకున్నవాళ్ల చెల్లింపులు 97 శాతంగా ఉన్నాయని, ఈ కొత్త సర్వీస్ సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ సర్వీస్‌ను మరింతగా విస్తరించాలనుకుంటున్నామని వివరించారు. కన్సూమర్ లెండింగ్ మార్కెట్ ప్లేస్ క్యాష్‌కేర్ భాగస్వామ్యంతో ఈ సర్వీస్‌ను అందిస్తున్నామని వివరించారు. వచ్చే కొన్నినెలల్లో 2-3 లక్షల మంది యూజర్లకు ఈ రుణాలివ్వనున్నట్లు తెలిపారు.