
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ వాలెట్ యాప్ ‘మొబిక్విక్’ను ఉపయోగిస్తున్న యూజర్లకిది శుభవార్తే. ఇప్పుడు వీళ్లు మొబిక్విక్ యాప్ నుంచే నేరుగా ఓలా రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్ నుంచే ఓలా రైడ్‌కు పేమెంట్ చెల్లించొచ్చు. ఈ సేవల కోసం మొబిక్విక్, ఓలా ఒప్పందం చేసుకున్నాయి.
మొబిక్విక్ తన కస్టమర్లకు లాంచ్ ఆఫర్‌లో భాగంగా తొలి ఐదు రైడ్స్‌పై రూ.50 సూపర్ క్యాష్ అందిస్తోంది. అలాగే యూజర్లు 10 శాతం సూపర్ క్యాష్ ఉపయోగించుకొని ప్రతి ఓలా బుకింగ్‌పై రూ.100 వరకు డిస్కౌంట్ పొందొచ్చని మొబిక్విక్ తెలిపింది. ఇక ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయాల్లో వాలెట్ ద్వారా ఓలా రైడ్ బుక్ చేసుకునే 1000 మంది యూజర్లకు వంద శాతం క్యాష్‌బ్యాక్ అవకాశం అందిస్తున్నామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment