బ్యాంక్ అకౌంట్‌తో పని లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది ఫిన్ టెక్ సంస్థ మొబీక్విక్ (MobiKwik). తన ప్లాట్‌ఫారమ్‌లో 'పాకెట్ UPI' అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇది వినియోగదారులకు బడ్జెట్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌పై మెరుగైన నియంత్రణను కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తుందని ఫిన్‌టెక్ కంపెనీ పేర్కొంది.
పాకెట్ UPI వినియోగదారులు వారి బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే మొబీక్విక్ వ్యాలెట్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. తద్వారా వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు అదనపు ఎంపికతో వారి చేతుల్లో మరింత శక్తిని ఇస్తుందని వన్ మొబీక్విక్ లిమిటెడ్ (మొబీక్విక్) కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
పాకెట్ యూపీఐ యూజర్లు వారి బ్యాంక్ ఖాతా కాకుండా మొబీక్విక్ వాలెట్ నుంచి డబ్బులను బదిలీ చేయడం ద్వారా తప్పు లావాదేవీలు, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు బహిర్గతం పరిమితం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment