![MobiKwik joins Adani One for travel discounts - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/15/MOBIKWIK-ADANI-ONE.jpg.webp?itok=STZIgEXy)
న్యూఢిల్లీ: విమాన టిక్కెట్లు, సుంకాల రహిత ఉత్పత్తులపై ప్రత్యేక సేవలు అందించడానికి అదానీ గ్రూప్ ట్రావెల్ బుకింగ్ యాప్– అదానీ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ తెలిపింది. మొబిక్విక్ వాలెట్‌తో విమాన బుకింగ్‌లు, డ్యూటీ–ఫ్రీ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తామని కంపెనీ ప్రకటన పేర్కొంది. ‘‘అదానీ వన్ యాప్‌తో భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము.
సులభమైన చెల్లింపులు, ఇబ్బందులు లేని ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని ఈ భాగస్వామ్యం ద్వారా అందిస్తాము. ప్రమాణానికి సిద్ధమవుతున్నందున కస్టమర్‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సేవలు అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం’’ అని మొబిక్విక్ పేర్కొంది. ఆర్థిక పరిమితుల వల్ల ఎవరి ప్రణాళికలకు ఎప్పుడూ ఆటంకం కలిగించకుండా చూసుకోవడానికి తాము అంకితభావంతో ఉన్నామని మొబిక్విక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు.
మొబిక్విక్ వాలెట్‌తో చెల్లింపు చేసినప్పుడు అదానీ వన్‌లో విమాన బుకింగ్‌లపై రూ. 500 తగ్గింపు ఉంటుందని, అలాగే అదానీ వన్ ద్వారా డ్యూటీ–ఫ్రీ ప్రొడక్టులపై రూ. 250 ఫ్లాట్ తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘‘మా సూపర్ యాప్‌లో మోబిక్విక్ సులభతరమైన ఫైనాన్స్ సొల్యూషన్‌లను ఏకీకృతం చేస్తున్నందున మేము సంతోíÙస్తున్నాము. భారతదేశం అంతటా ట్రావెల్ బుకింగ్‌లు, గ్లోబల్ బ్రాండ్‌లను సరళమైన ధరలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించడమే మా సమిష్టి లక్ష్యం’’ అని అదానీ వన్ ప్రతినిధి మరో ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment