mobikvik
-
అదానీ వన్‌తో మొబిక్విక్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: విమాన టిక్కెట్లు, సుంకాల రహిత ఉత్పత్తులపై ప్రత్యేక సేవలు అందించడానికి అదానీ గ్రూప్ ట్రావెల్ బుకింగ్ యాప్– అదానీ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ తెలిపింది. మొబిక్విక్ వాలెట్‌తో విమాన బుకింగ్‌లు, డ్యూటీ–ఫ్రీ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తామని కంపెనీ ప్రకటన పేర్కొంది. ‘‘అదానీ వన్ యాప్‌తో భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము. సులభమైన చెల్లింపులు, ఇబ్బందులు లేని ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని ఈ భాగస్వామ్యం ద్వారా అందిస్తాము. ప్రమాణానికి సిద్ధమవుతున్నందున కస్టమర్‌కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సేవలు అందించడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం’’ అని మొబిక్విక్ పేర్కొంది. ఆర్థిక పరిమితుల వల్ల ఎవరి ప్రణాళికలకు ఎప్పుడూ ఆటంకం కలిగించకుండా చూసుకోవడానికి తాము అంకితభావంతో ఉన్నామని మొబిక్విక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ చెప్పారు. మొబిక్విక్ వాలెట్‌తో చెల్లింపు చేసినప్పుడు అదానీ వన్‌లో విమాన బుకింగ్‌లపై రూ. 500 తగ్గింపు ఉంటుందని, అలాగే అదానీ వన్ ద్వారా డ్యూటీ–ఫ్రీ ప్రొడక్టులపై రూ. 250 ఫ్లాట్ తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘‘మా సూపర్ యాప్‌లో మోబిక్విక్ సులభతరమైన ఫైనాన్స్ సొల్యూషన్లను ఏకీకృతం చేస్తున్నందున మేము సంతోíÙస్తున్నాము. భారతదేశం అంతటా ట్రావెల్ బుకింగ్‌లు, గ్లోబల్ బ్రాండ్లను సరళమైన ధరలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగించడమే మా సమిష్టి లక్ష్యం’’ అని అదానీ వన్ ప్రతినిధి మరో ప్రకటనలో తెలిపారు. -
ఫ్రీచార్జ్‌పై మొబిక్విక్ కన్ను
► విలీనంపై ప్రాథమిక స్థాయిలో చర్చలు ► 1 బిలియన్ డాలర్లుగా విలీన కంపెనీ విలువ న్యూఢిల్లీ: ఈ–వాలెట్ కంపెనీ ఫ్రీచార్జ్ కొనుగోలుపై పోటీ సంస్థ మొబిక్విక్ దృష్టి పెట్టింది. రెండింటి మధ్య విలీన చర్చలు ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సమాచారం. వేర్వేరుగా చూస్తే రెండు సంస్థల విలువ చెరో 300 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని.. ఒకవేళ డీల్ కానీ పూర్తయిన పక్షంలో విలీన కంపెనీ విలువ సుమారు 700 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల దాకా ఉండగలదని పరిశ్రమవర్గాల అంచనా. అలాగే, భారత మార్కెట్లో ప్రవేశించాలని ఆసక్తిగా ఉన్న ఓ చైనా ఇన్వెస్టరు.. ఈ సంస్థలోకి సుమారు 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి సంసిధ్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని బ్యాంకులు కూడా ఆసక్తిగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొబిక్విక్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, పేటీఎం కూడా ఫ్రీచార్జ్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నాయి. ఫ్రీచార్జ్‌ను విక్రయించేందుకు గత కొన్నాళ్లుగా కంపెనీ సీఈవో జేసన్ కొఠారి ప్రయత్నిస్తున్నారు. అమెరికా, చైనాకు చెందిన పలువురు ఇన్వెస్టర్లతో కూడా చర్చలు జరిపారు. ఫ్రీచార్జ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు పేపాల్ ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మొబిక్విక్, ఫ్రీచార్జ్ మధ్య విలీన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెకోయా క్యాపిటల్ ఈ రెండు సంస్థల్లోనూ ఇన్వెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 13 కార్యాలయాలు ప్రారంభించిన మొబిక్విక్.. సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. రూ. 1,000 కోట్లు పైగా సమీకరించే ప్రయత్నాల్లో భాగంగా పలు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్‌తో చర్చలు జరుపుతోంది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే ప్రారంభంలో నిధులు అందవచ్చని అంచనా. -
వాలెట్ బ్యాలెన్స్‌పై 6% వార్షిక లాభం
మోబిక్విక్ ఆఫర్ హైదరాబాద్: మోబిక్విక్ సంస్థ యూజర్ల వాలెట్ బ్యాలెన్స్‌పై 6 శాతం వార్షిక లాభాన్ని అందించనున్నది. యూజర్లు... తమ వాలెట్ బ్యాలన్స్‌పై 6 శాతం వార్షిక లాభాన్ని పొందే ఆఫర్ భారత్‌లో తామే తొలిసారిగా ఆఫర్ చేస్తున్నామని భారతదేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపుల నెట్వర్క్ మోబిక్విక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ 6 శాతం వార్షిక లాభం పొందాలంటే యూజర్లు నెలకు కనీసం రూ.5,000 లేదా అంతకుమించిన బ్యాలెన్స్‌ను వాలెట్లో నిర్వహించాల్సి ఉంటుందని మోబిక్విక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఉపాసన తకు పేర్కొన్నారు. ఏడాదికి 250 శాతం చొప్పున వృద్ధి సాధిస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి తమ యూజర్ల సంక్య ఏడు లక్షలకు చేరగలదని వివరించారు. సూక్ష్మ రుణాలందించడం, వాలెట్ బ్యాలెన్స్‌పై లాభాలు, నగదు రహిత లావాదేవీలు తదితర సేవల ద్వారా ప్రతి భారతీయుడి ఆర్థిక అవసరాలను తీర్చే డిజిటల్సంస్థగా రూపాంతరం చెందుతున్నామని పేర్కొన్నారు.