న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ యూనికార్న్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ రెండేళ్ల తర్వాత మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 700 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. కంపెనీ ఇంతక్రితం 2021 జూలైలో రూ. 1,900 కోట్ల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు ప్రణాళికలు వేసింది.
ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే ఆపై ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. 2021 నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది.
కాగా.. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 140 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇది జరిగితే ఆమేరకు ఐపీవో పరిమాణం తగ్గనుంది. కంపెనీలో ప్రధాన వాటాదారు పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్‌తోపాటు.. బజాజ్ ఫైనాన్స్, అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు పెట్టుబడులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment