Fintech Startup Company
-
వందలాది ఉద్యోగుల తొలగింపు.. సారీ చెప్పిన సీఈవో
ఫిన్‌టెక్ కంపెనీ సింపుల్ (Simpl) వివిధ విభాగాల్లో వందలాది ఉద్యోగులను తొలగించింది. యూజర్ల చేరిక మందగించడం, నిర్వహణ వ్యయం పెరిగిపోవడం వంటి కారణాలతో 15 శాతం దాదాపు 100 మందిని కంపెనీ వదిలించుకుంది. కోతల ప్రభావం ఎక్కువగా ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్లో అత్యధిక జీతాలు అందుకునే ఉద్యోగులపై పడినట్లు తెలుస్తోంది.తాజా తొలగింపులకు ముందు, సింపుల్ దాదాపు 650 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇందులో ప్రధాన కార్యకలాపాలు, ఇంటర్న్లు, కాల్ సెంటర్ ఏజెంట్లు ఉన్నారు. ఈ స్టార్టప్‌లో ఇవి వరుసగా రెండవ సంవత్సరం తొలగింపులు. 2023 మార్చిలో సింపుల్ దాదాపు 160-170 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా రౌండ్ తొలగింపుల్లో కొంతమంది ఇటీవలే చేరిన ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఉద్యోగంలో చేరి ఒకటి లేదా ఒకటిన్నర నెలలు మాత్రమే కావడం గమనార్హం.కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో నిత్యానంద్ శర్మ బుధవారం టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. లేఆఫ్‌ల నిర్ణయానికి విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరారు. అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయంతో సహా ప్రభావితమైన వారికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. -
కుటుంబం దివాళా.. ఓ కుర్రాడి అష్టకష్టాలు! ప్రముఖ సీఈవో ‘ఫిలాసఫీ’ కథ
అప్పటివరకూ విలాసవంతంగా గడిపిన కుటుంబం అనుకోని కారణాలతో దివాళా తీస్తే ఆ ఇంట్లోని కుర్రాడు కుటుంబం కోసం డెలివరీ బాయ్‌గా, డీటీపీ ఆపరేటర్‌గా ఇలా చిన్నాచితకా పనులు చేస్తూ అష్టకష్టాలు పడ్డాడు. ఏదో సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఇది రియల్ స్టోరీనే.. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ (CRED) సీఈవో ‘ఫిలాసఫీ’ కథ ఇది.. క్రెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా (Kunal Shah) తన కుటుంబం దివాళా తీసినప్పుడు డెలివరీ ఏజెంట్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేయవలసి వచ్చింది. తనకు తెలిసిన ఈ చేదు గతాన్ని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో ఇటీవల కలుసుకున్నప్పుడు కునాల్ షా చిన్నతనంలో పడిన కష్టాలను సంజీవ్ బిఖ్‌చందానీ తెలుసుకున్నారు. ఆసక్తికర ‘ఫిలాసఫీ’! సంజీవ్ బిఖ్‌చందానీ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఇలా షేర్ చేశారు.. “ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో కునాల్ షాతో కలిసి కూర్చున్నాను. ఐఐటీ, ఐఐఎం ఫౌండర్ల ప్రపంచంలో అతను ముంబైలోని విల్సన్ కాలేజీ నుంచి ఫిలాసఫీ గ్రాడ్యుయేట్. అతను ఫిలాసఫీనే ఎందుకు చదివాడు.. 12వ తరగతిలో వచ్చిన మార్కులు అతనికి ఆ సబ్జెక్ట్‌లో మాత్రమే అడ్మిషన్ ఇచ్చాయా లేదా ఫిలాసఫీపై నిజంగా ఆసక్తి ఉందా అని అడిగాను. కానీ ఇవేం కాదని, కుటుంబం దివాళా తీయడంతో డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకే తరగతులు ఉండే ఏకైక సబ్జెక్ట్ ఫిలాసఫీ కావడమే కారణం అన్నాడు. సెల్యూట్.” Sitting with Kunal Shah at a coffee shop in Delhi. In a world of IIT IIM Founders he stands out as a philosophy graduate from Wilson College in Mumbai. I asked him why he studied philosophy - is it that his marks in Class 12 only gave him admission in that subject or was it out… — Sanjeev Bikhchandani (@sbikh) February 2, 2024 తన కుటుంబం క్లిష్ట ఆర్థిక పరిస్థితి గురించి కునాల్ షా ఇదివరకే తెలియజేశారు. కుటుంబం కోసం తాను చిన్న వయసు నుంచే పనిచేయడం, సంపాదించడం ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు. 16 సంవత్సరాల వయసు నుంచే తాను చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించడం మొదలు పెట్టానని, సీడీలను పైరసీ చేయడం, సైబర్ కేఫ్ నడపడం వంటి పనులు సైతం చేసినట్లు కునాల్ షా వెల్లడించారు. తన కంపెనీ ఫిన్‌టెక్ లాభదాయకంగా మారే వరకు తాను నెలకు కేవలం రూ.15,000 జీతం తీసుకుంటానని కూడా చెప్పారు. -
ఐపీవో బాటలో మొబిక్విక్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ యూనికార్న్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ రెండేళ్ల తర్వాత మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 700 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. కంపెనీ ఇంతక్రితం 2021 జూలైలో రూ. 1,900 కోట్ల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే ఆపై ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. 2021 నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. కాగా.. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 140 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇది జరిగితే ఆమేరకు ఐపీవో పరిమాణం తగ్గనుంది. కంపెనీలో ప్రధాన వాటాదారు పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్‌తోపాటు.. బజాజ్ ఫైనాన్స్, అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు పెట్టుబడులున్నాయి. -
యూనికార్న్‌గా ఇన్‌క్రెడ్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ ఇన్‌క్రెడ్ తాజాగా యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) హోదా దక్కించుకుంది. ప్రస్తుత, కొత్త ఇన్వెస్టర్ల నుంచి 60 మిలియన్ డాలర్లు సమీకరించడంతో ఇది సాధ్యపడింది. తాజా పెట్టుబడుల రాకతో సంస్థ విలువ 1.04 బిలియన్ డాలర్లకు చేరిందని ఇన్‌క్రెడ్ పేర్కొంది. తద్వారా ఈ ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న రెండో సంస్థగా నిల్చిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు ఇన్‌క్రెడ్ సీఈవో భూపీందర్ సింగ్ తెలిపారు. ఎంఈఎంజీకి చెందిన రంజన్ పాయ్, ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రవి పిళ్లై, డాయిష్ బ్యాంక్ గ్లోబల్ కో–హెడ్ రామ్ నాయక్ తదితరులు ఇన్వెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. ఇన్‌క్రెడ్ సంస్థ కన్జూ్యమర్ రుణాలు, విద్యా రుణాలు మొదలైన వ్యాపార విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఎగుమతిదార్లకు ‘రేజర్‌పే’ ఖాతా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిన్‌టెక్ కంపెనీ రేజర్‌పే తాజాగా మనీసేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ సేవలను ప్రారంభించింది. ఎగుమతిదార్లు అంతర్జాతీయంగా జరిపే నగదు లావాదేవీల చార్జీలపై 50 శాతం వరకు పొదుపు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ‘చిన్న, మధ్య తరహా ఎగుమతిదార్లు తమకు నచి్చన దేశంలో ఖాతాను తెరవడానికి, అలాగే రేజర్‌పే ప్లాట్‌ఫామ్ ద్వారా స్థానికంగా చెల్లింపులను స్వీకరించడానికి కంపెనీ సహాయం చేస్తుంది. తద్వారా చార్జ్బ్యాక్స్, ట్రాన్స్ఫర్ ఖర్చులను నివారించవచ్చు’ అని రేజర్‌పే వెల్లడించింది. మనీసేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్‌తో 160 దేశాల నుండి బ్యాంకుల ద్వారా నగదును స్వీకరించడానికి ఎగుమతిదారులకు వీలు కలుగుతుంది. అన్ని చెల్లింపులు ఎల్రక్టానిక్ ఫారెన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ స్టేట్మెంట్తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 10,000 పైచిలుకు మంది ఎగుమతిదార్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని రేజర్‌పే చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాహుల్ కొఠారి చెప్పారు. -
క్రెడిట్‌పై అద్దె చెల్లించవచ్చు
న్యూఢిల్లీ: ప్రాపర్టీటెక్ కంపెనీ హౌసింగ్.కామ్ కస్టమర్లకు క్రెడిట్‌పై అద్దె చెల్లించే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు ఫిన్‌టెక్ సంస్థ నీరోతో చేతులు కలిపింది. వెరసి కస్టమర్లకు ప్రస్తుతం అద్దె చెల్లించు– తదుపరి దశలో తిరిగి చెల్లించు(రెంట్ నౌ పే లేటర్– ఆర్ఎన్పీఎల్) సేవలను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రెడిట్ కార్డుల తరహాలో ప్రస్తుత కొనుగోలుకి తరువాత చెల్లింపు(బయ్ నౌ పే లేటర్– బీపీఎన్ఎల్) సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు సంస్థ నీరోతో ఒప్పందం ద్వారా ఆస్ట్రేలియన్ కంపెనీ ఆర్ఈఏలో భాగమైన హౌసింగ్.కామ్ కస్టమర్లకు తాజాగా ఆర్ఎన్పీఎల్ సేవలను ప్రారంభించింది. దీంతో కస్టమర్లకు ఎలాంటి కన్వినెన్స్ ఫీజు లేకుండా 40 రోజుల క్రెడిట్ ద్వారా అద్దెను చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది. అంతేకాకుండా అద్దె చెల్లింపులను అవసరమైతే కస్టమర్లు సులభ వాయిదా పద్ధతి(ఈఎంఐ)లోకి మార్పిడి చేసుకునేందుకు అవకాశమున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా 4 శాతం ప్రజలకే క్రెడిట్ కార్డులున్నందున రెంట్ నౌ పే లేటర్ సర్వీసు వినియోగదారులకు ప్రయోజనకరంగా నిలవనున్నట్లు వివరించింది. హౌసింగ్.కామ్ ఇప్పటికే క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులకు తెరతీసిన విషయం విదితమే. -
భారత్‌కు మారేందుకు రూ. 8,000 కోట్ల పన్నులు కట్టాం..
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకోవడానికి దాదాపు రూ. 8,000 కోట్ల మేర పన్నులు కట్టాల్సి వచ్చింది. పైగా సంబంధిత నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను వ్యాపార పునర్వ్యవస్థీకరణగా పరిగణించడం వల్ల సుమారు రూ. 7,300 కోట్లు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రధాన కార్యాలయాలను మార్చుకోవడానికి సంబంధించిన స్థానిక చట్టాలు పురోగామిగా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనల కారణంగా ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఎసాప్) కింద ఇచ్చే ప్రోత్సాహకాలన్నింటినీ ఉద్యోగులు కోల్పోయారని నిగమ్ చెప్పారు. ‘భారత్ కేంద్రంగా చేసుకోవాలంటే కొత్తగా మార్కెట్ వేల్యుయేషన్‌ను జరిపించుకుని, పన్నులు కట్టాల్సి ఉంటుంది. మేము భారత్ రావడానికి మా ఇన్వెస్టర్లు దాదాాపు రూ. 8,000 కోట్లు పన్నులు కట్టాల్సి వచ్చింది. ఇంకా పూర్తిగా మెచ్యూర్ కాని వ్యాపార సంస్థకు ఇది చాలా గట్టి షాక్‌లాంటిది‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వాల్‌మార్ట్, టెన్సెంట్ వంటి దీర్ఘకాల దిగ్గజ ఇన్వెస్టర్లు తమ వెంట ఉండటంతో దీన్ని తట్టుకోగలిగామని వివరించారు. గతేడాది అక్టోబర్‌లో ఫోన్‌పే తమ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకుంది. -
పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో!
ఓ కాలేజీ కుర్రాడికి మెరుపులాంటి ఐడియా వచ్చింది. ఆ ఆలోచనకు సృజనాత్మకతను జోడించాడు. ఎంతో కష్టపడి పనిచేశాడు. అంతే ఆ బిజినెస్ పెద్ద హిట్ అయ్యింది. ఇదిగో సక్సెస్ అయిన ప్రతి కంపెనీ గురించి విన్నా, లేదంటే ఎవరైనా చెప్పినా..క్రియేటీవ్ థాట్స్ ఉండాలి. ఎవరూ స్టార్ట్ చేయని బిజినెస్ నేను స్టార్ట్ చేస్తే 100 శాతం అది క్లిక్ అవుతుంది’ అని చాలా మంది నమ్ముతారు. కానీ అది కరెక్ట్ కాదని అంటున్నారు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ. నిత్యం మనంరోజూ వారి జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం చూపించే బిజినెస్ ఐడియాతో వందల కోట్లు సంపాదించవచ్చని చెబుతున్నారు. అలాగే తనకు ఎదురైన ఓ సమస్యతో పేటీఎం బిజినెస్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఓ సమావేశంలో వెల్లడించారు. పేటీఎంకు చిన్న సైజు ఏటీఎం పేటీఎం లాంటి యూపీఐ పేమెంట్స్ యాప్స్ వచ్చినప్పుడు వాటిని నమ్మడం చాలా కష్టమైంది. ఆ తర్వాత ఫోన్ పే, గూగుల్ పేలాంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక పేటీఎం అప్ అండ్ డౌన్స్ గురించి వినే ఉంటున్నాం. వాటిల్లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే? మనం కిరాణా షాపులు, పాన్ షాపుల్లోకి వెళితే ఓ డబ్బా నుంచి రిసీవ్డ్ అమౌంట్ ఆఫ్ సో అండ్ సో అనే ఆడియో వినపడుతుంది కదా. అది బ్రాండింగ్ కోసం పెట్టారని అనుకుంటాం. కానీ అది బ్రాండింగ్ కోసం పెట్టిన బాక్స్ కాదు. పేటీఎంకు కోట్లు కురిపించే ఓ చిన్న సైజ్ ఏటీఎం. గేమ్ ఛేంజర్ సౌండ్ బాక్స్ ఫిన్ టెక్ కంపెనీల్లో సౌండ్ బాక్స్ అనేది ఓ గేమ్ ఛేంజర్. ముఖ్యంగా షాపుల్లో రద్దీగా ఉన్న సమయంలో యజమానికి కస్టమర్ ఎంత చెల్లించారో చెప్పేలా అన్నీ స్థానిక భాషల్లో అలెర్ట్ ఇస్తుంది. అయితే ఆ సౌండ్ బాక్స్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఉందని మీకు తెలుసా. పాలబూత్‌లో చేదు అనుభవం పేటీఎం సౌండ్‌బాక్స్ పై విజయ్ శేఖర్ శర్మ తన వ్యక్తిగతంగా ఎదురైన అనుభవం నుంచి ఐడియా పుట్టింది. ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో మాట్లాడుతూ.. విజయ్ ఈ గేమ్ ఛేంజర్ ఇన్నోవేషన్ గురించి స్పందించారు. తన ఇంటి సమీపంలో ఉన్న పాల బూత్‌లో పాల ప్యాకెట్ కొనేందుకు వెళ్లారు. పాల బూత్‌లో పాల ప్యాకెట్ కొన్నారు. పేటీఎం ద్వారా యూపీఐ పేమెంట్ చేశారు. కానీ పేమెంట్ చేసినట్లు మెసేజ్ రాకపోవడంతో సదరు షాపు యజమాని విజయ్ శేఖర్ శర్మని అడ్డగించాడు. పాల ప్యాకెట్‌కు డబ్బులు చెల్లించకుండా వెళతున్నారని అన్నారు. దీంతో కంగుతిన్న పేటీఎం సీఈవో సదరు పాల బూత్ యజమానిని ఫోన్ చూసుకోండి. పేమెంట్ చేశానని చెప్పారు. కానీ సదరు పాల వ్యాపారి ఫోన్ మెసేజ్ ఇన్ బాక్స్ నిండిపోవడంతో పేటీఎం సీఈవో చేసిన పేమెంట్ మెసేజ్ అలెర్ట్ రాలేదు. దీంతో మెసేజ్ ఇన్‌బాక్స్‌లో కొన్ని మెసేజ్‌లు డిలీట్ చేయడంతో విజయ్ శేఖర్ శర్మ పాల ప్యాకెట్‌కు పేమెంట్ చేసినట్లు మెసేజ్ వచ్చింది. అదిగో అప్పుడే పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు మెరుపులాంటి ఐడియా వచ్చింది. వాట్ ఏన్ ఐడియా సర్జీ పాల బూత్‌లో తనకు ఎదురైన సమస్యను పరిష్కరించాలని అనుకున్నారు. కస్టమర్లు పేమెంట్ చేసిన వెంటనే సౌండ్ అలర్ట్ వచ్చేలా వ్యాపారి, కస్టమర్ కు అనుసంధానం చేస్తూ ఓ డివైజ్ ను తయారు చేస్తే ఎలా ఉంటుందోనని అని ఆలోచించారు. అనేక తర్జన బర్జనల తర్వాత వచ్చిందే ఈ పేటీఎం సౌండ్ బాక్స్ ఐడియా. అలా పాల ప్యాకెట్ (పరోక్షంగా) తెచ్చిన అదృష్టంతో పేటీఎం సీఈవో వందల కోట్లు సంపాదించడం నిజంగా ఆశ్చర్యమే కదా. వందల కోట్లు సంపాదన ఎలా? కిరాణా స్టోర్‌లో పేటీఎం సౌండ్ బాక్స్ పెట్టుకుంటే నెలకు రూ.125 రెంట్ కట్టాల్సి ఉంది. ఆ లెక్కన మొత్తం మన దేశంలో 2.1 మిలియన్ల మంది ఆ సౌండ్ బాక్స్ వినియోగిస్తుంటే యావరజ్గా రూ.125 చెల్లిస్తే.. నెలకు వందల కోట్లు అర్జిస్తున్నట్లే కదా. -
ఎంఎస్ఎంఈల్లో వ్యాపార ఆశావహం
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల్లో (ఎంఎస్ఎంఈ) వ్యాపార ఆశావహం పుంజుకుంది. 2022 డిసెంబర్ వరకు ఆరు నెలల్లో వ్యాపార వృద్ధి పట్ల 71 శాతం ఎంఎస్ఎంఈలు సానుకూలంగా ఉన్నాయి. వచ్చే ఆరు నెలల్లో వ్యాపారం కుంటుపడొచ్చని కేవలం 5 శాతం మందే చెప్పారు. ఫిన్‌టెక్ సంస్థ ‘ఖాతాబుక్’ అర్ధ సంవత్సర ఎంఎస్ఎంఈ బిజినెస్ సెంటిమెంట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలతో ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనూ ఎంఎస్ఎంఈలో అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాల్లోనూ వృద్ధిని చూసినట్టు ఈ నివేదిక తెలిపింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఎంఎస్ఎంఈల్లో సానుకూల వృద్ధి ఉందని, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ముందంజంలో ఉన్నట్టు పేర్కొంది. 2021లో ప్రతికూల వృద్ధిని చూసిన పారిశ్రామిక సేవలు, స్టేషనరీ, హోమ్ ఫర్నిషింగ్ కంపెనీలు సైతం ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో సానుకూల వ్యాపారాన్ని నమోదు చేసినట్టు వివరించింది. 2022 మొదటి రెండు త్రైమాసికాల్లో ఫార్మా, సెలూన్లు, రెస్టారెంట్లు అధిక వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది. సమస్యలు కూడా తక్కువే.. తమకు వ్యాపారానికి సంబంధించి పెద్ద సమస్యలు ఏమీ లేవని 66 శాతం ఎంఎస్ఎంఈలు చెప్పాయి. దీనికి విరుద్ధంగా ఇతర ఎంఎస్ఎంఈలు డిమాండ్ బలహీనంగా ఉందని, రుణాల లభ్యత, లిక్విడిటీ సమస్యలను ప్రస్తావించాయి. 7,295 అభిప్రాయాలను సర్వేలో తెలుసుకోగా, 58 శాతం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వ్యాపారం మెరుగుపడినట్టు చెప్పాయి. ఇదే కాలంలో వ్యాపారం క్షీణించినట్టు 14 శాతం ఎంఎస్ఎంఈలు తెలిపాయి. రిటైలర్లు, హోల్‌సేల్ విక్రేతలు, పంపిణీదారులు, తయారీదారుల్లో వ్యాపార సెంటిమెంట్ బలపడింది. -
సోకుల కోసం కంపెనీ సొమ్మును వాడేసింది!
ఫిన్‌టెక్ రంగంలో భారత్‌పే సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్, ఆయన సతీమణి మాధురీ మీద అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అష్నీర్‌ను సెలవుల మీద పంపించి.. అంతర్గత విచారణ ద్వారా ఆయన్ని తప్పించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అష్నీర్‌కు తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత్‌పే. ఆయన భార్య మాధురీ జైన్‌ను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అంతేకాదు ఆమె పేరిట కంపెనీలో ఉన్న వాటాను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ కంట్రోలర్ హోదాలో ఆర్థికపరమైన అవకతవకలకు మాధురి పాల్పడినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మాధురీ జైన్.. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు, దుస్తులు, ఎలక్ట్రిక్ సామాన్లు, అమెరికా.. దుబాయ్‌కి ఫ్యామిలీ ట్రిప్స్ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అల్వరెజ్ అండ్ మార్షల్ కంపెనీ నిర్వహించిన దర్యాప్తులో ఈ ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యాయి. ఫేక్ ఇన్వాయిస్లతో కంపెనీని ఆమె మోసం చేయాలని ప్రయత్నించినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. అష్నీర్ గ్రోవర్ ఆరోపణలన్నింటిని ఖండిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాను కంపెనీని వీడాలంటే.. తన వాటాగా ఉన్న 4 వేల కోట్ల రూపాయలు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తన నాయకత్వంలోనే కంపెనీ ముందుకెళ్లాలని చెప్తున్నాడు. ఇదిలా ఉండగా.. సుమారు 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్‌పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీవోకు వెళ్లే యోచనలో ఉంది. ఈ లోపు ఈ ఆరోపణలతో వార్తల్లో నిలుస్తుండడం విశేషం. సంబంధిత వార్తలు: భర్తతో కలిసి బండబూతులు తిట్టిన మాధురీ! -
‘ఇది నా కంపెనీ.. నేనెందుకు బయటికి పోవాలి’
BharatPe MD Ashneer Grover Huge Demand Before Investors For Leaving Company: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పేలో అవినీతి ఆరోపణలతో పాటు ప్రవర్తన తీరు సరిగా లేదన్న వ్యవహారంపై మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ మీద దర్యాప్తు నడుస్తోంది. లావాదేవీల్లో మోసాలు, ఆరోపణలపై సొంత టీంతో కాకుండా.. స్వతంత్ర విభాగాన్ని నియమించింది భారత్‌పే. ఈ తరుణంలో ఆయన్ను గద్దె దించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అయితే.. తాను కంపెనీని వీడాలంటే.. 4 వేల కోట్ల రూపాయలు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ బిజినెస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన సంకేతాలు పంపించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కొట్టిపారేసిన గ్రోవర్.. తనను ఇన్వెస్టర్లు గనుక బయటకు పంపాలనుకుంటే తన డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. భారత్‌పేలో గ్రోవర్‌కి 9.5 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 21 వేల కోట్ల రూపాయాలకు పైనే. ఇక భారత్‌పే కంపెనీ విలువ 6 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందన్నది ఒక అంచనా. ‘‘రాజీనామా చేసేంత తప్పు నేనేం చేశా?. నేను ఈ కంపెనీ ఎండీని. కంపెనీని నడిపిస్తోంది నేనే. ఒకవేళ బోర్డు గనుక నా అవసరం లేదనుకుంటే.. నన్ను ఎండీగా కొనసాగించడం ఇష్టం లేదనుకుంటే.. నాకు రావాల్సిన 4 వేల కోట్ల రూపాయలను టేబుల్ మీద పెట్టి.. తాళాలు తీసుకోవచ్చు. ఒకటి కంపెనీని నేనే నడిపించడమా? లేదా నాకు సెటిల్ మెంట్ చేసి బయటకు పంపించడమా? అంతేతప్ప.. మూడో ఆప్షన్ బోర్డు దగ్గర లేదు అని స్పష్టం చేశాడాయన. మరోవైపు ఆయన న్యాయపోరాటానికి సైతం సిద్ధమయ్యారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న సుహాయిల్ సమీర్‌ను పదవి నుంచి తప్పించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నాడు కూడా. ఇదిలా ఉంటే.. నైకా ఐపీవోకి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కొటాక్ మహీంద్ర బ్యాంక్‌తో భారత్‌పే ఎండీ అష్నీర్ గ్రోవర్‌కి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో బ్యాంకుకు లీగల్ నోటీసులు పంపిన కొద్దిరోజులకే.. కొటక్ ఎంప్లాయి ఒకరిని ఫోన్లో బండబూతులు తిట్టాడు అష్నీర్. అందుకు సంబంధించిన క్లిప్ ఒకటి బయటకు రాగా.. ఈ వ్యవహారానికి సంబంధించి కొటక్ బ్యాంకు లీగల్ నోటీసులు పంపింది భారత్‌పేకు. ఈ పరిణామాలతో అష్నీర్ గ్రోవర్ కొన్నాళ్లపాటు సెలవుల మీద బయటకు వెళ్లగా.. తాజాగా ఆయన సెలవులను మార్చి 31 వరకు పొడిగించింది భారత్‌పే. దీంతో ఆయన ఉద్వాసన ఖాయమని అంతా భావించగా.. అలాంటిదేం లేదని కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఆ కొద్దిరోజులకే ఆయన భార్య మాధురిని సైతం సెలవుల మీద పంపింది. ఈ గ్యాప్‌లో భారత్‌పే సీఈవో సుహాయిల్ సమీర్‌కు బాధ్యతలు అప్పజెప్పిన బోర్డు.. అష్నీర్ ఆయన భార్య మాధురి ఇద్దరూ ఫేక్ ఇన్వాయిస్లతో భారీ అవకతవకలకు పాల్పడ్డాడంటూ ఫోరెన్సిక్ అడిట్ కోసం అల్వరెజ్& మార్షల్, పీడబ్ల్యూసీలను నియమించి.. దాదాపుగా ఆయన ఉద్వాసనను ఖరారు చేసింది. -
చోళమండలం ఇన్వెస్ట్ గూటికి పేస్విఫ్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ పేమెంట్ సొల్యూషన్స్ అందించే పేస్విఫ్ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్ల చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ తాజాగా వెల్లడించింది. రూ. 450 కోట్లను వెచ్చించడం ద్వారా 72.12% వాటా సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు పేర్కొంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులతో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వాటా కొనుగోలు తదుపరి పేస్విఫ్‌ను అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. షేరుకి రూ. 1,622.66 ధరలో నగదు ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా మెజారిటీ వాటాను చేజిక్కించుకోనున్నట్లు వివరించింది. బ్యాక్‌గ్రౌండ్ ఇలా: 2013లో ప్రారంభమైన పేస్విఫ్ ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే సర్వీసులు అందిస్తోంది. ప్రధానంగా ఈకామర్స్ బిజినెస్‌లకు సేవ లు సమకూర్చుతోంది. ఈకామర్స్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. బిజినెస్ యజమానులు కస్టమర్ల నుంచి చెల్లింపులను ఆమోదించేందుకు వీలుగా ఓమ్నీచానల్ పేమెంట్ లావాదేవీల సొల్యూషన్స్ సమకూర్చుతోంది. స్టోర్లలో, హోమ్డెలివరీ (ఇంటివద్ద), ఆన్లైన్, ఎంపీవోఎస్, పీవోఎస్ తదితరాల ద్వారా చెల్లింపులు నిర్వహించేందుకు వీలు కల్పిస్తోంది. మొత్తం రుణ మంజూరీ విధానంలో ఆధునిక మార్పులు, విస్తరణలకుగాను కంపెనీ అమలు చేస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా తాజా కొనుగోలుకి తెరతీసినట్లు చోళమండలం ఇన్వెస్ట్ పేర్కొంది. ప్రధానంగా ఎస్ఎంఈ విభాగం రుణాల మంజూరీలో ఎకో సిస్టమ్‌ను అమలు చేసేందుకు ఇది తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. -
ఆర్థిక సాధికారతకు ఫిన్‌టెక్ చేయూత
న్యూఢిల్లీ: సామాన్య ప్రజానీకానికి ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఫిన్‌టెక్ విప్లవాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఫిన్‌టెక్ రంగం భారీ స్థాయిలో విస్తరించిందని, ప్రజల్లోనూ ఆమోదయోగ్యత పొందిందని శుక్రవారం ఇన్ఫినిటీ ఫోరం సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన తెలిపారు. ‘ఇప్పుడు ఈ ఫిన్‌టెక్ ఆవిష్కరణలను ఫిన్‌టెక్ విప్లవంగా మల్చుకోవాల్సిన సమయం వచ్చింది. దేశంలోని ప్రతి పౌరుడికి ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఈ విప్లవం తోడ్పడాలి‘ అని ప్రధాని చెప్పారు. ఆర్థిక రంగంలో టెక్నాలజీ గణనీయంగా మార్పులు తెస్తోందని, గతేడాది మొబైల్ ద్వారా చెల్లింపులు .. ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాయల్స్‌కు మించి జరిగాయని పేర్కొన్నారు. అలాగే భౌతికంగా శాఖలు లేని పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకులు ఇప్పటికే వచ్చేశాయని, భవిష్యత్తులో ఇవి సర్వసాధారణంగా మారగలవని మోదీ వివరించారు. టెక్నాలజీ వినియోగంలో ఇతర దేశాలకేమీ తీసిపోమని భారత్ నిరూపించిందని ఆయన చెప్పారు. డిజిటల్ ఇండియా నినాదం కింద చేపట్టిన వివిధ చర్యలతో.. పాలనలో నూతన ఫిన్‌టెక్ పరిష్కార మార్గాలను ఉపయోగించేందుకు ద్వారాలు తెరుచుకున్నాయని మోదీ పేర్కొన్నారు. ఆ నాలుగు కీలకం..: ఫిన్‌టెక్ విప్లవమనేది .. ఆదాయం, పెట్టుబడులు, బీమా, సంస్థాగత రుణాలు అనే నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉందని మోదీ చెప్పారు. యూపీఐ, రూపే వంటి సాధనాలు ప్రతీ దేశానికీ ఉపయోగపడేవేనన్నారు. సమిష్టిగా టెక్నాలజీ నియంత్రణ: ఆర్థిక మంత్రి ఎప్పటికప్పుడు మారిపోతున్న టెక్నాలజీని, టెక్ ఆధారిత పేమెంట్ వ్యవస్థలను సమర్ధమంతంగా నియంత్రించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమిష్టి కృషి అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం కొత్త టెక్నాలజీల నియంత్రణ విషయంలో ప్రత్యేక ఫార్ములా అంటూ లేదని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా టెక్నాలజీలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఇన్ఫినిటీ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. -
నాలుగు లిస్టింగ్‌లు... రెండు ఐపీవోలు
నాలుగు లిస్టింగ్‌లు.., రెండు పబ్లిక్ ఇష్యూల ప్రారంభంతో ఈ వారం దలాల్ స్ట్రీట్ కళకళలాడనుంది. పేటీఎంతో సహా మొత్తం నాలుగు కంపెనీల షేర్లు ఈ వారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇందులో నేడు పీబీ ఫిన్‌టెక్, సిగాచీ ఇండస్ట్రీస్, ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్ షేర్ల లిస్టింగ్ కార్యక్రమం ఉంది. ఈ మూడు కంపెనీలు ప్రాథమిక మార్కెట్ నుంచి రూ.6,550 కోట్ల సమీకరించాయి. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న పేటీఎం షేర్లు గురువారం లిస్ట్ కానున్నాయి. ఇదే వారంలో టార్సన్స్ ప్రొడక్ట్స్, గో ఫ్యాషన్లు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ల్యాబొరేటరీ ఉపకరణాల తయారీ సంస్థ టార్సన్స్ ప్రొడక్ట్స్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభం కానుంది. బుధవారం (నవంబర్ 17)తో ముగిసే ఐపీవో ద్వారా కంపెనీ రూ.1,023 కోట్లను సమీకరించనుంది. గో ఫ్యాషన్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బుధవారం మొదలవుతుంది. వచ్చే సోమవారం(22వ తేదీ)తో ముగిసే ఇష్యూ ద్వారా రూ.1,014 కోట్లను సమీకరించనుంది. ఇందుకు రూ. 655–690 ధరల శ్రేణిని ప్రకటించింది. -
పోస్ట్ పే వినూత్న ఆఫర్: ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ భారత్ పే, 'పోస్ట్ పే' పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. 'బై నౌ పే లేటర్' (బిఎన్పిఎల్) కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్లు భారత్ పే ప్రకటించింది. "పోస్ట్ పే" యాప్ ను కస్టమర్లు ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రూ.10 లక్షల వరకు వడ్డీ లేని క్రెడిట్ లిమిట్ పొందవచ్చు అని తెలపింది. 'పోస్ట్ పే' భారీ కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ కొనుగోళ్లకు వర్తిస్తుంది అని తెలిపింది. తన రుణ భాగస్వాముల కోసం మొదటి 12 నెలల్లో పోస్ట్ పే ద్వారా 300 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ పే పేర్కొంది. సులభంగా చెప్పాలంటే మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఈ యాప్ ద్వారా నగదు చెల్లించి. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఆ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లించకపోతే రుసుము వసూలు చేస్తారు. మీ క్రెడిట్ చరిత్ర ఆధారంగా రాను రాను రుణ పరిమితి పెరుగుతుంది. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ మీద ఎటువంటి ప్రభావం పడదు అని కంపెనీ తెలిపింది. అలాగే, మీరు గనుక భారీ మొత్తం దీని ద్వారా చెల్లిస్తే దానిని ఈఎమ్ఐల ద్వారా సులభంగా తిరిగి చెల్లించవచ్చని ఫిన్ టెక్ కంపెనీ తెలిపింది. కస్టమర్ చేయాల్సిందల్లా పోస్ట్ పే యాప్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. (చదవండి: బిగ్బుల్ ఝున్‌ఝున్‌వాలా ఏం చేయబోతున్నాడు? సర్వత్రా ఆసక్తి) అలాగే, వినియోగదారులు స్టోర్స్ వద్ద పోస్ట్ పే కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. క్యాష్ బ్యాక్, రివార్డులు కూడా లభిస్తాయి. పోస్ట్ పే యాప్ లేదా కార్డు ద్వారా చేసే చెల్లింపులపై వార్షిక ఫీజు లేదా లావాదేవీ ఛార్జీలు లేవని కంపెనీ తెలిపింది. అంతేగాక, దుబాయ్ లో జరగబోయే ఐసీసీ టి20 ప్రపంచ కప్ కోసం ప్రపంచ స్పాన్సర్లలో పోస్ట్ పే ఒకరు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 24 వరకు జరగబోయే మ్యాచ్ కోసం వినియోగదారులు 3,500 ఉచిత పాసులు గెలుచుకునే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ప్రతి ఒక్కరికీ రుణం అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏమిటీ బీఎన్‌పీఎల్ కొన్ని వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లును వెంటనే చెల్లించకుండా.. కొన్నాళ్ల తర్వాత ఒకేసారి లేదా వాయిదాల రూపంలో చెల్లించేందుకు వీలు కల్పించే విధానమే ఈ బీఎన్‌పీఎల్. ఈ వ్యవధిలో సున్నా శాతం లేదా స్వల్ప వడ్డీని ఈ బీఎన్‌పీఎల్ సంస్థలు వసూలు చేస్తాయి. చిన్న మొత్తంలో రుణం కావాలని అనుకున్నప్పుడు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎన్నో ఫిన్‌టెక్ అంకురాలు ఇప్పుడు ఈ బీఎన్‌పీఎల్ సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు బ్యాంకులూ ఈ విభాగంలోకి ప్రవేశించాయి. ఇ-కామర్స్ వెబ్సైట్లూ.. కొన్ని సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. -
డబ్బే డబ్బు.. భారత్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫిన్‌టెక్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన ఫండింగ్‌తో ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. పైన్‌ల్యాబ్స్ రూ.2,860 కోట్లు, క్రెడ్ రూ.1,597 కోట్లు, రేజర్‌పే రూ.1,189 కోట్లు, క్రెడిట్‌బీ రూ.1,137 కోట్లు, ఆఫ్‌బిజినెస్ రూ.817 కోట్లు, భారత్‌పే రూ.802 కోట్లు అందుకున్నాయి. కంపెనీలు డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేజిక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇన్సూరెన్స్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. టర్టిల్‌మింట్ రూ.342 కోట్లు, రెన్యూబీ రూ.334 కోట్లు, డిజిట్ ఇన్సూరెన్స్ రూ.134 కోట్లు స్వీకరించాయి. చిన్న స్థాయి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేశాయి. టాప్–10లో నాలుగు.. ఆసియాలో టాప్–10 డీల్స్‌లో పైన్‌ల్యాబ్స్ మూడవ స్థానంలో, క్రెడ్ నాల్గవ, రేజర్‌పే ఎనమిదవ, క్రెడిట్‌బీ 10వ స్థానంలో నిలిచింది. ఇక ఐపీవోలు కొనసాగుతాయని కేపీఎంజీ నివేదిక తెలిపిం ది. పాలసీ బజార్ రూ.6,500 కోట్లు, పేటీఎం రూ.16,500 కోట్ల ఐపీవో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనం, కొనుగోళ్ల విషయంలో ఫిన్‌టెక్ కంపెనీలను బ్యాంకులు, ఈ రంగంలోని పెద్ద సంస్థలు, సర్వీసులు అందిస్తున్న దిగ్గజాలు లక్ష్యంగా చేసుకున్నాయి. రానున్న ఏడాదిలో ముందు వరుసలో ఉన్న ఫిన్‌టెక్ యూనికార్న్ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్‌పై దృష్టిసారిస్తాయి. బ్యాంకులు సైతం ఫిన్‌టెక్ కంపెనీలు, కొత్త బ్యాంకులు, వెల్త్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సైతం.. తొలి ఆరు నెలల్లో అంతర్జాతీయంగా నిధులు వెల్లువెత్తాయి. రూ.7,28,140 కోట్లు ఫిన్‌టెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. 2020లో ఈ మొత్తం రూ.9,02,745 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో యూఎస్ కంపెనీల్లోకి రూ.3,78,930 కోట్లు, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా రూ.2,90,513 కోట్లు, ఆసియా పసిఫిక్ సంస్థల్లోకి రూ.55,725 కోట్లు వచ్చి చేరాయి. విలీనాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.3,02,400 కోట్ల విలువైన 353 డీల్స్ జరిగాయి. 2020లో 502 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ రూ.5,49,820 కోట్లు. జూలై–డిసెంబరు కాలంలోనూ అన్ని ప్రాంతాల్లో ఇదే స్థాయిలో పెట్టుబడులు, డీల్స్ ఉండొచ్చని కేపీఎంజీ అంచనా వేస్తోంది. పేమెంట్స్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్, బ్యాంకింగ్ యాజ్ ఏ సర్వీస్, బీ2బీ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు ఉంటాయని వివరించింది. చదవండి: భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం -
వ్యాపారాలకు జోరుగా రుణాలివ్వాలి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను వేగవంతంగా రికవరీ బాట పట్టించే దిశగా వ్యాపార సంస్థలకు మరింతగా రుణాలివ్వడంపై దృష్టి పెట్టాలని బ్యాంకులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అలాగే, ఫిన్‌టెక్, స్టార్టప్ సంస్థలకు అనువైన ఆర్థిక సాధనాలను రూపొందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలన్నది కేంద్రం లక్ష్యం అయినప్పటికీ.. బడుగు వర్గాలకు తోడ్పాటు అందించడం కోసం బ్యాంకింగ్, బీమా రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కొనసాగడం అవసరమని మోదీ చెప్పారు. ఆర్థిక సేవలకు సంబంధించి బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలపై శుక్రవారం జరిగిన వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. కోవిడ్–19 కష్టకాలంలో చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలతో 90 లక్షల పైగా ఎంఎస్ఎంఈలకు దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల రుణాలు లభించాయని ఆయన చెప్పారు. ‘ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లను ఆదుకోవడం, వాటికి రుణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడటం ముఖ్యం. వ్యవసాయం, బొగ్గు, అంతరిక్షం తదితర రంగాల్లో ప్రభుత్వం సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇక గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, స్వావలంబన భారత లక్ష్యాన్ని సాధించడంలో వారిని కూడా భాగస్వాములను చేసేందుకు తగు విధమైన తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ఆర్థిక రంగంపైనే ఉంది‘ అని ప్రధాని తెలిపారు. ‘ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో రుణ లభ్యత కూడా కీలకంగా మారుతోంది. కొత్త రంగాలు, కొత్తగా వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణ సదుపాయాన్ని ఎలా అందించాలన్న దానిపై ఆర్థిక సంస్థలు దృష్టి పెట్టాలి. స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థల కోసం కొత్తగా, మెరుగైన ఆర్థిక సాధనాల రూపకల్పనపై కసరత్తు చేయాలి‘ అని సూచించారు. చిన్న రైతులకు కిసాన్ క్రెడిట్ తోడ్పాటు.. చిన్న రైతులు, పాడి రైతులు మొదలైన వారు అసంఘటిత వడ్డీ వ్యాపారుల చెర నుంచి బైటపడటానికి కిసాన్ క్రెడిట్ ఎంతగానో తోడ్పడిందని మోదీ చెప్పారు. ఇలాంటి వర్గాల వారి కోసం వినూత్నమైన ఆర్థిక సాధనాలను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రైవేట్ రంగం పరిశీలించాలని సూచించారు. ఆర్థిక సేవల రంగంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, దీన్ని మరింత పటిష్టంగా.. క్రియాశీలకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. -
స్టేట్ బ్యాంక్- రుపీక్ జత?
బెంగళూరు: బంగారు ఆభరణాలపై రుణాలందించే స్టార్టప్ రుపీక్ ను చెంతకు చేర్చుకోవాలని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఎస్బీఐ యాప్ లో రుపీక్ కు చోటు కల్పించాలని చూస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా 2015లో ప్రారంభమైన గోల్డ్ లోన్స్ స్టార్టప్ రుపీక్.. కస్టమర్ల ఇంటి వద్ద రుణ సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రస్తుతం నెలకు రూ. 350- 375 కోట్లవరకూ రుణాలందిస్తోంది. ఏడాదిన్నర క్రితం ఇవి రూ. 20 కోట్లేకాగా.. ఇప్పటికే కరూర్ వైశ్యా, ఫెడరల్ బ్యాంక్ లతో జత కట్టింది. ఇటీవల కాథోలిక్ సిరియన్, యాక్సిస్ బ్యాంకులతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లోన్స్ కు డిమాండ్ కోవిడ్ -19 నేపథ్యంలో కొద్ది రోజులుగా గోల్డ్ లోన్స్ కు డిమాండ్ పెరిగినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కావడంతో ఎస్బీఐ నుంచి గోల్డ్ లోన్స్ కు మరింత డిమాండ్ కనిపిస్తున్నట్లు తెలియజేశాయి. నిజానికి బ్యాంకుకున్న నెట్వర్క్ సామర్థ్యం రీత్యా రోజుకి రూ. 150 కోట్లవరకూ రుణాలు విడుదల చేయవచ్చని చెబుతున్నాయి. అయితే డిమాండుకు అనుగుణంగా ప్రస్తుతం సర్వీసులను అందించలేకపోతున్నట్లు వివరించాయి. దీంతో గోల్డ్ లోన్ మార్కెట్లో 30 శాతం వాటాకు బదులు 15 శాతాన్నే కైవసం చేసుకున్నట్లు అభిప్రాయపడ్డాయి. అయితే రుపీక్ తో భాగస్వామ్యం ఏర్పాటు చేయడం ద్వారా స్టేట్ బ్యాంక్ గోల్డ్ లోన్స్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలగనున్నట్లు తెలియజేశాయి. రూ. 1200 కోట్లు రుపీక్ తో స్టేట్ బ్యాంక్ జట్టు కడితే.. 2021 మార్చికల్లా రూ. 1,200 కోట్లమేర గోల్డ్ లోన్స్ ను పంపిణీ చేసే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల కారణంగా ఎన్బీఎఫ్సీ తదితర ఫిన్ టెక్ సంస్థలు మార్కెట్లో విస్తరించేందుకు వీలు చిక్కడంలేదని ఫైనాన్షియల్ నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి గోల్డ్ లోన్స్.. భద్రత కలిగినవి కావడంతో డిఫాల్ట్ సమస్యలు తక్కువేనని చెబుతున్నారు. -
ఫిన్‌టెక్.. ‘కంటెంట్’ మంత్రం!
న్యూఢిల్లీ: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడుల సేవలు అందిస్తున్న నవతరం ఫిన్‌టెక్ స్టార్టప్‌లు.. అల్లకల్లోల సమయాల్లో కస్టమర్లను కాపాడుకునేందుకు, వారు మార్కెట్లకు దూరంగా వెళ్లకుండా ఉండేందుకు పలు రకాల సేవలతో ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకమైన కంటెంట్ కూడా ఒకటి. స్టాక్ మార్కెట్లు దీర్ఘకాలంగా తీవ్ర అస్థిరతల్లో ఉండడంతో కంపెనీలు ఈ తరహా చర్యల దిశగా అడుగులు వేస్తున్నాయి. జీరోధా, గ్రోవ్ వంటి సంస్థలు బ్లాగ్ పోస్ట్‌లు, సోషల్ మీడియా సందేశాలు, మార్కెట్లపై విజ్ఞానాన్ని పెంచే వినూత్నమైన వీడియోలను అందిస్తున్నాయి. వీటి ద్వారా ఆటుపోట్లతో కూడిన మార్కెట్లలో పెట్టుబడి అవకాశాల గురించి తెలియజేస్తూ ఇన్వెస్టర్లు తగిన నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రోత్సహిస్తున్నాయి. జీరోధా సేవలు... ‘‘అస్థిరతలతో కూడిన మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవర్తన అందరిదీ ఒకే విధంగా ఉంటుంది. కనుక గతంలో ఇన్వెస్టర్లు ఏ విధంగా స్పందించారన్న విషయంపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. గ్రాఫ్‌లు, చార్ట్‌ల సాయంతో ఈ తరహా మార్కెట్ పరిస్థితుల్లో ఉన్న అవకాశాల గురించి వివరిస్తున్నాం’’ అని జీరోధా సంస్థలో ఈక్విటీ పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కార్తీక్ రంగప్ప తెలిపారు. జీరోధా సంస్థ వర్సిటీ, ట్రేడింగ్‌క్యుఎన్‌ఏ, జెడ్‌కనెక్ట్ అనే మూడు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇన్వెస్టర్ల ఆందోళనలు, ప్రశ్నలకు వీటి ద్వారా సమాధానాలు ఇస్తోంది. ఇప్పటి వరకు 46,000 విచారణలను ఈ సంస్థ స్వీకరించింది. ఆప్షన్ల ట్రేడింగ్, పన్నులపై ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. రోజూ 20–40 వరకు విచారణలు వస్తున్నాయని రంగప్ప పేర్కొన్నారు. ఫలానా స్టాక్ ఫలానా ధర ఉన్నప్పుడు ఇన్వెస్టర్‌ను అప్రమత్తం చేసేందుకు ‘సెట్ యాన్ అలర్ట్’ ఆప్షన్, స్టాక్ రిపోర్టులు, టెక్నికల్స్, ఫండమెంటల్స్, చార్ట్‌లను జెరోదా ఆఫర్ చేస్తోంది. వీటిని జీరోధా కైట్ యాప్, పోర్టల్ నుంచి సులభంగా పొందొచ్చు. ఈటీ మనీ... అస్థిరతల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించే ప్రయత్నాన్ని ఈటీ మనీ చేస్తోంది. ‘‘వాస్తవ గణాంకాలు, సమాచారం ఆధారంగా అస్థిరతల సమయాల్లో ఎలా నడుచుకోవాలన్న దానిపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతీ మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించి రిపోర్టు కార్డులతో సులభమైన ఇంగ్లిష్‌లో తెలియజేస్తున్నాం’’ అని ఈటీ మనీ సీఈవో ముకేష్ కర్లా తెలిపారు. టైమ్స్ గ్రూపులో భాగమైన టైమ్స్ ఇంటర్నెట్కు చెందిన అనుబంధ కంపెనీయే ఈటీ మనీ. ఇతర సంస్థలూ... 22 లక్షల యూజర్ల బేస్ కలిగిన గ్రోవ్ సంస్థ వీడియో కంటెంట్‌ను ఇన్వెస్టర్లకు అందిస్తోంది. ‘‘వీడియో, టెక్ట్స్ కోసం 12 మందితో కూడిన కంటెంట్ బృందం మాకు ఉంది. పెట్టుబడుల అంశాలపై మాట్లాడాలంటూ పరిశ్రమకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నాం. వీడియోలు చాలా సులభంగా, తక్కువ అంశాలతో అవగాహన కల్పించే విధంగా ఉండేలా చూస్తున్నాం’’ అని గ్రోవ్ సీఈవో హర్‡్షజైన్ వెల్లడించారు. గ్రోవ్ యూట్యూబ్ సబ్స్క్రయిబర్ల సంఖ్య 5,000 నుంచి 31,000కు పెరగ్గా, ఒక్కో వీడియోకు గతంలో 1,000 వ్యూస్ రాగా, అవి 10,000కు పెరిగాయి. పేటీఎం మనీ సైతం ముగ్గురు సభ్యుల బృందంతో యూ జర్లపై మార్కెట్ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరహా సందేశాలు కస్టమర్లను సర్దుకునేలా చేస్తాయన్నారు పేటీఎం మనీ హోల్‌టైమ్ డైరెక్టర్ ప్రవీణ్ జాదవ్. ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో యూజర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కొత్తేమీ కాదు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడాన్ని సెబీ తప్పనిసరి కూడా చేసింది. అయితే, చిన్న పట్టణాల నుంచీ ఇన్వెస్టర్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా కార్యక్రమాల అవసరం ఎంతో ఉందంటున్నారు నిపుణులు. -
చిన్న పట్టణాలే లక్ష్యంగా ‘ట్యాక్స్ ఇట్ హియర్’
సాక్షి, అమరావతి: మున్ముందు అంతా ఆదాయ పన్ను రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చెయ్యాల్సిన పరిస్థితులు వస్తుండటంతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి... ‘ట్యాక్స్ ఇట్ హియర్’ పేరిట విజయవాడ కేంద్రంగా ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ ఏర్పాటయింది.చిన్న పట్టణాల్లో ఐటీ రిటర్నులు దాఖలు చేయడంలో ప్రజలు, చిన్న వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఐదుగురు స్నేహితులతో కలసి దీన్ని ఆరంభించినట్లు ఫౌండర్ శ్రీకృష్ణ శీలం చెప్పారు. రిఫండ్ ఇప్పించటంతో పాటు ఏడాది పొడుగునా ట్యాక్స్ సేవింగ్ సలహాలను అందించటం తమ ప్రత్యేకత అని ‘సాక్షి’తో చెప్పారు. ‘‘స్థానిక చార్టర్డ్ అకౌం టెంట్ల సేవలు తీసుకుంటూ ద్వితీయశ్రేణి పట్టణాలకు విస్తరించటానికి ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే విశాఖ, తిరుపతి, వరంగల్ పట్టణాల్లో సేవలు ఆరంభిస్తాం. ఇప్పటికే విజయవాడలో 300 మం ది, బెంగళూరులో 128 మంది చార్టర్డ్ అకౌంటెట్స్తో ఒప్పందం చేసుకున్నాం. ఎన్ని రకాల ఆదాయాలున్నప్పటికీ రూ.1,000లకే ఫైలింగ్ సేవలను మేం అందిస్తాం’’ అని ఆయన వివరించారు. తొలి ఏడాది కనీసం 5,000 మంది తమ ద్వారా రిటర్నులు దాఖలు చేస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే వుయ్ఆర్గాడ్జెట్స్ డాట్ కామ్, డీల్బర్ట్ డాట్ కామ్ వంటి తమ స్టార్టప్‌లు సక్సెస్ అయినట్లు శ్రీకృష్ణ చెప్పారు. ఫండింగ్‌కు తొందర లేదు: రూ.60 లక్షల సొంత నిధులతో ట్యాక్స్ ఇట్ హియర్ను ఆరంభించామని శ్రీకృష్ణ చెప్పారు. ‘‘అమెరికాలోని టర్బోట్యాక్స్ సంస్థ స్ఫూర్తితో దీన్ని ప్రారంభించాం. తొలి ఫిన్‌టెక్ స్టార్టప్ కావడంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మేం తొందరపడటం లేదు. సంస్థ ఒక స్థాయికి చేరాక విస్తరణ సమయంలో నిధులపై దృష్టి పెడతాం’’ అని వివరించారు. విద్యార్థులకు అవకాశం: విద్యార్థుల్లోని వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించటానికి ఈ సంస్థ ‘ఇంటర్న్‌షిప్’ పోటీని నిర్వహిస్తోంది. డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దీన్లో పాల్గొనవచ్చు. మొత్తం 160 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిని 80 టీమ్‌లుగా విభజించి పోటీ నిర్వహిస్తామని, వారికి రూ.85,000 నగదు, ఐదుగురికి సంస్థలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. తొలి 5 స్టార్టప్ ఐడియాలకు ఏడాదిపాటు ఫండింగ్ ఇస్తామని చెప్పారు. వివరాలు ట్యాక్స్ ఇట్హియర్ఇంటర్న్షిప్.కామ్‌లో ఉంటాయి.