న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ ఇన్‌క్రెడ్ తాజాగా యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) హోదా దక్కించుకుంది. ప్రస్తుత, కొత్త ఇన్వెస్టర్ల నుంచి 60 మిలియన్ డాలర్లు సమీకరించడంతో ఇది సాధ్యపడింది. తాజా పెట్టుబడుల రాకతో సంస్థ విలువ 1.04 బిలియన్ డాలర్లకు చేరిందని ఇన్‌క్రెడ్ పేర్కొంది. తద్వారా ఈ ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న రెండో సంస్థగా నిల్చిందని పేర్కొంది.
రాబోయే రోజుల్లో వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు ఇన్‌క్రెడ్ సీఈవో భూపీందర్ సింగ్ తెలిపారు. ఎంఈఎంజీకి చెందిన రంజన్ పాయ్, ఆర్‌పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రవి పిళ్లై, డాయిష్ బ్యాంక్ గ్లోబల్ కో–హెడ్ రామ్ నాయక్ తదితరులు ఇన్వెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. ఇన్‌క్రెడ్ సంస్థ కన్జూ్యమర్ రుణాలు, విద్యా రుణాలు మొదలైన వ్యాపార విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment