Unicorn
-
ర్యాపిడో ఇక ‘యూనికార్న్’..
దేశంలో ప్రముఖ రైడ్-షేరింగ్ సంస్థ ‘రాపిడో’ మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తోంది. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సిరీస్-ఈ ఫండింగ్‌లో ఇన్వెస్టర్ల నుంచి 20 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,680 కోట్లు) నిధులు సమీకరణకు హామీ అందుకున్నట్లు ర్యాపిడో తెలిపింది.ఈ తాజా పెట్టుబడులతో రాపిడో విలువ 110 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9,236 కోట్లు) పెరిగింది. యానికార్న్ క్లబ్లో చేరింది. ఒక బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. కొత్తగా సేకరించిన నిధులను దేశం అంతటా రాపిడో కార్యకలాపాలను విస్తరించడానికి, సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి వినియోగిస్తామని కంపెనీ పేర్కొంది.బైక్ ట్యాక్సీ సర్వీస్‌గా 9 సంవత్సరాల క్రితం ర్యాపిడో ప్రారంభమైంది. పవన్ గుంటుపల్లి, అరవింద్ శంఖ, రుషికేష్‌లు 2015లో దీన్ని స్థాపించారు. ఏడాదికేడాది 150% పైగా వృద్ధితో దేశంలో షేర్డ్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా దాని స్థానాన్ని పటిష్టం చేసుకుంది. మొదట్లో బైక్-టాక్సీలపై దృష్టి సారించిన కంపెనీ, ఆ తర్వాత ఆటో, క్యాబ్ సేవలను విస్తరించింది. దేశంలోని 100 కుపైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఈ సీఈవో జీతం 12 రూపాయలే.. నమ్మబుద్ధి కావడం లేదా?
సాధారణంగా కంపెనీల సీఈవో వేతనం రూ.కోట్లలో ఉంటుంది. కానీ ఈ ఫిన్‌టెక్ యూనికార్న్ సీఈవో వార్షిక జీతం కేవలం 12 రూపాయలే. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ కథనం చదవండి.ప్రైవేట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ప్రైవేట్ సర్కిల్ రీసెర్చ్ యూనికార్న్ వ్యవస్థాపకుల మధ్యస్త, సగటు వేతన అంతరాలపై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఫిన్‌టెక్ యూనికార్న్ స్లైస్ ఫౌండర్, సీఈవో రాజన్ బజాజ్ 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 వార్షిక వేతనం మాత్రమే తీసుకున్నారు.సీఈవో బజాజ్ జీతం నామమాత్రంగా ఉన్నప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో చెల్లింపులు, రుణ వ్యాపార కార్యకలాపాల నుంచి స్లైస్ రూ .847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ తన అప్పటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తి అయిన ప్రీపెయిడ్ కార్డుపై రివాల్వింగ్ క్రెడిట్ లైన్‌ను రద్దు చేసినప్పటికీ కంపెనీ దీనిని సాధించగలిగింది. -
సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన యూనికార్న్‌లు ఇవే..
సమాజంలో పేరుప్రఖ్యాతలు ఉన్న సెల్రబిటీలు తాము సంపాదిస్తున్న డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారనే అనుమానం ఎప్పుడైనా కలిగిందా.. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో టెక్ కంపెనీలు అనూహ్యంగా వృద్ధి చెందుతాయని నమ్మి వాటికి వెంచర్కాపిటలిస్ట్లుగా, ఏంజిల్ ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. వాటిలో పెట్టుబడి పెట్టి తమ సంపదను మరింత పెంచుకుంటున్నారు. అప్పటికే వారి రంగాల్లో అన్నివిధాలా సక్సెస్ అయినవారు కేవలం ఆలోచనే వ్యాపారంగా మొదలయ్యే స్టార్టప్‌ల్లో పెట్టుబడి అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అలాంటి వాటిలోనూ కొందరు క్రికెటర్లు, సినీ ప్రముఖులు విజయం సాధించారు. అంతేకాదు తాము ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు యూనికార్న్ హోదాను సైతం దక్కించుకున్నాయి. ఈక్విటీకి బదులుగా చిన్న వ్యాపార సంస్థల్లో ఇన్వెస్ట్ చేసే వారిని ఏంజెల్ ఇన్వెస్టర్లు అంటారు. అలా సినీ, క్రికెట్ ప్రముఖులు ఏంజెల్ ఇన్వెస్టర్లుగా ఉన్న కొన్ని స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా(కంపెనీ విలువ రూ.8300 కోట్లు) మారాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ-మొబైల్ ప్రీమియర్ లీగ్ మొబైల్ ప్రీమియర్ లీగ్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ 2018లో ప్రారంభమైంది. 2019లో కోహ్లీ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. 2021లో 150 మిలియన్ డాలర్లు నిధులను కంపెనీ సమీకరించింది. దీంతో 2.3 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో యూనికార్న్ క్లబ్లో చేరింది. విరుష్క దంపతులు-డిజిట్ ఇన్సురెన్స్ డిజిటల్ ఇన్సురెన్స్ కంపెనీ అయిన ‘డిజిట్ ఇన్సురెన్స్’ 2016లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో విరాట్-అనుష్కశర్మ దంపతులు 2020లో ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. 2021లో 1.9 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో ఈ కంపెనీ యూనికార్న్‌గా అవతరించింది. మహేంద్ర సింగ్ ధోనీ-కార్స్24 కార్స్24 అనే ప్రీ ఓన్డ్ కార్స్ విక్రయాలు, ఫైనాన్సింగ్ చేపట్టే సంస్థను 2015లో మొదలుపెట్టారు. ఈ కంపెనీలో మహేంద్ర సింగ్ ధోనీ 2019లో ఇన్వెస్ట్ చేశారు. ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ కూడా మహీనే. 2020లో 200 మిలియన్ డాలర్లను కంపెనీ సమీకరించింది. 1 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో యూనికార్న్ స్టేటస్ సంపాదించింది. శ్రద్ధా కపూర్-మైగ్లామ్ ఆన్లైన్ మేకప్ బ్రాండ్ మైగ్లామ్ 2017లో మొదలుపెట్టారు. 2021 జూన్‌లో శ్రద్ధా కపూర్ పెట్టుబడి పెట్టారు. 2021 నవంబర్‌లో ఈ కంపెనీ యూనికార్న్ స్టార్టప్ హోదా సాధించింది. సచిన్ తెందూల్కర్-స్పిన్నీ పాత కార్లను విక్రయించే సంస్థ స్పిన్నీను 2015లో స్థాపించారు. సచిన్ తెందూల్కర్ 2021లో ఇందులో పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 2021 నవంబర్‌లో ఇది యూనికార్న్‌లో చేరింది. శిఖర్ ధావన్-అప్‌స్టాక్స్ ఆన్లైన్ స్టాక్‌బ్రోకర్ అయిన అప్‌స్టాక్స్‌ను 2012లో ప్రారంభించారు. క్రికెటర్ శిఖర్ ధావన్ 2022లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఆయన పెట్టుబడి పెట్టడానికి ఏడాది ముందే అంటే 2021 నవంబర్లోనే ఈ కంపెనీ యూనికార్న్ జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా విడుదలైన హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 171 అంకురాలు యూనికార్న్ హోదా సాధించాయి. అంటే ఏడాదిలో రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్ పుట్టుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,453 యూనికార్న్‌లున్నాయి. 2022తో పోలిస్తే 7% అధికంగా కొత్త సంస్థలు ఈ జాబితాలో చేరినట్లు నివేదికలో తెలిపారు. -
ప్రపంచ యూనికార్న్‌లలో స్థానం నిలుపుకున్న భారత్
అత్యధిక యూనికార్న్‌లు కలిగిన కంపెనీల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా భారత్ మూడో స్థానంలో నిలిచినట్లు హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 నివేదిక ద్వారా తెలిసింది. ఈమేరకు కొన్ని ఆసక్తికర అంశాలను నివేదికలో వెల్లడించారు. నివేదికలోని వివరాల ప్రకారం.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 171 అంకురాలు యూనికార్న్ (కంపెనీ విలువ రూ.8300 కోట్లు) హోదా సాధించాయి. అంటే ఏడాదిలో రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్ పుట్టుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,453 యూనికార్న్‌లున్నాయి. 2022తో పోలిస్తే 7% అధికంగా కొత్త సంస్థలు ఈ జాబితాలో చేరాయి. కొత్తగా అమెరికాలో 70, చైనాలో 56 సంస్థలు యూనికార్న్ స్థాయికి చేరాయి. దాంతోపాటు యూఎస్‌లో 21, చైనాలో 11 కంపెనీలు ఈ హోదా నుంచి తప్పుకున్నాయి. ఇతర దేశాల నుంచి 45 కొత్త అంకురాలు యూనికార్న్‌లుగా మారాయి. భారత్‌లో మాత్రం గతంలో మొత్తం 68 యూనికార్న్లుండేవి. వాటి సంఖ్య గతేడాది 1 తగ్గి 67కు చేరింది. అయితే గతేడాదితోపోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మూడో స్థానంలోనే కొనసాగుతోంది. ఇదీ చదవండి: భారత్‌లోకి టెస్లా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మస్క్ అమెరికా ప్రపంచంలోనే మొత్తం 703 యూనికార్న్‌లతో తొలి స్థానంలో ఉంది. చైనా 340 యూనికార్న్‌లతో రెండో స్థానంలో నిలిచింది. 53 యూనికార్న్‌లతో యూకే నాలుగో స్థానంలో ఉంది. ఏడాది క్రితం 22 బి.డాలర్ల (సుమారు రూ.1.82 లక్షల కోట్ల) విలువ కలిగిన బైజూస్, ఈసారి జాబితాలోనే లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో మరే కంపెనీకి ఇప్పటివరకు రాలేదు. భారత్‌లో స్టార్టప్ రంగానికి ప్రోత్సాహం తగ్గిందని, వెంచర్క్యాపిటల్ట్లు భారీ పెట్టుబడులు పెట్టడం లేదని హురున్ ఇండియా వ్యవస్థాపకులు అనాస్ రెహ్మన్ జునైద్ తెలిపారు. కంపెనీల విలువ ఆధారంగా హురున్ గ్లోబల్ ఇండెక్స్ విడుదల చేసిన టాప్ సంస్థలు ఈ కింది విధంగా ఉన్నాయి. బైట్ డ్యాన్స్ స్పేస్ ఎక్స్ ఓపెన్ఏఐ యాంట్ గ్రూప్ షీన్ స్ట్రైప్ డేటాబ్రిక్స్ కాన్వా బినాన్స్ విబ్యాంక్ -
2030కల్లా లక్ష కోట్ల డాలర్ల జమ
న్యూఢిల్లీ: కొత్తగా యూనికార్న్‌లుగా ఆవిర్భవించే స్టార్టప్‌ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లు జమయ్యే వీలున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనా వేసింది. 2030కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలకు తెరలేవనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌గా గుర్తించే సంగతి తెలిసిందే. మెకిన్సీ అండ్ కంపెనీతో రూపొందించిన ‘యూనికార్న్ 2.0: తదుపరి ట్రిలియన్ జమ’ పేరుతో సీఐఐ నివేదికను విడుదల చేసింది. రానున్న కాలంలో రిటైల్, ఈకామర్స్, ఆధునిక తరం ఫైనాన్షియల్ సర్వీసులు, తయారీ, ఎస్ఏఏఎస్(శాస్), డిజిటల్ తదితర రంగాలు భారీ వృద్ధికి దన్నుగా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది. శతకాన్ని దాటాయ్ నివేదిక ప్రకారం దేశీయంగా 2011లో తొలి యూనికార్న్ నమోదుకాగా.. దశాబ్దం తదుపరి 100 మార్క్‌ను యూనికార్న్‌లు చేరుకున్నాయి. 2024 జనవరికల్లా 113 యూనికార్న్‌ల ఉమ్మడి విలువ 350 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! యూనికార్న్‌ల సంఖ్య 100ను అధిగమించడం చెప్పుకోదగ్గ విజయంకాగా.. ఇందుకు పలు కీలక అంశాలు సహకరించాయి. ఇందుకు యువత డిజిటల్ సేవలను అందిపుచ్చుకోవడం, విస్తారిత మొబైల్ ఇంటర్నెట్ వినియోగం, మధ్యతరగతి పుంజుకోవడం, దన్నుగా నిలిచిన మార్గదర్శకాలు కారణమయ్యాయి. -
27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి!
‘మన చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి.పెద్దయ్యాక వాటికి పరిష్కారం వెతకాలి.’ - ఒకప్పటి పిల్లలు ఇలాగే ఆలోచించేవారు. కానీ నేటితరంవాళ్లు పెద్దయ్యేదాకా ఆగాలనుకోవడం లేదు. టెక్నాలజీతో అద్భుతాలు చేస్తున్నారు. అలాంటి వారిలో 27 ఏళ్ల పెరల్ కపూర్ ఒకరు. అప్పుడప్పుడే సంపాదనవైపు అడుగులు వేసే సమయంలో ఓ కంపెనీని స్థాపించారు. అనతి కాలంలో భారత్‌లోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆంత్రప్రెన్యూర్లకు భారత్ స్వర్గధామంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా మన దేశంలోనూ యూనికార్న్ కంపెనీల హవా నడుస్తోంది. ఒకప్పుడు యూనికార్న్ హోదా సాధించేందుకు దశబాద్ధాల తరబడి ఎదురు చూసిన స్టార్టప్‌లు ఇప్పుడు నెలల వ్యవధిలోనే యూనికార్న్‌లుగా మారిపోతున్నాయి. వ్యాపారంలో రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. పెరల్ కపూర్ ‘జైబర్ 365’ అనే స్టార్టప్ సంస్థ కూడా అంతే. గత ఏడాది మేలో తన కార్యకలాపాల్ని ప్రారంభించిన ఈ సంస్థ వెబ్3, ఏఐ ఓఎస్ ఆధారిత సేవల్ని అందిస్తుంది. ప్రారంభమైన కొద్ది కాలంలో భారత్, ఆసియా దేశాల్లో ఫాస్టెస్ట్ యూనికార్న్ కంపెనీగా అవతరించింది. వడివడిగా అడుగులేస్తూ ఏఎంపీఎస్ స్టోర్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా, యాంటీయర్ సొల్యూషన్స్‌కు బిజినెస్ అడ్వైజర్‌గా ఇలా పలు కంపెనీల్లో ప్రముఖ పాత్ర పోషించిన పెరల్ తొలిసారి ఫిబ్రవరి 2022లో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించారు. తన జైత్రయాత్రను ప్రారంభించారు. బిలియన్ పే టెక్నాలజీ తర్వాత జైబర్ 365 ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. పెరల్ కపూర్ చదువు, సంస్థ విషయానికొస్తే పెరల్ క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆఫ్ లండన్ నుండి ఎంఎస్సీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ పూర్తి చేశారు. అనంతరం పలు సంస్థల్లో పనిచేశారు. అనంతరం భవిష్యత్‌లో బ్లాక్ చైన్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ బూమ్‌ను ముందుగానే అంచనా వేశాడు. జైబర్ 365ని ప్రారంభించాడు. ప్రస్తుతం యూనికార్న్‌గా అవతరిండచంతో పాటు పెరల్ అత్యంత పిన్న వయస్సుల్లో బిలియనీర్‌ని చేసింది. కాగా, ప్రస్తుతం ఆ సంస్థ తిరుగులేని యూనికార్న్ కంపెనీగా వృద్ది సాధిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
Pearl Kapur మూడు నెలల్లోనే రూ. 9800 కోట్లు : ఎలా బ్రో..?!
భారతదేశం వందలాది బిలియనీర్లకు నిలయం. అంతేకాదు ది ల్యాండ్ ఆఫ్ స్టార్టప్స్ కూడా. కొత్త పరిశ్రమలకు, ప్రతిభావంతులకు కొదవ లేదు. కొత్త వ్యాపారాలతో బిలియనీర్లుగా అవతరిస్తున్న యువ పారిశ్రామికవేత్తలు చాలామందే ఉన్నారు. అయితే 27 ఏళ్ల యువకుడి సక్సెస్ విశేషంగా నిలుస్తోంది.వ్యాణిజ్య దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది. బిలియనీర్లు అనగానే తక్షణమే గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, టాటా లాంటి వ్యాపార దిగ్గజాలు గుర్తొస్తారు. వీరికి వ్యాపార కుటుంబ నేపథ్యంతోపాటు ఎన్నో ఏళ్ల శ్రమ ద్వారా ఈ స్థాయికి ఎదిగారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిచ్చారు. ఆశ్చర్యకరంగా చిన్న వయస్సులోనే వారి సక్సెస్ స్టోరీలను తిరగరాశాడో యువ పారిశ్రామికవేత్త. అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడయ్యాడు పెరల్ కపూర్. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. గుజరాత్‌కు చెందిన పెరల్ కపూర్ Zyber 365 అనే కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీలో కపూర్ వాటా 90 శాతం. అలాగే స్రామ్ & మ్రామ్ గ్రూప్ 8.3 శాతం పెట్టుబడి పెట్టింది. తొలి పెట్టుబడుల సమీకరణలో భాగంగా 100 మిలియన్ డాలర్లను సంపాదించింది. అలా ఇండియా యునికార్న్ ర్యాంకింగ్‌లో 109వ స్థానాన్ని పొందింది. గత ఏడాది మే నెలలో ఆవిర్భవించిన ఆ కంపెనీ కేవలం 90 రోజుల్లోనే రూ. 9,840 కోట్ల స్థాయికి ఎదిగింది. ఇది వెబ్3 , AI-ఆధారిత OS స్టార్ట్-అప్. ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీని యునికార్న్ అంటారు. కేవలం మూడు నెలల్లో యునికార్న్‌గా ఆవిర్భవించింది. లండన్‌లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ భారతదేశం, ఆసియాలో అత్యంత వేగవంతమైన యునికార్న్‌గా ప్రశంసలందుకుంటోంది. త్వరలోనే ఇండియా ప్రధాన కేంద్రంగా పనిచేయాలని భావిస్తోంది. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి MSC ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (CFA పాత్వే) గ్రాడ్యుయేట్ అయిన కపూర్, Web3 టెక్నాలజీ రంగంలో గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. జైబర్ 365కి ముందు, కపూర్ AMPM స్టోర్‌లో ఆర్థిక సలహాదారుగా, యాంటీయర్ సొల్యూషన్స్ బిజినెస్ సలహాదారుగానూ పనిచేశారు. సొంత కంపెనీ పెట్టాలన్న అతని బలమైన కోరిక 2022, ఫిబ్రవరిలో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి నాంది పలికింది. అలా మొదలైన ప్రయాణం స్టార్టప్ Zyber 365, బిలియనీర్ హొదా దాకా ఎదిగింది. -
యూనికార్న్‌గా ఇన్‌క్రెడ్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ ఇన్‌క్రెడ్ తాజాగా యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) హోదా దక్కించుకుంది. ప్రస్తుత, కొత్త ఇన్వెస్టర్ల నుంచి 60 మిలియన్ డాలర్లు సమీకరించడంతో ఇది సాధ్యపడింది. తాజా పెట్టుబడుల రాకతో సంస్థ విలువ 1.04 బిలియన్ డాలర్లకు చేరిందని ఇన్‌క్రెడ్ పేర్కొంది. తద్వారా ఈ ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న రెండో సంస్థగా నిల్చిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు ఇన్‌క్రెడ్ సీఈవో భూపీందర్ సింగ్ తెలిపారు. ఎంఈఎంజీకి చెందిన రంజన్ పాయ్, ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రవి పిళ్లై, డాయిష్ బ్యాంక్ గ్లోబల్ కో–హెడ్ రామ్ నాయక్ తదితరులు ఇన్వెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. ఇన్‌క్రెడ్ సంస్థ కన్జూ్యమర్ రుణాలు, విద్యా రుణాలు మొదలైన వ్యాపార విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఉద్యోగులకు షాకిచ్చిన ‘ఫిజిక్స్‌వాలా’!
ప్రముఖ దేశీయ ఎడ్టెక్ యూనికార్న్ సంస్థ ఫిజిక్స్ వాలా ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. 70 నుంచి 120 మంది ఉద్యోగుల్ని తొలగించింది. దీంతో నిధుల కొరత కారణంగా ఉద్యోగుల్ని తొలగించిన జాబితాలో ఫిజిక్స్ వాలా చేరిపోయింది. అయితే ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. పిడబ్ల్యూలో మేం మిడ్ టర్మ్, అక్టోబర్ నెల ముగిసే సమయానికి ఎండ్ టర్న్ సైకిల్స్‌లో ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తాం. ఫిజిక్స్ వాలా మొత్తం వర్క్ ఫోర్స్‌లో 0.8శాతం కంటే తక్కువ అంటే 70 నుండి 120 మంది ఉద్యోగుల్లో పనితీరులో సమస్యలు ఉన్నట్లు గుర్తించాము’ అని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సతీష్ ఖేంగ్రే ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో అదనంగా 1000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నామని, ఇది వృద్ధి పట్ల తమ నిబద్ధతను బలపరుస్తుందని ఖేంగ్రే తెలిపారు. ఫిజిక్స్ వాలా గత ఏడాది రూ.100 కోట్ల యూనికార్న్ క్లబ్లో చేరింది. ఈ కంపెనీలో వెస్ట్‌బ్రిడ్జ్ కేపిటల్, జీఎస్వీ వెంచర్స్ వంటి కేపిటల్ మార్కెట్ కంపెనీలు 1 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడి దారులు తమ ఫోర్ట్ ఫోలియో కంపెనీ ఫిజిక్స్ వాలాలో పెట్టిన పెట్టుబడులతో లాభాల్ని గడించాలని భావిస్తున్న సమయంలో ఆ సంస్థ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో ఫిజిక్స్ వాలా తన విస్తరణ ప్రయత్నాల్లో భాగంగా కేరళకు చెందిన సైలెమ్ లెర్నింగ్ లో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
పన్ను ఎగవేతకు పాల్పడ్డాయా?, యూనికార్న్ సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు?
దేశీయ ఆదాయపు పన్ను శాఖ అధికారులు యూనికార్న్ సంస్థలు పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా మూడు యూనికార్న్ సంస్థలు ఫస్ట్ క్రై డాట్ కామ్, గ్లోబల్బీస్ బ్రాండ్స్ లిమిటెడ్, ఎక్స్ప్రెస్బీస్లు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డాయని గుర్తించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ దేశీయ యూనికార్న్ జాబితాలో ఉన్న ఫస్ట్ క్రై డాట్ కామ్ ఫౌండర్ సుపమ్ మహేశ్వరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లావాదేవీలపై 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ట్యాక్స్ ఎందుకు చెల్లించ లేదని ప్రశ్నిస్తూ సుపమ్కు జారీ చేసినట్లు నోటీసుల్లో ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్రిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కో, ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుటుంబ సభ్యుల కార్యాలయంతో సహా ఫస్ట్‌క్రైలో ఆరుగురు ఇన్వెస్టర్లు సైతం ఈ నోటీసులు అందుకున్నారని నివేదికలు హైలెట్ చేశాయి. నోటీసులతో సుపమ్ ఆదాయపు పన్ను శాఖతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, ఆదాపు పన్ను శాఖ నోటీసులు, ట్యాక్స్ ఎగవేత అంశాలపై సుపమ్ మహేశ్వరి, క్రిస్ కేపిటల్, సునీల్ భారతి మిట్టల్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం విడుదల కావాల్సి ఉంది. -
లక్ష యూనికార్న్‌లు.. 20 లక్షల స్టార్టప్‌లు సాధ్యమే: కేంద్ర మంత్రి ధీమా
న్యూఢిల్లీ: నవకల్పనలు, ఎంట్రప్రెన్యూర్షిప్ ,ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజిటల్ రంగంలో భారత్ సాధించిన విజయాలు గోరంతేనని .. దేశం ముందు కొండంత అవకాశాలు అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. భవిష్యత్తులో ఒక లక్ష యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), సుమారు 10–20 లక్షల స్టార్టప్‌ల స్థాయికి ఎదిగే సత్తా భారత్‌కి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా టెక్నాలజీతో ప్రజలకు, సమాజానికి, దేశానికి టెక్నాలజీతో ఎలా ప్రయోజనాలు చేకూర్చవచ్చనేది ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని మంత్రి చెప్పారు. పాలనలో, ఆర్థిక వ్యవస్థలోనూ, ప్రభుత్వంలోను డిజిటలైజేషన్ మరింత వేగం పుంజుకోనుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా టెక్నాలజీ, డిజిటల్ రంగంలో భారత్ అంగలు వేయడం ఇప్పుడే ప్రారంభమైందని, ఎదిగేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మంత్రి ఈ విషయాలు వివరించారు. -
సౌత్‌పై కన్నేసిన ఫిజిక్స్‌వాలా.. మూడేళ్లలో రూ. 500 కోట్లు..
న్యూఢిల్లీ: యూనికార్న్ స్టార్టప్ సంస్థ ఫిజిక్స్‌వాలా మూడేళ్లలో ఎడ్టెక్ సంస్థ జైలెమ్ లెర్నింగ్‌ను సొంతం చేసుకోనుంది. కేరళ కేంద్రంగా ఆవిర్భవించిన ఈ ఎడ్టెక్ సంస్థలో 50 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఫిజిక్స్‌వాలా పేర్కొంది. ఇందుకు రానున్న మూడేళ్లలో దశలవారీగా రూ. 500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే వెల్లడించారు. తద్వారా దక్షిణాది మార్కెట్లో మరింత పట్టుసాధించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. రెండు సంస్థల కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఈక్విటీ, నగదు ద్వారా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా జైలెమ్ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు. మూడేళ్లలో రూ. 500 కోట్లు వెచ్చించడం ద్వారా హైబ్రిడ్ లెర్నింగ్ జైలెమ్ మోడల్‌ను సరిహద్దు రాష్ట్రాలకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ అవలంబిస్తున్న ఫలితాలు సాధించే ప్రణాళికల శిక్షణా విధానం తననెంతో ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. -
స్టార్టప్‌లలో 24 వేల మంది ఉద్యోగుల తొలగింపులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 24,000 పైచిలుకు ఉద్యోగులకు 84 ప్రధాన స్టార్టప్స్ ఉద్వాసన పలికాయి. మరికొన్ని కంపెనీలు సిబ్బంది సంఖ్యను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. వీటిలో యూనికార్న్ కంపెనీలైన బైజూస్, చార్జ్బీ, కార్స్24, లీడ్, ఓలా, ఓయో, మీషో, ఎంపీఎల్ తదితర సంస్థలు ఉన్నాయి. కంపెనీనిబట్టి కొన్ని ఏకంగా 85 శాతం వరకు సిబ్బంది సంఖ్యను కుదించడం గమనార్హం. పునర్వ్యవస్థీకరణ, వ్యయ నియంత్రణ, తీవ్ర ఆర్థిక పరిస్థితులు, వ్యాపార విధానం మార్పు వంటివి ఉద్యోగుల తీసివేతలకు ప్రధాన కారణాలు. పనితీరు బాగోలేకపోవడం వల్ల కొంత మందిని కొన్ని కంపెనీలు తొలగించాయి. రాజీనామా చేయాల్సిందిగా కొన్ని సంస్థలు పలువురిని కోరాయి. 19 ఎడ్టెక్ స్టార్టప్స్‌లో నాలుగు యూనికార్న్ కంపెనీలు 9 వేల మందికిపైగా సిబ్బందిని సాగనంపాయి. ఎడ్టెక్ తర్వాత కంజ్యూమర్ సర్వీసెస్, ఈ–కామర్స్ రంగ కంపెనీల్లో ఎక్కువగా తీసివేతలు నమోదయ్యాయి. ఈ మూడు రంగాల్లోని 46 స్టార్టప్స్ సుమారు 19,000 మంది ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. అయిదు ఎడ్టెక్ స్టార్టప్స్ 2022లో మూతపడ్డాయి. ఈ విభాగంలోని 36 స్టార్టప్స్ 2023లో 5,800 మందికి ఉద్వాసన పలికాయి. -
యూనికార్న్‌ల భారత్
ముంబై: యూనికార్న్‌ల విషయంలో భారత్ చైనా కంటే ముందు నిలిచింది. 2022లో మన దేశంలో 23 యూనికార్న్‌లు అవతరించాయి. చైనా మనలో సగం అంటే కేవలం 11 యూనికార్న్‌లకు పరిమితం అయింది. బిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా గుర్తిస్తారు. మన దేశంలో మొత్తం యూనికార్న్‌లు 2022 చివరికి 96కు చేరాయి. అంతకుముందు ఏడాది చివరికి ఇవి 73గా ఉన్నాయి. బెయిన్ అండ్ కో, భారత్‌కు చెందిన ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) భాగస్వామ్యంతో ఒక నివేదికను రూపొందించి విడుదల చేసింది. భారత్‌లో 2021లో 44 యూనికార్న్‌లు అవతరించగా, దీంతో పోలిస్తే గతేడాది సగానికి తగ్గినట్టు తెలుస్తోంది. ఇక గతేడాది కొత్తగా ఏర్పడిన 23 యూనికార్న్‌లలో 9 టాప్–3 మెట్రోలకు వెలుపల అవతరించినవి. భౌగోళికంగా స్టార్టప్‌లకు పెట్టుబడుల మద్దతు మరిన్ని ప్రాంతాలకు చేరుతున్నట్టు ఇది తెలియజేస్తోంది. నాన్ మెట్రోల్లోని స్టార్టప్‌లకు గతేడాది 18 శాతం అధికంగా నిధులు లభించాయి. సాస్ ఆధారిత ఫిన్‌టెక్ సంస్థలు అధిక నిధులు రాబడితే, కన్జ్యూమర్ టెక్నాలజీ స్టార్టప్‌ల నిధుల సమీకరణ తగ్గింది. 2022లో స్థూల ఆర్థిక అంశాల పరంగా అనిశ్చితి, మాంద్యం భయాలు వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులపై ప్రభావం చూపించాయి. పెట్టుబడుల్లోనూ తగ్గుదల 2021తో పోలిస్తే 2022లో యూనికార్న్‌ల సంఖ్య తగ్గడమే కాదు.. స్టార్టప్‌ల నిధుల సమీకరణ కూడా తగ్గింది. 2021లో 38.5 బిలియన్ డాలర్లు స్టార్టప్‌ల్లోకి వచ్చాయి. గతేడాది కేవలం 25.7 బిలియన్ డాలర్ల నిధులే వచ్చాయి. ఆర్థిక అనిశ్చితులు పెరగడంతో ముఖ్యంగా గతేడాది ద్వితీయ భాగంలో పెట్టుబడుల డీల్స్ తగ్గాయి. అయితే, ఆరంభ దశలోని స్టార్టప్‌లకు మాత్రం నిధుల ప్రవాహం మెరుగ్గానే ఉంది. 2022లో 1,600 వెంచర్ క్యాపిటల్ పెట్టుబడి లావాదేవీలు నమోదయ్యాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థల్లో మార్పు.. బెయిన్ అండ్ కో పార్ట్నర్ అర్పణ్సేత్ స్పందిస్తూ. వెంచర్ క్యాపిటల్ సంస్థల ధోరనిలో మార్పు వచ్చిందని, అవి యూనిట్ లాభదాయకతపై దృష్టి సారించాని చెప్పారు. స్టార్టప్‌లు నియంత్రణపరమైన సవాళ్లను చూవిచూశాయని, ఉద్యోగుల తొలగింపులు, కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలు తలెత్తినట్టు, ఇవన్నీ గతేడాది స్టార్టప్‌ల ఫండింగ్పై ప్రభావం చూపించినట్టు వివరించారు. ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ సాస్ ఆధారిత స్టార్టప్‌లకు ఫండింగ్ 2021లో మాదిరే ఉండడం ఆశావహమన్నారు. రానున్న రోజుల్లోనూ స్థూల ఆర్థిక అనిశ్చితుల ప్రభావం స్టార్టప్‌ల ఫండింగ్పై ఉంటుందన్నారు. 2022లో ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు అసాధారణ స్థాయిలో సవాళ్లను చూశాయని ఐవీసీఏ ప్రెసిడెంట్ రాజన్ టాండన్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో నమ్మకం ఉందన్నారు. ‘‘స్టార్టప్‌ల దీర్ఘకాల వృద్ధి అవకాశాల పట్ల ఎంతో ఆశాభావంతో ఉన్నాం. అనిశ్చితులను అధిగమించే, అవకాశాలను గుర్తించే సామర్థ్యాలు వాటికి ఉన్నాయి’’అని టాండన్ చెప్పారు. -
కోటి యూట్యూబ్ సబ్స్క్రైబర్లు: 8500 కోట్లతో సొంత కంపెనీ
న్యూఢిల్లీ: చాలా తెలివైన విద్యార్థి. కష్టపడి చదివేవాడు.10, 12వ తరగతిలో టాపర్.. IITలో సీటు కోసం కష్టపడ్డా... దొరక్కపోవడంతో కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ కాలేజీలో అడ్మిషన్ తో సరిపెట్టుకున్నాడు. అయితేనేం ఇపుడు కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయనే UPకి చెందిన అలఖ్ పాండే. ఐఐటీ రాలేదని నిరాశ చెందకుండా ట్యూషన్ టీచర్‌గా కెరియర్ మొదలు పెట్టి ఇప్పుడు విజయవంతమైన ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగాడు. ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్‌ఫాం ద్వారా బిలియనీర్‌గా ఎదిగాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం ఏలతాడు అన్నట్టు తనలాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అలహాబాద్ కుర్రోడు బిలియనీర్‌గా అలహాబాద్‌కు చెందిన అలఖ్ పాండే ఇంటర్ చదువుతున్నపుడు ఐఐటీ గురించి కలలు కన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ అది సాధ్యం కాలేదు. అయినా కుంగిపోలేదు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనే చదువుకు టాటా చెప్పేసాడు. సొంత కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ట్యూషన్ టీచర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ట్యూటర్‌గా అతని తొలి సంపాదన రూ. 5వేలు మాత్రమే. మరిపుడు వేల కోట్ల విలువైన "ఫిజిక్స్ వాలా" అనే కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా శబాష్ అనిపించుకుంటున్నాడు. యూట్యూబర్ కూడా అయిన అలఖ్ పాండే విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తాడు. అలాగే తన యాప్ ద్వారా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు రోజుకు కనీసం 1.5 గంటలు శిక్షణ తీసుకుంటున్నారంటే అతని క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిజిక్స్ వాలాలో జేఈఈ-నీట్ శిక్షణను కూడా ప్రారంభించాడు. అంతేకాదు ఈనెల (ఫిబ్రవరి) 28న విశ్వాస్ దివస్ పేరుతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెస్ట్ లాంచ్ చేయబోతున్నానని ప్రకటించాడు అలఖ్ పాండే. ఫిజిక్స్ వాలా ఆవిర్భావం ఇంజినీరింగ్ వదిలి అలహాబాద్ తిరిగొచ్చి 2016లో ఫిజిక్స్ వాలా ఛానెల్‌ని ప్రారంభించాడు. దీని తరువాత 2020లో ఒక యాప్‌ను కూడా ప్రారంభించాడు. ఇటీవల భారీ పెట్టుబడులతో పాండే కంపెనీ మొత్తం నికర విలువ రూ.8500 కోట్లుగా నిలిచింది. అలఖ్ యూట్యూబ్ ఛానల్ కు 9.75 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. గతేడాది ఆయన కంపెనీ రూ.350 కోట్లు ఆర్జించింది. కంపెనీలో 19వేల మంది ఉద్యోగులు ఉన్నారు. బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఫిజిక్స్‌వాలా దేశంలోని 101వ యునికార్న్‌గా ఉంది. తాజాగా ఆయన రూ.777 కోట్ల పెట్టుబడులను సమీకరించారు. దేశీయ 101వ యూనికార్న్ ఫిజిక్స్ వాలా ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్ ఫిజిక్స్ వాలా (PWగా పాపులర్) వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, GSV వెంచర్స్ నుండి సిరీస్ A ఫండింగ్ 100 మిలియన్లను సేకరించడం ద్వారా భారతదేశపు 101వ యునికార్న్‌గా అవతరించింది. 2020, 2021లో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వంటి పోటీ పరీక్షలలో 10వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని కంపెనీ గతంలో ప్రకటించింది. భారతదేశంలో కనీసం ఆరుగురిలో ఒకరు వైద్య విద్యార్థులు, 10మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఫిజిక్స్వాలాకి చెందిన వారుంటారని పేర్కొంది. అలాగే బైజూస్, వేదాంతా వంటి ఇతర అనేక ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా ఇప్పటికే 18 నగరాల్లో 20 కంటే ఎక్కువ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేశారు పాండే. 300 మంది సామూహిక వివాహాలకు ఫండింగ్ ఫిబ్రవరి 22న జర్నలిస్ట్ శివాని దూబేతో ఏడు అడుగులు వేశాడు అలఖ్. మరో విశేషం ఏమిటంటే తమ పెళ్లి సందర్బంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే సామూహిక వివాహాలకు ఫండింగ్‌కు ముందుకొచ్చాడు. అంతేకాదు పెళ్లి తరువాత కూడా చదువు కొనసాగించాలనుకునే వారికి చదువుకునేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు పాండే. మార్చి ప్రారంభంలో ప్రయాగ్‌రాజ్, తేలియార్గంజ్లోని NRIPT గ్రౌండ్లో 300మందికి సామూహిక వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah) -
వావ్.. 2500 ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్న కంపెనీ
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజాల నుంచి స్టార్టప్‌ల దాకా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల ఊచకోత వార్తలు ఆందోళన రేపుతోంటే ఒక యూనికార్న్ ఎడ్టెక్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. 2023,మార్చి నాటికి 2500మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు ఫిజిక్స్ వాలా ప్రకటించింది. బిజినెస్ అనలిస్ట్‌లు, డేటా అనలిస్ట్‌లు, కౌన్సెలర్లు, ఆపరేషన్స్ మేనేజర్లు, బ్యాచ్ మేనేజర్లు, టీచర్లు, ఇతర ఫ్యాకల్టీ సభ్యులతో పాటు నిపుణులను నియమిస్తున్నట్లు ఫిజిక్స్ వాలా కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్రతిష్టాత్మక బ్రాండ్ వృద్ధి లక్ష్యాలకనుగుణంగానే ఈ నియామకాలని తెలిపింది. అన్నింటికీ మించి విద్యార్థులందరికీ సరసమైన, నాణ్యమైన విద్యను అందించాలనే తమ విజన్‌కు అనుగుణంగా పనిచేసే ఉత్సాహవంతులైన, నిబద్ధతల వారి కోసం చూస్తున్నామని సంస్థ హెచ్ ఆర్ హెడ్, సతీష్ ఖేంగ్రే తెలిపారు. కాగా కంపెనీలో ప్రస్తుతం 6,500 మంది ఉద్యోగులున్నాయి. ఇందులో 2వేల మంది ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు ఉన్నారు. గత నెలలో, అప్‌స్కిల్లింగ్ విభాగంలో iNeuronని కొనుగోలు చేసింది కంపెనీ. గత ఏడాది బైజూస్, అనాకాడెమీ, వేదాంతు, ఫ్రంట్‌రో మొదలైన అనేక ఎడ్టెక్ కంపెనీలు భారీ లే-ఆఫ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యూనికార్న్‌గా బీఎల్ఎస్
న్యూఢిల్లీ: టెక్ ఆధారిత సర్వీసుల సంస్థ బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ తాజాగా యూనికార్న్ హోదాను అందుకుంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీ షేరు గత ఆరు నెలల్లో 110 శాతం దూసుకెళ్లింది. దీంతో మార్కెట్ విలువ బిలియన్ డాలర్లను దాటింది. ఇదే సమయంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 14 శాతమే బలపడటం గమనార్హం! 2005 నుంచీ కంపెనీ ప్రభుత్వాలు, ఎంబసీలకు ఔట్సోర్సింగ్ వీసాలు, పాస్‌పోర్టులతోపాటు.. సిటిజన్ సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి అర్ధభాగంలో కంపెనీ ఆదాయం 71 శాతం జంప్‌చేసి రూ. 630 కోట్లను తాకగా.. నికర లాభం సైతం 71 శాతం ఎగసి రూ. 82 కోట్లకు చేరినట్లు బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ తెలియజేసింది. (బీఎల్ఎస్ షేరు బీఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 198.5 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 8,153 కోట్లుగా నమోదైంది.) -
యూనికార్న్ జెట్వెర్క్ చేతికి అమెరికా కంపెనీ
న్యూఢిల్లీ: యూనికార్న్ (స్టార్టప్) కంపెనీ జెట్వెర్క్ మ్యానుఫాక్చరింగ్.. అమెరికాకు చెందిన యూనిమాక్ట్స్ ను 39 మిలియన్ డాలర్లు (సుమారు రూ.320 కోట్లు) పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కొనుగోలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని తెలిపింది. ఇదీ చదవండి: CNN layoffs షాకింగ్: ఉద్యోగులకు ముప్పు నేడో, రేపో నోటీసులు! జెట్వెర్క్ కంపెనీ గత ఆరు నెలల్లో నాలుగో కంపెనీని కొనుగోలు చేస్తుండడం గమనించాలి. తాజా డీల్ మాత్రం తొలి విదేశీ కొనుగోలు అవుతుంది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేకు సంబంధించి సరఫరా వ్యవస్థలో భాగమైన కంపెనీలను జెట్వెర్క్ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది. ఇండస్ట్రియల్, కన్జ్యూమర్ ఉత్పత్తులను కాంట్రాక్ట్ విధానంలో తయారు చేసి అందించడం జెట్వెర్క్ చేసే పని. (జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) -
ఓఎన్‌డీసీలోకి మీషో, ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో తాజాగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరింది. కొనుగోలుదారులను హైపర్‌లోకల్ విక్రేతలకు అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడ గలదని సంస్థ తెలిపింది. తమ పైలట్ ప్రాజెక్టు ముందుగా బెంగళూరులో ప్రారంభమై తర్వాత మిగతా నగరాలకు విస్తరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. (ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌లో పల్సర్ పీ 150: ధర ఎంతంటే?) మీషోలో 8 లక్షల మంది పైగా విక్రేతలు ఉన్నారు. విక్రేతలు, వినియోగదారుల వ్యయాల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓఎన్డీసీని తెరపైకి తెచ్చింది. ఆన్లైన్లో తక్కువ రేట్లకు ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలుదారులు దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. (Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు) -
ఐటీ సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉంటాయా? అది ఎంత వరకు నిజం!
విద్యార్ధులకు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సాఫ్ట్ వేర్ జాబ్ కొట్టడం అనేది ఓ డ్రీం. ఎందుకంటే ఆ రంగంలో భారీ ఎత్తున శాలరీలు తీసుకోవచ్చని. కానీ అది ఎంత వరకు నిజం? ఇటీవల బెంగళూర్‌కు చెందిన ‘వీక్డే’ సంస్థ దేశ వ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు ఇతర ప్రొఫెషనల్ రంగాల్లో పనిచేస్తున్న వారి శాలరీల డేటాను కలెక్ట్ చేసింది. ఆ డేటా ప్రకారం..సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఎంత జీతం తీసుకుంటున్నారో..అదే స్థాయిలో ఇతర ప్రొఫెషనల్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు సైతం కళ్లు చెదిరేలా శాలరీలు తీకుంటున్నారనే ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. 50వేల మంది ఉద్యోగుల నుంచి బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న అమిత్ సింగ్ ఐటీ ఉద్యోగ నియామకాల సంస్థ ‘వీక్ డే’ను స్థాపించారు. ఆ సంస్థ కోసం దేశ వ్యాప్తంగా 50 వేల మంది ఐటీ నిపుణుల వద్ద నుంచి సేకరించిన డేటానే అమిత్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దేశంలో దిగ్గజ ఐటీ కంపెనీలు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర సంస్థల్లో పనిచేసే ఐటీ ఉద్యోగుల శాలరీ కంటే..షేర్ చాట్, క్రెడ్, మీషో, స్విగ్గీతో పాటు ఇతర స్టార్టప్‌లలో పనిచేసే ఐటీ ఉద్యోగులు జీతాలు భారీగా ఉన్నట్లు తేలింది. ఎవరికెంత! వీక్డే సర్వే ప్రకారం..4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ( మిడ్ లెవల్) సాఫ్ట్వేర్ ఉద్యోగికి సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ అత్యధికంగా ఏడాదికి రూ.47 లక్షలు చెల్లిస్తుండగా..ఫిన్ టెక్ కంపెనీ క్రెడ్, ఈ కామర్స్ కంపెనీ మీషో రూ.40 లక్షల నుంచి రూ.39 లక్షల ప్యాకేజీ అందిస్తున్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లో ఇదే నాలుగేళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీతం రూ.10 లక్షలుగా ఉంది.ఈ టెక్ సంస్థల్లో ఏడాదికి బేసిక్ శాలరీ రూ.7 లక్షలు. ఈ శాలరీ స్టార్టప్‌లు చెల్లించే వేతనం కంటే చాలా తక్కువగా ఉంది. రికార్డులను తిరిగి రాస్తున్నాయ్ ఏదైనా స్టార్టప్ మంచి పనితీరును కనబరిచి పెట్టుబడులు సాధిస్తూ దాని మార్కెట్ వాల్యుయేషన్ వన్ బిలియన్ డాలర్లకు చేరుకుంటే దాన్ని యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఈ యూనికార్న్‌లు అమెరికా, యూరప్, చైనా, జపాన్ దేశాల్లోనే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దేశీయ కంపెనీలు వ్యాపారంలో రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. బైజూస్, ఫ్రెష్ వర్క్స్, క్విక్కర్, షాప్ క్లస్ వంటి యూని కార్న్ సంస్థలు ఉద్యోగులకు చెల్లించే జీతాల విషయంలో రికార్డులను తిరగ రాస్తున్నాయి. జొమాటాలో జీతం 50వేల మంది ఐటీ ఉద్యోగుల డేటాలో.. 4 ఏళ్ల అనుభవం ఉన్న షాప్ క్లస్ ఐటీ ఉద్యోగికి ఏడాదికి రూ.12 లక్షలు, జొమాటోలో రూ.32 లక్షలు, పేటీఎంలో రూ.22 లక్షలు, ఫ్లిప్ కార్ట్‌లో రూ.36 లక్షలు చెల్లిస్తున్నాయి. ఐటీ కంపెనీస్ వర్సెస్ యూనికార్న్ కంపెనీలు జీతాల సంగతి పక్కన పెడితే యూనికార్న్ కంపెనీలతో పోలిస్తే ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువ కాలం పని చేస్తున్నారు. పైన పేర్కొన్న స్టార్టప్‌లలో ఉద్యోగి సగటున 1.5 నుండి 2 సంవత్సరాల వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ వంటి కంపెనీల్లో పనిచేసే ఇంజనీర్లు సగటున 2.4 సంవత్సరాలు, బైజూస్ కంపెనీలో పని చేసే ఇంజనీర్లు సగటున 1.4 సంవత్సరాలు, క్రెడ్లో పనిచేసే ఇంజనీర్లు సగటున 1.8 సంవత్సరాలు ఉంటున్నట్లు వీక్ డే రిపోర్ట్‌లో తేలింది. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒకే సంస్థలో ఏళ్లకు ఏళ్లు పనిచేయడానికి కారణం.. సంవత్సరానికి సగటున 10 శాతం శాలరీ పెంపుదల ఉంటుందనే భావన ఎక్కువగా ఉందని వీక్ డే జరిపిన అనాలసిస్‌లో ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగుల రిజైన్కి కారణం ఇతర ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఐటీ సెక్టార్లో ఉద్యోగులు ఒక సంస్థను వదిలి మరో సంస్థకు వెళ్లుతున్నారు. అందుకు కారణం.. సంస్థ మారిన ప్రతి సారి 50 నుంచి 70శాతం శాలరీ ఎక్కువగా పొందుతున్నారు. అందుకే భారత్‌లో ఐటీ ఉద్యోగులు తరుచు జాబ్ మారేందుకు దోహదపడుతుంది. -
యూనికార్న్ హోదాకు సర్విఫై!
ముంబై: వివిధ స్మార్ట్‌ఫోన్ వెండార్ ప్రొడక్టుల(డివైస్‌లు) లైఫ్‌సైకిల్‌ను నిర్వహించే సర్విఫై తాజాగా 6.5 కోట్ల డాలర్లు(రూ. 520 కోట్లు) సమీకరించింది. సింగులారిటీ గ్రోత్ అపార్చునిటీ ఫండ్ అధ్యక్షతన పలు సంస్థలు నిధులు అందించినట్లు సర్విఫై వెల్లడించింది. తాజా పెట్టుబడులతో కంపెనీ విలువ దాదాపు బిలియన్ డాలర్లకు చేరినట్లు సర్విఫై వ్యవస్థాపకుడు శ్రీవాస్తవ ప్రభాకర్ పేర్కొన్నారు. శామ్సంగ్, ఆపిల్ తదితర గ్లోబల్ బ్రాండ్లకు సర్వీసులందించే సంస్థ రానున్న 18-24 నెలల్లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే లక్ష్యంతో ఉన్నట్లు శ్రీవాస్తవ తెలియజేశారు. ఐరన్ పిల్లర్, బీనెక్ట్స్, బ్లూమ్ వెంచర్స్, డీఎంఐ స్పార్కిల్ ఫండ్ తదితరాలు పెట్టుబడులు సమకూర్చినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో మరోసారి 7 కోట్ల డాలర్లవరకూ నిధులను సమీకరించే వీలున్నట్లు తెలియజేశారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి!
న్యూఢిల్లీ: కరోనా అనంతరం మారిన పరిస్థితుల్లో.. మహిళలు ఇంటి నుంచి పనిచేసేందుకే (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అవకాశం కల్పించే కంపెనీల వైపు చూస్తున్నారు. ఇంటి నుంచి పని, ఉన్న చోట నుంచే పని, ఇల్లు, కార్యాలయాల నుంచి పనికి వీలు కల్పించే హైబ్రిడ్ నమూనాలను అనుసరించే కంపెనీలు.. మహిళల నుంచి ఎక్కువగా ఉద్యోగ దరఖాస్తులు వస్తున్నట్టు తెలిపాయి. ఈ పరిణామంతో కొన్ని కంపెనీల్లో స్త్రీ/పురుష ఉద్యోగుల సమానత్వం/వైవిధ్యం పరంగా మెరుగుదల కనిపిస్తోంది. ఆర్పీజీ గ్రూపు పరిధిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న వారిలో మహిళలు 15–20 శాతం పెరిగారు. దీనివల్ల తాము లింగ వైవిధ్య లక్ష్యాలను త్వరగా చేరుకోవడం సాధ్యపడుతుందని ఆర్పీజీ గ్రూపు భావిస్తోంది. ‘‘మా రిమోట్ పని విధానం ఎంతో మంది మహిళలకు ప్రోత్సాహకరంగా ఉంది. దాంతో వారు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకుంటున్నారు’’అని ఆర్పీజీ గ్రూపు చీఫ్ టాలెంట్ ఆఫీసర్ సుప్రతిక్ భట్టాచార్య తెలిపారు. ముంబైకి చెందిన ఆర్పీజీ గ్రూనపు ఉద్యోగులను వారి విధుల ఆధారంగా వివిధ కేటగిరీలుగా విభజించింది. కొన్ని కేటగిరీల్లోని వారికి 50 శాతం సమయాన్ని ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తోంది. కొన్ని కేటగిరీల్లో నూరు శాతం ఉన్న చోట నుంచే పనిచేసేందుకు అనుమతిస్తోంది. స్పష్టమైన మార్పు.. విద్యా సంబంధిత టెక్నాలజీ యూనికార్న్ ఎరూడిటస్.. గ్రూపు పరిధిలోని అన్ని స్థాయిల్లో కరోనాకు ముందు మహిళలు 41 శాతంగా ఉంటే, కరోనా తర్వాత 51 శాతానికి పెరిగారు. అదే మధ్య స్థాయి ఉద్యోగాల్లో అయితే 37 శాతంగా ఉన్న మహిళలు 47 శాతానికి చేరారు. ‘‘నూరు శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మళ్లిన తర్వాత గతంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోని మహిళలు సైతం ఇప్పుడు ముందుకు వస్తున్నారు’’అని ఎరూడిటస్ సీఈవో అశ్విన్ దామెర తెలిపారు. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఈ విధానం మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. హెచ్ఆర్ టెక్నాలజీ స్టార్టప్ అయిన ‘స్ప్రింగ్‌వర్క్స్’ నూరు శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ సంస్థలో మహిళా ఉద్యోగులు 30 శాతం నుంచి 35 శాతానికి పెరిగారు. ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటు కల్పించడం వల్ల టైర్–2, టైర్–3 పట్టణాల నుంచి నిపుణుల సేవలను పొందగలిగినట్టు యాక్సిస్ బ్యాంకు సైతం తెలిపింది. లేదంటే ఈ అవకాశం ఉండేది కాదని పేర్కొనడం గమనార్హం. -
ఆర్థిక ఇబ్బందులతో దేశీ స్టార్టప్ కంపెనీలు సతమతం
(కంచర్ల యాదగిరిరెడ్డి) దేశంలో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న కొత్త మంత్రం స్టార్టప్.. స్టార్టప్.. వినూత్నమైన ఉత్పత్తులు, సేవలతో సరికొత్త వ్యాపారాలను సృష్టించి భారత యువత ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. రూ. వందల వేల కోట్ల విలువైన పెట్టుబడులు స్టార్టప్ కంపెనీల్లోకి ప్రవహిస్తూ ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ప్రతి వ్యవస్థలో ఒడిదుడుకులు ఉన్నట్లే ప్రస్తుత మన స్టార్టప్ కంపెనీలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రూ. లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు... దేశంలో ఇప్పటివరకు దాదాపు 72 వేల స్టార్టప్‌లు ఏర్పాట య్యాయి. ఈ ఏడాది జూన్ వరకూ భారత స్టార్టప్ కంపెనీలు ఆకర్షించిన పెట్టుబడులు సుమారు రూ. 1.36 లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా. కేవలం 891 ఒప్పందాల ద్వారా ఈ స్థాయి పెట్టుబడులు రావడమన్నది చెప్పుకోదగ్గ విషయమే. ఈ సమయంలోనే సుమారు 18 స్టార్టప్ కంపెనీలు 100 కోట్ల డాలర్ల విలువైనవిగా (యూనికార్న్)గా మారిపోయాయి. గతేడాదితో పోలిస్తే వచ్చిన పెట్టుబడులు, యూనికార్న్‌లుగా ఎదిగిన కంపెనీల సంఖ్య రెండూ ఎక్కువే. సరిపెట్టుకుంటున్న స్టార్టప్‌లు.. పెట్టుబడులు తగ్గిపోయిన నేపథ్యంలో భారత స్టార్టప్ కంపెనీలు కూడా అందుకు తగ్గట్లుగా సర్దుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, మార్కెటింగ్ వ్యవహారాలను తగ్గించుకోవడం ద్వారా పొదుపును పాటించే ప్రయత్నం చేస్తున్నాయి. భారం తగ్గించుకొనే క్రమంలో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 10 వేలకు పైనే. ఈ పరిస్థితి ఇంకో ఏడాదిన్నర వరకూ కొనసాగే అవకాశం ఉందని అంచనా. కోవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు ఉనికిలోకి రాగా విద్యకు సంబంధించిన స్టార్టప్‌లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. వీడియో గేమింగ్ పరిస్థితి కూడా ఇదే. అయితే కోవిడ్ సద్దుమణుగుతున్న నేపథ్యంలో ఈ రంగాలకు నిధుల కొరత ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే చాలా రంగాల్లోని స్టార్టప్‌లు గత రెండేళ్లుగా నిధులు సేకరించలేదు. ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి కంపెనీలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు వస్తేనే సమీప భవిష్యత్తులో మళ్లీ స్టార్టప్‌లు నిలదొక్కుకోగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుటపడితే నిధులు వస్తాయని, కాకపోతే వచ్చే ఈ నిధులను కొంచెం ఆచితూచి తగిన వ్యాపార ప్రణాళికతో ఖర్చు చేస్తే మేలన్నది వారి అభిప్రాయం. మే నెలలో మందగమనం.. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో పెట్టుబడుల మొత్తం రూ. 1.36 లక్షల కోట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఫలితంగా ఏప్రిల్ నుంచే మందగమనం మొదలైంది. మే నెలలో వచ్చిన పెట్టుబడులు రూ. 14 వేల కోట్లు మాత్రమే. ఇందులోనూ గతంలో కుది రిన ఒప్పందాల కారణంగా వచ్చినవే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ల పతనం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, సరుకు రవాణా ఇబ్బందులు, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటివి భారత స్టార్టప్ వ్యవస్థపైనా ప్రభావం చూపాయని నిపుణులు విశ్లేస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇందు కు ఒక కారణంగా చెబుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వెంచర్ క్యాపిటలిస్టులైన సాఫ్ట్ బ్యాంక్, టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్లు మే నెలలోనే 2022 సంవత్సరానికిగాను నష్టాలను ప్రకటించడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ప్రతి త్రైమాసి కానికి 1,000–1,100 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాగా మే–జూన్ త్రైమాసికంలో అది 40% దాకా తగ్గిపోయి 600–700 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ( పాపం.. ఓలా అంచనా తల్లకిందులైందే!) నిపుణుల మాట ఇదీ.. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కగలిగినవి మాత్రమే భవిష్యత్తులో దేశంలోని దిగ్గజ కంపెనీల జాబితాలోకి చేరిపోతాయి. 2021ని స్టార్టప్‌లకు ఊపిరి పోసిన ఏడాదిగా చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కగలిగితే వాటి భవిష్యత్తుకు ఢోకా ఉండదు. – ఆశిష్ శర్మ, ఇన్నోవెన్ క్యాపిటల్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ భారత స్టార్టప్ వ్యవస్థకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టెక్నాలజీ, ఇన్నొవేషన్, ఉత్పత్తులన్నీ యథాతథంగా కొనసాగుతాయనేది నా నమ్మకం. కంపెనీల వ్యాల్యుయేషన్‌లో తగ్గుదల ఉన్నా మొత్తమ్మీద పరిస్థితి బాగుంది. – సి.విజయ్ కుమార్, సీఈవో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత 2 నెలల్లో స్టార్టప్ వ్యవస్థకు సమస్యల ముసురు పట్టుకుంది. పెట్టుబడులు తగ్గిపోయాయి. ఉన్న కంపె నీల వ్యాపార ప్రణాళికలు వెనుకంజ వేస్తుండగా కొత్త వాటికి నిధులు గగనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? సమస్యలు ఇలాగే ఉంటే వాటి భవిష్యత్తు ఏమవుతుంది? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలి. – కేశవ్ ఆర్. మురుగేష్, నాస్కామ్ మాజీ చైర్మన్ స్టార్టప్ కంపెనీలు మౌలికాంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వెంచర్ క్యాపిటలిస్టులు లేదా పెట్టు బడిదారులు గతంలో మాదిరిగా సులువుగా పెట్టుబ డులు పెట్టడం లేదు. ఉత్పత్తి లేదా సేవ ఆదాయాన్ని ఇవ్వగలదా లేదా? అన్నది చూస్తున్నారు. ఇప్పటివరకూ చాలా వరకూ స్టార్టప్‌లు తమ ఉత్పత్తులు/సేవలను రాయితీ ధరలతో అమ్మే ప్రయత్నం చేశాయి. ఇలా కాకుండా వాస్తవ అవసరాలను గుర్తించి చేసే వ్యాపారం లాభదాయకమా కాదా? అని ఆలోచించుకుని ముందడుగు వేయడం మంచిది. – మురళి బుక్కపట్నం, టై గ్లోబల్ ఉపాధ్యక్షుడు స్టార్టప్‌లకు అకస్మాత్తుగా నిధులు మందగించడం ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో భాగమే. దీనిపై ఆందోళన అవ సరం లేదు. అయితే కేవలం వ్యాల్యుయేషన్పైనే ఆధార పడి కొంతకాలంగా స్టార్టప్ కంపెనీలు పనిచేస్తుండటం ప్రస్తుత పరిస్థితికి కారణం కావచ్చు. ఆదాయాన్ని సృష్టించగలమా? లాభాలు వస్తాయా అనే ఆలోచన లేకుండా కంపెనీలు పెట్టుబడిదారుల నుంచి వస్తున్న నిధులను ఖర్చు చేయడమే ఆందోళన కలిగించే విషయం. – ఇటీవలి నివేదికలో ఆర్బీఐ -
కష్టకాలంలోనూ ఎగురుతున్న గుర్రాలు
కనీసం వందకోట్ల డాలర్ల విలువను సాధించగలిగిన స్టార్టప్ సంస్థలను యూనికార్న్‌లు అంటున్నారు. 2022 నాటికి భారత్ 100 యూనికార్న్‌ల మైలురాయిని తాకింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇవి ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అమెరికా, చైనా తర్వాత ఎక్కువ యూనికార్న్‌లను కలిగిన దేశం మనదే. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను వీటి అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్‌ల శరవేగ వ్యాప్తి గురించి అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. ఉక్రెయిన్‌లో సైనిక సంఘర్షణ, పెరుగుతున్న అంతర్జాతీయ వడ్డీరేట్లు అనే ద్వంద్వ తాకిడి నుంచి కోలుకోవడానికి ఆర్థిక వ్యవస్థ మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ, ఒక రంగం మాత్రం శరవేగంగా పెరుగుతోంది. బాహ్య పరిణామాలకు ఈ రంగం ఏమాత్రం ప్రభావితం కానట్లు కనిపిస్తోంది. ఆ రంగం ఏదో కాదు, యూనికార్న్‌లు అని పేరొందిన భారీ స్టార్టప్ సంస్థలు. ఈ సంవత్సరం భారత్ 100 యూనికార్న్‌ల మైలురాయిని తాకింది. 2011లో దేశంలో తొలి స్టార్టప్ వెంచర్ యూనికార్న్‌గా మారి దశాబ్దం గడిచింది. ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత యూనికార్న్ సంస్థలు అధికంగా ఉన్న మూడో దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఉమ్మడిగా చూస్తే ఈ వంద స్టార్టప్ సంస్థలు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వీటి మొత్తం విలువ ఇప్పుడు 333 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ఒక బిలియన్ డాలర్ల విలువను మార్కెట్లో సాధించిన స్టార్టప్ కంపెనీని యూనికార్న్ అని పిలుస్తున్నారు. ఒక దశాబ్దం క్రితం ఇలాంటి వెంచర్లు చాలా అరుదుగా ఉండేవి కాబట్టి పూర్వకాలపు పౌరాణిక ఒంటికొమ్ము రెక్కల గుర్రాల్లాగా వీటిని వర్ణించేవారు. కానీ ఇప్పుడు, అమెరికా 487 యూనికార్న్ సంస్థలనూ, చైనా 301 సంస్థలనూ కలిగి ఉన్నాయి. ఇప్పుడు యూనికార్న్ అనే పదం డెకాకార్న్ వరకు విస్తరిస్తోంది. అంటే కనీసం 10 బిలియన్ డాలర్ల విలువ గల సంస్థలుగా ఇవి ఎదుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఫ్లిప్‌కార్ట్, నైకా, బైజూస్, స్విగ్గీ వంటి కొన్ని స్టార్టప్ సంస్థలు 10 బిలియన్ డాలర్ల నిధులు సేకరించిన వెంచర్లుగా నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2020 సంవత్సరం నుంచే యూనికార్న్ వెంచర్లు బాగా పెరుగుతూండటమే. మరో మాటలో చెప్పాలంటే, మహమ్మారి తర్వాతే ఇవి విస్తరిస్తున్నాయి. ఆ సంవత్సరం దేశంలో 11 యూనికార్న్ సంస్థలు ఆవిర్బవించాయి. 2021లో వీటి సంఖ్య రికార్డు స్థాయిలో 44. ఈ ఏడాది గత ఆరునెలల కాలంలో 16 ఏర్పడటం విశేషం. ‘ఇంక్42’ సంస్థ ప్రకారం, 2025 నాటికి దేశంలో 250 యూనికార్న్‌లు ఏర్పడతాయని అంచనా. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ దూకుడుగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల యూనికార్న్‌లలో ఫండింగ్ కాస్త తగ్గుముఖం పట్టింది కానీ, 2022లో కూడా ఇన్నోవేషన్, స్టార్టప్‌ల ఎకో–సిస్టమ్ ఇప్పటికీ వికాస దశలోనే సాగుతోంది. ఫండింగ్‌కి సంబంధించి కాస్త ఆందోళన ఉన్నప్పటికీ అనేక స్టార్టప్‌లు ఈ సంవత్సరం కూడా యూనికార్న్ క్లబ్లో చేరనున్నాయి. మహమ్మారి కాలంలో ఆఫీసుకు నేరుగా వెళ్లి పనిచేసే పద్ధతి నుంచి, ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి ప్రపంచం మారిపోయింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి... ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లవైపు సృజనాత్మక ఆవిష్కరణలను మళ్లించింది. ఇళ్లనుంచి బయటకు వెళ్లడంలో అవరోధాలు ఏర్పడటంతో ప్రజాజీవితంలో ఇంటర్నెట్ మరింత పెద్ద పాత్ర వహించే స్థాయికి పరిణమించింది. కాబట్టి రిటైల్ కొనుగోళ్లు చేయడం, ఆర్థిక లావాదేవీలను సాగించడం, బిజినెస్‌ను నిర్వహించడంతో పాటు విద్య సైతం ఆన్లైన్ యాక్టివిటీగా మారిపోయింది. పేటీఎం, మొబివిక్ వంటి ఫిన్‌టెక్ కంపెనీల ద్వారా... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ కంపెనీల ద్వారా డిజిటల్ చెల్లింపులు విస్తృతరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్కెట్ వంటి తాజా స్టార్టప్‌లు దేశంలోని 2వ, 3వ శ్రేణి నగరాల్లో వేగంగా విస్తరించాయి. యూనికార్న్ ప్రపంచం విస్తరణకు మరొక కారణం సులభమైన ఫండింగ్. దేశంలో డిజిటల్ ఎకో సిస్టమ్ విస్తరణకు అపారమైన అవకాశం ఉంటుందని మదుపుదారులు గ్రహిస్తున్నారు. దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి ఇప్పటికీ సాపేక్షికంగా తక్కువ స్థాయిలో, అంటే 41 శాతంగానే కొనసాగుతోంది. అంటే ఈ రంగంలో పెరుగుదలకు అపారమైన అవకాశాలు ఉన్నట్లే లెక్క. అయితే ఆన్లైన్ స్పేస్‌లో వినియోగదారుల సంఖ్య ఇప్పటికీ ఏడు శాతంగా మాత్రమే నమోదైంది. వాట్సాప్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలను ఉపయోగిస్తున్న వారు సైతం ఫిజికల్ రిటైల్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారని తాజా డేటా చెబుతోంది. దేశంలోని 44 కోట్లమంది వాట్సాప్ యూజర్లలో 15 శాతంమంది మాత్రమే ఆన్లైన్లో కొంటున్నారు. ఈ నేపథ్యంలో, వచ్చే అయిదు లేదా పది సంవత్సరాల కాలంలో వెంచర్ కేపిటల్ ఫండ్స్ దీర్ఘకాలిక అంచనాల ప్రాతిపదికపై మదుపు పెట్టడానికి సిద్ధపడటం ఖాయం అని తేలుతోంది. గత సంవత్సరం నుంచి చైనాలో టెక్ కంపెనీలపై రెగ్యులేటరీ నిబంధనలను పెంచుతున్న నేపథ్యంలోనే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో వెంచర్ కేపిటలిస్టులు మన దేశంలోని పరిణామాలపై తాజాగా దృష్టి సారిస్తున్నారు. మొత్తంమీద చూస్తే, లాభదాయకమైన ఐడియాలపైనే మదుపుదారులు డబ్బు పెడతారన్నది నిజం. గత కొన్ని సంవత్సరాల్లో ప్రారంభమైన అనేక స్టార్టప్ సంస్థలు ఫిన్‌టెక్, ఈ–కామర్స్ లేదా సాఫ్ట్వేర్ సర్వీస్ కేటగిరీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది. కొన్ని సమస్యలను ఎంపిక చేయడం కష్టమే అవుతుంది గానీ, నైకా సంస్థ ఆన్లెన్ మార్కెట్లో సౌందర్య ఉత్పత్తుల విషయంలో గ్యాప్ ఉన్నట్లు కనుగొన్నది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలకు కూడా మార్కెట్లో స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని మీషో సంస్థ కనుగొంది. దేశంలో అత్యధిక సంఖ్యలో యూనికార్న్‌లను (33) కలిగి ఉన్న ఫిన్ టెక్ సంస్థలు రిటైల్ వినియోగదారులతోపాటు వ్యాపార సంస్థల డిజిటల్ చెల్లింపుల అవసరాలను కూడా పూరించడంలో అధిక కృషి చేస్తున్నాయి. ఆన్లైన్ బిజినెస్‌లలో ఉన్న ఖాళీలను పూరించడంలో సాయపడేందుకు ‘సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్’ స్టార్టప్‌లు ముందుకొస్తున్నాయి. ఎడ్యుకేషన్ లేదా ఎడ్టెక్ వెంచర్లుగా పేరొందిన సంస్థలు బైజూస్ వంటి డెకాకార్న్‌ల వికాసానికి దారితీశాయి. మహమ్మారి కాలంలో ఆరోగ్య సంరక్షణ మరో ప్రాధాన్య రంగంగా ముందుకొచ్చింది. ఆరోగ్య రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం వల్ల ఇన్నోవస్సెర్, ఫార్మియాసీ, క్యూర్‌ఫిట్, ప్రిస్టిన్ కేర్ వంటి శైశవదశలోని యూనికార్న్‌ల ఆవిర్భావానికి తావిచ్చాయి. యూనికార్న్‌లు ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయనడంలో సందేహమే లేదు. ప్రత్యేకించి ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను యూనికార్న్‌ల అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్‌ల శరవేగ అభివృద్ధి గురించి మరీ అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. కొన్ని యూనికార్న్‌లు హైరింగ్ రంగంలో అడుగుపెట్టాయి. అయితే మొత్తం ఉపాధిరంగంలో తమదైన పాత్ర పోషించడానికి తగినంత పెద్ద మొత్తంలో ఇలాంటి వెంచర్లకు నిధులు లభ్యం కావడం లేదన్నది వాస్తవం. అదే సమయంలో, స్టార్టప్‌లు, యూనికార్న్‌లు, డెకాకార్న్‌ల వంటి వెంచర్లను దీర్ఘకాలిక దృష్టితోనే అంచనా వేయాలి. కాలం గడిచేకొద్దీ ఈ తరహా వెంచర్లు దేశాన్ని మరింత వేగంగా డిజిటల్ యుగంలోకి తీసుకెళతాయి. అంతే కాకుండా అంతిమంగా అసమానతలను తగ్గించడం వైపు దేశాన్ని నడిపిస్తాయి. అంతిమంగా, యూనికార్న్‌లను ఒంటరి ద్వీపాల్లాగా చూడకూడదు. దేశ వాణిజ్య వాతావరణంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే ఉత్ప్రేరకాలుగా ఇవి పనిచేస్తాయి. సాంకేతికత ఆధారంగా పనిచేసే స్టార్టప్‌లు వేటికవి విడివిడిగా ఉంటాయి కానీ సాంప్రదాయికమైన ఇటుకలు, ఫిరంగి తయారీ పరిశ్రమల్లో సైతం ఇవి సృజనాత్మకతను పెంచుతున్నాయి. ‘బిగ్ టెక్’ కంపెనీ విదేశాల్లోనూ స్టార్టప్‌ల నుంచే ఆవిర్భవించింది. ప్రపంచమంతటా ఇప్పుడు స్టార్టప్‌ల రాజ్యం నడుస్తోంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త ఫైనాన్షియల్ జర్నలిస్టు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
4 ఏళ్లలో 122 యూనికార్న్‌లు
ముంబై: ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ పరిస్థితులు ఆవిరౌతున్న(ఫండింగ్ వింటర్) నేపథ్యంలోనూ దేశీయంగా స్టార్టప్ వ్యవస్థ బలపడే వీలున్నట్లు హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. రానున్న నాలుగేళ్లలో బిలియన్ డాలర్ల విలువ అందుకోగల స్టార్టప్‌ల సంఖ్య పెరగనున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. దీంతో కొత్తగా 122 సంస్థలు యూనికార్న్‌లుగా ఆవిర్భవించనున్నట్లు అంచనా వేసింది. తద్వారా దేశీయంగా యూనికార్న్‌ల సంఖ్య 200ను మించనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను సాధించే స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఏడాది క్రితం 51గా నమోదైన యూనికార్న్‌ల సంఖ్య ప్రస్తుతం 84కు చేరినట్లు ప్రస్తావించింది. ఇప్పటికే 20 కోట్ల డాలర్లకుపైగా విలువ సాధించిన స్టార్టప్‌లు మరో 122 ఉన్నట్లు వెల్లడించింది. ఇవి రానున్న రెండు నుంచి నాలుగేళ్లలో యూనికార్న్‌లుగా ఎదిగే వీలున్నట్లు పేర్కొంది. 36 శాతం అప్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై ‘ఫండింగ్ వింటర్’ ప్రభావం చూపగలదని ఏఎస్కే ప్రయివేట్ వెల్త్‌తో జత కట్టిన హురూన్ ఇండియా.. ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ 2022 పేరుతో రూపొందించిన నివేదికలో అభిప్రాయపడింది. కఠిన పరపతి విధానాలతో ఇటీవల అంతర్జాతీయంగా లిక్విడిటీ తగ్గుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. గతేడాదితో పోలిస్తే 36 శాతం విలువను పెంచుకున్న 122 స్టార్టప్‌ల విలువ 49 బిలియన్ డాలర్లకు చేరిన ట్లు వెల్లడించింది. ఈ సంస్థలు బిలియన్ డాలర్ల విలువను అందుకోగలవని అభిప్రాయపడింది. ఈ సంస్థలు ప్రస్తుతం 82,300 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. స్టార్టప్‌లకు పెట్టుబడులు అందిస్తున్న సంస్థలలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ సీక్వోయా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేÆ ö్కంది. భవిష్యత్ యూనికార్న్‌లు 122లో 39 సంస్థలకు సీక్వోయా నిధులు అందించినట్లు వెల్లడించింది. ఈ బాటలో టైగర్ గ్లోబల్ 27 సంస్థలలో పెట్టుబడుల ద్వారా తదుపరి నిలిచినట్లు తెలియజేసింది. రెండేళ్లలో... తాజాగా రూపొందించిన జాబితాలోని 122 స్టార్టప్‌లలో 51 సంస్థలు రెండేళ్లలోనే బిలియన్ డాలర్ల విలువను సాధించే వీలున్నట్లు నివేదిక అంచనా వేసింది. తదుపరి మరో రెండేళ్లలో మిగిలిన 71 స్టా ర్టప్‌లు యూనికార్న్‌లుగా ఆవిర్భవించవచ్చని తెలి యజేసింది. 2017లో ఏర్పాటైన లాజిస్టిక్స్ టెక్ స్టార్టప్ షిప్‌రాకెట్ ముందుగా ఈ హోదాకు చేరే వీలున్నట్లు పేర్కొంది. ఇదేవిధంగా క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో, ఈకామర్స్ సంస్థ టర్టిల్‌మింట్ వేగ వంత వృద్ధి సాధించనున్నట్లు అభిప్రాయపడింది. -
అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు!
ఫిన్‌టెక్ స్టార్టప్ భారత్‌పే మాజీ సీఈవో అశ్నీర్ గ్రోవర్ స్టార్టప్ వరల్డ్‌లో మరోసారి హాట్ టాపిగ్గా మారారు. బడాయి మాటలు..కక్కుర్తి పనులతో కొని తెచ్చుకున్న కష్టాల నుంచి తేరుకొని ఇప్పుడు మరో సంస్థను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మిలియన్ డాలర్లు పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్నారు. అశ్నీర్ గ్రోవర్ పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌పే ఫౌండర్‌గా, అతని భార్య మాధురి జైన్ కంట్రోల్స్ ఆఫ్ హెడ్ హోదాలో అవినీతికి పాల్పడారంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సంస్థ సొమ్ముతో వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారు. భోగ భాగ్యాలు అనుభవించారు. కోటి రూపాయలు డైనింగ్ టేబుల్, మూడున్నర కోట్ల కారు ఉందంటూ గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్నారు. చివరికి చేసిన పాపం ఊరికే పోదన్నట్లు మహీంద్రా కోటక్ బ్యాంక్‌కి చెందిన మహిళా అధికారిని దుషించారు. సంబంధిత ఆడియో సంభాషణలు వెలుగులోకి రావడంతో అశ్నీర్ కథ అడ్డం తిరిగింది. చివరికి సంస్థ నుంచి బలవంతంగా బయటకు నెట్టేయించుకునే పరిస్థితికి దిగజారారు. Today I turn 40. Some will say I’ve lived a full life and experienced more things than most. Created value for generations. For me it’s still unfinished business. Time to disrupt another sector. It’s time for the Third Unicorn !! pic.twitter.com/wb7ZQe41FY — Ashneer Grover (@Ashneer_Grover) June 14, 2022 అయినా సరే ఇప్పుడు మరో స్టార్టప్‌ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. అశ్నీర్ తన 40వ బర్త్ డే సందర్భంగా స్టార్టప్‌ను యూనికార్న్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇందుకోసం అమెరికాలో తన కుటుంబానికి చెందిన ఓ సంస్థతో పాటు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో సంప్రదించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అశ్నీర్ మాత్రం భారత్‌పేలో అమ్మిన తన వాటాతో బిజినెస్‌ను ప్రారంభించనున్నట్లు మరికొన్ని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. మరోవైపు అశ్నీర్ ఫిన్‌టెక్ సంస్థను నెలకొల్పుతారా? లేదంటే ఇతర రంగానికి చెందిన స్టార్టప్‌ను ప్రారంభిస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి👉చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది! -
ఫిజిక్స్‌వాలా.. సూపర్‌హిట్ ఫార్ములా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఎడ్టెక్ కంపెనీ ఫిజిక్స్‌వాలా యూనికార్న్ జాబితాలో చేరింది. సిరీస్–ఏ కింద కంపెనీ రూ.777 కోట్ల నిధులను సమీకరించింది. వెస్ట్‌బ్రిడ్జ్, జీఎస్వీ వెంచర్స్ ఈ మొత్తాన్ని సమకూర్చాయి. డీల్‌లో భాగంగా ఫిజిక్స్‌వాలాను రూ.8,663 కోట్లుగా విలువ కట్టారు. భారత్‌లో 101వ యూనికార్న్‌గా ఫిజిక్స్‌వాలా చోటు సంపాదించింది. అలాగే సిరీస్–ఏ ఫండ్ ద్వారా ఈ ఘనతను సాధించిన మొదటి సంస్థ కూడా ఇదే. వ్యాపార విస్తరణకు, బ్రాండింగ్, లెర్నింగ్ కేంద్రాల ఏర్పాటు, కొత్త కోర్సులను పరిచయం చేసేందుకు తాజా నిధులను వినియోగించనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. సంస్థ యాప్‌ను 52 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. యూట్యూబ్‌లో 69 లక్షల మంది చందాదార్లు ఉన్నారు. మరిన్ని భాషల్లో.. వృద్ధి ప్రయాణంలో భాగంగా తెలుగుసహా కొత్తగా తొమ్మిది స్థానిక భాషల్లో కంటెంట్‌ను పరిచయం చేయనున్నట్టు ఫిజిక్స్‌వాలా వెల్లడించింది. సంస్థలో 1,900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 500 మంది దాకా బోధకులు, 100 మంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి 200 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఆరు మెడికల్ కళాశాలల్లో ఒకరు, 10 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకరు ఫిజిక్స్‌వాలా విద్యార్థులు ఉంటారని కంపెనీ తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను 10,000 మందికిపైగా విద్యార్థులు తమ పేర్లను సంస్థ వద్ద నమోదు చేసుకున్నారు. చదవండి: Alakh Pandey Success Story: నెలకు రూ.3.30 కోట్ల జీతం ఇస్తామన్నా వద్దన్నాడు.. చివరికి.. -
Mann Ki Baat: మన స్టార్టప్‌లు సూపర్
న్యూఢిల్లీ: భారత స్టార్టప్ కంపెనీలు కరోనా కష్టకాలంలోనూ ఎనలేని సంపదను, విలువను సృష్టించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘వీటివల్ల చిన్న పట్టణాల నుంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెలుగులోకి వస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలుంటే సంపదను సులువుగా సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు’’ అంటూ కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్‌లో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘భారత క్రికెట్ జట్టు బ్యాట్స్‌మన్ సెంచరీ చేస్తే మనందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే మన దేశం స్టార్టప్‌ల రంగంలో అరుదైన సెంచరీ కొట్టింది. దేశంలో యూనికార్న్ (రూ.7,500 కోట్ల కనీస టర్నోవర్ ఉన్న స్టార్టప్) కంపెనీల సంఖ్య ఈ నెల 5వ తేదీతో 100కు చేరింది. ఇదో గొప్ప మైలురాయి. వీటి సమష్టి విలువ 330 బిలియన్ డాలర్ల కంటే కూడా ఎక్కువ! అంటే, రూ.25 లక్షల కోట్ల పై చిలుకు!! ప్రతి భారతీయునికీ గర్వకారణమిది’’ అన్నారు. ‘‘వీటిల్లో 44 యూనికార్న్‌లు గతేడాదే వచ్చాయంటే ఆశ్చర్యం కలక్కమానదు. ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే 14కు పైగా యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. భారత యూనికార్న్‌ల సగటు వార్సిక వృద్ధి రేటు అమెరికా, ఇంగ్లండ్‌తో సహా అత్యధిక దేశాల కంటే ఎక్కవ. పైగా మన యూనికార్న్‌లు ఈ కామర్స్, ఫిన్ టెక్, ఎడ్ టెక్, బయో టెక్ వంటి వైవిధ్య రంగాల్లో విస్తరిస్తుండటం మరింత శుభసూచకం. పైగా స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అత్యంత కీలకమైన సమర్థులైన మెంటార్లు విరివిగా అందుబాటులోకి రావడం మరో సానుకూల పరిణామం’’ అన్నారు. వెంబు శ్రీధర్, మదన్ పడాకీ, మీరా షెనాయ్ తదితరులను ఈ సందర్భంగా ఉదాహరించారు. మనసుంటే మార్గముంటుంది మన దేశం విభిన్న భాషలు, యాసలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో సుసంపన్నంగా అలరారుతోందని మోదీ అన్నారు. మన బలానికి, ఐక్యతకు ఈ వైవిధ్యమే మూలమని కొనియాడారు. ‘‘సాధించి తీరాలన్న మనసుంటే మార్గం అదే దొరుకుతుంది. కర్నాటకలో పదో తరగతి పరీక్షల్లో కన్నడ సబ్జెక్టులో 92 మార్కులు సాధించిన కల్పన అనే ఉత్తరాఖండ్ అమ్మాయే ఇందుకు ఉదాహరణ. ఆమెకు మూడో తరగతిలోనే టీబీ సోకింది. ఒక కంటి చూపు కూడా పోయింది. పైగా ఇటీవలి దాకా కన్నడ భాష గురించి అసలేమీ తెలియదు. అయినా మైసూరుకు చెందిన ప్రొఫెసర్ తారామూర్తి ప్రోత్సాహంతో మూడే నెలల్లో కన్నడపై పట్టు సాధించింది. రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోకి అనువదించిన పశ్చిమబెంగాల్లోని పురులియాకు చెందిన శ్రీపతి తుడు అనే ప్రొఫెసర్దీ ఇలాంటి స్ఫూర్తి గాథే. అలాగే తంజావూరు స్వయం సహాయక బృందం కళాకారులు నాకు పంపిన అమ్మవారి కళాకృతి ఓ వెలకట్టలేని బహుమానం. ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’కు ఇవన్నీ ఉదాహరణలే’’ అన్నారు. స్వయం సహాయక బృందాల ఉత్పత్తులను వాడటం ద్వారా వాటిని ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చార్ధామ్ యాత్రకు భక్తులు ఈసారి భారీగా పోటెత్తుతుండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. కేదార్నాథ్ క్షేత్రాన్ని చెత్తాచెదారంతో నింపుతుండటం బాధాకరమన్నారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యతన్నారు. సూర్యోదయాన్ని స్వాగతిస్తూ... ప్రపంచవ్యాప్త రిలే యోగా ప్రపంచ యోగా డేను ఈ జూన్ 21న ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ‘మానవాళి కోసం యోగా’ పేరిట దేశవ్యాప్తంగా 75 చోట్ల యోగా డే ఈవెంట్లు జరుగుతాయి. అలాగే గార్డియన్ రింగ్ పేరిట జూన్ 21న రోజు పొడవునా ప్రపంచమంతటా పలు దేశాల్లో సూర్యోదయాన్ని యోగా సాధనతో స్వాగతించనున్నాం. ఇది ఒకరకంగా రిలే యోగా ఈవెంట్‌గా సాగుతుంది. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వీటిని చేపడతాయి’’ అని వివరించారు. ‘దేశం, జాతి తదితరాలతో సంబంధం లేకుండా యోగాతో ఎందరో శారీరక, మానసిక, మేధోపరమైన, ఆధ్యాత్మిక ఆరోగ్యాలను సొంతం చేసుకుంటున్నారన్నారు. జపనీయుల్లో భారత్ పట్ల ఉన్న ప్రేమను ఇటీవల ఆ దేశంలో పర్యటన సందర్భంగా సన్నిహితంగా గమనించానని మోదీ చెప్పారు. జపాన్‌కు చెందిన ప్రఖ్యాత కళా దర్శకుడు హిరోషీ కొయిటే తొమ్మిదేళ్లుగా మహాభారత్ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నట్టు, నాటక ప్రదర్శనలు ఇస్తున్నట్టు తెలిసి ఎంతో సంతోషించా. మరో ఇద్దరు జపనీయులు రామాయణంపై జపనీస్‌లో యానిమేషన్ ఫిల్మ్ రూపొందించారు’’ అని వివరించారు. -
Unicorn: ప్రతీ పదింటా ఒకటి ఇండియాలోనే
ఎంట్రప్యూనర్లకు స్వర్గధామంగా ఇండియా మారుతోంది. గడిచిన నాలుగేళ్లుగా ఇండియాలో యూనికార్న్ కంపెనీల హవా నడుస్తోంది. ఒకప్పుడు యూనికార్న్ హోదా సాధించేందుకు దశాబ్ధాల తరబడి ఎదురు చూసిన స్టార్టప్‌లు ఇప్పుడు నెలల వ్యవధిలోనే యానికార్న్‌లుగా మారిపోతున్నాయి. వ్యాపారంలో రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. యూనికార్న్ అంటే నియోబ్యాంక్ ఓపెన్ స్టార్టప్ 2022 మే 2న ఇండియాలో వందో యూనికార్న్ కంపెనీగా రూపుదిద్దుకుంది. ఏదైనా స్టార్టప్ మంచి పనితీరును కనబరిచి పెట్టుబడులు సాధిస్తూ దాని మార్కెట్ వాల్యుయేషన్ వన్ బిలియన్ డాలర్లకు చేరుకుంటే దాన్ని యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఈ యూనికార్న్‌లు అమెరికా, యూరప్, చైనా, జపాన్ దేశాల్లోనే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గేమ్ చేంజర్ 2016 మన దేశంలోనే 2016-17కి పూర్వం వరకు సగటున ఏడాదికి ఒక స్టార్టప్ కనాకష్టంగా యూనికార్న్ హోదాను పొందేది. పెట్టుబడులు సాధించడం కష్టంగా ఉండేది. కానీ 2016లో స్టార్టప్‌కు ప్రత్యేక ప్రోత్సహాకాలు ప్రకటించడం, అదే సమయంలో ఇంటర్నెట్ చవగ్గా మారి అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో అప్పటి నుంచి స్టార్టప్‌లకు మంచి రోజులు వచ్చాయి. అనతి కాలంలోనే ఊహించిన స్థాయిలో స్టార్టప్‌లు పెరిగిపోయాయి. 26 ఏళ్ల నుంచి 4 నెలలకు 2022 మే వరకు గల డేటాను పరిశీలిస్తే దేశంలో ఏకంగా 69 వేల స్టార్టప్‌లు ఉన్నాయి. ఇవి 56 రంగాల్లో కృషి చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 13 శాతం స్టార్టప్‌లు ఐటీ రంగంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్ లైఫ్ సైన్సెస్‌లో 9 శాతం, ఎడ్యుకేషన్ 7 శాతం, ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ 5 శాతం, అగ్రికల్చర్ 5 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 5 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు యూనికార్న్ హోదా పొందిన 100 కంపెనీలను పరిశీలిస్తే.. యూనికార్న్ హోదా పొందేందుకు గరిష్ట సమయం 26 ఏళ్లు ఉండగా కనిష్ట సమయం 4 నాలుగు నెలలుగా ఉంది. దేశీయంగా స్టార్టప్ ఏకో సిస్టమ్ బాగుండటంతో త్వరితగతిన యూనికార్న్ హోదాను సాధిస్తున్నాయి. ఇప్పటికే 14 యూనికార్న్‌లు కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత 2021లోనే ఏకంగా 44 కంపెనీలు యూనికార్న్ హోదాను సాధించాయి. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల కాలంలోనే 14 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వేగం చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ పది యూనికార్న్ స్టార్టప్‌లలో ఒకటి ఇండియా నుంచే వస్తోంది. చదవండి: ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్! -
ఇండియా నుంచి వందో యూనికార్న్..ఎక్కడో తెలుసా?
యంగ్ ఎంట్రప్యూనర్లు ఇండియాలో పెరిగిపోతున్నారు. సంప్రదాయ వ్యాపార వాణిజ్య విధానాలకు టెక్నాలజీ హంగులు అద్దుతూ కొత్త కంపెనీలకు శ్రీకారం చుడుతున్నారు. పదేళ్ల కిందట మొదలై ఈ ట్రెండ్ ఇప్పుడు వేగంగా ముందుకు పోతుంది. ఈ క్రమంలో ఇండియా నుంచి మరో స్టార్టప్ యూనికార్న్ హోదాను సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు వంద స్టార్టప్‌లు యూనికార్న్ క్లబ్లో చేరాయి. బెంగళూరుకు చెందిన నియో బ్యాంకింగ్ స్టార్టప్ ఓపెన్ యూనికార్న్ హోదా సాధించిన వందో భారతీయ స్టార్టప్‌గా గుర్తింపు సాధించింది. ఇటీవల జరిగిన ఫండ్ రైజింగ్ రౌండ్లో సింగపూర్‌కి చెందిన వెల్త్ ఫండ్ టెమాసెక్, యూఎస్ హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్, 3 వన్ 4 క్యాపిటల్ సంస్థలు 50 మిలియన్ డాలర్లు పెట్టుబడులుకు ముందుకు వచ్చాయి. దీంతో ఓపెన్ మార్కెట్ వాల్యుయేషన్ వన్ బిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేసింది. దీంతో యూనికార్న్ హోదాను దక్కించుకున్న వందో స్టార్టప్‌గా రికార్డులకెక్కింది. నియోబ్యాంకింగ్ స్టార్టప్ ఓపెన్ అందిస్తోన్న ఓపెన్ ఫ్లో, ఓపెన్ సెటిల్, ఓపెన్ క్యాపిటల్ సర్వీసెస్‌కి ఆదరణ పెరుగుతుండటంతో నిధుల సమీకరణ సులువైంది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ శుభాకాంక్షలు తెలిపారు. ఐడియాస్, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కలిపితే ఇండియా అంటూ మంత్రి ప్రశంసలు కురిపించారు. India Hits A Century In Style! 💯 Bengaluru-based startup become country's 100th Unicorn.🦄 India = Ideas + Innovation + Investmentshttps://t.co/KcNQMIEokA — Piyush Goyal (@PiyushGoyal) May 2, 2022 చదవండి: అక్షయ తృతీయ.. ‘నగ’ ధగలు! -
పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న దిగ్గజ ఐటీ కంపెనీలు..బాబోయ్ వద్దంటున్న ఉద్యోగులు!
కరోనా కొంత మంది ఉద్యోగాలు ఊడేలా చేస్తే.. ఫ్రెషర్స్‌కు మాత్రం బంపరాఫర్ ఇస్తోంది.మా ఆఫీస్‌లో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్‌కు తగ్గట్లు ప్యాకేజీ ఇస్తాం. కాదు..కూడదు అంటే అంతకంటే ఎక్కువ ఇస్తాం అంటూ దిగ్గజ సంస్థలు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. కానీ ఫ్రెషర్స్, ప్రస్తుతం ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. అందుకు కారణం ఏంటీ? అసలు ఐటీ కంపెనీల లోపల ఏం జరుగుతుంది. ఫ్రెషర్స్, ఉద్యోగులు సైతం మా ఆఫీస్‌లో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్‌కు జీతాలిస్తాం. కాదు..కూడదు అంటే అంతకంటే ఎక్కువ ఇస్తామంటూ దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్‌కు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. దీంతో పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలీటీతో పాటు ఇంకా మరెన్నో ఆఫర్లు అందిస్తున్నాయి. కానీ ఆఫర్ లెటర్లు అందుకున్న ఫ్రెషర్స్ సైతం..ఆ ఆఫర్లను వద్దనుకుంటున్నారు. అందుకు కారణం అప్డేట్ అవుతున్న టెక్నాలజీయేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రోజు రోజుకీ పుట్టుకొస్తున్న కొత్త కొత్త టెక్నాలజీ కోర్స్‌లు నేర్చుకొని స్టార్టప్‌లలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కోవిడ్ సమయంలో విధించిన నిబంధనలు, అప్డేట్ అవుతున్న టెక్నాలజీల వల్ల తలెత్తే ఇబ్బందులు, జీతాల వంటి ఇతర కారణాల వల్ల చేస్తున్న ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్నారు.స్టార్టప్స్‌లో చేరుతున్నారు. స్టార్టప్స్ జపం ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావ్ మాట్లాడుతూ..ఉద్యోగుల నిర్ణయాన్ని బట్టి వారికి నచ్చేలా ఉద్యోగాలు, ప్రమోషన్లు,జీతాలతో..స్టార్టప్‌లు,యూనికార్న్ సంస్థలు ఆకర్షిస్తున్నాయి. అంతెందుకు యూనికార్న్ కంపెనీలు సైతం మా కంపెనీ(ఇన్ఫోసిస్) ఉద్యోగులకు అవకాశం ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయని ప్రవీణ్ రావు అన్నారు.కాబట్టే టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర దిగ్గజ కంపెనీలు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ ఫ్రెషర్స్‌ను నియమించుకుంటూనే..అట్రిషన్ రేట్ తగ్గించుకునేందుకు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తున్నాయి. కారణం అదే కరోనా కారణంగా దేశంలో డిజిటల్ ట్రాన్సర్మేషన్ అంటే చేసే బిజినెస్, కల్చర్, కొత్త ప్రాజెక్ట్‌లను దక్కించుకునేందుకు కావాల్సిన మార్కెట్ రిక్వైర్ మెంట్స్ మారిపోయాయి. దీంతో సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం మార్కెట్లో వస్తున్న కొత్త కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కోర్స్‌లు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉన్నా..వారికి నచ్చిన జాబ్‌లో జాయిన్ అవుతున్నారు. కాబట్టే ఇన్ఫోసిస్,టీసీఎస్ వంటి టెక్ కంపెనీలలో ఉద్యోగులు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్క ఇన్ఫోసిస్‌లోనే గత ఆర్థిక సంవత్సరానికిగాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. మూడో త్రైమాసికం 25.5 శాతంతో పోల్చితే నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు 27.7 శాతానికి పెరిగింది. అట్రిషన్ రేట్ తగ్గించేందుకు ఈనెల నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల్ని భారీ ఎత్తున పెంచనుంది. ఇక ఇక గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకోగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50,000 మందిని నియమించుకోనేందుకు ఇన్ఫోసిస్ చూస్తోంది. ఎంతమందిని నియమించుకున్నాయంటే? ఫైనాన్షియల్ ఇయర్ 2022లో టీసీఎస్ 1.03లక్షల మందిని..మూడు నెలల్లో ఎక్కువ మంది నియమించుకుంది. దీంతో మొత్తం 6లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చదవండి: జోరుగా..హుషారుగా! ఐటీ రంగంలో ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు! -
కష్టాల్లో అంకితి బోస్.. యంగ్‌లేడీ సీఈవోకి భారీ షాక్ !
భారత్‌పే అశ్నీర్ గ్రోవర్ ఉదంతం తెరమరుగు కాకముందే అలాంటిదే మరో వ్యవహారం వెలుగు చూసింది. రేపోమాపో యూనికార్న్ హోదా దక్కించుకోబోతున్న స్టార్టప్ పునాదులు కదిలిపోయాయి. అవమానకర రీతిలో ఆ స్టార్టప్ ఫౌండర్ కమ్ సీఈవో బయటకు వెళ్లాల్సి వచ్చింది. అది కూడా యువ మహిళా ఫౌండర్ కావడంతో ఈ అంశంపై బిజినెస్ సర్కిల్స్‌లో భారీ చర్చ నడుస్తోంది. ముంబై నుంచి మొదలు ముంబైకి చెందిన అంకితా బోస్ అక్కడే ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత బెంగళూరులో ఓ బహుళ జాతి కంపెనీలో మంచి ఉద్యోగంలో చేరారు. అయితే బిజినెస్ ట్రిప్‌లో భాగంగా బ్యాంకాక్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆమె మదిలో మెదిలిన ఐడియా ఓ స్టార్టప్‌కి ప్రాణం పోసింది. స్ట్రీట్ వెండర్స్‌కి ఆన్లైన్లో బిజినెస్ చేసుకునే అవకాశం కల్పిస్తూ జిలింగో ఈ కామర్స్ సైట్‌ని పరిచయస్తుడైన ద్రువ్కపూర్తో పాటు మరికొందరితో కలిసి 2015లో ప్రారంభించింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 23 ఏళ్లు కావడం గమనార్హం. నిధుల దుర్వినియోగం 2015లో సింగపూర్ కేంద్రంగా మొదలైన జిలింగో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇన్వెస్టర్లను సాధించింది. మార్కెట్లో నిలదొక్కుకోగలిగింది. తాజాగా మరో విడత పెట్టుబడుల సమీకరణలో భాగంగా దాదాపు 200 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించింది. ఈ కమ్రంలో కంపెనీ పత్రాలను పరిశీలించగా మొదటి విడతలో సేకరించిన నిధులు పక్కదారి పట్టినట్టు గుర్తించారు. దీనికి అంకిత బోస్ కారణమని పేర్కొంటూ ఆమెను జిలింగో నుంచి సాగనంపారు. నన్ను టార్గెట్ చేశారు జిలింగోలో కొందరుకు కుట్ర పూరితంగా వ్యవహరించి తనను ‘టార్గెట్’ చేశారని అంకితి బోస్ అంటున్నారు. ఈ క్రమంలో తనపై లేనిపోని నిందలు వేశారని చెబుతున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, తనను తప్పుడు ఆరోపణలపై కంపెనీ నుంచి బయటకు పంపడంపై న్యాయ పోరాటం చేస్తానంటూ ఆమె ప్రకటించారు. చివరి మెట్టులో 23 ఏళ్ల వయసులో జిలింగో స్టార్టప్ ప్రయాణం మొదలైతే 2019 నాటికి ఆగ్నేయాసియా దేశాల్లో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీగా ఎదిగింది. కోవిడ్ ముందు నాటికే 970 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించింది. ఇక రేపోమాపో యూనికార్న్ హోదా అనుకునే సమయంలో అంకితీ బోస్కి షాక్ తగిలింది. ఏది ఏమైనా యువతరంలో ఎంతో స్ఫూర్తి నింపుతున్న స్టార్టప్ ప్రపంచంలో అశ్నీర్, అంకితీ లాంటి వ్యవహారాలు సరికొత్త చర్చకు తెరతీశాయి. చదవండి: ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్' నిధుల దుర్వినియోగంపై సమీర్! -
స్టార్టప్‌లకు ఫండింగ్ బూస్ట్
ముంబై: దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి నిధుల ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2022) తొలి మూడు నెలల్లోనే ఏకంగా 14 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. వెరసి వరుసగా మూడో క్వార్టర్లోనూ యూనికార్న్‌ల స్పీడ్ కొనసాగింది. పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక ప్రకారం 334 లావాదేవీల ద్వారా 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 75,000 కోట్లు) తాజా పెట్టుబడులు లభించాయి. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. కాగా.. మార్చిచివరికల్లా దేశీయంగా వీటి సంఖ్య 84ను తాకింది. ఒక త్రైమాసికంలో 10 బిలియన్ డాలర్ల నిధులు దేశీ స్టార్టప్ వ్యవస్థలోకి ప్రవహించడం వరుసగా ఇది మూడోసారికావడం విశేషం! వెరసి ఈ క్యూ1(జనవరి–మార్చి)లో స్టార్లప్‌లు మొత్తం 10.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. సాస్ హవా నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్‌నే సర్వీసులుగా అందించే(సాస్) కంపెనీలు అత్యధికంగా పెట్టుబడులను అందుకున్నాయి. 3.5 బిలియన్ డాలర్లకు మించిన నిధులు ప్రవహించాయి. దీంతో క్యూ1లో ఐదు యూనికార్న్‌లు సాస్ విభాగంనుంచే ఆవిర్భవించాయి. ప్రపంచ ఆర్థిక వాతావరణం అనిశ్చితిగా ఉన్నప్పటికీ దేశీ స్టార్టప్ వ్యవస్థ పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు కన్సల్టెన్సీ స్టార్టప్స్ విభాగం చీఫ్ అమిత్ నాకా పేర్కొన్నారు. వృద్ధికి పెట్టుబడులు అవసరమైన స్థాయిలో నిధులు లభించడం ప్రస్తావించదగ్గ అంశమని తెలియజేశారు. సుపరిపాలన దేశీయంగా స్టార్టప్‌లు భారీ వృద్ధిని అందుకుంటున్న నేపథ్యంలో కార్పొరేట్ సుపరిపాలనకు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు అమిత్ పేర్కొన్నారు. దీంతో స్టార్టప్‌లకు కార్పొరేట్ గవర్నెన్స్‌పై మార్గదర్శకాల రూపకల్పనపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. వ్యవస్థాగతంగా విస్తరణపై ఆశలున్న కంపెనీలు ఇందుకు తగిన విధంగా సన్నద్ధంకావలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సాస్ ఎకోసిస్టమ్‌లోకి గత మూడేళ్లలోనే మూడు రెట్లు అధిక పెట్టుబడులు తరలిరాగా.. కరోనా మహమ్మారి ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహాన్నిచ్చినట్లు వివరించారు. మారుమూల ప్రాంతాల నుంచీ పనిచేసే పరిస్థితులతోపాటు, ఉత్పాదకత పెరగడం, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాధాన్యత ఇందుకు సహకరిస్తున్నాయి. 15 సంస్థలు సాస్ విభాగంలో గత మూడేళ్ల కాలంలో 15 యూనికార్న్‌లు పుట్టుకొచ్చాయి. ఈ జాబితాలో డార్విన్‌బాక్స్, ఫ్రాక్టల్, యూనిఫోర్, హసురా, అమగీ మీడియా ల్యాబ్స్ తదితరాలున్నాయి. 2021 చివర్లో ఫ్రెష్‌వర్క్స్ నాస్డాక్లో బంపర్ లిస్టింగ్‌ను సాధించడంతో సాస్ సంస్థలకు కొత్త జోష్ వచ్చినట్లు అమిత్ ప్రస్తావించారు. పలు కంపెనీలు పబ్లిక్ లిస్టింగ్‌పై దృష్టిపెడుతున్నట్లు పేర్కొన్నారు. విలీనాలు.. దేశీ స్టార్టప్ వ్యవస్థలో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) లావాదేవీలు క్యూ1లో ఈకామర్స్ విభాగంలో అధికంగా జరిగాయి. క్యూర్‌ఫుడ్స్, మెన్సా బ్రాండ్స్, గ్లోబల్బీస్, మైగ్లామ్ ఎంఅండ్ఏలో భాగమయ్యాయి. వీటి కీలక వ్యాపార వ్యూహాలకు ప్రాధాన్యత లభించగా.. అప్స్కాలియో, ఈవెన్‌ఫ్లో తదితర కంపెనీలు సైతం రేసులో చేరాయి. 38 శాతం ఎంఅండ్ఏలు ఈకామర్స్, డైరెక్ట్‌టు కన్జూమర్ విభాగంలో నమోదుకాగా.. 22 శాతం డీల్స్‌కు సాస్ రంగంలో తెరలేచింది. వృద్ధి, చివరి దశ స్టార్టప్‌లు విలువరీత్యా 89 శాతం పెట్టుబడులు అందుకోగా.. మొత్తం లావాదేవీల్లో 44 శాతం వాటాను ఆక్రమించాయి. గత మూడు త్రైమాసికాలలో వృద్ధిస్థాయి నిధులు 6.5–7 బిలియన్ డాలర్లకు చేరగా.. సగటు టికెట్ పరిమాణం 5.5–7 కోట్ల డాలర్లుగా నమోదైంది. తొలి దశ పెట్టుబడుల విషయానికివస్తే 4 మిలియన్ డాలర్ల సగటు టికెట్ పరిమాణంలో 76.1 కోట్ల డాలర్లు లభించాయి. లావాదేవీల పరిమాణంలో ఇవి 55 శాతంగా నివేదిక తెలియజేసింది. -
హైదరాబాద్‌లో ఆఫీస్ ప్రారంభించిన ఇంగ్లండ్ కంపెనీ
ఫుడ్, గ్రోసరీస్ డెలివరీ స్టార్టప్‌గా ఇంగ్లండ్‌లో మొదలై అనతి కాలంలోనే యూనికార్న్‌గా మారిన డెలివరూ ఇండియాలో తన కార్యకలాపాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరంలో తొలి ఇంజనీరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇంగ్లండ్ వెలుపల ఆ సంస్థకు ఇదే అతి పెద్ద సెంటర్. ఈ కామర్స్ రంగంలో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కస్టమర్లు హోం డెలివరికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇండియా లాంటి పెద్ద మార్కెట్ ఉన్న దేశంలో డెలివరూ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతోంది. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న స్కై వ్యూ బిల్డింగ్‌లో కో వర్కింగ్ మోడ్‌లో ఆఫీస్‌ను ప్రారంభించింది. ఈ మేరకు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తదితర రంగాల్లో పట్టున్న వారి కోసం రిక్రూట్మెంట్ కూడా నిర్వహిస్తోంది. ఈ కామర్స్ సెక్టార్ బేస్డ్గా డెలివరీ ప్రధానంగా పని చేయనుంది. -
కచ్చా బాదామ్.. యూనికార్న్ కంపెనీలను వదల్లేదు
కచ్చా బాదామ్ సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు భుబన్ బద్యాకర్. పల్లీలు అమ్ముకుంటూ తాను పాడిన పాట యూట్యూబ్‌కి చేరిన తర్వాత నేషనల్ స్టార్ అయ్యాడు. సామాన్యులు మొదలు సినీ సెలబ్రిటీల వరకు కచ్చాబాదం మంత్రం జపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్గోయల్ చేరారు. ఈ ఏడాది ఇండియా నుంచి పదో యూనికార్న్ కంపెనీగా గుర్తింపు పొందిన హసురా ఎదుగుదల గురించి చెప్పేందుకు కచ్చా బాదామ్ని రిఫరెన్స్‌గా వాడుకున్నాడు. బెంగళూరు, యూఎస్ బేస్డ్ హసురా కంపెనీ బుదవారం 100 మిలియన్ డాలర్ల పెట్టుబుడుల సాధించి యూనికార్న్‌గా గుర్తింపు పొందింది. తన్మయ్ గోపాల్, రాజోషి ఘోష్‌లు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ బేస్డ్ హసురా యాప్ ఇప్పటికే నాలుగు కోట్ల సార్లు డౌన్లోడ్ అయ్యింది. దీంతో వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులకు ముందుకు వచ్చారు. ఫలితంగా ఈ ఏడాది యూనికార్న్ గుర్తింపు పొందిన పదో స్టార్టప్‌గా హసురా నిలిచింది. Another 'Kacha Badam' becomes 'Pakka' India adds its Tenth Unicorn in just 53 days pic.twitter.com/25RRezpfZF — Piyush Goyal (@PiyushGoyal) February 23, 2022 హసురా విజయాలను కచ్చాబాదమ్తో పోల్చారు మంత్రి పియుష్ గోయల్. కచ్చా బాదమ్ సాంగ్ హిట్ కావడానికి ముందు ఆ తర్వాత భుబన్ బద్యాకర్ ఎలా ఉండేబాడో తెలిపే మీమ్‌ను ట్వీట్ చేస్తూ హసురా కంపెనినీ అభినందించారు. -
దేశంలో స్టార్టప్‌ల స్పీడ్
కోల్‌కతా: దేశీయంగా స్టార్టప్‌లు వేగంగా పుట్టుకొస్తున్నట్లు నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఐవోటీ, ఏఐ విభాగాల సీఈవో సంజీవ్ మల్హోత్రా పేర్కొన్నారు. వార్షికంగా వీటి సంఖ్యలో 10 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు తెలియజేశారు. స్టార్టప్‌లలో అత్యధికం అప్లికేషన్వైపు ఊపిరిపోసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే సాఫ్ట్వేర్ మద్దతిచ్చే సర్వీసులలో మరింత ప్రగతి సాధించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. దేశీంలో ప్రతీ ఏటా 10 శాతం స్టార్టప్‌లు జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వీటి సంఖ్యలో భారీ వృద్ధి నమోదవుతున్నదని, ఇందుకు పెట్టుబడి సంస్థలు నిధులు అందించడం దోహదం చేస్తున్నట్లు వివరించారు. అయితే కీలక రీసెర్చ్‌కు సంబంధించిన అంశాలలో స్టార్టప్‌లు ఆవిర్భవించవలసిన అవసరమున్నట్లు ప్రస్తావించారు. మూడో పెద్ద వ్యవస్థ స్టార్టప్‌లు, ఇన్నోవేటర్లు, ఎంటర్‌ప్రైజ్‌లు, ప్రభుత్వంతో కలసి దేశీయంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలకు అతిపెద్ద వ్యవస్థగా నిలుస్తోంది. ప్రపంచంలోనే భారత్ మూడో పెద్ద ఎకోసిస్టమ్‌ను కలిగి ఉన్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సర్వే సైతం గత ఆరేళ్లలో ఇలాంటి స్టార్టప్‌లు భారీగా వృద్ధి చెందినట్లు పేర్కొంది. 2021–22కల్లా గుర్తింపు పొందిన కొత్త స్టార్టప్‌లు 14,000ను మించాయి. 2016–17లో ఇవి 733 మాత్రమే. తద్వారా అమెరికా, చైనా తదుపరి మూడో పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా దేశం ఆవిర్భవించినట్లు మల్హోత్రా తెలియజేశారు. యూనికార్న్ జోరు పటిష్ట ఎకోసిస్టమ్, ప్రోత్సాహకర పెట్టుబడుల కారణంగా దేశంలో మరిన్ని యూనికార్న్‌లు ఆవిర్భవించనున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. స్టార్టప్ వ్యవస్థలో బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 7,500 కోట్లు) విలువను అందుకున్న కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరించే సంగతి తెలిసిందే. 2021లో దేశీయంగా 44 స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను అందుకున్నాయి. దీంతో వీటి సంఖ్య 83ను తాకింది. వీటిలో అత్యధికం సర్వీసుల రంగంలోనే సేవలందిస్తుండటం గమనార్హం. స్టార్టప్‌లు ఊపిరిపోసుకునేందుకు వీలుగా సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీల జాతీయ అసోసియేషన్(నాస్కామ్) అవసరమైన ఎకోసిస్టమ్‌ను కల్పిస్తున్నట్లు మల్హోత్రా తెలియజేశారు. -
దేశంలో జోరుగా స్టార్టప్ కల్చర్.. ప్రపంచంలోనే 3వ స్థానంలో!
దేశంలో రోజు రోజుకి స్టార్టప్ కల్చర్ భారీగా పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వందలాది కొత్త స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ(గతంలో బెంగళూరు) భారత స్టార్ట్-అప్ రాజధానిగా మారింది. ఏప్రిల్ 2019 - డిసెంబర్ 2021 మధ్య కాలంలో బెంగళూరులో ఏర్పడిన 4,514 స్టార్టప్ కంపెనీలతో పోలిస్తే ఢిల్లీలో 5,000కు పైగా గుర్తింపు పొందిన స్టార్ట్-అప్ కంపెనీలు వెలిసినట్లు నేడు పార్లమెంటులో కేంద్రం ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే 2021-22లో తెలిపింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో(11,308) స్టార్ట్-అప్ కంపెనీలు ఉన్నాయి. జనవరి 10, 2022 నాటికి భారతదేశంలో 61,400కు పైగా స్టార్ట్-అప్ కంపెనీలను గుర్తించినట్లు ఈ నివేదిక తెలిపింది. 2021లో 44 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందాయి. దీంతో, అమెరికా & చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో యునికార్న్ సంస్థలు భారతదేశంలోనే ఉన్నాయి. 2021లో అమెరికాలో 487 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందితే, చైనాలో 301 స్టార్ట్-అప్ కంపెనీలు యునికార్న్ హోదా పొందాయి. జనవరి 14, 2022 నాటికి, భారతదేశంలోని మొత్తం 83 యునికార్న్ కంపెనీల సంపద విలువ 277.77 బిలియన్ డాలర్లు. ఈ స్టార్ట్-అప్ కంపెనీలలో చాలా వరకు కంపెనీలు సేవ రంగంలో ఉన్నాయి. అలాగే, దేశంలోని స్టార్ట్-అప్ కంపెనీలలో ఎక్కువ భాగం ఐటీ/నాలెడ్జ్ ఆధారిత రంగంలో ఉన్నాయి. 2016-17లో 733 స్టార్ట్-అప్ కంపెనీల నుంచి కొత్తగా గుర్తింపు పొందిన స్టార్ట్-అప్ కంపెనీల సంఖ్య 2021-22 నాటికి 14,000కు చేరుకుంది. గత మూడు సంవత్సరాలుగా, అంతరిక్ష రంగంలో స్టార్ట్-అప్ కంపెనీల సంఖ్య 2019లో ఉన్న 11 నుంచి 2021 నాటికి 42కు పెరిగింది. ఇస్రో/డివోఎస్ ఎలాంటి స్టార్ట్-అప్ కంపెనీలను నమోదు చేయనందున, స్టార్టప్ ఇండియా పోర్టల్‌లో స్పేస్ టెక్నాలజీ కేటగిరీ కింద సుమారు 75 స్టార్ట్-అప్ కంపెనీలు మాత్రమే చూపిస్తున్నాయి. 2021లో 555 జిల్లాలు కనీసం ఒక కొత్త స్టార్ట్-అప్ కంపెనీ వెలిసింది. 2016-17లో 121 జిల్లాలో మాత్రమే ఒక స్టార్ట్-అప్ కంపెనీ స్థాపించబడింది. (చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గుతున్న పసిడి ధరలు!) -
చెన్నై సూపర్‌కింగ్స్ సరికొత్త రికార్డు.. 7,600 కోట్లు.. భారతదేశంలో నంబర్ 1గా..
IPL- Chennai Super Kings: ఐపీఎల్లో తిరుగులేని జట్టు... నాలుగుసార్లు విజేత అయిన చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సారథ్యంలోని చాంపియన్ ఈ సీజన్ ఆరంభానికి ముందే అద్భుత రికార్డు సాధించింది. క్యాష్ రిచ్ లీగ్‌లో అసాధారణ విజయాలు సాధించిన సీఎస్కే భారతదేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ యూనికార్న్ కంపెనీగా శుక్రవారం అవతరించింది. సీఎస్కే మార్కెట్ క్యాప్ 7,600 కోట్ల రూపాయలు దాటడం విశేషం. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ల ప్రైస్ బాండ్ విలువ రికార్డు స్థాయిలో 210-225 మధ్య ట్రేడ్ కావడం గమనార్హం. ఈ క్రమంలో మరో అతి పెద్ద రికార్డును కూడా సీఎస్కే తన పేరిట లిఖించుకుంది. మాతృసంస్థ ఇండియా సిమెంట్స్ మార్కెట్ క్యాప్ విలువను సీఎస్కే అధిగమించడం విశేషం. ప్రస్తుతం ఆ కంపెనీ స్టాక్ వాల్యూ 6869 కోట్ల రూపాయలుగా ఉండగా సీఎస్కే వాల్యూ 7600 కోట్లు. కాగా ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువ గల ప్రైవేట్ సంస్థలను యూనికార్న్ కంపెనీలుగా పిలుస్తారు. ఇక ఆట విషయానికొస్తే.. ఐపీఎల్ మెగా వేలం-2022కు చెన్నై సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆక్షన్ నిర్వహణ నేపథ్యంలో కెప్టెన్ ధోని ఇప్పటికే చెన్నైకి చేరుకుని యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాడు. మెగా వేలానికి సంబంధించి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక రిటెన్షన్‌లో భాగంగా రవీంద్ర జడేజా(16 కోట్లు), ఎంఎస్ ధోని(12 కోట్లు), మొయిన్ అలీ(8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్(6 కోట్లు)ను అట్టిపెట్టుకుంటామని చెన్నై ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నలుగురు ఆటగాళ్ల కోసం మొత్తంగా ఫ్రాంఛైజీ 42 కోట్లు ఖర్చు చేయగా.. పర్సులో ప్రస్తుతం 48 కోట్ల రూపాయలు ఉన్నాయి. చదవండి: India Test Captain: రోహిత్ శర్మపై టీమిండియా మాజీ సెలక్టర్ సంచలన వ్యాఖ్యలు... సిరీస్‌కు ముందు గాయపడే కెప్టెన్ అవసరమా? IPL 2022 Auction- MS Dhoni: జడేజా కోసం కోట్లు వదులుకున్నాడు.. జట్టు కోసం ఏమైనా చేస్తాడు.. అతడే మా కెప్టెన్! -
యూని'ఫ్లాప్' కార్న్‌లు.. బేర్ మంటున్న టెక్ స్టార్టప్‌లు!
కొద్ది నెలలుగా రిటైల్ ఇన్వెస్టర్లను ఊరిస్తూ భారీ లాభాలతో స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టయిన కంపెనీలు ఉన్నట్టుండి ‘బేర్’మంటున్నాయి. ప్రధానంగా టెక్ స్టార్టప్‌లలో ఊపందుకున్న అమ్మకాలు అనూహ్య నష్టాలకు తెరతీస్తున్నాయి. వెరసి కొద్ది వారాల్లోనే కొత్తగా లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 2 లక్షల కోట్లు ఆవిరైంది. వీటిలో ప్రధానంగా గత కేలండర్ ఏడాది(2021)లో లిస్టయిన ఆరు టెక్ స్టార్టప్‌లు కోల్పోయిన విలువే రూ. 1.2 లక్షల కోట్లుకావడం గమనార్హం! దిగ్గజ స్టార్టప్‌లకు దెబ్బ 2021లో ప్రైమరీ మార్కెట్లు కదంతొక్కాయి. దీంతో పలు స్టార్టప్‌లు సహా వివిధ రంగాల కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. ప్రధానంగా కొత్తతరం టెక్నాలజీ కంపెనీలు లిస్టింగ్‌కు పోటీపడ్డాయి. రిటైల్ ఇన్వెస్టర్లు క్యూకట్టడంతో ఐటీ, సాస్, ఎడ్టెక్, ఫిన్‌టెక్ తదితర కంపెనీలు ఐపీవోల ద్వారా అనూహ్య స్థాయిలో నిధులు సమకూర్చుకున్నాయి. దీనికితోడు సెకండరీ మార్కెట్లు జోరు మీదుండటంతో భారీ లాభాలతో సైతం లిస్టయ్యాయి. అయితే గతేడాది చివర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోలుకి మంగళంపాడనుండటంతోపాటు.. వడ్డీ రేట్లను వేగంగా పెంచనున్న సంకేతాలు ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులు యూటర్న్ తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా అటు సెకండరీ మార్కెట్లలో దిద్దుబాటు ప్రారంభమైంది. వెరసి లిస్టింగ్ తదుపరి ఈ కేలండర్ ఏడాది(2022) మూడో వారానికల్లా కొత్తగా లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 2 లక్షల కోట్లకు చిల్లు పడింది. ఆరు కొత్తతరం కంపెనీల ద్వారానే దీనిలో రూ. 1.2 లక్షల కోట్లమేర ఆవిరైంది. జాబితాలో ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్(నైకా బ్రాండ్), వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), జొమాటో, పీబీ ఫిన్‌టెక్(పాలసీ బజార్), కార్‌ట్రేడ్ చేరాయి. అయితే గేమింగ్ ఆధారిత కంపెనీ నజారా టెక్నాలజీస్ నష్టాల నుంచి నిలదొక్కుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! పేటీఎమ్ పతనం రెండు నెలల క్రితం లిస్టయిన డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ మార్కెట్ విలువ తాజాగా సగానికి పడిపోయింది. ఈ నెల 24కల్లా రూ. 60,000 కోట్ల దిగువకు చేరింది. కంపెనీ షేరు ఐపీవో ధర రూ. 2,150తో పోలిస్తే రూ. 917 వరకూ జారింది. అంటే 57 శాతం పతనమైంది. ఇక 2021 నవంబర్ 16న 52 వారాల గరిష్టం రూ. 169ను అందుకున్న జొమాటో తాజాగా రూ. 91 వద్ద ముగిసింది. ఈ బాటలో ఆగస్ట్ 20న గరిష్టంగా రూ.1610ను తాకిన కార్‌ట్రేడ్ సోమవారానికల్లా రూ.768కు పడిపోయింది. గత నవంబర్ 17న రూ. 1,470 వద్ద లైఫ్‌టైమ్ హై సాధించిన పాలసీబజార్ రూ.776కు జారింది. ఇదేవిధంగా నవంబర్ 26న రూ. 2,674కు ఎగసిన నైకా రూ. రూ.1,735కు దిగింది. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ షేరు రూ. 940 నుంచి రూ. 780కు నీరసించింది. అయితే రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు పెట్టుబడులున్న నజారా టెక్ మార్కెట్ విలువకు లిస్టింగ్ తదుపరి రూ.3,000 కోట్లమేర జమయ్యింది. అయినప్పటికీ ఈ షేరు సైతం అక్టోబర్ 11న రూ. 3,354ను అధిగమించగా.. తాజాగా రూ. 2,384 వరకూ క్షీణించింది. వేల్యూ స్టాక్స్‌వైపు చూపు కొద్ది రోజులుగా దేశీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఊపందుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఫండ్ మేనేజర్లు, తదితర ఇన్వెస్టర్లు అధిక అవకాశాలున్న గ్రోత్ స్టాక్స్ నుంచి వైదొలగుతున్నట్లు తెలియజేశారు. వీటి స్థానే ఇప్పటికే వ్యాపారాలు విస్తరించిన వేల్యూ స్టాక్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. యూఎస్ అంశాన్ని పక్కనపెడితే.. దేశీయంగా గతేడాది బుల్‌ట్రెండ్ కారణంగా నష్టాలలో ఉన్నప్పటికీ టెక్ ఆధారిత కంపెనీలైన జొమాటో, పేటీఎమ్ తదితర కౌంటర్లు పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ సంస్థ క్రిస్ డైరెక్టర్ అరుణ్ కేజ్రీవాల్ తెలియజేశారు. ప్రస్తుతం వీటి విలువలు(పీఈ) అధికంగా ఉండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర వేల్యూ స్టాక్స్‌వైపు చూస్తున్నట్లు ఎలారా సెక్యూరిటీస్ ఇండియా ఎండీ హరేంద్ర కుమార్ పేర్కొన్నారు. కారణాలున్నాయ్... కొద్దిరోజులుగా సెకండరీ మార్కెట్లు కరెక్షన్కు లోనుకావడానికి ప్రధానంగా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, ఒమిక్రాన్ ఆందోళనలు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే యూఎస్‌లో ఇటీవల టెక్నాలజీ కౌంటర్లలో భారీ అమ్మకాలు కొనసాగుతుండటం ఇక్కడ గమనార్హం. టెక్ కౌంటర్లకు ఆవాసమైన నాస్డాక్ ఇండెక్స్ గత నవంబర్ నుంచి చూస్తే దాదాపు 20 శాతం పతనంకావడాన్ని ప్రస్తావిస్తున్నారు. స్వల్ప కాలంలో ఇండెక్స్ 20 శాతం పతనంకావడం బేర్ ట్రెండుకు సంకేతమని పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు అధిక విలువలుగల టెక్ స్టార్టప్‌ల నుంచి వైదొలగేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషించారు. (చదవండి: -
యూనికార్న్ కంపెనీగా అవతరించిన హైదరాబాద్ కంపెనీ..!
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్ స్టార్టప్ సంస్థ డార్విన్ బాక్స్ యూనికార్న్ కంపెనీగా అవతరించింది. డార్విన్ బాక్స్ డీ-సిరీస్ ఫండ్ రైజ్‌లో భాగంగా టీసీవీ కంపెనీ నుంచి 72 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో ఈ కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లకు పైగా చేరుకోవడంతో యూనికార్న్ కంపెనీగా అవతరించింది. ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువ గల ప్రైవేట్ సంస్థలను యూనికార్న్ కంపెనీలుగా పిలుస్తారు. యూనికార్న్ కంపెనీగా మారిన డార్విన్ బాక్స్ స్టారప్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్లో జయేష్ రంజన్, డార్విన్ బాక్స్ వ్యవస్థాపకులు రోహిత్, చైతన్య, జయంత్ పాలేటి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడారు. ఇండియాలో స్టార్ట్అప్ల పురోగతి చాలా వేగంగా నడుస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో 300లకు పైగా స్టార్టప్ సంస్థలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో మొదలైన డార్విన్ బాక్స్ కంపెనీ యూనికార్న్ అవ్వడం మంచి విషయమన్నారు. యూనికార్న్ కంపెనీగా అవతరించిన డార్విన్ బాక్స్ వ్యవస్థాపకులు చైతన్య పెద్ది, జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమనేని & ఎండియా పార్ట్నర్స్కి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫేస్బుక్ వేదికగా అభినందనలు తెలిపారు. జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమాని & చైతన్య పెద్ది కలిసి 2015లో డార్విన్ బాక్స్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ హెచ్ఆర్ కి సంబంధించిన సేవలు అందిస్తుంది. ఉద్యోగుల హాజరు, పేరోల్ & ఉద్యోగి ఆన్ బోర్డింగ్ వంటి విధులను డిజిటైజ్ చేస్తుంది. దీని ఇతర పెట్టుబడిదారులలో సీక్వోయా, లైట్ స్పీడ్ ఇండియా & సేల్స్ ఫోర్స్ వెంచర్స్ ఉన్నాయి. డార్విన్ బాక్స్ వార్షిక రికరింగ్ రెవిన్యూ(ఏఆర్ఆర్) సంవత్సరానికి సుమారు $30 మిలియన్లకు రెట్టింపు అయింది. అలాగే, ఈ ఏడాదిలో(2022) యూనికార్న్ సంస్థగా అవతరించిన 4వ కంపెనీ. -
యూనికార్న్‌ల హవా!
ముంబై/న్యూఢిల్లీ: ఈ కేలండర్ ఏడాది(2022)లోనూ స్టార్టప్‌ల హవా కొనసాగనుంది. కనీసం 50 సంస్థలు యూనికార్న్ హోదాను పొందే వీలున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,500 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌గా పిలిచే విషయం విదితమే. ఇప్పటికే కనీసం 10 కోట్ల డాలర్ల నిధుల సమీకరణ రీత్యా భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించగల స్టార్టప్‌ల జాబితాను పీడబ్ల్యూసీ రూపొందించింది. ఈ జాబితాలో ఖాటాబుక్, వాట్‌ఫిక్స్, ప్రాక్టో, నింజాకార్ట్, ఇన్‌షార్ట్స్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, పెప్పర్ఫ్రై, లివ్‌స్పేస్ తదితర 50 స్టార్టప్‌లకు చోటు లభించింది. పెట్టుబడుల దూకుడు దేశీయంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత కేలండర్ ఏడాది(2021)లో అత్యంత అధికంగా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్‌లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది(2020)లో సమకూర్చుకున్న 11.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లుకంటే ఎక్కువకావడం విశేషం! దీంతో గతేడాది ఏకంగా 46 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. ఫలితంగా దేశంలో యూనికార్న్‌ల సంఖ్య 90కు చేరింది. 2021 దేశీ టెక్ యూనికార్న్ నివేదిక పేరుతో ఓరిస్ వెంచర్ పార్టనర్స్ రూపొందించిన వివరాలివి. వీటి ప్రకారం.. టాప్–3 ర్యాంక్ గతేడాది బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీల జాబితాలో షేర్‌చాట్, క్రెడ్, మీషో, నజారా, మాగ్లిక్స్, ఎంపీఎల్, గ్రోఫర్స్(బ్లింకిట్), అప్‌గ్రాడ్, మమాఎర్త్, గ్లోబల్బీస్, అకో, స్పిన్నీ తదితరాలు చోటు సాధించాయి. దీంతో ప్రపంచంలోనే అమెరికా(487), చైనా(301) తదుపరి భారత్ 90 యూనికార్న్‌లతో మూడో ర్యాంకులో నిలిచింది. వెరసి 39 యూనికార్న్‌లకు ఆవాసమైన యూకేను నాలుగో ర్యాంకులోకి నెట్టింది. 60,000 స్టార్టప్‌లకు నిలయంకావడం ద్వారా భారత్ మూడోపెద్ద స్టార్టప్ ఎకోవ్యవస్థగల దేశంగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 13 యూనికార్న్‌లలో ఒకటి దేశీయంగానే ఊపిరి పోసుకుంటుండటం విశేషం! ఉపాధి సైతం భారీగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లు కొత్తతరహా సొల్యూషన్స్, సాంకేతికతలను అందించడమేకాకుండా భారీ స్థాయిలో ఉపాధి కల్పనకూ దారి చూపుతున్నాయి. ఫిన్‌టెక్, ఈకామర్స్, ఎస్ఏఏఎస్(సాస్) విభాగాల నుంచి అత్యధికంగా స్టార్టప్‌లు ఆవిర్భవిస్తున్నాయి. వీటి తదుపరి హెల్త్‌టెక్, ఎడ్టెక్, డీ2సీ, గేమింగ్, క్రిప్టో విభాగాలు నిలుస్తున్నాయి. అత్యధిక స్టార్టప్‌లకు బెంగళూరు నెలవుకాగా.. విలువలో 37.6 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్ అగ్రపథాన్ని పొందింది.3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడం ద్వారా గత జూలైలో ఈ విలువను అందుకుంది. ఇక ఆరు నెలల్లోనే యూనికార్న్ హోదాను పొందిన సంస్థగామెన్సా బ్రాండ్స్ గుర్తింపు పొందింది. 2021 మే నెలలో 5 కోట్ల డాలర్లు సమకూర్చుకోవడంతో ఈ విలువను సాధించింది. మహిళలూ.. యూనికార్న్‌ల వ్యవస్థాపకుల్లో 20 శాతం నాన్ ఇంజినీర్స్ కాగా.. దాదాపు 67 శాతం వరకూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్బీ నుంచి ఒకరు లేదా అంతకుమించిన వ్యక్తులు ఉన్నట్లు ఓరిస్ వెంచర్స్ తాజా నివేదిక పేర్కొంది. జాబితాలో 13 మంది మహిళా వ్యవస్థాపకులకు చోటు లభించగా.. 2021లోనే 8 మంది ఈ హోదాను సాధించారు. వీరిలో ఫాల్గుణి నాయర్(నైకా), గజల్ కల్రా(రివిగో), రుచీ కల్రా(ఆఫ్‌బిజినెస్), దివ్యా గోకుల్‌నాథ్(బైజూస్), ఘజల్ అలఘ్(మమాఎర్త్), సరితా కటికనేని(జెనోటీ) తదితరులున్నారు. డెకాకార్న్‌లుగా.. 10 బిలియన్ డాలర్లు అంతకుమించిన విలువను అందుకున్న కంపెనీలను డెకాకార్న్‌లుగా వ్యవహరిస్తుంటారు. దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, బైజూస్, ఓయో డెకాకార్న్‌లుగా ఆవిర్భవించాయి. గతేడాది అత్యధికంగా 11 స్టార్టప్‌లు ఐపీఓలను చేపట్టాయి. వీటిలో 8 యూనికార్న్‌లే! ఐపీవోల ద్వారా 7.16 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 18,300 కోట్లు(2.46 బిలియన్ డాలర్లు) అందుకుంది. మరోపక్క జొమాటో 14.8 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్(విలువ)తో చరిత్ర సృష్టించింది. ఈ బాటలో నైకా 13.5 బిలియన్ డాలర్లు, ఫ్రెష్‌వర్క్స్ 6.9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించడం విశేషం! -
స్టార్టప్స్‌లో పెట్టుబడుల దూకుడు
న్యూఢిల్లీ: దేశీయంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. గత కేలండర్ ఏడాది(2021)లో అత్యంత అధికంగా 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్‌లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది(2020)లో సమకూర్చుకున్న 11.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి మూడు రెట్లుకంటే ఎక్కువకావడం విశేషం! దీంతో గతేడాది ఏకంగా 46 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఫలితంగా దేశంలో యూనికార్న్‌ల సంఖ్య 90కు చేరింది. 2021 దేశీ టెక్ యూనికార్న్ నివేదిక పేరుతో ఓరిస్ వెంచర్ పార్టనర్స్ రూపొందించిన వివరాలివి. వీటి ప్రకారం.. టాప్–3 ర్యాంక్.. గతేడాది బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీల జాబితాలో షేర్‌చాట్, క్రెడ్, మీషో, నజారా, మాగ్లిక్స్, ఎంపీఎల్, గ్రోఫర్స్(బ్లింకిట్), అప్‌గ్రాడ్, మమాఎర్త్, గ్లోబల్బీస్, అకో, స్పిన్నీ తదితరాలు చోటు సాధించాయి. దీంతో ప్రపంచంలోనే అమెరికా(487), చైనా(301) తదుపరి భారత్ 90 యూనికార్న్‌లతో మూడో ర్యాంకులో నిలిచింది. వెరసి 39 యూనికార్న్‌లకు ఆవాసమైన యూకేను నాలుగో ర్యాంకులోకి నెట్టింది. 60,000 స్టార్టప్‌లకు నిలయంకావడం ద్వారా భారత్ మూడోపెద్ద స్టార్టప్ ఎకోవ్యవస్థగల దేశంగా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 13 యూనికార్న్‌లలో ఒకటి దేశీయంగానే ఊపిరి పోసుకుంటుండటం విశేషం! ఉపాధి సైతం భారీగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లు కొత్తతరహా సొల్యూషన్స్, సాంకేతికతలను అందించడమేకాకుండా భారీ స్థాయిలో ఉపాధి కల్పనకూ దారి చూపుతున్నాయి. దారి చూపుతున్నాయి. ఫిన్‌టెక్, ఈకామర్స్, ఎస్ఏఏఎస్(సాస్) విభాగాల నుంచి అత్యధికంగా స్టార్టప్‌లు ఆవిర్భవిస్తున్నాయి. వీటి తదుపరి హెల్త్‌టెక్, ఎడ్టెక్, డీ2సీ, గేమింగ్, క్రిప్టో విభాగాలు నిలుస్తున్నాయి. అత్యధిక స్టార్టప్‌లకు బెంగళూరు నెలవుకాగా.. విలువలో 37.6 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్ అగ్రపథాన్ని పొందింది.3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడం ద్వారా గత జులైలో ఈ విలువను అందుకుంది. ఇక ఆరు నెలల్లోనే యూనికార్న్ హోదాను పొందిన సంస్థగామెన్సా బ్రాండ్స్ గుర్తింపు పొందింది. 2021 మే నెలలో 5 కోట్ల డాలర్లు సమకూర్చుకోవడంతో ఈ విలువను సాధించింది. డెకాకార్న్లు.. 10 బిలియన్ డాలర్లు అంతకుమించిన విలువను అందుకున్న కంపెనీలను డెకాకార్న్‌లుగా వ్యవహరిస్తుంటారు. దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, బైజూస్, ఓయో రూమ్స్ డెకాకార్న్‌లుగా ఆవిర్భవించాయి. గతేడాది అత్యధికంగా 11 స్టార్టప్‌లు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. వీటిలో 8 యూనికార్న్ సంస్థలుండటం గమనార్హం! ఐపీవోల ద్వారా 7.16 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్) కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 18,300 కోట్లు(2.46 బిలియన్ డాలర్లు) అందుకుంది. మరోపక్క జొమాటో 14.8 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)తో చరిత్ర సృష్టించింది. ఈ బాటలో నైకా 13.5 బిలియన్ డాలర్లు, ఫ్రెష్‌వర్క్స్ 6.9 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించడం విశేషం! మహిళలూ.. యూనికార్న్‌ల వ్యవస్థాపకుల్లో 20 శాతం నాన్ఇంజినీర్స్కాగా.. దాదాపు 67 శాతంవరకూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఎస్బీ నుంచి ఒకరు లేదా అంతకుమించిన వ్యక్తులున్నారు. జాబితాలో 13 మంది మహిళా వ్యవస్థాపకులకు చోటు లభించగా.. 2021లోనే 8 మంది ఈ హోదాను సాధించారు. వీరిలో ఫాల్గుణి నాయర్(నైకా), గజల్ కల్రా(రివిగో), రుచీ కల్రా(ఆఫ్‌బిజినెస్), దివ్యా గోకుల్‌నాథ్(బైజూస్), ఘజల్ అలఘ్(మమాఎర్త్), సరితా కటికనేని(జెనోటీ) తదితరులున్నారు. -
ఈ ఏడాది తొలి యూనికార్న్‌గా హోనాసా
న్యూఢిల్లీ: మామాఎర్త్ తదితర బ్రాండ్స్ పేరిట వ్యక్తిగత సౌందర్య సంరక్షణ సాధనాలు విక్రయించే ఈ–కామర్స్ సంస్థ హోనాసా కన్జూమర్ తాజాగా 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 52 మిలియన్ డాలర్లు సమీకరించింది. తద్వారా ఈ ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి సంస్థగా నిల్చింది. సెకోయా, సోఫినా వెంచర్స్, ఎవాల్వెన్స్ క్యాపిటల్ తదితర సంస్థలు ఈ విడత ఇన్వెస్ట్ చేశాయి. సంస్థ ఇప్పటికే ఫైర్‌సైడ్ వెంచర్స్, స్టెలారిస్ వెంచర్ పార్ట్నర్స్ మొదలైన వాటి నుంచి పెట్టుబడులు సమకూర్చుకుంది. కొత్తగా సమీకరించిన నిధులను వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్లు, నవకల్పనలు, పంపిణీ.. మార్కెటింగ్ వ్యవస్థలను మరింతగా విస్తరించేందుకు ఉపయోగించుకోనున్నట్లు హోనాసా సహ వ్యవస్థాపకుడు, సీఈవో వరుణ్ అలగ్ తెలిపారు. మామాఎర్త్, ది డెర్మా కంపెనీతో పాటు కొత్తగా ఆక్వాలాజికా బ్రాండ్ పేరిట స్కిన్‌కేర్ విభాగంలోకి కూడా ప్రవేశించినట్లు ఆయన వివరించారు. మామాఎర్త్ బ్రాండ్ కింద శిరోజాలు, చర్మ సంరక్షణ, కాస్మెటిక్స్ మొదలైన ఉత్పత్తులను, ది డెర్మా కంపెనీ బ్రాండ్ కింద 40 పైగా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు హోనాసా మరో సహ వ్యవస్థాపకుడు, సీఈవో గజల్ అలగ్ తెలిపారు. అయిదేళ్ల క్రితం ఏర్పాటైన హోనాసా దేశీయంగా 1,000 పైచిలుకు నగరాల్లో ఉత్పత్తులు అందిస్తోంది. -
పేటీఎంకు భారీ షాక్
Patym Mall Lost Unicorn Status: డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎంకు భారీ షాక్ తగిలింది. పేటీఎం ఈ-కామర్స్ విభాగం ‘పేటీఎం మాల్’ యూనికార్న్ హోదాను కోల్పోయింది. తాజాగా హురూన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించిన యూనికార్న్ జాబితాలో ‘పేటీఎం మాల్’ స్థానం కనిపించలేదు. స్టార్టప్ వాల్యూయేషన్ 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేట్ స్టార్టప్‌లను ‘యూనికార్న్’ కంపెనీలుగా ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేటీఎం మాల్ వాల్యూ 1 బిలియన్ కంటే కిందకి పడిపోయినట్లు సమాచారం. ఈ పతనంపై పేటీఎం స్పందించాల్సి ఉంది. ఇక పేటీఎం మాల్తో పాటు మరో ఏడు భారీ స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను పొగొట్టుకున్నాయి. వీటిలో చాలావరకు చైనాకు చెందినవే ఉండడం విశేషం. ఈసారి లిస్టులో 673 కొత్త సంస్థలు స్థానం దక్కించుకున్నాయి. వేల్యుయేషన్స్ 1 బిలియన్ డాలర్ల దిగువకి పడిపోవడంతో 39 కంపెనీలు యూనికార్న్ హోదా కోల్పోయాయి. స్టాక్ ఎక్సేంజ్ లిస్ట్ కావడం లేదంటే ఇతర సంస్థలు కొనుగోలు చేయడం వంటి కారణాలతో మొత్తం 162 సంస్థలను యూనికార్న్ లిస్టు నుంచి తప్పించారు. ఈ-కామర్స్ రంగం పోటీలో భాగంగా పేటీఎం మాల్‌ను 2016లో పేటీఎం లాంఛ్ చేసింది. రెండేళ్లు తిరగకుండానే బిలియన్ డాలర్ల వాల్యూతో యూనికార్న్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది పేటీఎం మాల్. ఈబే ఫండింగ్ తర్వాత 2019లో పేటీఎం మాల్ విలువ 2.86 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ సమయంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో సైతం పోటీపడింది పేటీఎం మాల్. కిందటి ఏడాది 3 బిలియన్ డాలర్ల వాల్యూతో నిలిచిన పేటీఎం మాల్.. ఈ ఏడాది ఏకంగా యూనికార్న్ హోదా కోల్పోవడం విశేషం. ఇంకోవైపు ఐపీవోకి వెళ్లిన పేటీఎం.. చేదు ఫలితాల్నే చవిచూస్తోంది. చదవండి: బ్రిటన్ను వెనక్కి నెట్టిన భారత్.. నెక్స్ట్ చైనానే!