హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఎడ్‌టెక్ కంపెనీ ఫిజిక్స్‌వాలా యూనికార్న్ జాబితాలో చేరింది. సిరీస్–ఏ కింద కంపెనీ రూ.777 కోట్ల నిధులను సమీకరించింది. వెస్ట్‌బ్రిడ్జ్, జీఎస్‌వీ వెంచర్స్ ఈ మొత్తాన్ని సమకూర్చాయి. డీల్‌లో భాగంగా ఫిజిక్స్‌వాలాను రూ.8,663 కోట్లుగా విలువ కట్టారు. భారత్‌లో 101వ యూనికార్న్‌గా ఫిజిక్స్‌వాలా చోటు సంపాదించింది. అలాగే సిరీస్–ఏ ఫండ్ ద్వారా ఈ ఘనతను సాధించిన మొదటి సంస్థ కూడా ఇదే. వ్యాపార విస్తరణకు, బ్రాండింగ్, లెర్నింగ్ కేంద్రాల ఏర్పాటు, కొత్త కోర్సులను పరిచయం చేసేందుకు తాజా నిధులను వినియోగించనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. సంస్థ యాప్‌ను 52 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. యూట్యూబ్‌లో 69 లక్షల మంది చందాదార్లు ఉన్నారు.
మరిన్ని భాషల్లో..
వృద్ధి ప్రయాణంలో భాగంగా తెలుగుసహా కొత్తగా తొమ్మిది స్థానిక భాషల్లో కంటెంట్‌ను పరిచయం చేయనున్నట్టు ఫిజిక్స్‌వాలా వెల్లడించింది. సంస్థలో 1,900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 500 మంది దాకా బోధకులు, 100 మంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి 200 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు. ఆరు మెడికల్ కళాశాలల్లో ఒకరు, 10 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకరు ఫిజిక్స్‌వాలా విద్యార్థులు ఉంటారని కంపెనీ తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికిగాను 10,000 మందికిపైగా విద్యార్థులు తమ పేర్లను సంస్థ వద్ద నమోదు చేసుకున్నారు.
చదవండి: Alakh Pandey Success Story: నెలకు రూ.3.30 కోట్ల జీతం ఇస్తామన్నా వద్దన్నాడు.. చివరికి..
Comments
Please login to add a commentAdd a comment