ఎంట్రప్యూనర్లకు స్వర్గధామంగా ఇండియా మారుతోంది. గడిచిన నాలుగేళ్లుగా ఇండియాలో యూనికార్న్ కంపెనీల హవా నడుస్తోంది. ఒకప్పుడు యూనికార్న్ హోదా సాధించేందుకు దశాబ్ధాల తరబడి ఎదురు చూసిన స్టార్టప్‌లు ఇప్పుడు నెలల వ్యవధిలోనే యానికార్న్‌లుగా మారిపోతున్నాయి. వ్యాపారంలో రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి.
యూనికార్న్ అంటే
నియోబ్యాంక్ ఓపెన్ స్టార్టప్ 2022 మే 2న ఇండియాలో వందో యూనికార్న్ కంపెనీగా రూపుదిద్దుకుంది. ఏదైనా స్టార్టప్ మంచి పనితీరును కనబరిచి పెట్టుబడులు సాధిస్తూ దాని మార్కెట్ వాల్యుయేషన్ వన్ బిలియన్ డాలర్లకు చేరుకుంటే దాన్ని యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఈ యూనికార్న్‌లు అమెరికా, యూరప్, చైనా, జపాన్ దేశాల్లోనే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
గేమ్ చేంజర్
2016 మన దేశంలోనే 2016-17కి పూర్వం వరకు సగటున ఏడాదికి ఒక స్టార్టప్ కనాకష్టంగా యూనికార్న్ హోదాను పొందేది. పెట్టుబడులు సాధించడం కష్టంగా ఉండేది. కానీ 2016లో స్టార్టప్‌కు ప్రత్యేక ప్రోత్సహాకాలు ప్రకటించడం, అదే సమయంలో ఇంటర్నెట్ చవగ్గా మారి అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో అప్పటి నుంచి స్టార్టప్‌లకు మంచి రోజులు వచ్చాయి. అనతి కాలంలోనే ఊహించిన స్థాయిలో స్టార్టప్‌లు పెరిగిపోయాయి.
26 ఏళ్ల నుంచి 4 నెలలకు
2022 మే వరకు గల డేటాను పరిశీలిస్తే దేశంలో ఏకంగా 69 వేల స్టార్టప్‌లు ఉన్నాయి. ఇవి 56 రంగాల్లో కృషి చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 13 శాతం స్టార్టప్‌లు ఐటీ రంగంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్ లైఫ్ సైన్సెస్‌లో 9 శాతం, ఎడ్యుకేషన్ 7 శాతం, ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ 5 శాతం, అగ్రికల్చర్ 5 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 5 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు యూనికార్న్ హోదా పొందిన 100 కంపెనీలను పరిశీలిస్తే.. యూనికార్న్ హోదా పొందేందుకు గరిష్ట సమయం 26 ఏళ్లు ఉండగా కనిష్ట సమయం 4 నాలుగు నెలలుగా ఉంది. దేశీయంగా స్టార్టప్ ఏకో సిస్టమ్ బాగుండటంతో త్వరితగతిన యూనికార్న్ హోదాను సాధిస్తున్నాయి.
ఇప్పటికే 14 యూనికార్న్‌లు
కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత 2021లోనే ఏకంగా 44 కంపెనీలు యూనికార్న్ హోదాను సాధించాయి. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల కాలంలోనే 14 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వేగం చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ పది యూనికార్న్ స్టార్టప్‌లలో ఒకటి ఇండియా నుంచే వస్తోంది.
చదవండి: ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్!
Comments
Please login to add a commentAdd a comment