inida
-
'ఇండియా' కూటమి తర్వాతి ప్రణాళిక అదుర్స్!!
పాట్నా: ముంబైలో ముచ్చటగా మూడో సారి సమావేశమైన ఇండియా విపక్ష కూటమి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై జమిలి ఎన్నికల కమిటీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇదే క్రమంలో ఇండియా తదుపరి కార్యాచరణ గురించి కీలకమైన సమాచారమిచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దానికోసం యావత్ భారత్ దేశం పండుగలా జరుపుకునే గాంధీ జయంతిని వేదికగా చేసుకున్నట్లు తెలిపారు. ఇండియా కూటమి తర్వాతి కార్యాచరణ గురించి కీలక సమాచారమిచ్చారు బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. ముంబైలో ఇండియా కూటమి సమావేశం ముగించుకుని పాట్నా చేరుకున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ జన్మదినోత్సవాల్లో పాల్గొని వచ్చేనెల ఇండియా కూటమి గాంధీ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఇదే నెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల కోసం పిలుపునిచ్చిన ప్రభుత్వం వాటి ఎజెండా ఏమిటో చెప్పకపోవడంపై కూడా అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక జమిలి ఎన్నికల పేరుతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని మేమంతా ఏకకంఠంతో వ్యతిరేకించడంతో షాక్‌కు గురయ్యారన్నారు. కేంద్రం ఎప్పుడో నిర్వహిస్తామని చెప్పిన కులగణన గురించి ఇప్పటికీ నోరువిప్పకపోవడం చాల ఆశ్చర్యకరంగా ఉందని వారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలోపే మేము మా రాష్ట్రంలో కులగణన తోపాటు జనాభా గణన కూడా పూర్తి చేశామని అన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చేందుకే బహుశా వారు ఈ సమావేశాలకు పిలుపునిచ్చారనిపిస్తోందని మేము కూడా ఇదే సమావేశాల్లో జనాభాగణన గురించి కేంద్రాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ టికెట్టు కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ -
ఆ ఊరిలో ఇంటికో డాక్టర్ ఎందుకున్నారు? ఇందుకు ఎవరు ప్రేరణగా నిలిచారు?
మనదేశంలోని ఆ గ్రామంలో గల ప్రతి ఇంట్లో వైద్యుడు ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న దేవుని స్వరూపమే వైద్యుడని అంటుంటారు. ఆలోచిస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా పుట్టుకు వస్తున్న రోగాల నుంచి మనకు విముక్తి కల్పించేది వైద్యులే అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం చెప్పుకుంటున్న ఆ గ్రామం మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉంది. ఇక్కడి ఘరివలి గ్రామంలో దాదాపు ముప్పై కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలలో ఎక్కువ మంది వైద్యులు ఉన్నారు. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే ఈ కుటుంబాలకు చెందిన పిల్లలు భవిష్యత్తులో కూడా వైద్యులు కావాలనే సంకల్పంతో ఉన్నారు. ఇక్కడి చిన్నారులు వైద్యులుగా తయారయ్యేందుకు మొదటి నుంచీ ప్రేరణ పొందుతున్నారు. ఈ ప్రపంచంలో మరొకరి ప్రాణాన్ని కాపాడటం కంటే మించినది వేరేదీ లేదని గ్రామస్తులు చెబుతుంటారు. కాగా ఇక్కడ ఉన్న కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినప్పటికీ వారి పిల్లలు ప్రతి సంవత్సరం వైద్యులుగా మారుతున్నారు. ఈ గ్రామంలో వైద్యుల కథ 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ గ్రామానికి చెందిన సంజయ్ పాటిల్ అనే యువకుడు తొలిసారిగా ఎంబీబీఎస్ పట్టా అందుకున్నాడు. అతను డాక్టర్ అయ్యాక, అతనితో పాటు అతని కుటుంబం ఆర్థిక స్థితి మెరుగుపడింది. దీంతోపాటు అతని కుటుంబానికి సమాజంగా గౌరవం మరింతగా పెరిగింది. ఇదిమొదలు గ్రామంలోని ప్రతి చిన్నారిలోనూ డాక్టర్ కావాలనే కల చిగురించింది. కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడి పిల్లలు డాక్టర్లు కావడానికి ఎంతో కష్టపడుతున్నారు. నేడు ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ వైద్యుడు ఉన్నాడు. ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో! -
నాడు సీమా, నేడు సానియా.. ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు!
ప్రేమ కోసం దేశ సరిహద్దులను లెక్కచేయకుండా పాకిస్తాన్ నుంచి భారత్‌కు తరలివచ్చిన సీమా హైదర్ కథ మరచిపోకముందే అలాంటి అనేక ప్రేమ కథలు మన ముందుకు వస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళ తన ఏడాది కుమారునితో పాటు భారత్‌కు తరలివచ్చింది. ఆమె తన పేరు సానియా అఖ్తర్ అని చెబుతోంది. సానియా బంగ్లాదేశ్‌నుంచి వీసా తీసుకుని, తన భర్త సౌరభ్ కాంత్ తివారిని కలుసుకునేందుకు వచ్చింది. సానియా, సౌరభ్‌లు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని సమాచారం. తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారికి ఇప్పుడు ఏడాది వయసు. సానియా ఇప్పుడు కుమారుడిని తీసుకుని, తన భర్త ఉంటున్న నోయిడాకు వచ్చింది. అయితే ఆమె ఇక్కడకు వచ్చాక భర్త మరో వివాహం చేసుకున్నాడని ఆమెకు తెలిసింది. సానియా మీడియాతో మాట్లాడుతూ తన భర్త సౌరభ్ తనకు ఇప్పుడు ఆశ్రయం కల్పించడం లేదని, తనను మోసం చేసిన సౌరభ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని తెలిపింది. కాగా ఈ ఉదంతం నోయిడా పోలీసుల వరకూ చేరింది. ఆమె తన కుమారుడిని తీసుకుని సెక్టార్ 108లో ఉన్న పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంది. తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకుంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం సౌరభ్ బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కల్టీ మ్యాక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. -
2047 నాటికి మన దేశమే నంబర్ వన్
హైదరాబాద్: అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన 2047 నాటికి భారత్‌ను నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న 25 ఏళ్లను అమృత కాలంగా పరిగణిస్తూ రాజకీయాలకతీతంగా దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగం, పేదరికం లేనటువంటి దేశంగా అభివృద్ధి దిశగా ముందుకెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు ఆధ్వర్యంలో సోమవారం బర్కత్‌పురాలోని బీజేపీ నగర కార్యాలయం వద్ద తిరంగా ర్యాలీని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని, అలాంటి వారిలో వెలుగులోకి రానివారి జీవిత చరిత్రను, ఆధ్యాత్మికమైన ప్రముఖ వ్యక్తుల చరిత్రను రేపటి తరానికి అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గత ఏడాది దేశంలో 25 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేశారని, అదే స్ఫూర్తితో ఆగస్టు 15, జనవరి 26న ప్రతి భారతీయుడి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. 75 మీటర్ల జాతీయ జెండాతో బర్కత్‌పురా చమన్ నుంచి కాచిగూడ చౌరస్తాలోని వీరసావర్కర్ విగ్రహాం వరకు తిరంగా ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి జి.కావ్యారెడ్డి, బీజేపీ మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి, నీరజ, కార్పొరేటర్లు బి.పద్మ వెంకట్‌రెడ్డి, కన్నె ఉమారమేష్ యాదవ్, వై.అమృత, పార్టీ నేతలు అట్లూరి సుభాషిణి, కృష్ణాగౌడ్, ఎ.సూర్యప్రకాష్ సింగ్, ఎడెల్లి అజయ్ కుమార్, సి.నందకిషోర్ యాదవ్, సి.వినోద్ యాదవ్, వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
Covid: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిత్యం 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,899 మంది కోవిడ్ బారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే వైరస్‌తో 15 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 72,474. యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,855కు చేరుకుంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 7.71 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,518 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,99, 363కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 14,88,807 మందికి కరోనా వ్యాక్సిన్లను అందించినట్టు కేంద్రం తెలిపింది. చదవండి: Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్ -
Unicorn: ప్రతీ పదింటా ఒకటి ఇండియాలోనే
ఎంట్రప్యూనర్లకు స్వర్గధామంగా ఇండియా మారుతోంది. గడిచిన నాలుగేళ్లుగా ఇండియాలో యూనికార్న్ కంపెనీల హవా నడుస్తోంది. ఒకప్పుడు యూనికార్న్ హోదా సాధించేందుకు దశాబ్ధాల తరబడి ఎదురు చూసిన స్టార్టప్‌లు ఇప్పుడు నెలల వ్యవధిలోనే యానికార్న్‌లుగా మారిపోతున్నాయి. వ్యాపారంలో రయ్ రయ్ మంటూ దూసుకుపోతున్నాయి. యూనికార్న్ అంటే నియోబ్యాంక్ ఓపెన్ స్టార్టప్ 2022 మే 2న ఇండియాలో వందో యూనికార్న్ కంపెనీగా రూపుదిద్దుకుంది. ఏదైనా స్టార్టప్ మంచి పనితీరును కనబరిచి పెట్టుబడులు సాధిస్తూ దాని మార్కెట్ వాల్యుయేషన్ వన్ బిలియన్ డాలర్లకు చేరుకుంటే దాన్ని యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. ఒకప్పుడు ఈ యూనికార్న్‌లు అమెరికా, యూరప్, చైనా, జపాన్ దేశాల్లోనే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గేమ్ చేంజర్ 2016 మన దేశంలోనే 2016-17కి పూర్వం వరకు సగటున ఏడాదికి ఒక స్టార్టప్ కనాకష్టంగా యూనికార్న్ హోదాను పొందేది. పెట్టుబడులు సాధించడం కష్టంగా ఉండేది. కానీ 2016లో స్టార్టప్‌కు ప్రత్యేక ప్రోత్సహాకాలు ప్రకటించడం, అదే సమయంలో ఇంటర్నెట్ చవగ్గా మారి అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో అప్పటి నుంచి స్టార్టప్‌లకు మంచి రోజులు వచ్చాయి. అనతి కాలంలోనే ఊహించిన స్థాయిలో స్టార్టప్‌లు పెరిగిపోయాయి. 26 ఏళ్ల నుంచి 4 నెలలకు 2022 మే వరకు గల డేటాను పరిశీలిస్తే దేశంలో ఏకంగా 69 వేల స్టార్టప్‌లు ఉన్నాయి. ఇవి 56 రంగాల్లో కృషి చేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 13 శాతం స్టార్టప్‌లు ఐటీ రంగంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్ లైఫ్ సైన్సెస్‌లో 9 శాతం, ఎడ్యుకేషన్ 7 శాతం, ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ సర్వీసెస్ 5 శాతం, అగ్రికల్చర్ 5 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 5 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు యూనికార్న్ హోదా పొందిన 100 కంపెనీలను పరిశీలిస్తే.. యూనికార్న్ హోదా పొందేందుకు గరిష్ట సమయం 26 ఏళ్లు ఉండగా కనిష్ట సమయం 4 నాలుగు నెలలుగా ఉంది. దేశీయంగా స్టార్టప్ ఏకో సిస్టమ్ బాగుండటంతో త్వరితగతిన యూనికార్న్ హోదాను సాధిస్తున్నాయి. ఇప్పటికే 14 యూనికార్న్‌లు కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత 2021లోనే ఏకంగా 44 కంపెనీలు యూనికార్న్ హోదాను సాధించాయి. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల కాలంలోనే 14 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వేగం చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ పది యూనికార్న్ స్టార్టప్‌లలో ఒకటి ఇండియా నుంచే వస్తోంది. చదవండి: ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు..సీఈఓ పరాగ్ అగర్వాల్ భార్య అదిరిపోయే ట్విస్ట్! -
కొత్త పంచాయితీ ఎత్తుకున్న చైనా
న్యూఢిల్లీ: కయ్యానికి కాలు దువ్వే డ్రాగన్ కంట్రీ మరోసారి భూటాన్‌తో సరిహద్దు పంచాయితీ ఉందంటూ కొత్త రాగం అందుకుంది. పొరుగునున్న భూటాన్‌తో తూర్పు ప్రాంతంలో సరిహద్దు వివాదాలున్నాయని చైనా తొలిసారి అధికారికంగా ప్రకటించింది. చాలా ఏళ్లుగా నెలకొన్న ఈ వివాదం ఇంకా ముగియలేదని తెలిపింది. చైనా, భూటాన్ సరిహద్దుల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో నెలకొన్న వివాదాల్లో.. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో వివాదాలు సమసిపోయాయని, తూర్పు ప్రాంతంలో వివాదం అలాగే ఉందని చైనా శనివారం వెల్లడించింది. అయితే, భూటాన్‌తో ఉన్న సరిహద్దు వివాదంలో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా భారత్‌ను ఉద్దేశించి చైనా స్పష్టమైన సూచన చేసింది. కాగా, చైనా చెప్తున్న తూర్పు ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్నందున భారత్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. (చదవండి: లవ్ ఇండియా : ట్రంప్ వైరల్ ట్వీట్) ఇదిలాఉండగా.. 1984 నుంచి 2016 వరకు చైనా భూటాన్ మధ్య 24 సార్లు చర్చలు జరిగాయి. ఇవన్నీ ఇరు దేశాల మద్య ఉన్న పశ్చిమ, మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినవేనని భూటాన్ పార్లమెంట్ డాటా ప్రకారం తెలుస్తోంది. రెండు దేశాల మధ్య ఎన్నోసార్లు చర్చలు జరిగినప్పటికీ.. తూర్పు సరిహద్దు ప్రాంతంపై ఎలాంటి వివాదాలు తెరపైకి రాలేదని భూటాన్ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక చైనా తాజా ప్రకటనపై భారత్ ఇంకా స్పందించలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటన నేపథ్యంలోనే డ్రాగన్ దేశం తాజా వివాదాన్ని లేవనెత్తిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో భూటాన్‌తో ఉన్న తూర్పు ప్రాంత వివాదం కొత్తదేమీ కాదని, ఏళ్లుగా నలుగుతోందని చైనా తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటోంది. (చదవండి: రాయని డైరీ: జిన్‌పింగ్ (చైనా అధ్యక్షుడు)) -
భారత్‌లో ఒక్క రోజే 17,296 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటలలో అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 407 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401కు చేరుకోగా, మొత్తం 15,301 మంది మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,89,463గా ఉంది. ( సినీ నటుల ఇళ్ల వద్ద కరోనా కలకలం ) కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,85,636 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,15,446.. ఇప్పటి వరకు 77,76,228 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. కాగా, గురువారం ఒక్కరోజే 16,922 కొత్త కేసులు నమోదు కాగా, మరో 418 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. -
ఏకంగా చైనాను దాటేసిన మహారాష్ట్ర!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తరణ అంతకంతకూ అధికమవుతోంది. ఇప్పటికే రెండున్నర లక్షల కేసులతో భారత్ ఇటలీని దాటేసి రికార్డులకెక్కగా.. తాజాగా మహారాష్ట్ర కూడా ఓ రికార్డును నమోదు చేసింది. వైశాల్యంలో మూడో స్థానం, జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనాను కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర బీట్ చేసింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 3007 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 85,975కు చేరింది. అదేసమయంలో కోవిడ్ పుట్టుకకు కేంద్ర స్థానమైన చైనాలో కేసుల సంఖ్య 83,036 గా ఉంది. (చదవండి: ఇటలీని దాటేసిన భారత్) ఇక దేశ వ్యాప్తంగా 6929 మంది మరణించగా.. ఒక్క మహారాష్ట్రలోనే ఆ సంఖ్య మూడు వేలుగా ఉంది. ఆదివారం సాయంత్రం నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 లక్షల 26 వేలకు చేరగా.. 34 లక్షల 35 వేల మంది కోలుకున్నారు. కాగా, 2,34,801 కేసులతో ఇటలీ ఏడో స్థానంలో ఉండగా.. 2,54,242 కేసులతో భారత్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో 82 వేల కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో, 30 వేల కేసులతో తమిళనాడు రెండో స్థానంలో, 27 వేల కేసులతో ఢిల్లీ, 19 వేల కేసులతో గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. (చదవండి: ఇది ఎన్నికల ర్యాలీ కాదు : అమిత్ షా) -
భారత్‌లో పంజా విసురుతున్న కరోనా
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతునే ఉంది. కోవిడ్-19 పాజిటివ్ కేసులు సంఖ్యతో పాటు, మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. గురువారం కేంద్రం విడుదల చేసిన హెల్త్ బుటిటెన్ ప్రకారం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 33 వేలు దాటింది. గత 24 గంటల్లో భారత్‌లో 1718 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్అగర్వాల్ వెల్లడించారు. దీంతో భారత్ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి చేరింది. (చదవండి : పెళ్లి కోసం తండ్రి, కొడుకులు ఏం చేశారంటే..) ఇక ఈ మహమ్మారి బారిన పడి 24 గంటల్లో 67 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1074కు చేరింది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 25.19గా పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించడం కాస్త ఊరట కలిగించే అంశం. ఇప్పటి వరకు 8,324 మంది కరోనా మహమ్మారి నుంచి కొలుకొని ఇంటికి వెళ్లినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పేదలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు లాక్డౌన్ సమయంలో కూలీలు, పేదలకు తక్కువ ధరకే నిత్యావసరాలు అందిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్అగర్వాల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా హాట్స్పాట్లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. లారీ డ్రైవర్లకు స్క్రీనింగ్ చేయాలని రాష్ట్రాలను ఆదేశించామని చెప్పారు. కరోనా కట్టడిలో రాష్ట్రాలు అన్ని కేంద్రంతో కలిసి నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మనదగ్గర కరోనా కేసులు తక్కువెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన ప్రాంతం దక్షిణాసియా. దాదాపు రెండు వందల కోట్ల మంది నివసించే ఈ ప్రాంతం ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యరంగంలోనూ వెనకబడింది. అయినా ఆరోగ్యరంగంతోపాటు ఆర్థికంగా బాగున్న చైనా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలకన్నా కరోనా వైరస్ బాధితులు తక్కువగా ఉండడం ఎంతో విశేషం. ఏప్రిల్ 20వ తేదీ నాటికి భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ దేశాల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,446 కాగా, మృతుల సంఖ్య 817. అమెరికాలోని ఒక్క న్యూయార్క్ సిటీలోనే 1,34,436 మంది కరోనా బాధితులుకాగా, 10,022 మంది మరణించారు. ప్రపంచ జనాభాలో 20 శాతానికి పైగా జనాభా కలిగిన దక్షిణాసియాలో కరోనా కేసుల శాతం 1.2 శాతం మాత్రమే. ఇక మృతుల సంఖ్య 0.5 శాతానికన్నా తక్కువ. దక్షిణాసియాలోని మొత్తం 28,446 కేసుల్లో భారత్‌లో 17,265, పాకిస్థాన్‌లో 8,418, బంగ్లాదేశ్‌లో 2,456, శ్రీలంకలో 271, నేపాల్‌లో 31, భూటాన్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. (చదవండి: 80 శాతం రోగులకు కరోనా లక్షణాలు లేవు) అలాగే మృతుల సంఖ్యలో భారత్‌లో 543 మంది, పాకిస్థాన్‌లో 176, బంగ్లాదేశ్‌లో 91, శ్రీలంకలో ఏడుగురు మరణించగా, నేపాల్, భూటాన్‌లో ఒక్కరు కూడా మరణించలేదు. నిర్ధారిత కరోనా కేసుల్లో మృతుల సంఖ్య దక్షిణాసియాలో సరాసరి 2.87 శాతంకాగా, అమెరికాలో 5,34 శాతం, బ్రిటన్‌లో 13,38 శాతం. ప్రపంచ సరాసరి శాతం 6.87 శాతం. ఈ విషయంలో బంగ్లాదేశ్ 3.71 శాతంతో ముందుండగా, 3.15 శాతంతో భారత్ స్థానంలో ఉంది. 2.09 శాతంతో పాకిస్థాన్ చివరి స్థానంలో ఉంది. దక్షిణాసియాలో ఎంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఎంత మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలిందనే విషయంలోనూ దక్షిణాసియా రికార్డు బాగానే ఉంది. అందుకనే తాము నిర్వహిస్తున్న కరోనా పరీక్షల సంఖ్య సముచితంగా ఉందంటూ భారత్ వాదిస్తోంది. భారత్‌లో పరీక్షలు జరిపిన వారిలో నిర్ధారిత కేసులు 25.9 శాతం కాగా, పాకిస్థాన్‌లో 13.2 శాతం, బంగ్లాదేశ్‌లో 11.6 శాతం ఉంది. ఈ విషయంలో ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ దక్షిణ కొరియాలో 52.4 శాతం కాగా, అమెరికాలో 5,3, బ్రిటన్‌లో 3.3 శాతం ఉంది. తక్కువగా ఉండడానికి కారణాలేమిటీ? దక్షిణాసియాలో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉండడానికి పలు సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. టీబీ కోసం బెసిల్లస్ కాల్మెట్టీ గెరిన్ వ్యాక్సిన్ (బీసీజీ) కారణమని చెబుతున్నారు. దక్షిణాసియాలోని అన్ని దేశాలు వ్యాక్సిన్‌ను వాడుతున్నాయి. ఉష్టమండల ప్రాంతమవడంతో వేడి ఎక్కువగా ఉండడం వల్ల కరోనా మనుగడ సాగించలేక పోతోందన్నది మరో సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలను నమ్మడానికి సరైన కారణాలు కనిపించడం లేదని వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్, ఎపిడిమిమాలజిస్ట్ జయప్రకాష్ ములియిల్ అన్నారు. ఓ ఆశను పట్టుకొని చర్యలు తీసుకోలేమని చెప్పారు. ‘ఆ సిద్ధాంతాలు నిజమైనా వాటిని పరిగణలోకి తీసుకోలేం. మనం లాటరీ గెలిస్తే మంచిదే. అలా అని లాటరీ టిక్కెట్లను కొనేందుకు సగం జీతం ఖర్చు పెట్టడం వధా అవుతుంది’ అని ప్రముఖ వైరాలజిస్ట్ జాకబ్ జాన్ తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి భారత ప్రభుత్వం వద్ద సరైన డేటా లేదని, దేశంలో ఎంత మంది చనిపోయారో, వారు ఏ కారణంతో చనిపోయారో స్పష్టంగా తెలియజేసే గణాంకాలు లేవని జయప్రకాష్ తెలిపారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంఖ్య కూడా తక్కువగా ఉందని అన్నారు. (చదవండి: కోవిడ్-19 : ఆ మందు ప్రభావంపై షాకింగ్ సర్వే..) -
హైదరాబాద్‌లో పాక్టెరా కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్సల్టింగ్, టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ పాక్టెరా భారత్‌లో అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ ఆఫీస్‌ను బుధవారం ప్రారంభించారు. ప్రస్తుతం 70 మంది ఉద్యోగులు ఉన్నారని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రంగాపురం ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. మూడేళ్లలో భారత ఉద్యోగుల సంఖ్య 3,000లకు చేరుతుందని వెల్లడించారు. ఫ్రెషర్స్‌కు ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ఇంజనీరింగ్‌తోపాటు ఆర్ట్స్ విద్యార్థులకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు. హైదరాబాద్‌లో సొంత భవనాన్ని నెలకొల్పుతామని కంపెనీ ఇండియా హెడ్ నారాయణ్ మూర్తి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సంస్థలో 30,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని సొల్యూషన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ దినేష్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయన్నారు. -
రెండో టెస్టులో విజయంపై భారత్ గురి
-
ఈసారి గెలవాలి
శ్రీలంకను వారి గడ్డపై చిత్తుగా ఓడించిన భారత జట్టుకు స్వదేశంలో జరిగిన తొలి టెస్టులో మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. పిచ్ కారణంగా తొలి రోజు తడబాటుతో పాటు వాతావరణం కూడా లంకను ఆదుకోవడంతో చివరకు ‘డ్రా’తో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని భావిస్తున్న టీమిండియా మరో పోరుకు సన్నద్ధమైంది. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం సన్నాహకం అంటూ కోల్‌కతాలాగే నాగ్‌పూర్‌లోనూ పేస్ వికెట్‌నే కోరుకుంటున్న కోహ్లి సేన తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే శ్రీలంకకు కష్టాలు తప్పవు. ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం నాగ్‌పూర్: వర్షం బారిన పడి అర్ధానందాన్నే మిగిల్చిన తొలి టెస్టు తర్వాత భారత్, శ్రీలంక సిరీస్‌లో ఆధిక్యం కోసం మరో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. నేటి నుంచి ఇక్కడి జామ్తా స్టేడియంలో జరిగే రెండో టెస్టులో ఇరు జట్లు తలపడుతున్నాయి. తొలి టెస్టులో ఓటమికి చేరువైన లంక త్రుటిలో దానిని తప్పించుకోగా... గెలుపు భారత్ చేజారింది. గత మ్యాచ్‌లో ముందుగా వెనుకబడి కూడా విజయావకాశాలు సృష్టించుకొని భారత్ తమ స్థాయిని ప్రదర్శించగా... శ్రీలంక తడబాటుతో తమ బలహీనతలు బయటపెట్టింది. ఈ నేపథ్యంలో తాజా మ్యాచ్ ఎలా జరుగుతుందో చూడాలి. విజయ్ రెడీ... శ్రీలంకలో జరిగిన సిరీస్‌లో గాయంతో ఆఖరి నిమిషంలో మురళీ విజయ్ తప్పుకోగా, శిఖర్ ధావన్ అవకాశం దక్కించుకొని చెలరేగాడు. ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో ధావన్ దూరం కావడంతో ఓపెనర్‌గా విజయ్ మళ్లీ జట్టులోకి రావడం ఖాయమైంది. రాహుల్, పుజారా, కోహ్లి మరోసారి బ్యాటింగ్ భారం మోస్తారు. గత టెస్టులో ఘోరంగా విఫలమైన వైస్ కెప్టెన్ రహానే సత్తా చాటాల్సి ఉంది. ఈడెన్‌తో పోలిస్తే ఇక్కడ స్పిన్ ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి అశ్విన్, జడేజాలు జట్టులో కొనసాగుతారు. ఇద్దరు పేసర్లు షమీ, ఉమేశ్‌లతో పాటు మూడో పేసర్‌గా ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. పెళ్లి కారణంగా భువనేశ్వర్ సిరీస్ నుంచి తప్పుకోవడంతో వాస్తవానికి అతని స్థానంలో నేరుగా ఇషాంత్ శర్మ తుది జట్టులోకి వచ్చేయాలి. రంజీల్లో ఇషాంత్ ఫామ్ కూడా చాలా బాగుంది. 4 మ్యాచ్‌లలో కలిపి అతను 20 వికెట్లు తీశాడు. అయితే హార్దిక్ పాండ్యా తరహాలో సీమ్ ఆల్‌రౌండర్‌ను ప్రయత్నించాలని భావిస్తే మాత్రం కొత్త ఆటగాడు విజయ్ శంకర్‌కు అవకాశం దక్కవచ్చు. అదే విధంగా అదనపు బ్యాట్స్‌మన్ కావాలనుకుంటే మాత్రం రోహిత్ శర్మ జట్టులో ఉంటాడు. కోల్‌కతా తొలి ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడ్డా... రెండో ఇన్నింగ్స్ ప్రదర్శన జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు అదే జోరు ఇక్కడా కొనసాగించాల్సి ఉంది. డి సిల్వాకు అవకాశం! టాస్ గెలవడం, అనుకూల వాతావరణంలో గత మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక పండగ చేసుకుంది. అయితే భారత్‌ను కుప్పకూల్చిన లక్మల్ తర్వాత అదే ఆటను కొనసాగించలేకపోగా, రెండో ఇన్నింగ్స్‌లో జట్టు పేలవ బ్యాటింగ్ ప్రదర్శించింది. కాబట్టి ఈ మ్యాచ్ లంక సామర్థ్యానికి సవాల్ విసరనుంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లో తిరిమన్నె, మాథ్యూస్ మాత్రమే కొంత పోరాడగలిగారు. కరుణరత్నే, సమరవిక్రమలతో పాటు కెప్టెన్ చండిమాల్ కూడా రాణించాల్సి ఉంది. బ్యాటింగ్ బలహీనతను అధిగమించేందుకు ఆ జట్టు ధనంజయను జట్టులోకి తీసుకోనుంది. దూకుడులో సంగక్కరను గుర్తు చేస్తున్న డిక్‌వెలాపై కూడా లంక ఆశలు పెట్టుకుంది. ఇక లక్మల్‌తో పాటు మరో పేసర్‌గా ఫెర్నాండో బరిలోకి దిగుతాడు. స్పిన్నర్ హెరాత్‌కు ఈ మ్యాచ్‌లో కాస్త పని పడవచ్చు. పిచ్ అనుకూలిస్తే అతను కూడా ప్రమాదకారి కాగలడు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, రాహుల్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్/విజయ్ శంకర్, షమీ, ఉమేశ్. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, తిరిమన్నె, మాథ్యూస్, డిక్వెలా, ధనంజయ డి సిల్వా/షనక, పెరీరా, లక్మల్, హెరాత్, విశ్వ ఫెర్నాండో. పిచ్, వాతావరణం జామ్తా మైదానంలో కూడా పేస్ పిచ్‌నే సిద్ధం చేశారు. అయితే ఈడెన్‌తో పోలిస్తే పచ్చిక తక్కువగా ఉండటంతో పాటు నాగ్‌పూర్ పొడి వాతావరణం వల్ల కూడా ఆరంభంలో కాస్త ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించవచ్చు. ఆ తర్వాత బ్యాటింగ్ పిచ్, చివర్లో టర్నింగ్‌కు కూడా అవకాశం ఉంది. స్పిన్నర్లు ప్రభావం చూపించవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. -
పాక్ పనిపట్టి ఫైనల్లోకి...
ఢాకా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మరోసారి చావుదెబ్బ తీసింది. శనివారం జరిగిన తమ చివరి సూపర్–4 మ్యాచ్‌లో పాక్‌ను 4–0తో చిత్తుగా ఓడించింది. దీంతో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ ఆసియా కప్ ఫైనల్లోనూ ప్రవేశించింది. ఈ టోర్నీలో పాక్‌పై గెలవడం భారత్‌కు ఇది రెండోసారి కాగా ఈ ఏడాది నాలుగోసారి కావడం విశేషం. ఈ పరాజయంతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. సత్బీర్ సింగ్ (39వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (51వ ని.లో), లలిత్ ఉపాధ్యాయ్ (52వ ని.లో), గుర్జంత్ సింగ్ (57వ ని.లో) భారత్ తరఫున గోల్స్ సాధించారు. అంతకుముందు తొలి రెండు క్వార్టర్స్‌లో భారత జట్టు కాస్త నెమ్మదిగానే ఆడింది. తమకు లభించిన పీసీని సొమ్ము చేసుకోలేకపోయింది. ఇక చివరి రెండు క్వార్టర్లలో భారత్ విజృంభించింది. 39వ నిమిషంలో లలిత్ ఇచ్చిన పాస్‌ను అందుకున్న సత్బీర్ జట్టుకు తొలి గోల్ అందించాడు. మ్యాచ్ చివరి పది నిమిషాల్లో భారత్ ఒక్కసారిగా విరుచుకుపడి ఆరు నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో పాక్‌కు భారీ ఓటమి ఖాయమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు మలేసియాతో తలపడనుంది. కొరియాతో జరిగిన సూపర్–4 చివరి మ్యాచ్‌ను మలేసియా 1–1తో ‘డ్రా’ చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. 1982లో మొదలైన ఆసియా కప్‌లో భారత్ ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. 1982, 1985, 1989, 1994, 2013లలో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా 2003, 2007లలో చాంపియన్‌గా నిలిచింది. 1999లో మూడో స్థానాన్ని సంపాదించింది. ఆసియా కప్ ఫైనల్లో భారత్, మలేసియా తలపడనుండటం ఇదే తొలిసారి. -
'వరల్డ్ కప్ గెలవడానికి అతనే కారణం'
బెంగళూరు:1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వరల్డ్ కప్ గెలుచుకోవడానికి తమకు సారథిగా ఉన్న కపిల్ దేవ్‌లోని అపారమైన నమ్మకమే కారణమంటున్నారు ఆనాటి త్రయం కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, రోజర్ బిన్నీలు. తాజాగా నగరంలోని జరిగిన ఓ సదస్సుకు హాజరైన ఈ త్రిమూర్తులు.. అప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. 'ఫైనల్ మ్యాచ్ కు ముందు కపిల్ దేవ్ ఇచ్చిన ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మమ్మల్ని ఎంతో ఎత్తులో చూసుకునే స్పీచ్ అది. ఆ ప్రసంగంతో మాలో విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఆ క్రమంలోనే మేము ఫైనల్ పోరులో విజయం సాధించాం' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఆనాటి వరల్డ్ కప్ లో జింబాబ్వేతో జరిగిన సెమీ ఫైనల్లో 17పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో కపిల్ దేవ్ ఆడిన తీరు అద్భుతమని రోజర్ బిన్నీ తెలిపాడు. 'ఆ మ్యాచ్‌లో కపిల్ దేవ్ ముఖ్య భూమిక పోషించాడు. అజేయంగా 175 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. చావో-రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కపిల్ బాధ్యతాయుతంగా ఆడి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. అదొక స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు' అని బిన్నీ తెలిపాడు. ఫైనల్ మ్యాచ్ కు ముందు కపిల్ దేవ్ చెప్పిన కొన్ని పదాలే తమలో నమ్మకానికి కారణమయ్యాయని కిర్మాణీ పేర్కొన్నాడు. ఆ నమ్మకమే వెస్టిండీస్ ను ఫైనల్ ఓడించి తొలిసారి వరల్డ్ కప్ సాధించడానికి దోహద పడిందన్నాడు. -
న్యూక్లియర్ సప్లయర్ గ్రూపులో భారత్?
బీజింగ్: అణు సరఫరాదారుల (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ) బృందంలో భారత్‌కు సభ్యత్వం అంశం గురించి భారత్- చైనాల మధ్య మొదటి సారి చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ మీడియాకు వివరించారు. మోదీ పర్యటన వివరాలను ఆయన తెలిపారు. చైనా ప్రధాని జిన్ పింగ్ సమావేశ వివరాలు, 24 ఒప్పందాలపై సంతకాలు తదితర విషయాలను విలేకర్లకు తెలిపారు. పాకిస్థాన్‌లో పెట్రేగుతున్నఉగ్రవాదం, ఉగ్రవాదంపై ఇరుదేశాల పోరు, ఐరాస భద్రతా మండలిలో చేపట్టాల్సిన సంస్కరణలు చర్చకు వచ్చాయన్నారు. గుజరాత్లో మోదీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి నమూనాను చైనాలో అమలు చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆ దేశ ప్రధాని చెప్పారని తెలిపారు. అలాగే నేపాల్ భూకంప తదనంతర పరిస్థితులపై కూడా చర్చించారన్నారు. ఇరు ప్రధానుల భేటీ తర్వాత నరేంద్ర మోదీ ప్రసంగ వివరాలను తెలుపుతూ భారత్ - చైనా సరిహద్దులో శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారన్నారు. కాగా అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల పట్ల అగ్రరాజ్యాలు వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించిన ప్రధానమంత్రి .. 'భారత్‌లో కాలుష్యం పెరిగిపోతోందని వివిధ దేశాల ఏజెన్సీలు లెక్కలతో సహా మనల్ని నిందిస్తాయి.. కానీ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల్ని కడతామంటే మాత్రం గగ్గోలు పెడతాయి. దయచేసి మాకు అనుమతులు మంజూరుచేయండి' అని గ్లోబర్ న్యూక్లియర్ కమిటీని మోదీ గతంలో విజ్ఞప్తి చేశారు. -
ICC ర్యాంకింగ్స్‌లో భారత్ దిగజారింది