
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. కరోనా ఫోర్త్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిత్యం 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,899 మంది కోవిడ్ బారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే వైరస్‌తో 15 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 72,474. యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,855కు చేరుకుంది. పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 7.71 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,518 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,99, 363కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 14,88,807 మందికి కరోనా వ్యాక్సిన‍్లను అందించినట్టు కేంద్రం తెలిపింది.
చదవండి: Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
Comments
Please login to add a commentAdd a comment