ప్రేమ కోసం దేశ సరిహద్దులను లెక్కచేయకుండా పాకిస్తాన్ నుంచి భారత్‌కు తరలివచ్చిన సీమా హైదర్ కథ మరచిపోకముందే అలాంటి అనేక ప్రేమ కథలు మన ముందుకు వస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళ తన ఏడాది కుమారునితో పాటు భారత్‌కు తరలివచ్చింది. ఆమె తన పేరు సానియా అఖ్తర్ అని చెబుతోంది.
సానియా బంగ్లాదేశ్‌నుంచి వీసా తీసుకుని, తన భర్త సౌరభ్ కాంత్ తివారిని కలుసుకునేందుకు వచ్చింది. సానియా, సౌరభ్‌లు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని సమాచారం. తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారికి ఇప్పుడు ఏడాది వయసు. సానియా ఇప్పుడు కుమారుడిని తీసుకుని, తన భర్త ఉంటున్న నోయిడాకు వచ్చింది. అయితే ఆమె ఇక్కడకు వచ్చాక భర్త మరో వివాహం చేసుకున్నాడని ఆమెకు తెలిసింది.
సానియా మీడియాతో మాట్లాడుతూ తన భర్త సౌరభ్ తనకు ఇప్పుడు ఆశ్రయం కల్పించడం లేదని, తనను మోసం చేసిన సౌరభ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని తెలిపింది. కాగా ఈ ఉదంతం నోయిడా పోలీసుల వరకూ చేరింది. ఆమె తన కుమారుడిని తీసుకుని సెక్టార్ 108లో ఉన్న పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంది. తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకుంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం సౌరభ్ బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కల్టీ మ్యాక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి..
Comments
Please login to add a commentAdd a comment