Sania
-
నాడు సీమా, నేడు సానియా.. ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు!
ప్రేమ కోసం దేశ సరిహద్దులను లెక్కచేయకుండా పాకిస్తాన్ నుంచి భారత్‌కు తరలివచ్చిన సీమా హైదర్ కథ మరచిపోకముందే అలాంటి అనేక ప్రేమ కథలు మన ముందుకు వస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళ తన ఏడాది కుమారునితో పాటు భారత్‌కు తరలివచ్చింది. ఆమె తన పేరు సానియా అఖ్తర్ అని చెబుతోంది. సానియా బంగ్లాదేశ్‌నుంచి వీసా తీసుకుని, తన భర్త సౌరభ్ కాంత్ తివారిని కలుసుకునేందుకు వచ్చింది. సానియా, సౌరభ్‌లు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని సమాచారం. తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారికి ఇప్పుడు ఏడాది వయసు. సానియా ఇప్పుడు కుమారుడిని తీసుకుని, తన భర్త ఉంటున్న నోయిడాకు వచ్చింది. అయితే ఆమె ఇక్కడకు వచ్చాక భర్త మరో వివాహం చేసుకున్నాడని ఆమెకు తెలిసింది. సానియా మీడియాతో మాట్లాడుతూ తన భర్త సౌరభ్ తనకు ఇప్పుడు ఆశ్రయం కల్పించడం లేదని, తనను మోసం చేసిన సౌరభ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని తెలిపింది. కాగా ఈ ఉదంతం నోయిడా పోలీసుల వరకూ చేరింది. ఆమె తన కుమారుడిని తీసుకుని సెక్టార్ 108లో ఉన్న పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంది. తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకుంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం సౌరభ్ బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కల్టీ మ్యాక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి.. -
అవకాశాలకు..జీఈ’ఎస్’
-
అనంతపురంలో స్నేహితులు!
ప్రేమ కంటే స్నేహం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న సినిమా ‘టు ఫ్రెండ్స్’. సూరజ్ హీరోగా జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో మళ్ళగూరు అనంతరాముడు, మళ్ళగూరు రమేశ్‌నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాలో రవీంద్రతేజ, కార్తీక్, సానియా, ఫరా, స్నిగ్ధ ముఖ్యతారలు. ప్రస్తుతం అనంతపురంలోని అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కాలేజీలో స్వర్ణ మాస్టర్ నేతృత్వంలో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రమిది. హైదరాబాద్‌లో కొన్ని సీన్లు చిత్రీకరించిన తర్వాత యూనిట్ అనంతపురం చేరుకుంది. నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. దీని తర్వాతి షెడ్యూల్ బెంగళూరులో ఉంటుంది. తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి. సురేందర్‌రెడ్డి, కథ, మాటలు, సంగీతం: పోలూర్ ఘటికాచలం. -
నిజమైన ప్రేమకథ
సూరజ్, రవీంద్రతేజ, సానియా, ఫారా ముఖ్యతారలు గా జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2 ఫ్రెండ్స్’ శుక్రవారం ప్రారంభమైంది. ట్రూ లవ్ స్టోరి అనేది ఉపశీర్షిక. ముళ్ళగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి ఎమ్మెల్యే గాంధీ క్లాప్ ఇవ్వగా, నటుడు విజయ్‌చందర్ స్విచ్చాన్ చేశారు. ఓంప్రకాశ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కథ తయారు చేయడానికి ఏడాది పట్టింది. పాటల రికార్డింగ్ పూర్తయింది. పిల్లలకు, తల్లిదండ్రులకు సంబంధించిన మంచి కథ ఇది’’ అన్నారు జీఎల్బీ శ్రీనివాస్. ‘‘ప్రేమ, స్నేహం నేపథ్యంలో సినిమా ఉంటుంది. ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంటుంది’’ అన్నారు నిర్మాత అనంతరాముడు. సంగీతం: పోలూర్ ఘటికాచలం. -
గుప్త జ్వాల
మనిషిలో ఉన్న ప్రతిభ గుప్తంగా ఎందుకు ఉండాలి? దేవుడిచ్చిన సామర్థ్యాన్ని గోప్యంగా ఎందుకుంచాలి? యజ్ఞంలో అగ్గిలేకపోతే ఎలా? జీవితంలో జ్వాల లేకపోతే ఎలా? ఈ ప్రజ్వలాలన్నీ కాంతినివ్వకపోతే ఎలా? ఈ కీర్తిని మసకబార్చిన వాళ్లపై కోపం ఉండదా? గుత్తా జ్వాలకు కోపం వచ్చింది! గోప్యం లేకుండా మాట్లాడింది! గుప్త జ్వాల ఎగిసిపడింది!! మీ ఆటకు బదులు మీ దుస్తులు, వేషధారణ గురించి మాట్లాడితే మీకు బాధనిపించదా? మన దేశంలో విషాదం ఏంటంటే.. ఒక స్పోర్ట్స్ ఉమన్ అంటే సరిగ్గా డ్రెసప్ కాకూడదు. మేకప్ వేసుకోకూడదు. అలా వ్యక్తిగత శ్రద్ధ చూపించకపోతేనే వాళ్లు వాళ్ల కెరీర్ పట్ల ఫోకస్డ్గా ఉన్నట్టు లెక్క. ఒక్క స్పోర్ట్సే కాదు.. ఏ కెరీర్‌లోనైనా అంతే. అమ్మాయి కొంచెం పర్సనల్ కేర్ తీసుకున్నట్టు కనపడితే చాలు. ఈజీగా ముద్ర వేసేసారు. మ్యానిక్యూర్, పెడీక్యూర్ లాంటివి పర్సనల్ హైజీన్ అన్న విషయాన్ని అర్థం చేసుకోరు. కొంచెం బ్రైట్‌గా కనపడితే చాలు... ఫాస్ట్ అంటారు.. యాక్టివ్ అంటారు. సచ్ ఎ హారిబుల్ థింగ్. భవిష్యత్‌లో వాళ్లూ ఆడపిల్లలకు తండ్రులవుతారనే ఆలోచన ఎందుకు రాదో... అర్థం కాదు. మీరేం మాట్లాడినా కాంట్రవర్సీ అంటారు. ఎందుకు? యా... నన్ను, సానియాను కాంట్రావర్సీ క్వీన్స్ అంటారు. కానీ, నేనెప్పుడు కాంట్రవర్సీ చేశానండీ? ఎవరినైనా తిడితే.. కొడితే కాంట్రవర్సీ. మా ైరైట్స్ గురించి మాట్లాడితే కాంట్రావర్సీయా? నేను, ఈవెన్ సానియా.. మేమెప్పుడూ మా హక్కుల గురించే మాట్లాడాం. మన దేశంలో ఇప్పటికీ మనం రైట్స్ గురించి పోట్లాడాల్సిన దుఃస్థితి. హక్కుల గురించి పోరాడే మహిళలపై చాలా తేలికగా ముద్ర వేస్తారు. మీరు ఇతర స్పోర్ట్స్పర్సన్స్కు మద్దతిచ్చినట్టు మీకు వాళ్ల మద్దతు దొరికిందా? ఏ స్పోర్ట్స్ పర్సన్ గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా, నేను సహించను. వాళ్లకు సపోర్ట్‌గా నిలబడతాను. నా విషయంలో వాళ్లు అలాగే స్పందించాలని ఎక్స్పెక్ట్ చేయను. నాతోపాటు నిలబడితే అది నాకు కాదు... వాళ్లకే హెల్ప్ అవుతుంది. వాళ్లు నా కోసం ఫైట్ చేయనప్పుడు వాళ్ల కోసం వాళ్లూ ఫైట్ చేసుకోలేరు కదా! మిగిలిన ప్లేయర్స్‌లా మీకూ ఎంకరేజ్మెంట్ దొరికిందా? టిల్ డేట్ నేను గవర్నమెంట్‌ని డబ్బులు అడగలేదు. ‘పద్మశ్రీ’ అవార్డ్ అడగలేదు. అవి వస్తే వస్తాయి.. అది సెకండరీ.. రెస్పెక్ట్ మాత్రం కోరుకున్నాను. మొన్న ఒలింపిక్స్ నుంచి సింధు వచ్చాక అందరూ ‘వాళ్ల ఫాదర్ ఇంత కష్టపడ్డారు.. అంత కష్టపడ్డారు’ అని అన్నారు. నో డౌట్ దె వర్క్డ్ హార్డ్. బట్ ఎవ్రీబడీ వర్క్స్ హార్డ్. స్పోర్ట్స్ పర్సన్స్ అందరి పేరెంట్స్ అంతే కష్టపడ్తారు. కాని సింధుకు దొరికిన సపోర్ట్ ఏంటి? మిగతావాళ్లకు అందిన సపోర్ట్ ఏంటి? అని ఎవరూ ఎందుకు అడగరు? ఈవెన్ సానియా విషయంలో కూడా అంతే కదా... షి హ్యాడ్ జీవీకే స్పాన్సర్స్ ఆల్ ద టైమ్. తెలంగాణ గవర్నమెంటూ సపోర్ట్ చేసింది. వియ్ నెవర్ గాట్ ఎనీ సపోర్ట్. దీని గురించి నేను నిజాలు మాట్లాడితే ఇష్టపడరు. కాంట్రవర్సీ చేస్తారు. అయితే ఎవరి సపోర్టూ అందలేదంటారా? హూ సపోర్టెడ్ మి?మా తల్లితండ్రులు నా ఆట కోసం డబ్బు ఖర్చుపెట్టారు. నేను నా బ్లడ్ ధారపోశా. బాడ్మింటన్‌కు నా లైఫ్ ఇచ్చా. ఐ బికేమ్ నేషనల్ ఛాంపియన్ బై మై ఓన్. ఐ బికేమ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్. కామన్వెల్త్ గేమ్స్ మెడల్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్... హ్యావ్ డన్ వెల్. నేను పాపులర్ అయింది, ఫేమస్ అయింది నా ఆటతీరుతో, మీడియా సపోర్ట్‌తో. నేను కృతజ్ఞురాలినంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మా ట్రిప్స్‌కి ఫండింగ్ చేసింది. ఇంకెవరూ ఏమీ చేయలేదు. అలాగని ఎవరిపై కంప్లయింట్స్ లేవు. ఈరోజు ఎవరు పీఆర్ మెయిన్టైన్ చేయగలరో వాళ్లకే గుర్తింపు. పని మీదే దృష్టిపెట్టే వాళ్లకు ఏ గుర్తింపు లేదు. మా డాడీ చెప్పే ‘యు హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ బాటిల్’ అనే మాట నమ్ముతా.. ఆచరిస్తా! అబద్ధాలు, రూమర్స్ ప్రచారం గురించి? నా గురించి అబద్ధాలు, రూమర్స్ నమ్మడం ఈజీ. మే బీ బికాజ్ ఆఫ్ మై పర్సనాలిటీ. ఐయామ్ వెరీ టాల్ అండ్ బ్రాడ్ పర్సనాలిటీ. యారగెంట్నని.. నాట్ ఫ్రెండ్లీ అనీ నిర్ధారణకు వచ్చేస్తారు. పైగా, ఐ హ్యావ్ కలర్డ్ మై హెయిర్.. ఐ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. కొంచెం ప్రెజెంటబుల్‌గా కనిపిస్తాను... కాబట్టి నా మీద వచ్చిన రూమర్స్‌ను జనాలు ఈజీగా నమ్మేస్తారు. నమ్మించేలా డర్టీ గిమ్మిక్స్ కూడా ప్లే చేస్తారు. కాని అవి నన్ను హర్ట్ చేస్తాయని, నాకూ ఓ కుటుంబం ఉంటుందని, ఫ్రెండ్స్ ఉంటారని ఆలోచించరు. నిజానికి నాది చాలా ఫ్రెండ్లీ నేచర్. ప్రాక్టీస్ తర్వాత ఇంట్లో, రెస్టారెంట్లలో నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ అవాలనుకుంటా... అవుతాను. ఇండిపెండెంట్ విమెన్‌పై మనవాళ్ల వైఖరిపై మీ వ్యాఖ్య? ఉయ్ లివ్ ఇన్ ఎ ఫ్రీ కంట్రీ. బట్ ఇన్ ఎ హిపొక్రటిక్ కంట్రీ. ఇండిపెండెంట్ విమెన్ పట్ల మన మైండ్ సెట్స్ ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెంట్ అనగానే సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అంటారు. దట్ ఈజ్ సచ్ ఎ హోప్లెస్, డర్టీ థింకింగ్. అయామ్ టెల్లింగ్ ఇట్ టుడే... అలా రాంగ్గా ఉండేది ఎక్కువగా మగవాళ్లే. కాని అబ్బాయికి అలాంటి పేరు లేదు. అమ్మాయికి మాత్రం పేరు పెడతారు. విచ్ ఈజ్ రియల్లీ సిక్. షేమ్ ఆన్ దోస్ పీపుల్ హూ థింగ్ లైక్ దట్. మీకు లేనివాటిని మీకు అపాదిస్తున్నట్టు అనిపిస్తోందా? అయామ్ వెరీ వార్మ్ పర్సన్. పీపుల్ లైక్ టు ఎజ్యూమ్. అండ్ దే ఆల్వేజ్ డన్ ఇట్ విత్ మి... చిన్నప్పటి నుంచి. నా గురించి తెలియని వాళ్లు నన్నెందుకు డిస్లైక్ చేస్తారో? నన్ను ఇష్టపడక పోవడానికి వాళ్లకుండే కారణాలు వాళ్లకుండొచ్చు. అది వాళ్ల సొంతం. నాకర్థమైంది ఏంటంటే.. నన్ను ఇష్టపడకపోవడానికి వాళ్ల ఇగో ఓ రీజన్ కావచ్చు. నేను మాత్రం అందరికీ ఒకే రకమైన గౌరవం ఇస్తాను. ఇంట్లో పనిచేసేవాళ్లను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్‌గానే ట్రీట్ చేస్తాను. అలా పెంచారు మా డాడీ. మీ మ్యారీడ్ లైఫ్...? నేను పెళ్లి చేసుకునే నాటికి అంత పాపులర్ కాదు. ఫేమస్ కాదు. ఐ వజ్ వెరీ ఇన్నోసెంట్ ఎట్ దట్ టైమ్. ఆ పెళ్లి ద్వారా చాలా నేర్చుకున్నాను. అదే సమయంలో మా అమ్మానాన్నలను చూసీ చాలా అర్థం చేసుకున్నాను. పెళ్లి అనేది భార్యభర్తలిద్దరిలో ఎవరికీ రిస్ట్రిక్షన్లా ఉండకూడదు. మేల్ అండ్ ఫీమేల్ షుడ్ గ్రో టుగెదర్. భర్తకు చేదోడుగా భార్య, భార్యకు చేయూతగా భర్తా ఉండాలి. మా విషయంలో అలా జరగలేదు. సమ్‌వేర్ ఐ థాట్ ఉయ్ వర్ నాట్ గ్రోయింగ్.. ఇంకేవో కొన్ని విషయాలు. వీటన్నిటితో ఆ రిలేషన్ కంటిన్యూ చేయలేననిపించింది. విడిపోయాం. ఇప్పుడు పెళ్లి గురించి మళ్లీ ఆలోచిస్తున్నారా? ఎందుకు ఉండదు? అయితే నాకు కొంచెం భయం. అంత త్వరగా ఎవరినీ నమ్మలేను. మనుషులను అంచనా వేయడంలో చాలా పూర్. మా పేరెంట్స్ ట్రూత్‌ఫుల్‌గా ఉండడమే నేర్పించారు. నా ఈ నేచర్, నా ఎక్స్పిరీయెన్సెస్ వల్ల అంత త్వరగా కమిట్ కాలేను. బట్ యెస్.. పెళ్లి చేసుకునే ఆలోచనైతే ఉంది. కానీ నాకు కావల్సిన మనిషి ఇంకా దొరకలేదు. టాల్‌గా కూడా ఉండాలి (నవ్వుతూ). మీ సినిమా ఎంట్రీ.. ఎక్స్పెక్టెడా? అనెక్స్పెక్టెడా? నితిన్ నాకు మంచి ఫ్రెండ్. మాకు ఓ కామన్ గ్రూప్ ఉంది. ఓ సారి అందరం కలిసి డిన్నర్ చేస్తుంటే.. ‘జ్వాలా! నా మూవీలో యాక్ట్ చేస్తావా?’అని అడిగాడు. నేను అంతే కాజ్యువల్‌గా ‘ఆ చేస్తాను’ అని చెప్పి ఆ విషయం మరిచిపోయా. త్రీ మంత్స్ తర్వాత ‘జ్వాలా! సాంగ్ రెడీ’ అంటూ వచ్చాడు. ఐ వజ్ షాక్డ్. ఆ టైమ్‌లో బాడ్మింటన్ కూడా ఎక్కువగా ఆడట్లేదు. సో చేసేశాను. భవిష్యత్తులో చేసే అవకాశం ఉందా? ఫ్యూచర్లో... ఐ డోంట్ థింక్. ఇప్పటి వరకు నా లైఫ్‌లో చాలా హార్డ్ వర్క్ చేశా. ఇప్పుడు ఓ కొత్త ఫీల్డ్‌లోకి వెళ్లి మళ్లీ అక్కడ స్ట్రగుల్ చేయడం ఇష్టం లేదు. ఐ లైక్ చాట్ షోస్. వాటిని హోస్ట్ చేయడం లాంటివైతే ఓకే. ఐ వాంట్ టు టీచ్ యూత్ టు డీల్ విత్ ట్రూత్. కోచ్‌గా మారే అవకాశం ఏమైనా ఉందా? నాకు పేషెన్స్ తక్కువ. సో మంచి కోచ్‌ని కాలేను. అయితే మన దగ్గర కోచ్‌లను గౌరవించే కల్చర్ లేదు. అలాంటి కల్చర్‌ను పెంచాలనైతే ఉంది. గవర్నమెంట్ సహాయంతో విమెన్ స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేయాలని ఉంది. మన దగ్గర మంచి పనులకు అవకాశాలు త్వరగా దొరకవుగా. ఎన్నాళ్లో నుంచో ప్రయత్నిస్తున్నా. చూద్దాం! ఫ్యూచర్లో ఎలాంటి వాతావరణం కోరుకుంటున్నారు? పదిహేనేళ్ల కిందట ఉన్న మంచి వాతావరణం.. భద్రతా ఇప్పుడు లేవు. ఆడవాళ్లను గౌరవంగా చూడాలని, వాళ్లనూ మనుషులుగానే పరిగణించాలని మన మగపిల్లలకు నేర్పించట్లేదు. ఐఫోన్ 7 ఉంటేనో, బీఎమ్‌డబ్ల్యూ కారు ఉంటేనో డెవలప్ అయినట్టు కాదు. ఆడవాళ్లు మగవాళ్లతో సమాన గౌరవం పొందగలిగినప్పుడు, ఆమె భద్రంగా ఉండగలిగినప్పుడే ఈ సొసైటీ డెవలప్ అయినట్టు! మా ఇంట్లో అలాంటి ఎట్మాస్ఫియరే ఉంది. మా అమ్మ విషయంలో, మా విషయంలో దేనికీ రిస్ట్రక్షన్స్ పెట్టలేదు మా నాన్న. ఉయ్ నీడ్ మెన్ లైక్ హిమ్. అలాగే ఆడవాళ్లూ సాటి ఆడవాళ్లకి సపోర్ట్‌గా నిలవాలి. ఇది ఇంటి నుంచే మొదలుకావాలి. ఎందుకంటే పిల్లలు చెబితే నేర్చుకోరు, చూసి నేర్చుకుంటారు. ఇంట్లో ఆడపిల్లను గౌరవించే వాతావరణం ఉంటే అదే పిల్లలకూ అలవడుతుంది! రాజకీయాల్లోకి వచ్చే చాన్స్ ఉందా? టు డూ సమ్‌థింగ్ గుడ్ యు నీడ్ పవర్.. సో ఐ విల్ సీ. నాలాంటి అభిప్రాయాలు, ఆశయాలు ఉన్న ఏ రాజకీయవేత్తలైనా నాకు అవకాశం ఇస్తే, నేననుకున్నది చేయగల స్వేచ్ఛను ఇస్తే.. డెఫినెట్లీ డు. ఒకవేళ అలాంటి చాన్స్ వస్తే అధికారాన్ని ఈ దేశంలోని మహిళలు, చిన్న పిల్లల సంక్షేమం కోసం వినియోగిస్తా! ‘గాంధీ’ కోసం వచ్చాం! డాడీ (గుత్తా క్రాంతి), మమ్మీ (ఎలెన్) మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో ఒకటే కాలేజ్‌లో చదువుకున్నారు. మా ముత్తాత మహాత్మాగాంధీ శిష్యులు. ఆయన మహాత్మాగాంధీ బయోగ్రఫీని చైనీస్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడానికి సేవాగ్రామ్ వచ్చారు. వస్తూ వస్తూ తన వెంట మా మమ్మీని కూడా తీసుకొచ్చారు. అలా కాలేజ్‌లో కలుసుకున్న మమ్మీ డాడీల పరిచయం... ప్రేమగా, ఆ తర్వాత పెళ్లిగా మారింది. డాడీ నాగ్‌పూర్‌లో రిజర్వ్‌బ్యాంక్‌లో పనిచేసేవారు. నేను అక్కడే పుట్టాను. నాకు ఓ చెల్లి (ఇన్సీ). నా నాలుగో ఏట హైదరాబాద్‌కి వచ్చాం. పుల్లెల గోపీచంద్‌తో గొడవేంటి? నాకూ తెలియదు. టిల్ డేట్ ఐ రియల్లీ వండర్. నాకొకటే బ్యాడ్ ఫీలింగ్.. ఏంటంటే.. సింగిల్స్‌కి సపోర్ట్ చేసినట్టు డబుల్స్‌కి ఆయన ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఇప్పటికీ చేయట్లేదు.. వై? వాట్ ఈజ్ ద రీజన్? గివ్ మి వన్ రీజన్ అని అడుగుతున్నా. ఇఫ్ హి కెన్ మేక్ సింధూ.. కెన్ మేక్ అనదర్ డబుల్స్ ఛాంపియన్.. మిక్స్డ్ డబుల్స్ ఛాంపియన్.. విమెన్ డబుల్స్ ఛాంపియన్. ‘ఐ వజ్ వరల్డ్ నంబర్ 6... యు డోంట్ వాంట్ టు గివ్ మి ఎనీ రెస్పెక్ట్.. ఫైన్! ఎంకరేజ్ ది అదర్ డబుల్స్.. వై నాట్?’ ఇది మాట్లాడ్డానికి చాలామంది ప్లేయర్స్ భయపడ్తారు. నా విషయంలో ఏం జరుగుతోందో చూస్తున్నారుగా. నితిన్ క్లోజ్... ఐ లవ్ ప్రభాస్... నాని కూడా ఇష్టం..! వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ రెండూ ఇష్టపడతా. చీరలంటే చాలా ఇష్టం. సిన్మాలు బాగా చూస్తా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ! తెలుగు హీరోల్లో ఐ లవ్ ప్రభాస్. నానీ అంటే కూడా ఇష్టమే. హి ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. ఐ హ్యావ్ మెట్ ప్రభాస్ వన్స్ ఆర్ ట్వయిస్. హి ఈజ్ సో టాల్ ఆల్సో. వీ డోన్ట్ హ్యావ్ టాల్ మెన్ కదా! (నవ్వు) - సరస్వతి రమ -
డెంగీతో బాలిక మృతి
బ్రహ్మసముద్రం : యరడికెర గ్రామానికి చెందిన సానియా (4) డెంగీతో గురువారం మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు జాఫర్, రమీజాబేగం తెలిపిన వివరాలు... నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో భాధపడుతూ అస్వస్థతకు గురైన బాలికను, చికిత్స కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల చికిత్స అనంతరం డెంగీ వ్యాధిగా నిర్ధారించిన ఆస్పత్రి వైద్యులు పాపను వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సానియా మృతి చెందింది. -
‘ఐటా’ జోక్యంపై తలో మాట!
తాను అడగలేదన్న సానియా * ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా * స్పందించారంటున్న సంఘం న్యూఢిల్లీ: ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)కు సంబంధించిన హ్యాకింగ్‌లో వీనస్ విలియమ్స్ పేరు బయటపడిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా)ను సానియా మీర్జా కోరినట్లు వచ్చిన వార్తలపై భిన్నమైన స్పందనలు వచ్చాయి. ముందుగా శుక్రవారం ఉదయం ఈ అంశంపై తాను ఎలాంటి జోక్యం కోరలేదని సానియా ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చింది. ‘ఐటా’ కూడా సానియా గానీ ఆమె తల్లి నసీమా మీర్జా నుంచి గానీ తమకు ఎలాంటి సమాచారం లేదంటూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సానియా దీనిని ఉటంకిస్తూ అన్ని సందేహాలకు ఇదే సమాధానం అని స్పష్టం చేసింది. అయితే సాయంత్రం ‘ఐటా’ దీనిపై మళ్లీ స్పందించింది. తన ప్రకటనలో తప్పు లేదంటూనే ‘వాడా’ అంశంలో జోక్యం చేసుకోవాలని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా కోరినట్లు ‘ఐటా’ కార్యదర్శి హిరణ్మయి ఛటర్జీ వెల్లడించారు. అరుుతే రాతపూర్వకంగా కాకుండా ఆయన నోటిమాటగానే దీనిని చెప్పారని అన్నారు. దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. -
‘సానియాకు డీఎన్ఏ పరీక్ష చేయండి’
-
‘సానియాకు డీఎన్ఏ పరీక్ష చేయండి’
చిన్నారి సానియాను చైల్డ్వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిన్నారిని ఎవరికి అప్పగించాలనే విషయమై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. చిన్నారి సానియాకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకు సానియా బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చూసుకుంటుందని పేర్కొంది. -
పాపం... సానియా..
-
పాపం... సానియా..
- రోజంతా కోర్టుల్లో హైడ్రామా - తల్లిదండ్రులకు దూరమై ఒంటరైన చిన్నారి సాక్షి, హైదరాబాద్ : నాన్న చేతిలో కాలి బూడిదైన అమ్మ... ఆ హత్యానేరంతో జైలుకెళ్లిన నాన్న... తమకే కావాలని తల్లి వైపు... తండ్రి వైపు బంధువులు పటబట్టడంతో... ఎవరికీకాక ఒంటరైన బుజ్జితల్లి కంటనీరు కట్టలు తెగుతోంది. ఎనిమిదేళ్ల చిన్నారి సానియా శుక్రవారమంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. గచ్జిబౌలిలో ఉండే రూపేశ్‌కుమార్ తన భార్య సింథియాను గత ఆదివారం హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరి ఏకైక కుమార్తె సానియా(8) పరిస్థితి దైన్యంగా మారింది. చిన్నారిని తామే పెంచుతామని నానమ్మ లలిత చెబుతుండగా, తమదేశం కాంగోకు తీసుకెళ్తామంటూ మేనమామ పట్టుబడుతున్నారు. కాంగో రాయబారి కూడా సానియాను తమకు అప్పగించాలని కోరినట్లు తెలిసింది. కనిపించని బంధువులు... ఈ వివాదంతో నింబోలిఅడ్డాలోని రెస్క్యూ హోంలో ఉన్న సానియాను ఎవరికి అప్పచెప్పాలో తేల్చుకోని పోలీస్‌లు తొలుత రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని 8ఎంఎం కోర్టు న్యాయమూర్తి రాధిక జేస్వాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టుకు న్యాయమూర్తి బదిలీ చేశారు. సానియాను అక్కడికి తీసుకువెళ్లగా... తమ పరిధిలో లేదని ఫ్యామిలీ కోర్టు జడ్జి రమేష్‌బాబు వెల్లడించారు. దీంతో మళ్లీ రాజేంద్రనగర్ 8ఎంఎం కోర్టుకు తీసుకెళ్లగా... పొద్దుపోయే వరకు విచారణ కొనసాగింది. అయితే... సానియా మాక్కావాలంటే మాక్కావాలన్న బంధువులు ఒక్కరు కూడా కోర్టులో పిటిషన్ వేయలేదు. దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు చిన్నారిని హైదర్షాకోటలోని కస్తూర్బా ట్రస్ట్‌కు తరలించారు. సోమవారం వరకు అక్కడే చిన్నారి యోగక్షేమాలు చూసుకోవాలన్నారు. బంధువులు పిటిషన్ దాఖలు చేస్తే తిరిగి ఈ కేసుపై విచారణ జరుగుతుంది. -
సానియా కేసు సోమవారానికి వాయిదా
హైదరాబాద్: చిన్నారి సానియా కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు సానియాను హైదర్షాకోట్లోని కస్తూర్బా ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని రాజేంద్రనగర్‌లో 8వ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. సోమవారం తిరిగి కోర్టులో హాజరుపరచాలని కోరింది. -
సానియా వ్యవహారంపై తేలని వివాదం
-
సానియా వ్యవహారంపై తేలని వివాదం
హైదరాబాద్ : దారుణంగా హత్యకు గురైన తల్లి... ఓవైపు జైల్లో తండ్రి.. ఇంకోవైపు తమకు అప్పగించాలంటూ తల్లి తరఫు బంధువులు, మరోవైపు సానియా తమతోనే ఉంటుందని తండ్రి కుటుంబసభ్యలు డిమాండ్‌తో చిన్నారి సానియా పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో వారి కూతురు సానియా ఎక్కడ ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయిదు రోజుల క్రితం కాంగో దేశస్తురాలు అయిన సింథియాను అతి కిరాతకంగా హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని దహనం చేసిన రూపేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె సోదరుడు డానీస్తోపాటు అతడి బంధువులు రెండురోజులుగా పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సానియాను పోలీసులు గురువారం రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసు తమ పరిధిలోకి రాదని, రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో పోలీసులు రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించనున్నారు. కాగా తల్లి హత్య అనంతరం సానియా తన నాయనమ్మ లీలావతి వద్ద ఉండగా, ఆ చిన్నారిని పోలీసులు గురువారం నాడు రెస్క్యూ హోంకు తరలించారు. ఆ ప్రదేశాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. -
సానియాను అప్పగించండి
సింథియా బంధువుల ఆందోళన శంషాబాద్ : భర్త చేతిలో హత్యకు గురైన ఆఫ్రికాలోని కాంగోవాసి సింథియా కూతురు సానియాను తమకప్పగించాలని ఆమె బంధువులు, స్నేహితులు రెండోరోజూ ఆందోళనకు దిగారు. గురువారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. సింథి యాను హత్య చేసిన రూపేష్‌ను నడిరోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హత్య చేసి న వ్యక్తులను హతమార్చడమే కఠిన శిక్షంటూ నినాదాలు చేశారు. హంతకుడికి ముసుగు వేసి తీసుకురావాల్సిన అవసరం ఏంటని, అతడిని ముసుగు లేకుండా చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భారతదేశంతోపాటు తెలంగాణ రాష్ట్రంపై తమకు అపారమైన గౌరవముందని, తమకు న్యాయం చేయాలని నినదించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలతోపాటు పక్కనే ఉన్న సర్వీసు రోడ్డుపై వారు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు వారికి నచ్చచెబుతుండగా వారితో కూడా వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో పోలీసులతో చర్చించేందుకు వచ్చిన దక్షిణాఫ్రికా ఎంబసీ అధికారులతోనూ వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు చొక్కాలు విప్పి రోడ్డుపై బైఠాయిం చారు. సానియాను తమకే అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు పలుమార్లు సముదాయించడంతో వారు అక్కడి నుంచి సైబరాబాద్ కమిషనరేట్‌కు వెళ్లిపోయారు. -
సానియాను మాకు అప్పగించండి
పోలీస్‌స్టేషన్ ఎదుట సింథియా బంధువుల ఆందోళన శంషాబాద్ : కాంగో దేశానికి చెందిన సింథియా బంధువులు సానియాను తమకు అప్పగించాలని బుధవారం ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. సింథియాను అతి కిరాతకంగా హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని దహనం చేసిన రూపేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె సోదరుడు డానీస్తోపాటు అతడి బంధువులు ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అతడికి బెయిల్ కూడా మంజూరు చేయకూడదంటూ డిమాండ్ చేశారు. తన అక్కను హత్య చేసిన హంతకుడు భవిష్యత్తులో అతడి కూతురు సానియాను కూడా హతమారుస్తాడని ఆరోపించారు. సానియాను తమకు చూపించాలని, తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రూపేష్ తల్లి వద్దనున్న సానియాను ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి వారికి చూపించారు. సానియాను తిరిగి రూపేష్ తల్లి వద్దకు పోలీసులు చేర్చారు. పోలీసులు సముదాయించడంతో పోలీస్‌స్టేషన్ నుంచి మదన్‌పల్లిలో మృతదేహాన్ని తగులబెట్టిన స్థలానికి వెళ్లారు. -
కూతురి సాయంతోనే భార్య మృతదేహం తరలింపు..?
దారుణ హత్య విషయం వెలుగు చూసిన గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్‌సిటీ వ్యూ అపార్ట్మెంట్లో మంగళవారం విషాద ఛాయలు అలుముకున్నాయి. శంషాబాద్‌లోని మదనపల్లిలో భార్య శరీర భాగాలను కాల్చివేసి పట్టుబడిన రూపేష్ కుమార్ అపార్ట్మెంట్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని తెలిసింది. తెలుగు, హిందీ రాకపోవటంతో అతని భార్య సింథియా కూడా బయటకు వచ్చేదికాదని సమాచారం. జైన్ శిల్ప సైబర్‌సిటీ అపార్ట్మెంట్లోని రమణారావుకు చెందిన గ్రౌండ్ ఫ్లోర్‌లోని జి ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని రెండేళ్లుగా రూపేష్ కుమార్, సింథియాతో పాటు కూతురు సానియా, సింథియా సోదరుడు నివాసం ఉంటున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే రూపేష్ రోజూ ఉదయం 10 గంటల బయటకు వెళ్లి సాయంత్రం 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేవాడు. అతని బావమరిది బీటెక్ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఫంక్షన్‌కు కలిసి వెళ్లిన రూపేష్, సింథియా, సానియా తిరిగి రాగా సింథియా సోదరుడు స్నేహితుల వద్దకు వెళ్లాడు. తన సోదరి హత్య విషయం తెలియని సింథియా సోదరుడు యథావిధిగా సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఫ్లాట్‌కు వచ్చాడు. తాళం చెవి లేకపోవడంతో అపార్ట్మెంట్లోనే తచ్చాడాడు. మీడియా ప్రతినిధులను చూసి విషయం తెలియటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రూపేష్, సింథియా గొడవ పడ్డట్లు తాము ఎప్పుడూ గమనించలేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. సింథియా ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేది కాదని, రూపేష్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదని తెలిపారు. సింథియా సోదరుడే ఇంటి పనులు చేసేవాడని పేర్కొన్నారు. గుట్టుచప్పుడు కాకుండా హత్య అపార్ట్మెంట్లో ఎవరికి అనుమానం రాకుండా భార్య శరీరాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్ నుంచి కారులో వెళ్లి ఉంటాడని అపార్ట్మెంట్ వాసులు భావిస్తున్నారు. రూపేష్ ఫ్లాట్ పక్కనే లిఫ్ట్ ఉంది. కారు లిఫ్ట్ దగ్గరికి వచ్చే వీలుంది. కూతురుకు చెత్త అని చెప్పి ఆమె సాయంతోనే సూట్‌కేస్‌ను కారులో పెట్టుకొని వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కారులో ఏ సమయంలో బయటకు వెళ్లాడో తెలియని పరిస్థితి నెలకొంది. సింథియా ఎవరితోనూ మాట్లాడేది కాదు రూపేష్ పని మనుషులనెవరిని పెట్టుకోలేదు. సింథియా ఎప్పడైనా బయటకు వచ్చినా ఎవరితోనూ మాట్లాడేది కాదు. తెలుగు, హిందీ రాకపోవడంతో ఇరుగుపొరుగు వారితోను మాట్లాడేది కాదు. కూతురును ప్రతి రోజు స్కూల్ బస్సులో ఎక్కించేది. అపార్టుమెంట్లో భద్రత కరువు గచ్చిబౌలిలోని శిల్పాలేవుట్‌లో విసిరేసినట్లుగా ఉండే ఏకైక అపార్ట్మెంట్ జైన్ శిల్ప సైబర్‌సిటీ వ్యూ. 54 ఫ్లాట్లలో ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నివాసం ఉంటున్నారు. అపార్ట్‌మెంట్‌కు రెండు ద్వారాలున్నప్పటికీ సీసీ కెమెరా ఒక్కటీ లేదు. రాత్రి, పగలు విధులు నిర్వహించేందుకు ఇద్దరే సెక్యూరిటీ గార్డులు ఉండటం గమనార్హం. రాయదుర్గం ఎస్ఐ రాజశేఖర్ మంగళవారం అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. రూపేష్ ఫ్లాట్ యజమాని ఎవరని అక్కడి సూరప్‌వైజర్ శరణప్పను ఆరా తీశారు. సీసీ కెమెరాలను ఎన్ని ఉన్నాయని అడగగా ఒక్కటి కూడా లేదని చెప్పారు. తక్షణమే సీసీ కెమెరాలు అమర్చాలని అపార్ట్మెంట్ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
సానియాను తీసుకువెళ్తుందనే...హత్య
హైదరాబాద్ : భార్యను అతి కిరాతకంగా హతమార్చిన ఘటనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. (భార్యను ముక్కలు చేసి...కాల్చేసి...) భార్య సింతియా విడాకులు కోరినందుకే రూపేశ్ కుమార్ అగర్వాల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. గతంలో దక్షిణాఫ్రికాలో పని చేసిన రూపేశ్ కుమార్‌కు కాంగో దేశస్తురాలు అయిన సింతియాతో పరిచయం అయింది. అనంతరం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం11ఏళ్లు పాటు సజావుగా కొనసాగింది. అయితే రూపేశ్, సింతియాల మధ్య కొన్నాళ్లుగా విబేధాలు తలెత్తాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తితో సింతియాకు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన రూపేశ్ పలుమార్లు భార్యతో గొడవ పడ్డాడు. అయితే భర్తపై విడాకులకు ఒత్తిడి తెచ్చిన సింతియా, కుమార్తె సానియతో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనిపై రూపేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో భార్యా,భర్తల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగి, అది సింతియా హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. కాగా సింతియా వీసా మంజూరుకు ఫ్రాన్స్ వ్యక్తి సహకారం అందించటంతో పాటు, పెళ్లి చేసుకున్నట్లుగా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా పంపించినట్లు సమాచారం. ఒక్కదానివే వెళ్లాలని, పాపను ఇచ్చేది లేదని అతడు తేల్చి చెప్పాడు. అయితే కుమార్తెతో కలిసి సింతియా ఫ్రాన్స్ వెళ్లేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో రూపేశ్... గచ్చిబౌలిలోని తన నివాసంలో భార్య గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం సింతియా శవాన్ని 10 ముక్కలుగా చేసి ఓ పెద్ద బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. శంషాబాద్ మండలం మదనపల్లె సమీపంలో చెట్ల పొదల్లో బ్యాగుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ క్రమంలో రూపేశ్ వాహనం బురదలో కూరుకుపోవటం, స్థానికులు అతడిని ప్రశ్నించడం, అందుకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో రూషేశ్ ఈ వివరాలు వెల్లడించినట్లు సమచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యను ముక్కలు చేసి.. కాల్చేసి..
- తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కిన భర్త - రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్‌పల్లి సమీపంలో ఘటన - ఇంట్లో చంపి.. శవాన్ని బ్యాగులో కుక్కి.. - చెత్త పడేద్దామంటూ కూతురును కారులో వెంట తీసుకెళ్లిన రూపేశ్ - ఆమెను కొద్ది దూరంలోనే దించేసి.. శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేసిన వైనం - తిరిగి వస్తుండగా వాహనం బురదలో ఇరుక్కోవడంతో చిక్కిన రూపేశ్ శంషాబాద్ రూరల్: భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. తప్పించుకునే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదన్‌పల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్ ప్రాంతానికి చెందిన రూపేశ్‌కుమార్ షేర్ మార్కెట్లో బాగా నష్టపోయాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్య సింతియా(30)తో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో ఆమె గొంతునులిమి చంపాడు. శవాన్ని ముక్కలుగా చేసి ఓ పెద్ద బ్యాగులో ఉంచాడు. కూతురు సానియా(8)కు అనుమానం రాకుండా సోమవారం ఉదయం పాఠశాలలో విడిచిపెట్టాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక బ్యాగులోని చెత్తను కాల్చేసి వద్దామంటూ కూతురుతో కలసి శంషాబాద్ శివారులోని మదన్‌పల్లికి రాత్రి ఏడు గంటల సమయంలో ఫోర్డ్ కారులో వచ్చాడు. బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రీన్‌సిటీ వెంచరులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారు ఆపాడు. కూతురును కొద్ది దూరంలోనే దించేసి కారును ముందుకు తీసుకెళ్లి అందులోని బ్యాగును కిందకు దించాడు. బ్యాగులోని భార్య మృతదేహాన్ని బయటకు తీసి, వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి తగులబెట్టాడు. అక్కడికి వచ్చిన దారిలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడానికి బయలుదేరాడు. మదన్‌పల్లి శివారులోకి వెళ్లగానే అక్కడ బురదలో కారు ఇరుక్కుపోయింది. గమనించిన స్థానికులు అక్కడకు వెళ్లి ఆరా తీయగా.. కంగారులో ఉన్న రూపేశ్‌కుమార్ పొంతన లేని సమాధానాలు చెప్పడం, దూరంగా మంటలు కనిపిస్తుండడంతో స్థానికులు వెంటనే శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోతున్న మృతదేహాన్ని గుర్తించారు. దీంతో నిందితుడితోపాటు అతడి కూతురును ఠాణాకు తరలించారు. అనంతరం శంషాబాద్ ఏసీపీ అనురాధ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఏం జరిగిందో.. ? భార్యను అత్యంత దారుణంగా నరికి చంపడం వెనుక బలమైన కారణం ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు విచారించే క్రమంలో అతను తన కూతురు ముందు హత్య విషయాలు చెప్పడానికి నిరాకరించినట్లు తెలిసింది. పోలీసులు వచ్చేంత వరకు కూడా ఈ విషయాన్ని కూతురుకు తెలియకుండా దాచిపెట్టడం, ఇంట్లోనే భార్యను హత్య చేసి ఇక్కడికి తీసుకురావడం అన్నీ పథకం ప్రకారం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘గ్రాండ్’ హ్యాట్రిక్...
* సానియా-హింగిస్ జంటకే మహిళల డబుల్స్ టైటిల్ * వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ మెల్బోర్న్: ఊహించిన ఫలితమే వచ్చింది. కొంతకాలంగా మహిళల డబుల్స్ టెన్నిస్‌ను శాసిస్తోన్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట తమ ఖాతాలో వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకుంది. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్‌ను నెగ్గిన ఈ ద్వయం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అజేయంగా నిలిచింది. మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ‘హ్యాట్రిక్’ సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 7-6 (7/1), 6-3తో ఏడో సీడ్ ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా జంటకు తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీనే లభించింది. రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకోవడంలో ఇబ్బంది పడ్డాయి. దాంతో తొలి సెట్లో ఏకంగా ఎనిమిది సార్లు సర్వీస్‌లు బ్రేక్ అయ్యాయి. తుదకు టైబ్రేక్‌లో సానియా జంట పైచేయి సాధించి తొలి సెట్‌ను 62 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్ ఆరంభంలోనే హర్డెకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ జంట తర్వాత అదే జోరును కొనసాగించి 5-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో హింగిస్ తన సర్వీస్‌ను కోల్పోయినా... తొమ్మిదో గేమ్‌లో హర్డెకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ ఇండో-స్విస్ ద్వయం విజయాన్ని దక్కించుకుంది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 6,35,000 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 3 కోట్ల 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 2000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. బహుమతి ప్రదానోత్సవంలో ఇద్దరికీ కలిపి ఒకే ట్రోఫీ అందజేస్తారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లేందుకు ఇద్దరికీ వేర్వేరుగా ఒక్కో ట్రోఫీని ఇస్తారు. మిక్స్డ్ డబుల్స్‌లో నిరాశ: మహిళల డబుల్స్‌లో టైటిల్ నెగ్గిన సానియా మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం సెమీఫైనల్లో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 5-7, 6-7 (4/7)తో ఐదో సీడ్ ఎలీనా వెస్నినా (రష్యా)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిన సానియా జంటకు 39,250 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 18 లక్షల 90 వేలు)ప్రైజ్‌మనీ దక్కింది. 36 వరుసగా సానియా-హింగిస్ సాధించిన విజయాలు. 8 ఈ ఇండో-స్విస్ జంట ఖాతాలో చేరిన వరుస టైటిల్స్ సంఖ్య. 6 మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌ను కలిపి సానియా సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. 21 సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాలలో కలిపి హింగిస్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. -
సానియా జోడీదే ఆస్ట్రేలియా ఓపెన్
-
తెలుగు ప్రముఖులకు ‘పద్మ’పురస్కారాలు
* మొత్తం 112 మందికి అవార్డులు ప్రకటించిన కేంద్రం * జాబితాలో 14 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు * రజనీ, రామోజీలకు పద్మవిభూషణ్.. సానియా, సైనాలకు పద్మభూషణ్ సాక్షి, న్యూఢిల్లీ: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు, సూపర్ స్టార్ రజనీకాంత్లకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం సోమవారం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 112 మందికి ఈ అవార్డులను ప్రతిపాదించగా రాష్ట్రపతి ఆమోదించారు. రామోజీరావు, రజనీకాంత్ సహా 10 మందికి పద్మవిభూషణ్; యార్గగడ్డ లక్ష్మీప్రసాద్, డి.నాగేశ్వర్‌రెడ్డి సహా 19 మందికి పద్మభూషణ్; లక్ష్మాగౌడ్, ఎస్.ఎస్.రాజమౌళి సహా 83 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ప్రకటించిన ఈ జాబితాలో మొత్తం 19 మంది మహిళలు ఉండగా.. పది మంది విదేశీయులు, ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన వారు ఉన్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజాసంబంధాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు వంటి రంగాల్లోవిశిష్ట సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలను ప్రకటిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే ఈ అవార్డులను ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే ప్రత్యేక వేడుకలో రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికైన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మొత్తం 14 మంది తెలుగువారు ఉండటం విశేషం. పద్మవిభూషణ్ పురస్కారాల జాబితాలో యామినీ కృష్ణమూర్తి, రామోజీరావులకు చోటు దక్కింది. పద్మభూషణ్ పురస్కారాల జాబితాలో సాహితీవేత్త డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ డి.నాగేశ్వరరెడ్డి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ ఆళ్ల వెంకట రామారావు, క్రీడల్లో సైనా నెహ్వాల్, సానియా మీర్జాలకు చోటు దక్కింది. ఇక పద్మశ్రీ అందుకోనున్న వారిలో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, పెయింటింగ్‌లో కె.లక్ష్మాగౌడ్, వైద్యంలో డాక్టర్ మన్నం గోపీచంద్, డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణగోఖలే, డాక్టర్ నాయుడమ్మ యార్లగడ్డ, సామాజిక సేవ రంగంలో సునీతాకృష్ణన్, డాక్టర్ టి.వి.నారాయణ ఉన్నారు. ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపిక చేసిన 112 మందిలో 12 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. నలుగురు ఎస్సీ, నలుగురు ఎస్సీ, నలుగురు ఓబీసీలు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అవార్డులకు ఎంపికైన వారిలో అత్యధికంగా 18 మంది ఢిల్లీ నుంచి ఉంటే.. మహారాష్ట్ర నుంచి 16 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 12 మంది, కర్ణాటక నుంచి 11 మంది ఉన్నారు. . . పద్మవిభూషణ్ పురస్కారాలు పేరు రంగం రాష్ట్రం 1. యామినీ కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యం ఢిల్లీ 2. రజినీకాంత్ సినిమా తమిళనాడు 3. గిరిజాదేవి శాస్త్రీయ గాత్రసంగీతం పశ్చిమబెంగాల్ 4. రామోజీరావు జర్నలిజం ఆంధ్రప్రదేశ్ 5. డాక్టర్ విశ్వనాథన్ శాంత వైద్యం తమిళనాడు 6. శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్యాత్మికం కర్ణాటక 7. జగ్మోహన్ ప్రజాసంబంధాలు ఢిల్లీ 8. డాక్టర్ వాసుదేవ్ ఆత్రే సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కర్ణాటక 9. అవినాష్ దీక్షిత్ సాహిత్యం, విద్య యూఎస్ఏ 10. ధీరూభాయ్ అంబానీ (మరణానంతరం) వాణిజ్యం, పరిశ్రమలు మహారాష్ట్ర . పద్మభూషణ్ 11. అనుపమ్‌ఖేర్ సినిమా మహారాష్ట్ర 12. ఉదిత్ నారాయణ్ ఝా నేపథ్య గానం మహారాష్ట్ర 13. రామ్ వి.సుతర్ శిల్పి ఉత్తరప్రదేశ్ 14. హీస్నమ్ కన్హయ్యలాల్ థియేటర్ మణిపూర్ 15. వినోద్ రాయ్ సివిల్ సర్వీస్ కేరళ 16. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాహిత్యం, విద్య ఆంధ్రప్రదేశ్ 17. ఎన్.ఎస్.రామనుజ తాతాచార్య సాహిత్యం మహారాష్ట్ర 18. బర్జీందర్సింగ్ హమ్దర్ద్ సాహిత్యం పంజాబ్ 19. ప్రొఫెసర్ డి.నాగేశ్వరరెడ్డి వైద్యం తెలంగాణ 20. స్వామి తేజోమయానంద ఆధ్యాత్మికం మహారాష్ట్ర 21. హఫీజ్ కాంట్రాక్టర్ ఆర్కిటెక్చర్ మహారాష్ట్ర 22. రవీంద్ర చంద్ర భార్గవ ప్రజాసంబంధాలు ఉత్తరప్రదేశ్ 23. ఆళ్ల వెంకట రామారావు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ 24. సైనా నెహ్వాల్ స్పోర్ట్స్ - బ్యాడ్మింటన్ తెలంగాణ 25. సానియా మీర్జా స్టోర్ట్స్ - టెన్నిస్ తెలంగాణ 26. ఇందూజైన్ వర్తకం ఢిల్లీ 27. స్వామి దయానంద్ సరస్వతి (మరణానంతరం) ఆధ్యాత్మికం ఉత్తరాఖండ్ 28. రాబర్ట్ బ్లాక్విల్ ప్రజాసంబంధాలు అమెరికా 29. పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ వర్తకం ఐర్లాండ్ . పద్మశ్రీ పురస్కారాలు 30. ప్రతిభాప్రహ్లాద్ శాస్త్రీయ నృత్యం ఢిల్లీ 31. భీకూదన్ గద్వీ జానపద సంగీతం గుజరాత్ 32. శ్రీభాస్ చంద్ర సుపాకర్ టెక్స్టైల్ డిజైనింగ్ ఉత్తరప్రదేశ్ 33. అజయ్ దేవ్‌గణ్ సినిమా మహారాష్ట్ర 34. ప్రియాంక చోప్రా సినిమా మహారాష్ట్ర 35. తులసీదాస్ బోర్కర్ శాస్త్రీయ సంగీతం గోవా 36. సోమ ఘోష్ గాత్ర సంగీతం ఉత్తరప్రదేశ్ 37. నీలా మదప్ పండా కళలు ఢిల్లీ 38. ఎస్.ఎస్.రాజమౌళి సినిమా కర్ణాటక 39. మధుర్ భండార్కర్ సినిమా మహారాష్ట్ర 40. ఎం.వెంకటేశ్‌కుమార్ జానపదం కర్ణాటక 41. గులాబీ సపేరా జానపదం రాజస్తాన్ 42. మమత్రా చంద్రార్కర్ జానపదం ఛత్తీస్‌గఢ్ 43. మాలినీ అవస్తీ జానపదం యూపీ 44. జయ్‌ప్రకాష్ లేఖీవాల్ పెయింటింగ్ ఢిల్లీ 45. కె.లక్ష్మాగౌడ్ పెయింటింగ్ తెలంగాణ 46. బాల్‌చంద్ర దత్తాత్రేయ్ మోండే ఫొటోగ్రఫీ మధ్యప్రదేశ్ 47. నరే శ్ చందర్ లాల సినిమా అండమాన్ 48. ధీరేంద్ర నాథ్ బెజ్బారువా సాహిత్యం అస్సాం 49. ప్రహ్లాద్ చంద్ర టాసా సాహిత్యం అస్సాం 50. డాక్టర్ రవీంద్ర నాగర్ సాహిత్యం ఢిల్లీ 51. దాహ్యాభాయ్ శాస్త్రి సాహిత్యం గుజరాత్ 52. డాక్టర్ సంతేషివర బైరప్ప సాహిత్యం కర్ణాటక 53. హల్దర్ నాగ్ సాహిత్యం ఒడిశా 54. కామేశ్వరం బ్రహ్మ జర్నలిజం అస్సాం 55. పుష్పేష్ పంత్ జర్నలిజం ఢిల్లీ 56. జవహర్లాల్ కౌల్ జర్నలిజం జమ్మూకశ్మీర్ 57. అశోక్ మాలిక్ సాహిత్యం ఢిల్లీ 58. మన్నం గోపీచంద్ వైద్యం తెలంగాణ 59. రవికాంత్ ైవె ద్యం ఉత్తరప్రదేశ్ 60. రాం హర్ష్‌సింగ్ వైద్యం ఉత్తరప్రదేశ్ 61. శివ్నారాయణ కురీల్ వైద్యం ఉత్తరప్రదేశ్ 62. సవ్యసాచి సర్కార్ వైద్యం ఉత్తరప్రదేశ్ 63. ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే వైద్యం ఆంధ్రప్రదేశ్ 64. టి.కె.లాహిరి వైద్యం ఉత్తరప్రదేశ్ 65. ప్రవీణ్ చంద్ర వైద్యం ఢిల్లీ 66. దల్జీత్‌సింగ్ గంభీర్ వైద్యం ఉత్తరప్రదేశ్ 67. చంద్రశేఖర్ శేషాద్రి వైద్యం తమిళనాడు 68. అనిల్‌కుమారి మల్హోత్రా వైద్యం ఢిల్లీ 69. ఎం.వి.పద్మ శ్రీవాస్తవ వైద్యం ఢిల్లీ 70. సుధీర్ వి.షా వైద్యం గుజరాత్ 71. ఎం.ఎం.జోషి వైద్యం కర్ణాటక 72. జాన్ ఎబ్నెజర్ వైద్యం కర్ణాటక 73. నాయుడమ్మ యార్లగడ్డ వైద్యం ఆంధ్రప్రదేశ్ 74. సైమన్ ఓరాన్ పర్యావరణం జార్ఖండ్ 75. ఇంతియాజ్ ఖురేషి పాకశాస్త్రం ఢిల్లీ 76. పీయూష్ పాండే వాణిజ్య ప్రకటనలు మహారాష్ట్ర 77. సుభాష్ పాలేకర్ సేద్యం మహారాష్ట్ర 78. రవిందర్ కుమార్ సిన్హా వన్యమృగ సంరక్షణ బిహార్ 79. హెచ్.ఆర్.నాగేంద్ర యోగా కర్ణాటక 80. ఎం.సి.మెహతా ప్రజాసంబంధాలు ఢిల్లీ 81. ఎం.ఎన్.కృష్ణ మణి ప్రజాసంబంధాలు ఢిల్లీ 82. ఉజ్వల్ నికమ్ ప్రజాసంబంధాలు మహారాష్ట్ర 83. టొఖేహో సేమ ప్రజాసంబంధాలు నాగాలాండ్ 84. సతీష్‌కుమార్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ 85. ఎం.అన్నాదురై సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక 86. దీపాంకర్ ఛటర్జీ సైన్స్, ఇంజనీరింగ్ కర్ణాటక 87. గణపతి దాదాసాహెబ్ యాదవ్ సైన్స్, ఇంజనీరింగ్ మహారాష్ట్ర 88. వీణా టాండన్ సైన్స్, ఇంజనీరింగ్ మేఘాలయ 89. ఓంకార్‌నాథ్ శ్రీవాస్తవ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్ 90. సునీతాకృష్ణన్ సామాజిక సేవ ఆంధ్రప్రదేశ్ 91. అజోయ్కుమార్ దత్తా సామాజిక సేవ అస్సాం 92. ఎం.పండిట్ దాసా సామాజిక సేవ కర్ణాటక 93. పి.పి.గోపినాథన్ నాయర్ సామాజిక సేవ కేరళ 94. మడేలైన్ హెర్మన్ డె బ్లిక్ సామాజిక సేవ పుదుచ్చేరి 95. శ్రీనివాసన్ డమల్ కందలాయి సామాజిక సేవ తమిళనాడు 96. సుధాకర్ ఓల్వే సామాజిక సేవ మహారాష్ట్ర 97. టి.వి.నారాయణ సామాజిక సేవ తెలంగాణ 98. అరుణాచలం మురుగంతం సామాజిక సేవ తమిళనాడు 99. దీపికా కుమారి క్రీడలు - విలువిద్య జార్ఖండ్ 100. సుశీల్ దోశి క్రీడలు - వ్యాఖ్యానం మధ్యప్రదేశ్ 101. మహేష్ శర్మ వాణిజ్యం ఢిల్లీ 102. సౌరభ్ శ్రీవాస్తవ వాణిజ్యం ఢిల్లీ 103. దిలీప్ సంఘ్వీ వాణిజ్యం మహారాష్ట్ర 104. డాక్టర్ కేకి హార్మస్జీ ఘర్దా వాణిజ్యం మహారాష్ట్ర 105. ప్రకాశ్ చంద్ సురానా (మరణానంతరం) శాస్త్రీయ సంగీతం రాజస్తాన్ 106. సయీద్ జాఫ్రీ (మరణానంతరం) సినిమా బ్రిటన్ 107. మైఖేల్ పోస్టల్ పురావస్తు ఫ్రాన్స్ 108. సల్మాన్ అమీన్ సల్ ఖాన్ సాహిత్యం అమెరికా 109. హుయ్ లాన్ జంగ్ యోగా చైనా 110. ప్రెడ్రగ్ కె. నైకిక్ యోగా సెర్బియా 111. సుందర్ ఆదిత్య మీనన్ సామాజిక సేవ అరబ్ ఎమిరేట్స్ 112. అజయ్‌పాల్‌సింగ్ బంగా వాణిజ్యం అమెరికా సూపర్‌స్టార్ రజనీ... నాలుగు దశాబ్దాల సినీ నటనతో అభిమానుల మనసులు చూరగొనటమే కాదు.. తమిళనాట ఒక దేవతామూర్తి హోదా సంపాదించుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన 1975లో కె.బాలచందర్ దర్శకత్వంలోని అపూర్వ రాగంగళ్ చిత్రంలో సినీ రంగంలోకి ప్రవేశించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ సినిమాల్లోనూ ఆయన నటించారు. దళపతి, శివాజీ, ఏంతిరన్ వంటి ఆయన సినిమాలు చాలా ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం 65 ఏళ్ల వయసున్న రజనీ ఇంతకుముందు పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. రజనీకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించటం పట్ల సినీ రంగ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, అల్లుడు ధనుష్ సహా అభిమానుల నుంచి ఫేస్బుక్, ట్విటర్ సామాజిక వెబ్సైట్లలో రజనీకి అభినందనలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా రజనీకాంత్‌కు అభినందనలు తెలిపారు. తనకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించటం.. తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రజనీ ట్విటర్లో స్పందించారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నటమయూరి యామినీ... నాట్యంపై అమితమైన ఇష్టంతో చిన్న వయసు నుంచే శిక్షణ పొందుతూ భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిఖరాగ్రాలకు చేరిన కళాకారిణి యామినీ కృష్ణమూర్తి. ఆమె 1940లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. రుక్మిణీదేవి అరుండేళ్, కాంచీపురం ఎల్లప్పపిళ్లై, తంజావూర్ కిట్టప్ప పిళ్లైల వద్ద భరతనాట్యం శిక్షణ పొందిన ఆమె.. వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పశుమర్తి వేణుగోపాల్ కృష్ణశర్మల మార్గదర్శకత్వంలో కూచిపూడి నృత్యం అభ్యసించారు. ఒడిస్సీ నృత్యాన్ని కూడా ఆమె అభ్యసించారు. 1957లోనే తొలి ప్రదర్శన ఇచ్చిన యామినీ అనతికాలంలోనే అగ్రగామి సంప్రదాయ నృత్యకళాకారిణి స్థానాన్ని చేరుకున్నారు. 1990లో ఢిల్లీలో యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌ను నెలకొల్పి నృత్యశిక్షణను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసున్న యామినీ గతంలోనే సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. పద్మశ్రీ రావడం సంతోషం: సుభాష్ పాలేకర్ అమలాపురం: పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల ప్రకృతి వ్యవసాయ పితామహుడు, ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పవరంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. పద్మ పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిన వెంటనే శిష్యులు, అభిమానులు పాలేకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు రావడంపై ఆయన స్పందిస్తూ... తాను అవార్డుల కోసం ఈ ఉద్యమాన్ని నిర్వహించలేదని, తన శ్రమను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. విలక్షణ నటుడు అనుపమ్‌ఖేర్ బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో జీవించే అనుపమ్‌ఖేర్ విలక్షణ నటుడిగా ఖ్యాతిగడించారు. మూడు దశాబ్దాలుగా సినీ నటన కొనసాగిస్తున్న ఖేర్.. తనకు పద్మభూషణ్ అవార్డు ద్వారా లభించిన గుర్తింపు ఒక గౌరవంగా భావిస్తున్నట్లు హర్షం వ్యక్తంచేశారు. ‘‘ఒక ప్రవాస కశ్మీరీ పండిట్ కుమారుడికి.. ఒక చిన్న పట్టణంలో అటవీ విభాగంలో క్లర్కుగా పనిచేసిన వ్యక్తి కృషిని గుర్తిస్తూ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు లభించింది. నా దేశానికి కృతజ్ఞతలు’’ అని ఆయన ట్విటర్లో వ్యాఖ్యానించారు. రాజకీయాధికారి జగ్మోహన్ 1927లో ప్రస్తుత పాకిస్తాన్‌లోని హఫీజాబాద్ అనే పట్టణంలో జన్మించారు. స్వాతంత్య్రం, విభజన సమయంలో మత కల్లోల నుంచి తృటిలో తప్పించుకుని ఢిల్లీ చేరుకున్న జగ్మోహన్ డిగ్రీ పూర్తిచేసి.. సివిల్ సర్వెంట్‌గా ఢిల్లీ ప్రభుత్వంలో పని చేశారు. ఆ తర్వాత 1980 నుంచి ఢిల్లీకి రెండు పర్యాయాలు, గోవా, డామన్ అండ్ డయ్యూలకు ఒక పర్యాయం లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. 1984 నుంచి 1989 వరకూ.. ఆ తర్వాత 1990లో నాలుగు నెలల పాటు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు ‘‘పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషంగా ఉంది. పరమాత్మునికి, నా తల్లిదండ్రులు తక్కెళ్ల వెంకయ్య, నర్సమ్మలకు, నా గురువు సోమదేవశర్మకు, నాలో దేశభక్తిని కలిగించిన పెద్దలకు కృతజ్ఞతలు. -టి.వి.నారాయణ, సామాజిక కార్యకర్త నేపథ్యం: 1925 జూలై 26న హైదరాబాద్ శివార్లలోని బొల్లారంలో తక్కెళ్ల వెంకన్న, నర్సమ్మ దంపతులకు జన్మించారు. ఉపాధ్యాయునిగా కెరీర్ ప్రారంభించారు. విద్యారంగంతో పాటు, సామాజిక రంగంలోనూ సేవలందించారు. సిటీ కాలేజీ ప్రిన్సిపల్‌గా, ఏపీపీఎస్సీ సభ్యునిగా, సెన్సార్ బోర్డు సభ్యునిగా చేశారు. జస్టిస్ పున్నయ్య నేతృత్వంలో ఏర్పడిన ఎస్సీ, ఎస్టీ సెల్ సభ్యునిగా పని చేశారు. సంస్కృతంలో రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. హిందీ-తెలుగు భాషల వారధి గుడివాడ: పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోనున్న సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గత నాలుగు దశాబ్దాలుగా హిందీ తెలుగు భాషల మధ్య వారధిగా నిలిచారు. పదమూడేళ్ల క్రితమే పద్మశ్రీ అందుకున్న ఈయన అటు అనువాదంలో, ఇటు స్వంత రచనలోనూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకున్నారు. రష్యా ప్రభుత్వం నుంచి పుష్కిన్ అవార్డు, అమెరికాలో తానా, వంగూరి ఫౌండేషన్ల నుంచి సత్కారాలు, హిందీ సాహిత్యంలో కృషికి సాహిత్య రత్నాకర్, గంగాశరణ్ పురస్కార్వంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందారు. జాతీయ స్థాయిలో హిందీ భాషాభివృద్ధికి కృషిచేస్తున్న లక్ష్మీప్రసాద్ తెలుగు, హిందీలో సొంతంగా, అనువాద రూపంలో దాదాపు 62 పుస్తకాలు రచించారు. ఆయన రచించిన ‘ద్రౌపది’ పుస్తకం సంచలనం రేకెత్తించింది. ఆంధ్రావర్సిటీలో హిందీ విభాగంలో ప్రొఫెసర్, శాఖాధిపతిగా చేశారు. 1996-2002కాలంలో రాజ్యసభసభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటరీ అధికార భాషా కమిటీకి డెప్యూటీ చైర్మన్‌గా, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా, అధికార భాషపై యూజీసీ కమిటీ చైర్మన్‌గా, కెనడాలో భారత సాంస్కృతిక రాయబారిగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర హిందీ సలహా మండలి సభ్యునిగా కొనసాగుతున్నారు. సాహిత్యం, కళల పరిరక్షణ కోసం లోక్‌నాయక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి లోక్‌నాయక్ అవార్డులను ప్రతిఏటా ఇస్తున్నారు. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కృష్ణాజిల్లా ఈడుపుగల్లు గ్రామంలో 1953 నవంబర్ 24న జన్మించారు. గుడివాడలోని బేతవోలు గ్రామంలో పెరిగారు. డిగ్రీ వరకు గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో చదివారు. జైఆంద్ర ఉద్యమం సమయంలో ఆయన్ను మీసా యాక్టు కింద జైలులో పెట్టారు. ఎలా స్పందించాలో తెలియడం లేదు ‘‘నాకెలా స్పందించాలో నాకు తెలియడం లేదు. మిశ్రమ భావాలు కలుగుతున్నాయి. నిజం చెప్పాలంటే నేను దీనికి అర్హున్ని కాదేమో అన్పిస్తోంది. ఎందుకంటే నేను సాధించినవేమిటో నాకు తెలుసు. ఇప్పటిదాకా అంతటి కళాత్మక అద్భుతాలనేమీ సృష్టించలేదు నేను. రజనీకాంత్, రామోజీరావు, పద్మవిభూషణ్‌కు పూర్తిగా అర్హులు. వారి పనితనాన్ని కొన్ని తరాల పాటు చెప్పుకుంటారు. అంత గొప్పవారితో కలిసి అవార్డు అందుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది’’ -ఎస్.ఎస్.రాజమౌళి, సినీ దర్శకుడు నేపథ్యం: ఎస్ ఎస్ రాజమౌళి. వైఫల్యమంటే ఎలా ఉంటుందో ఎరగని సినీ దర్శకుడు. స్టూడెంట్ నంబర్ 1తో మొదలైన ఆయన సినీ విజయాల పరంపర తాజాగా బాహుబలి దాకా అప్రతిహతంగా కొనసాగింది. ముఖ్యంగా బాహుబలి భారత సినీ చరిత్రలోనే కనీవినీ ఎరగని రికార్డులు సృష్టించింది. ఈ సినిమాతో రాజమౌళి పేరు జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. ప్రస్తుతం దానికి సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు. డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుండెమార్పిడి ఆపరేషన్లు నిర్వహించి తొలి కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే. ఆయన 1959 అక్టోబర్ 2న కృష్ణా జిల్లాలో జన్మించారు. ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ నిర్వహించిన మొట్టమొదటి సర్జన్ కూడా గోఖలేనే. ఆయన భార్య డాక్టర్ సూరపనేని వెంకటలక్ష్మీ పిల్లల వైద్య నిపుణురాలు. గోఖలే ప్రాథమిక విద్యాభ్యాసం కృష్ణా జిల్లా తమిరిస గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగింది. గుంటూరు వైద్య కళాశాలలో 1976లో ఎంబీబీఎస్‌లో చేరి 1982లో పూర్తి చేశారు. జనరల్ సర్జరీ 1985లో గుంటూరు వైద్య కళాశాలలో పూర్తి చేశారు. తదుపరి వెల్లూరులో కార్డియోథొరాసిక్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ కోర్సు 1990లో పూర్తి చేశారు. హైదరాబాద్ నిమ్స్‌లో 1992లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం సహృదయ ట్రస్టు ద్వారా జీజీహెచ్‌లో పేద రోగులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అవిభక్త చిన్నారులను విడదీసి పిల్లల శస్త్రచికిత్స నిపుణులుగా పేరు ప్రఖ్యాతలు గడించిన డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ గుంటూరు వైద్య కళాశాలలో 1970లో వైద్య విద్యనభ్యసించారు. ఆయన 1947 జూన్ 1న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. రోటక్ మెడికల్ కళాశాల నుంచి 1974లో జనరల్ సర్జరీ, 1977లో ఢిల్లీ ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ పూర్తి చేశారు. గుంటూరు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా, పిల్లల వైద్య విభాగాధిపతిగా పనిచేశారు. కళా సమాజానికి గొప్ప గుర్తింపు ‘‘పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషంగా ఉంది. కళా సమాజానికి, మొత్తం కళాకారులకు లభించిన గొప్ప గుర్తింపు ఇది. స్త్రీ, పురుషుడు, పశువు, చెట్టు, వాతావరణం... ఇవే నాకు స్ఫూర్తి. వీటి ఆధారంగానే బొమ్మలు గీస్తాను.’’ - ప్రముఖ చిత్రకారుడు లక్ష్మా గౌడ్ నేపథ్యం: పూర్తి పేరు కలాల్ లక్ష్మా గౌడ్. తెలంగాణ జీవన చిత్రాన్ని కాన్వాస్‌పై ఆవిష్కరించిన మొట్టమొదటి చిత్రకారుడు. 1940 ఆగస్టు 21న మెదక్ జిల్లా సంగారెడ్డి దగ్గర్లోని నిజాంపూర్‌లో వెంకన్న గౌడ్, అనంతమ్మ దంపతులకు జన్మించారు. తెలంగాణ జీవన చిత్రాన్ని సమున్నతంగా ఆవిష్కరించిన గొప్ప చిత్రకారుడు.ఎంతోమంది చిత్రకారులకు స్ఫూర్తి ప్రదాత. పెన్సిల్‌తోనే అద్భుతమైన చిత్రాలు గీయడం ఆయన ప్రత్యేకత. టెర్రాకోట్ శిల్పాలనూ అబ్బురపరిచేలా రూపొందిస్తారు. సామాన్య కుటుంబంలో పుట్టిన లక్ష్మాగౌడ్ చిన్నప్పటి నుంచే చిత్రకారుడిగా ప్రతిభ ను చాటుకున్నారు. కింగ్ కోఠీలోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో ఉపకారం వేతనంపై చదువుకున్నారు. బరోడాలోని లలిత కళా అకాడమీలో ఫైన్ ఆర్ట్స్‌లో చేరారు. బాధ్యత పెంచింది ‘‘అరుదైన గౌరవం లభించడం ఆనందంగా ఉంది. ఇది నా ఒక్కడి కృషి వల్ల సాధ్యం కాలేదు. 25 మంది వైద్యుల సమిష్టి కృషి ఈ విజయం. ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది. చిన్నారులకు హృదయ సేవలను మరింత చేరువ చేయాలన్నది మా ఆకాంక్ష’’ - మన్నం గోపిచంద్, చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్, స్టార్ ఆస్పత్రి నేపథ్యం: ప్రకాశం జిలా ్ల ఒంగోలుకు చెందిన డాక్టర్ మన్నం గోపిచంద్ గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తర్వాత వెస్టిడీస్కు వెళ్లి సర్జరీ నైపుణ్యాలు పెంచుకున్నారు. రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఈడెన్స్బర్గ్లో ఎఫ్ఆర్సీఎస్ ఇన్ జనరల్ సర్జరీ చేశారు. తర్వాత విదేశాల్లోని పలు ఆస్పత్రుల్లో కార్డియో థొరాసిక్ సర్జన్‌గా సేవలందించారు. 1994లో స్వదేశానికి తిరిగి వచ్చి అపోలో ఆస్పత్రిలో చేరారు. 1997లో మెడ్విన్ ఆస్పత్రిలో, 2002లో కేర్‌లో పని చేశారు. ప్రస్తుతం స్టార్ ఆస్పత్రిలో చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్‌గా ఉన్నారు. ఇప్పటిదాకా 12 వేలకు పైగా గుండె ఆపరేషన్లు చేశారు. హృదయ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా ఇప్పటి 3,000 మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేశారు. ఎంతో సంతోషంగా ఉంది: డి.నాగేశ్వర్‌రెడ్డి ‘‘నాకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రి అందిస్తున్న సేవలకు లభించిన సముచితమైన గౌరవంగా భావిస్తున్నా. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందరో వైద్య నిపుణులు, సిబ్బంది రోజుకు 24 గంటల పాటు రోగులకు సేవలందిస్తున్నారు. వారందరి సేవలకు గుర్తింపే ఇది. త్వరలో ఆస్పత్రి సేవలను మరింత విస్తరించబోతున్నాం. గచ్చిబౌలిలో 2016 మార్చి నాటికి వెయ్యి పడకలతో అధునాతన హంగులతో మరో ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి మరింతమందికి సేవలందిస్తాం’’ - ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డి.నాగేశ్వర్‌రెడ్డి నేపథ్యం: పూర్తి పేరు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి. 1956 మార్చి 18న భాస్కర్‌రెడ్డి, శారద దంపతులకు జన్మించారు. 1963లో బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టెన్త్‌లో టాపర్‌గా నిలిచారు. విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్, కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండీ, చండీగఢ్‌లోని ప్రతిష్టాత్మక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్లో గ్యాస్ట్రో ఎంటరాలజీలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పూర్తి చేశారు. తర్వాత కొద్దిరోజులకు హార్వర్డ్ మెడికల్ స్కూల్/కాలేజీలో అప్పట్లోనే నెలకు రూ.కోటి వేతనమున్న ఉద్యోగాన్ని వదులుకుని భారత్ తిరిగి వచ్చారు. 1984-89 వరకు నిమ్స్‌లో ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1989-90లో గుంటూరు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ పని చేశారు. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్‌గా, వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జీఐ ఎండోస్కొపీపై విస్తృత పరిశో ధనలు చేశారు. 335 పరిశోధనా పత్రాలు సమర్పించారు. 112 అంతర్జాతీయ ఎండోస్కోపిక్ వర్క్‌షాపుల్లో విజిటింగ్ ఫ్యాక ల్టీగా సేవలందించారు. సమాజహితం కోరినందుకే: ఏవీ రామారావు ‘సమాజానికి ఉపయోగపడే కొద్దోగొప్పో మంచి పనులు చేశాననే నమ్మకం నాకుంది. ఇందుకు ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించడం ఆనందంగా ఉంది’ అన్నారు ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఆళ్ల వెంకట రామారావు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డెరైక్టర్‌గా చేసి రిటైరైన ఆయన్ను అవార్డు ప్రకటన సందర్భంగా ‘సాక్షి’ పలుకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘రసాయన శాస్త్రవేత్తగా నా శక్తి సామర్థ్యాల మేరకు సమాజ హితం కోసం పనిచేశానన్న తృప్తి నాకుంది. పద్మశ్రీ అందుకున్న (1991) 14ఏళ్ల తర్వాత మరో పద్మ అవార్డు దక్కడం సంతోషంగానే ఉంది. యువతరంపై కొంత అసంతృప్తి ఉన్నమాటైతే వాస్తవం. వీలైనంత తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దృక్పథం సరైందికాదు. అంకితభావంతో పనిచేస్తే డబ్బు ఖ్యాతి వాటంతట అవే వస్తాయని నమ్మేవాడిని నేను. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. రిటైరయ్యాక సొంతంగా ఆవ్రా ల్యాబ్స్ స్థాపించి పరిశోధనలు కొనసాగిస్తున్న అతికొద్దిమందిలో నేను ఒకడిని. యువ శాస్త్రవేత్తలూ ఈ తీరులో పనిచేస్తే భారత్ అద్భుతాలు సృష్టించగలదు’ అన్నారు. ఫార్మా రంగంలో ఈయన పేరు తెలియని వారుండరు. హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఏజెడ్టీ మందును అత్యంత చౌకగా తయారు చేసే విధానాన్ని ఆవిష్కరించి రికార్డు సృష్టించారు. వార్తా, వ్యాపార సారథి రామోజీ రామోజీ గ్రూపు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు 1939లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పెదపారుపూడిలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన గత ఐదు దశాబ్దాలుగా మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ చానళ్లు, ఉషాకిరణ్ మూవీస్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, డాల్ఫిన్ హోటల్స్, ప్రియా ఫుడ్స్, కళాంజలి సంస్థలతో పాటు.. ప్రపంచంలో అతి పెద్ద సినీ నిర్మాణ కేంద్రం ‘రామోజీ ఫిల్మ్ సిటీ’లను స్థాపించి నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక రవిశంకర్... తమిళనాడులోని పాపనాశంలో 1956లో జన్మించిన రవిశంకర్ బెంగళూరు యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక రంగంలో కృషి చేస్తూ శ్రీశ్రీ రవిశంకర్‌గా ఖ్యాతి గడించారు. 1981లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. అది ఇప్పుడు 152 దేశాల్లో మనుషుల వ్యక్తిగత ఒత్తిడిని, సామాజిక సమస్యలను, హింసను తగ్గించే లక్ష్యంతో పనిచేస్తోంది. 1997లో జెనీవా కేంద్రంగా ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్’ అనే సంస్థను రవిశంకర్ నెలకొల్పారు. ఇది సహాయ కార్యక్రమాలతో పాటు, గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేస్తోంది. విద్యాపీఠం తొలివీసీ తాతాచార్య యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం తొలి వైస్‌చాన్సలర్‌గా పనిచేసిన ఎన్ఎస్ రామానుజ తాతాచార్యకు భారతదేశ అత్యున్నత మూడవ పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈయన 1989 నుంచి 93 వరకు విద్యాపీఠానికి తొలి వీసీగా పనిచేశారు. విద్యాపీఠం అభ్యున్నతికి సేవలందించారు. సంస్కృత భాష అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. పలు పుస్తకాలను రచించారు. ఈయనకు సంస్కృతం, తమిళం, హిందీ, తెలుగు భాషల్లో పరిజ్ఞానం ఉంది. వివిధ శాస్త్రాలకు సంబంధించిన ఈయన రాసిన 60 పరిశోధనా పత్రాలు పలు జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 25 మంది పరిశోధక విద్యార్థులకు ఈయన మార్గదర్శకం చేశారు. ఈయన సంస్కృత భాషకు చేసిన సేవకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈయన విద్యాపీఠంలో 30 సంవత్సరాల పాటు అధ్యాపకుడిగా పనిచేశారు. -
క్వార్టర్స్‌లో సానియా-హింగిస్ జోడి
మెల్బోర్న్: మహిళల డబుల్స్ విభాగంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా- మార్టీనా హింగిస్(స్వీజ్జర్లాండ్)ల జోడి.. ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఈ టాప్‌సీడ్ జోడీ.. స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా)-రాబర్టా విన్సీ(ఇటలీ) జంటపై 6-1, 6-3 పాయింట్లతో వరుస సెట్లలో విజయం సాధించింది. 80 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సానియా ద్వయం చెలరేగిపోయి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. -
సాన్ టినా ఎక్స్ ప్రెస్
♦ వరుసగా 29 మ్యాచ్‌లు గెలిచిన సానియా-హింగిస్ ♦ 1994 తర్వాత అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జోడీగా గుర్తింపు ♦ సిడ్నీ ఓపెన్ ఫైనల్లో ఇండో-స్విస్ ద్వయం అంతర్జాతీయ యవనికపై అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న సానియా-హింగిస్ జోడీ డబ్ల్యూటీఏ సర్క్యూట్లో 22 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. వరుసగా 29 మ్యాచ్‌ల్లో గెలిచి 1994 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళా జోడీగా రికార్డులకెక్కింది. లక్ష్యం పెద్దదే... ప్రస్తుతానికి సానియా-హింగిస్లు 1994 తర్వాత వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన రికార్డును మాత్రమే అందుకున్నారు. 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్‌ల రికార్డును ఛేదించాలంటే సానియా జోడి ఇంకా 16 మ్యాచ్‌లు గెలవాలి. మహిళల డబుల్స్‌లో ప్రపంచ రికార్డు లక్ష్యం మాత్రం చాలా పెద్దగా ఉంది. 1983-85 మధ్య కాలంలో మార్టినా నవ్రత్తిలోవా-ఫామ్ ష్రివర్‌లు వరుసగా 109 మ్యాచ్‌ల్లో నెగ్గారు. సిడ్నీ: అవకాశం వచ్చిన ప్రతిసారి తమ రాకెట్ నైపుణ్యాన్ని చూపెడుతున్న సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)లు మహిళల డబుల్స్‌లో 22 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. వరుసగా 29 మ్యాచ్‌ల్లో గెలిచి... 1994 తర్వాత అత్యధిక మ్యాచ్‌లు నెగ్గిన మహిళా జోడీగా రికార్డులకెక్కారు. సిడ్నీ ఓపెన్ ఫైనల్లోకి చేరుకోవడం ద్వారా ఇండో-స్విస్ ద్వయం ఈ ఘనత సాధించింది. దీంతో 1994లో గిగీ ఫెర్నాండేజ్ (ప్యూర్టోరికా-అమెరికా)-నటాషా జ్వెరెవా (బెలారస్) నెలకొల్పిన 28 విజయాల రికార్డు ఈ సందర్భంగా తుడిచిపెట్టుకుపోయింది. సిడ్నీ ఓపెన్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ సానియా-హింగిస్ 4-6, 6-3, 10-8తో రాలుకా ఒలారు (రొమేనియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)లపై నెగ్గారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్‌తో కలిపి సానియా-హింగిస్ మొత్తం 9 టైటిల్స్ గెలిచారు. గతవారం బ్రిస్బేన్ టైటిల్ నెగ్గిన ఈ జంటకు ఇది రెండో ఫైనల్. గంటా 31 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురైనా... ఇండో-స్విస్ జోడి దీటుగా స్పందించింది. తొలి సెట్లో రెండు జంటలు చెరో మూడుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాయి. అయితే ఒలారు-ష్వెదోవా నాలుగో బ్రేక్ పాయింట్‌ను కాచుకుని 6-4తో సెట్‌ను కైవసం చేసుకుంది. రెండో సెట్లో వ్యూహం మార్చిన సానియా-హింగిస్.... ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేయడంతో పాటు తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. తొలి సర్వీస్‌లోనే 76 శాతం పాయింట్లను సాధించారు. నిర్ణయాత్మక మూడో సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్ పాయింట్లను నిలబెట్టుకున్నా... కీలక దశలో ఒలారు-ష్వెదోవా డబుల్ ఫాల్ట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. దీన్ని ఆసరా చేసుకున్న సానియా వరుస పాయింట్లతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. -
ప్రపంచ రికార్డు సమం
♦ సానియా-హింగిస్ ఖాతాలో ♦ వరుసగా 28వ విజయం ♦ సిడ్నీ ఓపెన్ సెమీస్‌లో ప్రవేశం సిడ్నీ: తమ విజయపరంపరను కొనసాగిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట మహిళల డబుల్స్‌లో వరుస విజయాల ప్రపంచ రికార్డును సమం చేసింది. వరుసగా 28వ విజయం సాధించిన ఈ ఇండో-స్విస్ ద్వయం 1994లో గీగీ ఫెర్నాండెజ్ (ప్యూర్టోరికో-అమెరికా), నటాషా జ్వెరెవా (బెలారస్) జంట నెలకొల్పిన రికార్డును అందుకుంది. సిడ్నీ ఓపెన్ టోర్నమెంట్లో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 6-2, 6-3తో చెన్ లియాంగ్-పెంగ్ షుయె (చైనా) జంటను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. 59 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా-హింగిస్ తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి జంట సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. గురువారం జరిగే సెమీఫైనల్లో రలూకా ఒలారూ (రుమేనియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటతో సానియా-హింగిస్ జోడీ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సానియా-హింగిస్ వరుసగా 29 మ్యాచ్‌ల్లో నెగ్గిన జోడీగా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. -
సెమీస్‌లో సానియా జంట
బ్రిస్బేన్: గతేడాది పది డబుల్స్ టైటిల్స్ నెగ్గి సంచలనం సృష్టించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... కొత్త ఏడాదిలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. తన భాగస్వామి మార్టినా హింగిస్‌తో కలిసి ఈ హైదరాబాద్ అమ్మాయి బ్రిస్బేన్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-3, 4-6, 10-6తో బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) ద్వయంపై విజయం సాధించింది. అంతకుముందు తొలి రౌండ్లో సానియా-హింగిస్ 6-1, 6-2తో షహర్ పీర్ (ఇజ్రాయెల్)- శాంచెజ్ (అమెరికా)లపై గెలిచారు. -
బదులు తీర్చుకున్న ఏసెస్
మావెరిక్‌పై గెలుపు న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లోఫిలిప్పీన్స్ మావెరిక్‌పై ఇండియన్ ఏసెస్ జట్టు బదులు తీర్చుకుంది. భారత అంచె పోటీల్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఏసెస్ 30-12 తేడాతో మావెరిక్‌పై సునాయాసంగా గెలిచింది. ముందుగా మిక్స్డ్ డబుల్స్‌లో బోపన్న- సానియా మీర్జా జోడి 6-2తో హ్యువే- టోమ్లజనోవిక్పై నెగ్గి శుభారంభాన్ని అందించింది. ఆ తర్వాత మహిళల సింగిల్స్‌లో రద్వాన్‌స్కా 6-1తో గజ్డోసోవాపై.. పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో సాన్టోరో 6-1తో ఫిలిప్పోసిస్పై నెగ్గారు. ఇక పురుషుల డబుల్స్‌లో నాదల్- బోపన్న 6-4 వాసెలిన్- హ్యుయే జోడిపై.. పురుషుల సింగిల్స్‌లో నాదల్ 6-4తో వాసెలిన్‌ను ఓడించడంతో విజయం సంపూర్ణమైంది. మరో మ్యాచ్‌లో లియాండర్ పేస్‌కు చెందిన జపాన్ వారియర్స్ 24-21 తేడాతో యూఏఈ రాయల్స్‌ను ఓడించింది. -
ఎవరు గొప్ప..? సానియా? సైనా??
-
'సాన్ టినా'ఖాతాలో ఎనిమిదో టైటిల్
-
'సాన్ టినా' ఖాతాలో ఎనిమిదో టైటిల్
బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లు మరో టైటిల్ ను సాధించి తమ జోడీకి తిరుగులేదని నిరూపించుకున్నారు. చైనా ఓపెన్ కు ముందు సాన్ టినా పేరుతో బరిలో దిగిన ఈ జోడీ తుది పోరులో చైనీస్ తైపీ జంటపై విజయం సాధించి టైటిల్ ను చేజిక్కించుకుంది. చైనా ఓపెన్ డబ్యూటీఏ ఫైనల్ పోరులో సానియా జోడి 6-7 (9/11), 6-1, 10-8 తేడాతో హౌచింగ్ చాన్-యంగ్ జన్ చెన్ పై విజయం సాధించి టైటిల్ తమ ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన తొలి సెట్ టై బ్రేక్ దారి తీసింది. ఆ సెట్ ను కోల్సోయిన సానియా జోడీ అనంతరం పుంజుకుది. సానియా జంట రెండో సెట్ లో దూకుడుగా ఆడి ఆ సెట్ ను కైవసం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ లో సానియా జోడీ పోరాడి గెలిచి టైటిల్ ను సాధించింది. దీంతో ఈ జోడీ సాధించిన టైటిల్ సంఖ్య ఎనిమిదికి చేరగా, వరుసగా నాలుగో టైటిల్. -
సానియా... ఓ రోల్ మోడల్..!
ఆరేళ్ళ వయసున్న సానియా ఇప్పుడు దేశంలోని పిల్లలందరికీ రోల్ మోడల్ అయ్యింది. గౌరా గ్రామంలోని ప్రతివారూ ఇప్పుడు సానియాను ఫాలో అవుతున్నారు. ఆమెలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆమె మాత్రమే గ్రామం మొత్తానికి హెల్దీ ఛైల్డ్ గా గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్స్ తరపున వాత్సల్య ఎన్జీవో ఆర్గనైజేషన్ జరిపిన సర్వేలో గౌరా గ్రామంలో సానియా కుటుంబం తప్పించి మరెవ్వరూ పూర్తి ఆరోగ్యంతో లేనట్లు గుర్తించారు. ఈ ఆరేళ్ళ చిన్నారి ఆరోగ్యం దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నలక్షలమంది పిల్లలకు, వారి కుటుంబాలకు మార్గ దర్శకమైంది. ఓ ఆరోగ్యవంతమైన బిడ్డ ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగల్గుతుంది అనేందుకు సానియా నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే మన జీవితాలను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతాయన్నందుకు సానియా లైఫ్ స్టైల్ ను ఉదాహరణగా చెప్పొచ్చు. ఉత్తర ప్రదేశ్ లో ని గౌరా గ్రామంలో ఒకే ఒక్క హెల్దీ ఛైల్డ్ గా సానియా గుర్తింపు పొందింది. మంచి ఆహారపు అలవాట్లు ఉన్న కుటుంబంతోపాటు, తల్లిదండ్రులు పాటించిన ఫ్యామిలీ ప్లానింగ్ ఆమెకు వరంగా మారింది. ఎక్కువశాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్న గౌరా గ్రామంలో ఓ ఎన్జీవో సంస్థ జరిపిన సర్వేలో ఈ నిజం వెలుగు చూసింది. ఇంటి చుట్టుపక్కలవారు, స్నేహితుల్లోనే కాక ఏకంగా గ్రామంలోనే ఆ ఆరేళ్ళ చిన్నారి ఆరోగ్యంలో ముందున్నట్లుగా ఆ సంస్థ వెల్లడించింది. సానియా త్రండి కుండలు తయారు చేయడం వృత్తిగా జీవనం సాగిస్తున్నాడు. అయితేనేం సానియా ఆరోగ్యంలో ముందుండేందుకు ఆమె కుటుంబ ఆహారపు అలవాట్లు ఎంతగానో సహకరించాయి. కేవలం శారీరకంగానే కాదు... మానసికంగా కూడ సానియా ఎంతో ఆరోగ్యంవంతంగా ఉంది. అతి చిన్న గ్రామంలో ఉంటున్నా సానియా కుటుంబం ఎంతో పరిశుభ్రతను పాటిస్తుంది. భోజనానికి ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం, ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం వారి కుటుంబాన్ని అనారోగ్యాలకు దూరంగా ఉంచగల్గుతోందని ఆ సంస్థ సర్వేలో తేల్చి చెప్పింది. ఇప్పటికీ దేశంలోని పలు గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడ కొందరు మహిళలు ప్రసవం ఇంట్లోనే చేసుకుంటున్నారు. గర్భంతో ఉన్నప్పుడు కూడ కనీసం వైద్యులను సంప్రదించి అవసరమైన సలహాలను, వైద్యాన్ని తీసుకోవడం లేదు. కానీ ఓ చిన్న గ్రామంలో ఉన్నా... సానియా తల్లి మాత్రం గర్భంతో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డాక్టర్ చెకప్ చేయించుకోవడం, అవసరమైన పోషకాహారాన్ని, ఐరన్ మాత్రలను వాడటంతో ఎంతో ఆరోగ్యవంతమైన బిడ్డను కనగలిగింది. పసిబిడ్డల పెంపకంలో ఎంతో కష్టమైన మొదటి ఆరు నెలలు దాటే వరకూ తల్లిపాలివ్వడం సానియా ఆరోగ్యానికి కలసి వచ్చింది. అంతేకాదు తల్లిదండ్రులు బిడ్డ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు క్రమంగా వాక్సిన్లు వేయించారు. తమ ఆర్థిక స్థితిగతులను బట్టి మరో బిడ్డను ఆరోగ్యంగా పెంచడం కష్టమని తెలుసుకొని ఫ్యామిలీ ప్లానింగ్ కూడ పాటించారు. ఇవన్నీ సానియాను నేడు ఆరోగ్యానికి ఓ రోల్ మోడల్ గా నిలబెట్టాయి. -
సానియా సోదరి ఆనం నిఖా
-
సానియా సోదరి ఆనం నిఖా
హైదరాబాద్ : టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఓ వైపు క్రీడా శాఖ.. రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారానికి సానియా పేరును అవార్డుల కమిటీకి సిరఫాసు చేసింది. మరోవైపు సానియా చెల్లెలు ఆనం మీర్జా పెళ్లి ఖరారైంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అక్బర్ రషీద్‌తో... సెప్టెంబర్ 16న ఆనం మీర్జా నిఖా జరగనుంది. దీంతో సానియా ఇంటి పెళ్లి సందడి నెలకొంది. వధువు ఆనం మీర్జా షాపింగ్ కోసం ఇప్పటికే ముంబై వెళ్లింది. ఇరు కుటుంబాలు ఇప్పటికే పెళ్లి పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, అబూ సందీప్... ఆనం మీర్జా వెడ్డింగ్ డ్రెస్‌ను సెలక్ట్ చేయనున్నారు. ఆనం మిర్జా హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ డిగ్రీని పూర్తిచేశారు. -
డ్యాన్స్ ఇలా చేయాలి!
షోయబ్ మాలిక్‌కు యువీ చురక న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం శ్రీలంకపై పాకిస్తాన్ మూడో వన్డే గెలిచాక సానియాతో కలిసి షోయబ్ మాలిక్ చేసుకున్న సంబరాలు గుర్తున్నాయా. ఇప్పుడే పార్టీ మొదలైందంటూ వీరిద్దరితో పాటు పాక్ క్రికెటర్లు చిందులేసి వీడియోను నెట్లో పెట్టారు. అయితే అందరి సంగతేమో కానీ మన స్టార్ యువరాజ్‌సింగ్‌కు మాత్రం ఈ డ్యాన్స్ అస్సలు నచ్చలేదు. దాంతో నేరుగా మాలిక్‌కే గురి పెడుతూ ‘ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. కానీ ఘోరమైన డ్యాన్సర్లు’ అని ట్వీట్ చేశాడు. అయితే షోయబ్ దీనిని లైట్ తీసుకోలేదు. ‘అయితే మైదానంలోకి వచ్చేయ్...’ అంటూ యువీకి సవాల్ విసిరాడు. దీనిని స్వీకరించిన యువరాజ్ ‘నేను ఎప్పుడూ మైదానంలోనే ఉన్నాను భాయ్’...అంటూ తాను డ్యాన్స్ చేసి మరీ వీడియో పెట్టాడు. అదీ ఏకంగా మైకేల్ జాక్సన్ ప్రఖ్యాత బిల్లీ జీన్ ఆల్బంనుంచి ‘మూన్‌వాక్’ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టాడు. డ్యాన్స్ అంటే ఇలా చేయాలన్నట్లు చాలెంజ్ చేసినట్లుగా ఈ వీడియో ఉండటం విశేషం. -
అటు నేనే... ఇటు నేనే..!
మార్టినా హింగిస్ టెన్నిస్‌కు, భారత అభిమానులకు కూడా కొత్తేం కాదు. ఒకప్పుడు సింగిల్స్‌లో ఒక వెలుగు వెలిగిన ఈ స్విస్ తార అందరికీ సుపరిచితమే. అయితే ఈసారి వింబుల్డన్‌లో భారత్‌కు లభించిన రెండు టైటిల్స్‌లోనూ తన పాత్ర ఉంది. సానియాతో జతగా డబుల్స్, పేస్ జోడీగా మిక్స్డ్ డబుల్స్ నెగ్గింది. మనోళ్లతో హింగిస్‌కు ఎలా జోడీ కుదిరింది. ఒకప్పుడు ప్రపంచ సింగిల్స్ నంబర్‌వన్ ఇప్పుడు డబుల్స్ మాత్రమే ఎందుకు ఆడుతోంది? వింబుల్డన్‌లో భారత్ గర్వించదగ్గ రెండు విజయాల్లోనూ స్విట్జర్లాండ్ స్టార్ హింగిస్ పాత్ర ఉంది. భారత క్రీడాకారులతో జతకట్టి రెండు టైటిల్స్ సాధించిన హింగిస్.. తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకుంది. అమెరికాలో టీమ్ టెన్నిస్ పోటీల సందర్భంగా పేస్, హింగిస్ల జోడీ కుదిరింది. పేస్ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడని చెప్పిన ఈ స్విస్ స్టార్... ఈ ఏడాది రెండు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ రెండింటిలోనూ పేస్‌తో కలిసి కప్‌ను ముద్దాడింది. ఇక సానియా గత ఏడాది వరకు కారా బ్లాక్‌తో కలిసి డబుల్స్ ఆడింది. ఈ ఏడాది ఆరంభంలో కొత్త భాగస్వామిని ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఇదే సమయంలో హింగిస్ కూడా తగిన డబుల్స్ భాగస్వామి లేక ఇబ్బంది పడుతోంది. గత ఏడాది ఐపీటీఎల్ సందర్భంగా ఏర్పడిన సాన్నిహిత్యంతో ఈ ఇద్దరి కామన్ స్నేహితుడు ఒకరు కలిసి ఆడమని సూచించారు. దీంతో ఈ ఇద్దరూ మార్చిలో జతకట్టారు. అప్పటి నుంచి ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. హింగిస్ కెరీర్ ఆసక్తికరం అవిభాజ్య చెకోస్లొవేకియాలో 1980, సెప్టెంబరు 30న జన్మించిన హింగిస్ ఏడేళ్ల వయసులో స్విట్జర్లాండ్‌కు వలస వెళ్లింది. తల్లి మెలానీ శిక్షణలో రాటుదేలి 14 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారింది. ఏడాదిన్నర తిరిగేలోపు ‘గ్రాండ్‌స్లామ్ చాంపియన్’గా అవతరించింది. 1996లో 15 ఏళ్ల 9 నెలల వయసులో హెలెనా సుకోవాతో కలిసి వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఈ విజయంతో పిన్న వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన హింగిస్... 1997లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకొని పెను సంచలనం సృష్టించింది. 1998లో ఒకే సీజన్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో డబుల్స్ టైటిల్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో పిన్న వయస్సులో సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 2001లో తన కోచ్‌గా ఉన్న తల్లి మెలానీతో విడిపోవడం... కుడి చీలమండ గాయం కారణంగా హింగిస్ ఆటతీరు లయ తప్పింది. అదే ఏడాది కాప్రియాటికి నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన హింగిస్, 2003లో ఆశ్చర్యకరంగా రిటైర్మెంట్ ప్రకటించింది. రెండేళ్ల తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హింగిస్ మళ్లీ రాకెట్ పట్టింది. అయితే ఆమెలో మునుపటి జోరు కనిపించలేదు. నాలుగేళ్లపాటు ఆడిన ఆమె ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ మాత్రం చేరలేదు. 2007లో డోపింగ్‌లో పట్టుబడిన హింగిస్‌పై అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) రెండేళ్లపాటు నిషేధం విధించింది. నిషేధం ముగిసిన తర్వాత ఇన్విటేషన్, లెజెండ్స్లాంటి విభాగాలలో సరదాగా టెన్నిస్ ఆడిన హింగిస్ 2013లో మళ్లీ కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి సారించింది. అయితే ఈసారి సింగిల్స్‌ను వదులుకొని డబుల్స్‌కే పరిమితమైంది. పలువురు క్రీడాకారిణులతో జతకట్టిన హింగిస్ గొప్ప విజయాన్ని రుచి చూడలేకపోయింది. అయితే 2015లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌తో భాగస్వామ్యం హింగిస్ కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది. మూడు పదుల వయసు దాటినా అపార అనుభవానికి నైపుణ్యం జతకలవడంతో హింగిస్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లు, పదునైన రిటర్న్‌లు చేయడంలో తిరుగులేని హింగిస్‌కు ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జా రూపంలో మరో మంచి భాగస్వామి లభించింది. సానియా సర్వీస్‌లో నిలకడ, శక్తివంతమైన ఫోర్‌హ్యాండ్ షాట్లు... నెట్‌వద్ద హింగిస్ అప్రమత్తతతో ఈ జోడీకి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు 34 ఏళ్ల హింగిస్ లక్ష్యం వచ్చే ఏడాది బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం. -
చిన్నారులకు మార్టినా పాఠాలు
-
వారెవ్వా... సానియా
-
క్రీడా‘తారలు’
నగరానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం... వీరిలో కొందరి జీవిత విశేషాలు ఒక పూర్తి స్థాయి సినిమాను తలపించే రీతిలో ఉండడం మనకు తెలిసిందే. రన్నింగ్‌లో నేషనల్ ఛాంపియన్ మిల్కాసింగ్ కథతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’తో పాటు బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం కూడా విజయవంతమయ్యాయి. దీంతో నగరం వేదికగా ఎదిగిన క్రీడాకారులు కూడా తమ ‘జీవితం’తెరకెక్కాలని కోరుకుంటున్నారు. వీరిలో కొందరిని సినిమా రూపకర్తలే సంప్రదిస్తుండగా... కొంతమంది తామే చొరవ తీసుకుని లైఫ్‘షో’కి సై అంటున్నారు. దీంతో స్పోర్ట్స్స్టార్స్ బయోపిక్స్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. - బయోపిక్స్‌పై స్పోర్ట్స్స్టార్ల ఆసక్తి - ‘అజహర్’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల - తెరపైకి మరికొందరి జీవితాలు? వెండితెర ఇప్పుడు క్రీడాకారుల జీవిత విశేషాలకు వేదికవుతోంది. క్రీడాతారల జీవిత విశేషాలతో రూపొందిన కథలకు ఆదరణ లభిస్తుండడంతో... మరికొన్ని చిత్రాలు వరుసలోకి వస్తున్నాయి. దీనికి స్టార్ ఆటగాళ్లు సైతం పచ్చజెండా ఊపుతున్నారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి తమ పాత్రలలో ఏ హీరో, హీరోయిన్లు తెరపై కనిపిస్తే బాగుంటుందో సూచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడు అజహరుద్దీన్ జీవితం తెరపైకి వస్తున్న నేపథ్యంలో...మిగిలిన కథలూ ‘క్యూ’లో ఉన్నాయి. జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ క్రీడాతారల జీవితంలోని ఘట్టాల గురించి తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకు దక్కుతోంది. సానియా... ఎవరయా? నగరంలో పుట్టి నాజర్ స్కూల్లో చదివి... తెలుగు రాష్ట్రాల్లో టెన్నిస్ క్రీడకు వెలుగు తెచ్చిన అసమాన క్రీడాకారిణి సానియా మీర్జా. ఆటలో అంతర్జాతీయ కీర్తి గడించిన ఈ సిటీ స్టార్... అందం... ఫ్యాషన్ స్టైల్స్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్మాలిక్తో ప్రేమ పెళ్లి ద్వారా మీడియాకు కావాల్సినంత మసాలా అందించిన సానియా జీవితం కూడా విశేషాల మయమే. ఎంతో మంది సినిమాల్లో నటించాలనిఅడిగినా ‘నో’ చెప్పిన సానియా... తన జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి మాత్రం ఇటీవలే ఓకే చెప్పారు. మరుక్షణం నుంచి తన బయోపిక్ రూపొందించేందుకు టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని వినికిడి. సానియా కథతో తీసే సినిమాలో హీరోయిన్గా నటించేందుకు పలువురి పేర్లు ప్రస్తావనకు వస్తుంటే... తన పాత్ర పోషించాలంటే ప్రస్తుత నటీమణుల్లో దీపికా పదుకొనెమాత్రమే సరైన ఎంపిక అని... తన భర్త షోయబ్ పాత్రకు సల్మాన్‌ఖాన్‌ను సూచించడం ద్వారా సానియా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఇక ఈ బయోపిక్ తెరకెక్కడమే తరువాయి. వెండితెర ‘చంద్’మామ అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన బయోపిక్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ది. నగర వాసిగా బ్యాడ్మింటన్ రంగంలో రాణించడం మాత్రమే కాకుండా సైనా నెహ్వాల్ లాంటి నెంబర్‌వన్ క్రీడాకారిణిని తీర్చిదిద్ది... నగరానికి మరిన్ని క్రీడారంగ విజయాలు దక్కేలా చేసిన గోపీచంద్ బయోపిక్ ఇప్పుడు వార్తల్లో అంశం. సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు, హీరో సుధీర్‌బాబు (ప్రేమ కథా చిత్రం ఫేం) ఈ సినిమాలో గోపీచంద్ పాత్రలో నటి స్తున్నారు. వ్యక్తిగతంగా గోపీచంద్‌కి స్నేహితుడైన సుధీర్‌బాబు... ఈ సినిమా పట్ల అత్యంత ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం త్వరలోనే పట్టాలకెక్కనుంది. సై... అంటూ.. బ్యాడ్మింటన్ స్టార్‌గానూ, గ్లామర్, స్టైల్స్నూ పండిస్తూ... మన సిటీ వేదికగా రాణిస్తున్న నగర క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సైతం తన బయోపిక్ రూపకల్పనపై ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్‌గా వెలుగొందుతున్న ఈ సిటీ స్టార్... గతంలో బ్యాడ్మింటన్ ఆడిన అనుభవమున్న దీపికా పదుకొనె తన పాత్ర పోషిస్తే బాగుంటుందని... హీరోగా షారూఖ్ తన ఛాయిస్ అంటున్నారు. వ్యక్తిగతంగా తనను కాక బ్యాడ్మింటన్‌ను ప్రమోట్ చేసేలా ఆ సినిమా ఉండాలంటున్న సైనా.. మిగలిన క్రీడా నేపథ్యాల నుంచి వచ్చిన సినిమాల్లా కాక... తన సినిమా తీసేవారికి ఆటలో సాంకేతిక అంశాలపై కూడా పట్టుంటేనే... అది లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. అజహర్గా ఇమ్రాన్ మహ్మద్ అజహరుద్దీన్. క్రికెట్ ప్రేమికులు ముద్దుగా అజ్జూ అని పిలుచుకునే మన నగరవాసి. క్రికెట్ క్రీడాకారుడిగా, భార త టీమ్ కెప్టెన్‌గా సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. ఇక్కడే పుట్టి... ఇక్కడే చదువుకుని... ఇక్కడే ఎదిగిన ఈ హైదరాబాదీ...ప్రస్తుతం పొలిటీషియన్‌గానూ రాణిస్తున్నారు. టాప్ ఫీల్డర్‌గా ప్రశంసలు... మ్యాచ్ ఫిక్స్‌ర్‌గా ఆరోపణలతో అటు క్రీడా జీవితంలో... పెళ్లి... విడాకులు... సినీ నటితో ప్రేమ... పెళ్లి... మళ్లీ.. విడాకులు... ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం... ఇలా వ్యక్తిగత జీవితంలోనూ రకరకాల సవాళ్లను ఎదుర్కొన్న అజహర్ కథ... ఒక కలర్‌ఫుల్ సినిమాకు అవసరమైన అద్భుత ముడిసరుకు. ప్రస్తుతం ఏక్తాకపూర్ నిర్మాతగా ‘అజహర్’ పేరుతో రూపొందుతున్న బయోపిక్‌లో హిందీ హీరో ఇమ్రాన్హీష్మి నటిస్తున్నాడు. సంగీతా బిజిలానీతో ప్రేమ వ్యవహారానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ దీన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఇటీవలే దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. -
క్వార్టర్స్‌లో సానియా, పేస్ జోడీలు
మెల్బోర్న్: భారత స్టార్ క్రీడాకారులు సానియా మీర్జా, లియాండ్ పేస్ ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రవేశించారు. సోమవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సానియా, బ్రూనో సోర్స్ (బ్రెజిల్) జోడీ 7-5, 6-7 (3), 10-8 శాంటియాగో గోన్జలెజ్ (మెక్సికో), ఎబిగెయిల్ (అమెరికా) జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో పేస్, మార్టినా హింగీస్ (స్విట్జర్లాండ్) 6-3, 6-1తో స్పెయిన్ ద్వయం పాబ్లొ అందుజర్, ఎనెబెల్ మెడినాను ఓడించారు. -
ఐరాస దక్షిణాసియా మహిళా ప్రచారకర్తగా సానియా
అంతర్జాతీయం: ఖాట్మండులో 18వ సార్క్ సదస్సు దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) 18వ సదస్సు నేపాల్ రాజధాని ఖాట్మండులో నవంబరు 26-27 తేదీల్లో జరిగింది. ఉగ్రవాదం, తీవ్రవాదాలను సభ్యదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉమ్మడి, ఆర్థిక ద్రవ్య వ్యవస్థగా సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్ ఏర్పాటుతో పాటు, సార్క్ అభివృద్ధి నిధిని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సదస్సు ప్రకటించింది. సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదాన్ని, సీమాంతర నేరాలను ఎదుర్కొనేందుకు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చాలని పిలుపునిచ్చారు. సార్క్ సభ్యదేశాలు: భారత్, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, అఫ్గానిస్థాన్. 19వ సదస్సు పాకిస్థాన్‌లో జరగనుంది. ఐరాసలో మరణశిక్షలపై తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్ మరణశిక్షల తాత్కాలిక నిలిపివేతకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ముసాయిదా తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. నవంబరు 24న జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 114 దేశాలు, వ్యతిరేకంగా 36 దేశాలు ఓటు వేశాయి. 34 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అత్యంత అరుదైన కేసుల్లోనే మరణశిక్షను విధిస్తున్నట్లు భారత్ పేర్కొంది. నేపాల్ - భారత్ మధ్య 10 ఒప్పందాలు 18వ సార్క్ సదస్సులో భాగంగా నేపాల్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోదీ నవంబరు 25న ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య 10 ఒప్పందాలపై చర్చలు జరిగాయి. నేపాల్‌కు 100 కోట్ల అమెరికన్ డాలర్ల సాయం, మోటారు వాహనాల ఒప్పందం కింద ఇరు దేశాల్లో నిర్ధారించిన మార్గాల్లో ప్రయాణించేందుకు అనుమతి, ట్విన్ సిటీ ఒప్పందం కింద ఖాట్మండు-వారణాసి, జనక్‌పూర్- అయోధ్య, లుంబినీ-బోధ్ గయా నగరాల అనుసంధానం, ఇరు దేశాల సందర్శకులు రూ.500, రూ.1000 నోట్లు తీసుకెళ్లడానికి అనుమతి మొదలైనవి ఉన్నాయి. ఇప్పటివరకు రూ.100 నోట్లకే అవకాశం ఉండేది. జాతీయం 43 దేశాల ప్రజలకు ఈ-వీసా సౌకర్యం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భారత్ 43 దేశాలకు చెందిన ప్రజలకు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పించింది. దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నవంబరు 27న న్యూఢిల్లీలో ప్రారంభించారు. సౌకర్యం పొందిన దేశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్, రష్యా ఉన్నాయి. ఈ-వీసా 30 రోజులపాటు చెల్లుబాటవుతుంది. ఏడాదిలో రెండుసార్లు దీన్ని వినియోగించుకోవచ్చు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం, గోవా, కోచి విమానాశ్రయాల్లో తొలిసారిగా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. ఖాట్మండు-ఢిల్లీ బస్సు ప్రారంభం భారత ప్రధాని నరేంద్రమోదీ, నేపాల్ ప్రధాని సుశీల్ కుమార్ కొయిరాలా నవంబరు 25న ఖాట్మండు-ఢిల్లీ మధ్య బస్సును ఖాట్మండులో ప్రారంభించారు. ఈ బస్సుకు పశుపతి నాథ్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. అదే రోజు ఢిల్లీలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ-ఖాట్మండు బస్సు సర్వీసును ప్రారంభించారు. రెండు దేశాల మధ్య బస్సు సేవలు ప్రారంభం కావడం ఇదే మొదటిసారి. హార్నబిల్ ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో డిసెంబరు 1న నాగాలాండ్ రాజధాని కోహిమలో పర్యటించారు. వార్షిక హార్న్‌బిల్ ఉత్సవాలను ప్రారంభించారు. త్రిపురలోని ఉదయ్‌పూర్‌లో నిర్మించిన పలతానా విద్యుత్ ప్రాజెక్టులో 750 మెగావాట్ల రెండో యూనిట్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. మేఘాలయకు తొలి ప్యాసింజరు రైలు మేఘాలయకు తొలిసారిగా రైలు అనుసంధానాన్ని కల్పిస్తూ మెందిపథర్-గౌహతి ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 29న ప్రారంభించారు. అలాగే మిజోరంలోని భాయ్బ్రీ-సాయ్‌రంగ్ మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చడానికి శంకుస్థాపన చేశారు. గుజరాత్లో జాతీయ భద్రతా దళం కేంద్రం జాతీయ భద్రతా దళం కేంద్రాన్ని (ఎన్ఎస్జీ) గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు సమీపంలోని రందేశన్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. 2008 ముంబైలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం నేపథ్యంలో 2009లో ముంబై, చెన్నై, కోల్‌కత, హైదరాబాద్‌లలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రందేశన్‌లో నెలకొల్పే ఐదో ఎన్ఎస్జీ కేంద్రం వచ్చే ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి రానుంది. అవార్డులు బిలాల్ తన్వీర్‌కు శక్తిభట్ ఫస్ట్ బుక్ ప్రైజ్ లాహోర్‌కు చెందిన రచయిత బిలాల్ తన్వీర్‌కు శక్తిభట్ ఫస్ట్ బుక్ ప్రైజ్-2014 లభించింది. ఆయన రాసిన నవల ద స్కాటర్ హియర్ ఈజ్ టూ గ్రేట్‌కు ఈ బహుమతి దక్కింది. ఈ అవార్డును న్యూఢిల్లీలో డిసెంబర్ 2న ఆయన అందుకున్నారు. అవార్డు కింద రూ. 2 లక్షల నగదు బహుకరించారు. ప్రొ.శ్రీనాథ్‌రెడ్డికి లండన్ యూనివర్సిటీ డాక్టరేట్ భారతీయ ప్రజారోగ్య సంస్థ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ శ్రీనాథ్‌రెడ్డికి లండన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ లభించింది. ప్రతిష్టాత్మకమైన ఈ డాక్టరేట్‌ను నవంబరు 26న యూనివర్సిటీ ఛాన్స్లర్ బ్రిటిష్ యువరాణి ప్రదానం చేశారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనాథ్‌రెడ్డి ప్రజారోగ్యం, గుండె సంబంధ వ్యాధులపై అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. లెవియాథన్ చిత్రానికి బంగారు నెమలి అవార్డు గోవా రాజధాని పనాజీలో 11 రోజుల పాటు జరిగిన 45వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు (ఐఎఫ్ఐఎఫ్ఐ - ఇఫీ) నవంబరు 30న ముగిశాయి. అవార్డులు-విజేతలు: ఉత్తమ చిత్రం (బంగారు నెమలి): లెవియాథన్ (రష్యా) ఉత్తమ దర్శకుడు: నదావ్ లాపిడ్ (ఇజ్రాయ్ చిత్రం కిండర్ గార్డెన్ టీచర్ దర్శకత్వానికి) స్పెషల్ జ్యూరీ, సెంటినరీ అవార్డు: శ్రీహరి సాథె (భారతీయ చిత్రం: ఎక్ హజరాచీ నోట్‌కి దర్శకత్వానికి) ఉత్తమ నటుడు: అలెక్సెల్ సెరిబ్రియాకోవ్ (లెవియాథన్ హీరో), దులాల్ సర్కార్ (బెంగాళీ చిత్రం: చోటోదర్ చోబీ) లు సంయుక్తంగా అందుకున్నారు. ఉత్తమ నటి: క్యూబన్ నటి ఎరీనా రోడ్రిగ్ (చిత్రం: బిహేవియర్), సరిత్ లారీ (ఇజ్రాయ్ చిత్రం: కిండర్ గార్డెన్ టీచర్)లు సంయుక్తంగా అందుకున్నారు. రాష్ట్రీయం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ప్రాజెక్టు అనుమతి, స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం-(టీఎస్-టీపాస్) బిల్లు- 2014 పేరుతో బిల్లును నవంబరు 25న మంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి, పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడం, ఒకే చోట పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం, పరిశ్రమలు వేగంగా ఉత్పత్తి చేపట్టడం అనే లక్ష్యాలతో కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. భారీ పరిశ్రమలకు 15 రోజుల్లో, మధ్య తరహా పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. జిల్లా స్థాయిలో నెలరోజుల్లో అనుమతులు మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జపాన్ పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జపాన్ పర్యటనలో నవంబరు 28న టోక్యోలో ఆ దేశ ప్రధానమంత్రి షింజో అబేతో సమావేశమయ్యారు. నూతన రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటామని అబే తెలిపారు. ఐదురోజుల పర్యటనలో జపాన్ ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలతో పలు ఒప్పందాలు జరిగాయి. జపాన్ కంపెనీ సుమిటోమితో విద్యుత్ ఉత్పత్తి, రాజధానిలో మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ రంగాల్లో ఒప్పందాలు చేసుకుంది. వార్తల్లో వ్యక్తులు ఐరాస దక్షిణాసియా మహిళా ప్రచారకర్తగా సానియా ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళా విభాగం గుడ్‌విల్ అంబాసిడర్ (సౌహార్ధ్ర రాయబారి)గా భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా నవంబరు 25న నియమితులయ్యారు. దక్షిణాసియా నుంచి ఈ గౌరవం పొందిన తొలి మహిళ సానియా. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా సి.కె.ప్రసాద్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రమౌళి కుమార్ ప్రసాద్‌ను ఉపరాష్ట్రపతి నేతృత్వంలోని కమిటీ నవంబరు 25న ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్‌గా ఉన్న మార్కండేయ మూడేళ్ల పదవీకాలం అక్టోబరు 11న ముగిసింది. దీంతో ఆ స్థానంలో సి.కె. ప్రసాద్ నియమితులయ్యారు. తపన్‌రాయ్ చౌదురీ మృతి చరిత్రకారుడు తపన్ రాయ్ చౌదురీ (90) నవంబరు 26న మృతి చెందారు. ఆయన 1973 నుంచి 1992 వరకు ఆక్స్‌ఫర్డ్‌లోని సెంట్ ఆంటోనీ కాలేజీలో ఆధునిక దక్షిణాసియా విభాగంలో రీడర్‌గా పనిచేశారు. అందులోనే భారత చరిత్ర, నాగరికత పీఠంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. బెంగాల్ అండర్ అక్బర్ అండ్ జహంగీర్ అనే పుస్తకంతో పాటు తన జ్ఞాపకాలపై బెంగాల్ నామా అనే పుస్తకాన్ని బెంగాలీ భాషలో రాశారు. కథక్ నర్తకి సితారాదేవి మృతి ప్రముఖ కథక్ నర్తకి సితారాదేవి (96) నవంబరు 25న ముంబైలో మరణించారు. ఆమె 1969లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 1973లో పద్మశ్రీ, 1995లో కాళిదాస్ సమ్మాన్ పురస్కారం పొందారు. క్రీడలు కర్ణాటకకు విజయ్ హ జారే ట్రోఫీ క్రికెట్లో విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. అహ్మదాబాద్‌లో నవంబరు 25న జరిగిన ఫైనల్లో పంజాబ్‌ను ఓడించి కర్ణాటక విజేతగా నిలిచింది. దీంతో ఆ జట్టు వరుసగా రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతి దేశవాళి క్రికెట్లో ఆడుతూ గాయపడిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) సిడ్నీ ఆసుపత్రిలో నవంబరు 27న మరణించారు. బౌలర్ సీన్అబాట్ వేసిన బంతి హ్యూస్ తలకు తగలడంతో ఈ ప్రమాదం సంభవించింది. పీవీ సింధుకు మకావ్ ఓపెన్ టైటిల్ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. నవంబరు 30న మకావ్‌లో జరిగిన ఫైనల్లో కిమ్ హ్యోమిన్ (దక్షిణ కొరియా) ను డిఫెండింగ్ ఛాంపియన్ సింధు ఓడించింది. విజేతకు రూ. 5.60 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. సింధుకు ఇది మూడో గ్రాండ్ ప్రి టైటిల్. ఐబీఎస్ఎఫ్ అధ్యక్షుడిగా మోహన్ అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) కొత్త అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కెప్టెన్ పి.వి.కె.మోహన్ ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. కాగా ఆసియా నుంచి మూడో వ్యక్తి. ఈ హోదాలో ఆయన రెండేళ్లు కొనసాగుతారు. స్నూకర్ టైటిల్ విజేత బింగ్ టావ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను 14 ఏళ్ల చైనాకు చెందిన యాన్ బింగ్‌టావ్ కైవసం చేసుకున్నాడు. 12 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పంకజ్ అద్వానీ సహా హేమాహేమీలను ఓడిస్తూ ఫైనల్‌కు చేరిన యాన్... తుదిపోరులో మహ్మద్ సజ్జాద్ (పాకిస్థాన్) ను ఓడించాడు. దీంతో అత్యంత పిన్న వయసులో స్నూకర్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఘనత అతడికి దక్కింది. మహిళల విభాగంలో వాండీ జాన్స్ (బెల్జియం) రష్యాకు చెందిన అనస్తాషియా నెచెయివాను ఓడించి టైటిల్ సాధించింది. - ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు -
ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచార కర్తగా సానియా
-
హ్యాపీ డేస్
మా అమ్మమ్మగారి ఊరు విజయవాడలో పుట్టడమైతే పుట్టాను గానీ, చిన్ననాటి నుంచి నేను పెరిగింది హైదరాబాద్‌లోనే. బాల్యంలో ఎక్కువకాలం సికింద్రాబాద్ పరిసరాల్లో గడిపాను. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్లో చదువుకున్నాను. సైనిక్‌పురి కాలేజీలో బి.కామ్ పూర్తి చేశాను. చిన్నప్పుడు సికింద్రాబాద్, మారేడ్‌పల్లి, సైనిక్‌పురి ప్రాంతాలనే నగరంలో పోష్ ఏరియాలనుకునే దాన్ని. మా నాన్న రిటైర్డ్ బ్యాంకు అధికారి, అమ్మ గృహిణి. నాకో తమ్ముడు ఉన్నాడు. మాది ఎనిమిది మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం. నన్ను చాలా స్పెషల్‌గా తీర్చిదిద్దిన నగరం ఇదే. అందుకే హైదరాబాద్ అంటే నాకు వల్లమాలిన ఇష్టం. ఔట్‌డోర్ షూటింగుల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్‌ను మిస్సవుతున్నానే అని ఫీలవుతుంటాను. హైదరాబాద్ కంఫర్ట్‌కు మరే నగరమూ సాటిరాదు. ఇక్కడి ప్రజలు తమ తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా, సంస్కృతిని, పండుగలను ఎన్నడూ మరచిపోరు. కేకుల తయారీలో ప్రయోగాలు.. బేకరీ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆన్లైన్లో ఫుడ్ వెబ్‌సైట్స్ చూస్తూ, వంటల్లో.. ముఖ్యంగా కేకుల తయారీలో ప్రయోగాలు చేస్తుంటాను. నేనెప్పుడు వంటగదిలోకి వెళ్లినా.. ఇంటిల్లిపాదీ నేను చేసే వంటకాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. ఇక హైదరాబాదీ ఫుడ్ విషయానికొస్తే, నాకు హైదరాబాద్ హౌస్‌లోని దమ్కీ బిర్యానీ, కుబానీ కా మీఠా చాలా ఇష్టం. నేను ఎక్కువగా మొఘలాయ్ ఫుడ్‌ను ఇష్టపడతాను. మాదాపూర్‌లోని మంజర్ రెస్టారెంట్‌కు కూడా తరచూ వెళుతుంటాను. అప్పటి పచ్చదనం తిరిగి రావాలి.. నగరంలో నాకు చార్మినార్, బిర్లామందిర్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ఇష్టమైన ప్రదేశాలు. నా చిన్నప్పుడు నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతూ కనిపించేవి. వీధివీధినా పార్కులు ఉండేవి. వాహనాల రద్దీ తక్కువగా ఉండేది. ఇప్పుడన్నీ మారిపోయాయి. వాహనాలు.. వాటి వల్ల కాలుష్యం పెరిగాయి. పచ్చదనం తగ్గింది. చాలా ప్రాంతాల్లో పార్కులు మాయమయ్యాయి. అప్పటి పచ్చదనం తిరిగి రావాలని కోరుకుంటాను. ఇక పండుగలంటే నాకు చాలా ఉత్సాహం. ముంబై తరహాలోనే మన నగరంలోనూ వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. సంక్రాంతికి గొబ్బెమ్మలు, ముగ్గులు, గాలిపటాలు.. సందడే సందడి. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో సంక్రాంతికి అందరం టైపైకి వెళ్లి గాలిపటాలు ఎగరేస్తూ ఉత్సాహంగా గడుపుతాం. శిరీష చల్లపల్లి