‘ఐటా’ జోక్యంపై తలో మాట! | Sania Mirza denies writing to AITA on Venus Williams post-WADA hack report | Sakshi
Sakshi News home page

‘ఐటా’ జోక్యంపై తలో మాట!

Published Sat, Sep 17 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

‘ఐటా’ జోక్యంపై తలో మాట!

‘ఐటా’ జోక్యంపై తలో మాట!

తాను అడగలేదన్న సానియా
* ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా
* స్పందించారంటున్న సంఘం  

న్యూఢిల్లీ: ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)కు సంబంధించిన హ్యాకింగ్‌లో వీనస్ విలియమ్స్ పేరు బయటపడిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా)ను సానియా మీర్జా కోరినట్లు వచ్చిన వార్తలపై భిన్నమైన స్పందనలు వచ్చాయి. ముందుగా శుక్రవారం ఉదయం ఈ అంశంపై తాను ఎలాంటి జోక్యం కోరలేదని సానియా ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చింది. ‘ఐటా’ కూడా సానియా గానీ ఆమె తల్లి నసీమా మీర్జా నుంచి గానీ తమకు ఎలాంటి సమాచారం లేదంటూ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

సానియా దీనిని ఉటంకిస్తూ అన్ని సందేహాలకు ఇదే సమాధానం అని స్పష్టం చేసింది. అయితే సాయంత్రం ‘ఐటా’ దీనిపై మళ్లీ స్పందించింది. తన ప్రకటనలో తప్పు లేదంటూనే ‘వాడా’ అంశంలో జోక్యం చేసుకోవాలని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా కోరినట్లు ‘ఐటా’ కార్యదర్శి హిరణ్మయి ఛటర్జీ వెల్లడించారు. అరుుతే రాతపూర్వకంగా కాకుండా ఆయన నోటిమాటగానే దీనిని చెప్పారని అన్నారు. దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement