world anti-doping agency
-
శ్రీలంక క్రికెటర్‌కు భారీ ఊరట.. మూడేళ్ల నిషేధం ఎత్తివేత!
శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్విల్లా( Niroshan Dickwella)కు భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(WADA) అతడికి క్లీన్చిట్ దక్కినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిక్‌విల్లాపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేసినట్లు తెలుస్తోంది. శ్రీలంక ప్రీమియర్ లీగ్-2024 సందర్భంగా డిక్‌విల్లాపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఆట తీరును మెరుగుపరచుకునేందుకు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు శ్రీలంక యాంటీ డోపింగ్ ఏజెన్సీ(SLADA)కు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో నిరోషన్ డిక్విల్లాకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఏ ఫార్మాట్లోనూ క్రికెట్ ఆడకుండా మూడేళ్లపాటు నిషేధం పడింది.ఈ నేపథ్యంలో నిరోషన్ డిక్విల్లా వాడాను ఆశ్రయించగా.. అతడికి ఊరట లభించినట్లు డైలీ మిర్రర్ లంక పేర్కొంది. డిక్విల్లా నిషేధిత ప్రేరకాలు వాడలేదని.. అతడు తీసుకున్న పదార్థాలతో బ్యాటింగ్ ప్రదర్శన మెరుగుపడే అవకాశం లేదని లీగల్ టీమ్ ఆధారాలు సమర్పించినట్లు తెలిపింది. ఫలితంగా నిరోషన్ డిక్‌విల్లాపై నిషేధం ఎత్తివేయాల్సిందిగా వాడా ఆదేశించినట్లు పేర్కొంది.కాగా 31 ఏళ్ల నిరోషన్ డిక్విల్లా 2014లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ వికెట్ కీపర్ ఇప్పటి వరకు 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2757, 1604, 480 పరుగులు సాధించాడు. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడన్న కారణంగా నిషేధం ఎదుర్కోవడం అతడికి అలవాటే.కోవిడ్ సమయంలో 2021లో బయో బబుల్ నిబంధనలు అతిక్రమించినందుకు నిరోషన్ డిక్‌విల్లాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అతడితో పాటు ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్ కూడా ఇదే తప్పిదం కారణంగా నిషేధం ఎదుర్కొన్నారు. ఇక గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టు సందర్భంగా నిరోషన్ డిక్విల్లా శ్రీలంక తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌కే అతడు పరిమితమయ్యాడు. -
సినెర్ మెడకు ‘వాడా’ ఉచ్చు
హతవిధి... సినెర్‌ను అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) కరుణించినా... డోపింగ్ మరక మాత్రం నీడలా వెంటాడుతోంది. మార్చిలో దొరికినా... ఆగస్టు దాకా గోప్యంగా ఉంచేందుకు జాగ్రత్త పడినా... ఒక్క విన్నపంతో ఆశ్చర్యకరంగా నిషేధం బారిన పడకపోయినా... ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) డేగకన్ను నుంచి తప్పించుకోలేకపోయాడు. దీంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రోమ్: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్‌ను పాత వివాదం కొత్తగా చుట్టుకుంటోంది. డోపింగ్‌లో దొరికిపోయినా కనీసం ప్రొవిజనల్ సస్పెన్షన్ (తాత్కాలిక నిషేధం), తదుపరి సస్పెన్షన్ నుంచి తప్పించుకున్న ఈ ఇటలీ స్టార్ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కన్నుగప్పలేకపోయాడు. నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నట్లు రెండుసార్లు పరీక్షల్లో తేలినా నిషేధం విధించకపోవడం ఏంటని ‘వాడా’ రంగంలోకి దిగింది. తాజా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చాంపియన్‌ను ఒకటి లేదా రెండేళ్ల పాటు నిషేధించాల్సిందేనని ‘వాడా’ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తలుపు తట్టింది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని సీఏఎస్‌లో ‘వాడా’ అప్పీలు చేసింది. నిజానికి 23 ఏళ్ల సినెర్ దోషిగా తేలాడు. తాజా అప్పీలుపై జరిగే విచారణలో సీఏఎస్ సస్పెన్షన్‌కు గురైతే మాత్రం యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బీజింగ్‌లో చైనా ఓపెన్ ఆడుతున్న సినెర్... ‘వాడా’ అప్పీలుకు వెళ్లడంపై విచారం వ్యక్తం చేశాడు. ‘ఇది నన్ను చాలా నిరాశపరుస్తోంది.అంతేకాదు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. నిజాయితీగా చెబుతున్నా... నేను ఇదివరకే మూడు విచారణలకు హాజరయ్యా. అన్నింటిలోనూ నాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ‘వాడా’ అప్పీలును నేను ఊహించలేదు. దీని గురించి నాకు రెండు రోజుల క్రితమే తెలిసింది’ అని సినెర్ అన్నాడు. మరోవైపు ‘వాడా’ అధికారి ఒకరు మాట్లాడుతూ ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించలేదని తెలుసుకోవడం ‘వాడా’ లక్ష్యమని అన్నాడు. అప్పుడేం జరిగింది? ఈ ఏడాది మార్చిలో ఇండియన్ వెల్స్ టోర్నీ జరిగింది. ఆ సమయంలో, టోర్నీ ముగిశాక... ఈ రెండు సందర్భాల్లోనూ సినెర్ ఇచ్చిన శాంపిల్స్‌లో నిషిద్ధ ఉ్రత్పేరకం ‘క్లోస్టెబల్’ ఉన్నట్లు తేలింది. అంటే ఏకంగా ఒకే నెలలో రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడ్డాడు. దీంతో ఆ టోర్నీలో సెమీస్ చేరడంతో వచ్చిన ప్రైజ్‌మనీని వెనక్కి తీసుకోవడంతో పాటు, 400 ర్యాంకింగ్ పాయింట్లను కోతగా విధించారు. దీనిపై అప్పీలుకు వెళ్లిన సినెర్ ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదదని, తన ఫిజియో మసాజ్ చేసే సమయంలో కొట్టిన స్ప్రేతో శరీరంలోకి ప్రవేశించిందని, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా డోపింగ్ నిబంధనల్ని నిక్కచ్చిగా పాటిస్తానని విన్నవించాడు. ఐటీఐఏ ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ ప్యానెల్ అతని విన్నపాన్ని మన్నించి... క్లీన్చిట్ ఇవ్వడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. అలనాటి అమెరికా టెన్నిస్ దిగ్గజం క్రిస్ ఎవర్ట్ సహా షపవలోవ్ (కెనడా), కిరియోస్ (ఆస్ట్రేలియా) సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్కొక్కరికి ఒక్కోలా నిబంధనలుంటాయా అని ప్యానెల్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. సూపర్ ఫామ్‌లో... ఈ ఏడాది సినెర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో (ఆ్రస్టేలియన్, యూఎస్ ఓపెన్) విజేతగా నిలువడంతోపాటు మరో నాలుగు టోర్నీల్లో టైటిల్స్ సాధించాడు. ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతున్న చైనా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న సినెర్ ఈ ఏడాది 57 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. -
రెండేళ్లలో 114 మంది క్రికెటర్లకు మాత్రమేనా.. WADA అసహనం
2021-22 ఏడాదికి గానూ భారత క్రికెట్లో(పురుషులు, మహిళలు) కలిపి కేవలం 114 మంది క్రికెటర్లకు మాత్రమే జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) డోపింగ్ టెస్టులు హాజరయ్యారని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) తెలిపింది. మంగళవారం వాడా(WADA) ఇండియా యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్ పేరిట ఒక రిపోర్టును విడుదల చేసింది. దేశంలోని అథ్లెట్లకు నిర్వహించిన డోపింగ్ టెస్టుకు సంబంధించి తెలియని చాలా విషయాలు రిపోర్టులో చాలా ఉన్నాయని వాడా పేర్కొంది. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్.. సమాచార హక్కు చట్టం కింద 2021-22లో ఎంత మంది ఇండియన్ క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించారనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజేన్సీ(నాడా-NADA) ప్రకారం 2021, 2022 ఏడాదిలో మొత్తంగా 5961 డోపింగ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో కేవలం 114 మంది భారత క్రికెటర్లు ఉంటే.. మిగతా వాళ్లు వివిధ రకాల క్రీడలకు చెందిన అథ్లెట్లు ఉన్నారు. ఇందులో 1717 మంది అథ్లెట్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌కు చెందినవారే ఉన్నారు. రోహిత్ శర్మకు ఆరుసార్లు.. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యధికంగా ఆరుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు రిపోర్టులో ఉంది. ముంబై, అహ్మదాబాద్, చెన్నై, యూఏఈ వేదికగా రోహిత్‌కు ఆరుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇక రిషబ్ పంత్, సూర్యకుమార్, చతేశ్వర్ పుజారా సహా మరో నలుగురు క్రికెటర్లకు ఒకసారి డోపింగ్ టెస్టు నిర్వహించారు. కోహ్లికి ఒక్కసారి కూడా.. మరో ఆసక్తికర విషయమేంటంటే.. బీసీసీఐలో కాంట్రాక్ట్ కలిగి ఉన్న 25 మంది ఆటగాళ్లలో 12 మందికి ఒక్కసారి కూడా డోపింగ్ టెస్టు నిర్వహించలేదు. ఆ లిస్టులో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సహా టి20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బౌలర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్.. బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వికెట్ కీపర్లు సంజూ శాంసన్, కోన శ్రీకర్ భరత్‌లు ఉన్నారు. ఇక ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. ఇక మహిళల జట్టులో మాత్రం కాంట్రాక్ట్ కలిగి ఉన్న ప్రతీ క్రికెటర్‌కు కనీసం ఒక్కసారైనా డోపింగ్ టెస్టు నిర్వహించారు. ఇందులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానలకు మూడుసార్లు డోపింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ డేటా ఆటగాళ్లు ఎలాంటి తప్పు చేయలేదని సూచించదు. అయినప్పటికీ, సంభావ్య నేరస్థులను పట్టుకోవడంలో NADA తగినంతగా చేయడం లేదని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) తన వాదనను ఇది మరింత నొక్కి చెబుతుంది. దేశంలోని ఒలింపిక్ అథ్లెట్లను టార్గెట్ చేస్తున్న నాడా డోపింగ్ టెస్టుల కోసం పురుషుల క్రికెటర్ల నమూనాలను సేకరించడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పరోక్షంగా బీసీసీఐ హస్తం ఉందని.. నాడా వారికి భయపడే అతి తక్కువ మంది క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తోందని వాడా స్పష్టం చేసింది. రవి దహియా ఇంటికి 18సార్లు.. ఇక జనవరి 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు జాతీయ యాంటీ డోపింగ్ సంస్థ(నాడా) డోపింగ్ టెస్టు నిర్వహించడం కోసం ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ రవీ దహియా ఇంటికి 18సార్లు వెళ్లినట్లు సమాచారం. నిషేధిక డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు రావడంతో న్యూఢిల్లీతో పాటు తన సొంత రాష్ట్రం హర్యానాలోని సోన్పట్కు వెళ్లి అతని యూరిన్, బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. నీరజ్ చోప్రాను వదల్లేదు.. ఇక మహిళా వెయిట్‌లిఫ్టర్.. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాభాయి చానుకు కూడా ఎనిమిది సార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. పాటియాల, గాంధీనగర్‌తో పాటు విదేశాల్లోనూ ఆమెకు డోపింగ్ టెస్టులు చేశారు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మన దేశానికి బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాను కూడా వదల్లేదు. 2021 నుంచి 2022 ఏడాదిలో నీరజ్ చోప్రాకు ఐదుసార్లు డోపింగ్ టెస్టులు నిర్వహించారు. పాటియాలా, ఫిన్లాండ్, అమెరికాలోనూ ఈ టెస్టులు చేవారు. అయితే ఇవన్నీ ఆటగాళ్లకు ఎలాంటి కాంపిటీషన్స్ లేనప్పుడు కూడా నిర్వహించడం ఆసక్తి కలిగించింది. మరి భారత క్రికెటర్లు ఏడాది పొడవునా ఏదో ఒక సిరీస్ ఆడుతూనే ఉంటారు. క్షణం తీరిక లేకుండా స్వదేశం, విదేశాల్లో టోర్నీలు ఆడే టీమిండియా మధ్యలో ఐపీఎల్ కూడా ఆడుతుంది. మరి ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి డోపింగ్ టెస్టులు క్రమం తప్పకుండా చేయాల్సిందే. ఫిట్నెస్ సాధించడానికి 'యోయో(YOYO)' పేరుతో ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తున్నారే తప్ప ఎవరైనా క్రికెటర్ నిషేధిత డ్రగ్ ఏమైనా వాడుతున్నాడా అనేది డోపింగ్ టెస్టులో నిర్వహిస్తేనే బయటపడుతుంది. మన దేశంతో పోలిస్తే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లకు క్రమం తప్పకుండా డోపింగ్ టెస్టులు నిర్వహిస్తుంటారు. ఇంగ్లండ్ ఏజెన్సీ 96 మంది పురుషుల క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు నిర్వహిస్తే.. ఆస్ట్రేలియా ఏజెన్సీ 69 మంది మెన్స్ క్రికెటర్లకు నిర్వహించింది. కానీ భారత్‌లో మాత్రం నాడా 12 మంది పురుషుల క్రికెటర్లకు మాత్రమే డోపింగ్ టెస్టులు నిర్వహించింది. చదవండి: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు: బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్ ‘గిన్నిస్’లోకి సాత్విక్ స్మాష్... -
ఎన్‌డీటీఎల్‌పై ‘వాడా’ నిషేధం కొనసాగింపు
న్యూఢిల్లీ: ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) భారత్‌లోని జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబోరేటరీ (ఎన్‌డీటీఎల్)పై ఇదివరకే విధించిన నిషేధాన్ని తాజాగా మరో ఆరు నెలలు పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. కచ్చితత్వంతో కూడిన పరీక్షా ఫలితాలు వచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలేవీ ఎన్‌డీటీఎల్‌లో ఇంకా పాటించడం లేదంటూ నిషేధాన్ని కొనసాగించింది. దీంతో వచ్చే జనవరి (2021) దాకా మన ఆటగాళ్ల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని న్యూఢిల్లీలోని ఎన్‌డీటీఎల్‌లో పరీక్షించేందుకు వీలులేదు. అయితే నిషే«ధంపై 21 రోజుల్లోగా అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉంది. గతేడాది ఆగస్టులో తొలిసారిగా ‘వాడా’ మన ల్యాబ్‌ను నిషేధించింది. దీంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) భారత క్రీడాకారుల నమూనాల్ని దోహాలోని ల్యాబోరేటరీకి పంపి పరీక్షలు జరిపిస్తోంది. -
సున్ యాంగ్‌పై ఎనిమిదేళ్ల నిషేధం
హాంకాంగ్: మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, చైనా ఫ్రీ స్టయిల్ స్విమ్మర్ సున్ యాంగ్‌పై కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) శుక్రవారం ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 సెప్టెంబర్‌లో అతడి నుంచి శాంపిల్స్‌ను సేకరించడానికి వెళ్లిన ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రతినిధులకు సహకరించకుండా... వారు సేకరించిన శాంపిల్స్‌ను నాశనం చేశాడనే అభియోగంతో సీఏఎస్ అతడిపై విచారణ చేపట్టింది. తాజాగా ఆ ఘటనలో సున్ యాంగ్‌ను దోషిగా తేలుస్తూ... అతడిపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అయితే దీనిపై స్పందించిన సున్ తానెటువంటి తప్పు చేయలేదని...దీనిపై స్విట్జర్లాండ్ ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తానని మీడియాకు తెలిపాడు. చైనా స్విమ్మింగ్ సంఘం (సీఎస్ఏ) కూడా సున్కు మద్దతు తెలిపింది. ఆ రోజు సున్ శాంపిల్స్ సేకరించడానికి వచ్చిన వారు అర్హత కలిగిన అధికారులు కాదని తెలిపింది. 2014లో కూడా సున్ డోపింగ్‌లో పట్టుబడి నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. -
రష్యాపై నాలుగేళ్ల నిషేధం!
మాస్కో: అంతర్జాతీయ క్రీడల్లో మరో నాలుగేళ్ల పాటు రష్యా జెండా, అథ్లెట్లు కనిపించరేమో! తప్పుడు డోపింగ్ పరీక్షా ఫలితాలు, నిర్వహణతో రష్యా క్రీడా సమాఖ్య ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించుకునేందుకు సిద్ధమైంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించాలని అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు సిఫార్సు చేసింది. మాస్కోలోని ల్యాబోరేటరీల్లో నామమాత్రపు పరీక్షలు, నకిలీ నివేదికలు, నిర్వహణ తీరుపై విచారించిన ‘వాడా’ స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఆ మేరకు నిషేధాన్ని సూచించింది. రష్యా ఆటగాళ్లు పాల్గొనకుండా చేయడంతో పాటు రష్యా అంతర్జాతీయ పోటీల ఆతిథ్యానికి బిడ్ వేసే అవకాశముండదు. ఇదే జరిగితే యూరో 2020 ఈవెంట్‌ను ఈ సారి ఉమ్మడిగా నిర్వహిస్తున్నప్పటికీ ఇందులో రష్యాకు చెందిన సెయింట్ పీటర్స్బర్గ్ వేదిక కూడా ఉండటం ఫుట్‌బాల్ వర్గాల్ని కలవరపెడుతున్నాయి. రష్యా డోపింగ్ నిరోధక సంస్థ (ఆర్‌యూఎస్‌ఏడీఏ) చీఫ్ యూరీ గానస్ మాట్లడుతూ ‘నిషేధం తప్పేలా లేదు. నాలుగేళ్ల పాటు ఆటలకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో మా వాళ్లకు టోక్యో ఒలింపిక్స్ (2020), బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ (2022) మెగా ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు’ అని అన్నారు. 2015లో రష్యాలో వ్యవస్థీకృత డోపింగ్ వ్యవహారం అంతర్జాతీయ క్రీడా సమాజంలో కలకలం రేపింది. అక్కడి క్రీడాధికారులు, కోచ్‌లు తమ క్రీడాకారులకు శిక్షణతో పాటు నిషేధిత ఉ్రత్పేరకాలు అలవాటు చేస్తున్నట్లు తేలడంతో ‘వాడా’ విచారణకు స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణలో అధికారుల అండదండలతోనే ఇదంతా జరిగిందని తేలడంతో కథ ఆ దేశ నిషేధానికి చేరింది. సాధారణంగా డోపీలపై నిషేధం విధించడం సర్వసాధారణం కానీ... ఇక్కడ అధికారగణం ప్రోద్బలంతోనే ఇదంతా జరగడంతో ఏకంగా రష్యానే నిషేధించాల్సిన పరిస్థితి తలెత్తింది. గత రియో ఒలింపిక్స్ (2016)లో రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లను అనుమతించలేదు. మిగతా క్రీడాకారులను మాత్రం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గొడుగు కింద అనుమతించారు. -
‘నాడా’కు షాకిచ్చారు!
న్యూఢిల్లీ: భారత క్రీడాకారులకు డోపింగ్ పరీక్షలు నిర్వహించే జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పనితీరును ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ప్రశ్నించింది. ‘నాడా’కు చెందిన ల్యాబ్ (ఎన్‌డీటీఎల్)లో ప్రమాణాలు బాగా లేవంటూ ఆరు నెలల పాటు గుర్తింపును రద్దు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌కు ఏడాది కూడా సమయం లేని నేపథ్యంలో సొంత డోపింగ్ సంస్థపై నిషేధం ‘నాడా’ను ఇబ్బంది పరిచే అంశం. ‘ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్ (ఐఎస్ఎల్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఈ వేదికలో సౌకర్యాలు లేవని ‘వాడా’ పరిశీలనలో తేలింది. అందుకే ఈ ల్యాబ్ గుర్తింపు రద్దు చేస్తున్నాం’ అని ‘వాడా’ ప్రకటించింది. తమ గుర్తింపు ఉన్న ల్యాబ్‌లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఇది జరిగినట్లు కూడా వెల్లడించింది. 20 ఆగస్టు, 2019 నుంచి ఎన్‌డీటీఎల్‌పై సస్పెన్షన్ వర్తిస్తుంది. ఇకపై అన్ని రకాల పరీక్షలు నిలిపేయాల్సిందిగా కూడా ‘వాడా’ ఆదేశించింది. అయితే శాంపిల్‌ను తీసుకునే అవకాశం మాత్రం ‘నాడా’కు ఉంది. వాటిని తాము పరీక్షించకుండా ఇతర గుర్తింపు పొందిన సంస్థకు పంపించాల్సి ఉంటుంది. తాజా చర్యపై కోర్ట్ ఆఫ్ ఆర్బిటేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో 21 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఎన్డీటీఎల్కు ఉంది. ఒలింపిక్ ఏడాది కావడంతో కనీసం 5000కు పైగా డోపింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న ‘నాడా’ ఇప్పుడు ఆ పరీక్షలను బయట జరిపితే భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ‘నాడా’పై సస్పెన్షన్ విధించడం పట్ల కేంద్ర క్రీడా శాఖ విస్మయం వ్యక్తం చేసింది. దీని వెనక ‘వాడా’ వాణిజ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ జులనియా అన్నారు. ‘వాడా’ నిర్ణయంపై సీఏఎస్‌లో అప్పీల్ చేస్తామని రాధేశ్యామ్ తెలిపారు. -
‘ఐటా’ జోక్యంపై తలో మాట!
తాను అడగలేదన్న సానియా * ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా * స్పందించారంటున్న సంఘం న్యూఢిల్లీ: ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)కు సంబంధించిన హ్యాకింగ్‌లో వీనస్ విలియమ్స్ పేరు బయటపడిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా)ను సానియా మీర్జా కోరినట్లు వచ్చిన వార్తలపై భిన్నమైన స్పందనలు వచ్చాయి. ముందుగా శుక్రవారం ఉదయం ఈ అంశంపై తాను ఎలాంటి జోక్యం కోరలేదని సానియా ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చింది. ‘ఐటా’ కూడా సానియా గానీ ఆమె తల్లి నసీమా మీర్జా నుంచి గానీ తమకు ఎలాంటి సమాచారం లేదంటూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సానియా దీనిని ఉటంకిస్తూ అన్ని సందేహాలకు ఇదే సమాధానం అని స్పష్టం చేసింది. అయితే సాయంత్రం ‘ఐటా’ దీనిపై మళ్లీ స్పందించింది. తన ప్రకటనలో తప్పు లేదంటూనే ‘వాడా’ అంశంలో జోక్యం చేసుకోవాలని సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా కోరినట్లు ‘ఐటా’ కార్యదర్శి హిరణ్మయి ఛటర్జీ వెల్లడించారు. అరుుతే రాతపూర్వకంగా కాకుండా ఆయన నోటిమాటగానే దీనిని చెప్పారని అన్నారు. దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. -
రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యను సస్పెండ్ చేయండి
‘వాడా’ కమిషన్ నివేదిక జెనీవా: విచ్చలవిడిగా డోపింగ్‌కు పాల్పడుతున్న రష్యా అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఆర్ఏఫ్) అథ్లెట్లపై... 2016 రియో ఒలింపిక్స్‌తో సహా ఏ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా)కు చెందిన ముగ్గురు సభ్యుల ఇండిపెండెంట్ కమిషన్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన చాలా ఆధారాలను సేకరించిన కమిషన్ ఓ భారీ నివేదికను తయారు చేసినట్లు సమాచారం. రష్యా ప్రభుత్వ అనుమతితో డోపింగ్ మోసం ఓ క్రమబద్ధంగా జరుగుతున్నట్లు ఆధారాలతో సహా వెల్లడించింది. ఏమాత్రం విశ్వసనీయత లేని రష్యా ల్యాబ్‌ల్లో అథ్లెట్లకు డ్రగ్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారని తెలిపింది. ఈ పరిణామం చాలా ఆందోళన కలిగిస్తోందని కమిషన్‌కు నేతృత్వం వహించిన ‘వాడా’ మాజీ చీఫ్ రిచర్డ్ పౌండ్ ఆరోపించారు. తాము ఆలోచించిన దానికంటే చాలా ఎక్కువగా మోసం జరుగుతుందన్నారు. ప్రపంచం మొత్తం డోపింగ్ నిబంధనలను పాటిస్తున్నా.. వీటికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న రష్యా సమాఖ్యపై వేటు వేయాలని అంతర్జాతీయ అథ్లెటిక్స్ గవర్నింగ్ బాడీ (ఐఏఏఎఫ్)కి ప్రతిపాదించింది. కమిషన్ నివేదికపై స్పందించేందుకు రష్యాకు శుక్రవారం వరకు గడువు ఇచ్చామని ఐఏఏఎఫ్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో అన్నారు. ఆరోపణలు చూసి షాక్‌కు గురయ్యామని, వాటిపై రష్యా వివరణ ఇవ్వాల్సిందేనన్నారు. -
డోపీలు జాగ్రత్త
కేశగ్రీవ పరీక్ష వచ్చింది క్రీడల్లో పెరిగిన డోపింగ్ జాఢ్యాన్ని అరికట్టేందుకు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా... ఏదో ఒక రూపంలో డ్రగ్స్ తీసుకుని దేశానికి మచ్చ తెచ్చే క్రీడాకారులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో డోపింగ్‌ను పూర్తిగా అరికట్టే విధంగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఓ అడుగు ముందుకు వేసింది. రకరకాల పరిశోధనల తర్వాత కేశగ్రీవ (హెయిర్ ఫొలికల్ టెస్టు-వెంట్రుకను స్రవించే పుటిక) పరీక్షను అమల్లోకి తేనుంది. ఈ టెస్టు ద్వారా క్రీడాకారులు ఏ రూపంలో డ్రగ్స్ తీసుకున్నా ఇట్టే గుర్తించొచ్చని ‘వాడా’ కొత్త బాస్ క్రెయిగ్ రీడ్ చెబుతున్నారు. కొన్నిసార్లు శాంపిల్స్‌ను పరీక్షించినా కచ్చితమైన ఫలితాలు రాబట్టలేని సందర్భాల్లో ఈ టెస్టుతో నిజాన్ని నిగ్గు తేల్చొచ్చని పేర్కొన్నారు. సప్లిమెంట్లు, టాబ్లెట్లు, ఎనర్జీ డ్రింక్స్, రక్త మార్పిడి ఇలా ఎన్ని రకాలుగా డోపింగ్‌కు పాల్పడినా ఈ పరీక్షతో సులువుగా గుర్తించొచ్చు. ఈ కొత్త పరీక్ష కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 10 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధిని కేటాయించింది. చాలా ఏళ్ల కిందటే ఈ పద్ధతిని ఫ్రాన్స్ ప్రోత్సహించినా... పాలకుల నిర్లక్ష్యం... అథ్లెట్ల వ్యతిరేకత వల్ల వెలుగులోకి రాలేకపోయింది. ఇప్పటికైనా రీడ్ ఈ పద్ధతి అమలుకు ఒప్పుకోవడం చాలా సంతోషించిదగ్గ అంశం. ఓ రకంగా చెప్పాలంటే ఇటీవల డోపింగ్ పాజిటివ్స్‌గా తేలిన జమైకా స్టార్లు అథ్లెట్లు వెరోనికా క్యాంప్‌బెల్ బ్రౌన్, అసపా పావెల్, షెరోన్ సింప్సన్‌లకు ఇది పెద్ద దెబ్బే. ఈ కొత్త విధానాన్ని స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ స్వాగతించాడు. కొత్త పరీక్షతో తనకెలాంటి సమస్య లేదన్నాడు. మిగిలిన అథ్లెట్లు కూడా ఈ పరీక్షకు సిద్ధమవుతారా? లేక గతంలో మాదిరిగా వ్యతిరేకిస్తారో చూడాలి.