న్యూఢిల్లీ: ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) భారత్‌లోని జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబోరేటరీ (ఎన్‌డీటీఎల్)పై ఇదివరకే విధించిన నిషేధాన్ని తాజాగా మరో ఆరు నెలలు పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. కచ్చితత్వంతో కూడిన పరీక్షా ఫలితాలు వచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలేవీ ఎన్‌డీటీఎల్‌లో ఇంకా పాటించడం లేదంటూ నిషేధాన్ని కొనసాగించింది. దీంతో వచ్చే జనవరి (2021) దాకా మన ఆటగాళ్ల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని న్యూఢిల్లీలోని ఎన్‌డీటీఎల్‌లో పరీక్షించేందుకు వీలులేదు. అయితే నిషే«ధంపై 21 రోజుల్లోగా అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉంది. గతేడాది ఆగస్టులో తొలిసారిగా ‘వాడా’ మన ల్యాబ్‌ను నిషేధించింది. దీంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) భారత క్రీడాకారుల నమూనాల్ని దోహాలోని ల్యాబోరేటరీకి పంపి పరీక్షలు జరిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment