
రాజమహేంద్రవరం ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు.
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం ఫార్మసీ విద్యార్థిని పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. విద్యార్థిని పరిస్థితి ఆ తల్లిదండ్రులు వివరిస్తుంటే బాధనిపించింది. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమైంది. ఫార్మసీ విద్యార్థిని కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం జరిగేలా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగ అంజలి తల్లిదండ్రులు ఈ రోజు నన్ను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుత పరిస్థితిని నాకు వివరించారు. బాధ్యులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు… pic.twitter.com/NLm75iVpc5
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2025