
విల్లులా శరీరాన్ని వంచుతు చేసే సాహస క్రీడ స్కేటింగ్. అలాంటి స్కేటింగ్‌కి న్యత్యం జత చేసి మంచుపై అలవోకగా చేసే.. ఈ ఫిగర్ స్కేటింగ్ అంతకుమించిన సాహస క్రీడ. అలాంటి కష్టతరమైన సాహస క్రీడలో సత్తా చాటుతూ..మీడియా దృష్టిని ఆకర్షించింది ఈ భారత సంతతి టీనేజర్. ఆమె భారత్ తరఫున ఆడి గెలవడం కోసం తన అమెరికా పౌరసత్వాన్ని తృణప్రాయంగా వదులకుంది. పుట్టి పెరిగిన అమెరికా కంటే భారతవనే తన మాతృదేశం అంటూ..విశ్వ వేదిక మూడు రంగుల జెండాను రెపరెపలాడిస్తోంది. ఈ పాతికేళ్ల యువకెరటం పేరు తారా ప్రసాద్. ఈ అమ్మాయి సాధించిన విజయాల గురించి వివరిస్తూ..మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో మహీంద్రా తారను అభినందనలతో ముంచెత్తారు. దీంతో ఒక్కసారిగా ఎవరీ అమ్మాయి అంటూ ఇంటర్నెట్‌లో సర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ ఈ టెక్ దిగ్గజం ఆనంద్ మెచ్చిన ఆ యువ తార ఎవరో చూద్దామా..!
ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన కథలు పంచుకుంటూ ఉండే ఆనంద్ మహీంద్రా ఈసారి ఫిగర్ స్కేటర్ తారా ప్రసాద్‌ని ప్రశంసిస్తూ పోస్టు పెట్టారు. దానికి తారా చేసిన ఫిగర్ స్కేటింగ్ వీడియోని కూడా జత చేశారు. ఆ ఫిగర్ స్కేటింగ్ చూస్తే.. ఎవ్వరైనా కళ్లు ఆర్పడం మర్చిపోతారు. అంతలా ఒళ్లు జల్లుమనేలా ఉంటుంది ఈ క్రీడ. అందువల్లే ఈ బిజినెస్ దిగ్గజం మహీంద్రా ఆమె అద్భుత ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు మహీంద్రా పోస్ట్‌లో.."ఇటీవల తన స్నేహితుడొకరు ఈ అమ్మాయి స్కేటింగ్ ప్రతిభకు సంబంధించిన వీడియో పంపించేంత వకు ఆమె గురించి నాకు తెలియదు. ఓ వైపు నృత్యం చేస్తూ..మరోవైపు గాలలో ఎగురుతూ.. చేస్తున్నా ఆమె ఫిగర్ స్కేటింగ్‌కి విస్తుపోయే. ఆమె అద్భుత ప్రతిభ నన్ను ఎంతగానో కట్టిపడేసింది.అంతేగాదు ఆమె భారత్‌కి ప్రాతినిథ్యం వహించాలన్న ఉద్దేశ్యంతో 2019లో అమెరికా పౌరసత్వాన్ని భారతీయ పౌరసత్వంగా మార్చుకుంది.
ఏకంగా మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో గెలుపొందింది. గతేడాది వింటర్ ఒలింపిక్స్‌లో మీరు తృటిలో స్థానం కోల్పోయినా..వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌లో తప్పక విజయం సాధిస్తారు. ఆ విశ్వక్రీడలపై దృష్టిపెట్టి ఒలింపిక్స్ పతక కలను సాకారం చేసుకో తల్లి." అని ఆశ్వీరదీస్తూ మహీంద్రా పోస్ట్‌లో రాసుకొచ్చారు.
తారా ప్రసాద్ ఎవరు?
ఫిబ్రవరి 24, 2000లో అమెరికాలో జన్మించింది తారా ప్రసాద్. ఆమె కుటుంబం తమిళనాడు నుంచి వలస వచ్చి అమెరికాలో స్థిరపడింది. అయితే ఆమె అక్కడే పుట్టి పురిగినా..తన మాతృదేశంపై మమకారం వదులుకోలేదు. అందుకు కారణం తన తల్లిదండ్రులే అని సగర్వంగా చెబుతోంది తార. చిన్నప్పుడు స్కేటింగ్ షూస్ కట్టుకుని మంచుగడ్డలపై ఆడుకునేది. అయితే పెద్దయ్యాక దాన్నే ఆమె కెరియర్ ఎంచుకుంటుందని ఆమె కుటుంబసభ్యులెవ్వరూ అనుకోలేదట.
ఏమాత్రం పట్టు తప్పిన ప్రమాదాలు జరిగే క్లిష్టమైన ఫిగర్ స్కేటింగ్ క్రీడను ఎంచుకుంది తార. ఇది ఒక కష్టసాధ్యమైన కళాత్మక క్రీడ. చెప్పాలంటే నృత్యం, స్కేటింగ్ మిళితం చేసే ఒక అద్భుత ప్రదర్శన. అలాంటి క్రీడలో కఠోర సాధనతో నైపుణ్యం సాధించింది.
భారత్ తరుఫున ప్రాతినిథ్యం వహంచింది..
2016లో 'Basic Novice' పోటీల్లో (14 ఏళ్ల లోపు వారు పోటీ పడే కాంపిటీషన్స్) పాల్గొనడంతో మొదలుపెట్టి.. క్రమంగా 'Intermediate Novice' పోటీలు (16 ఏళ్ల లోపు వారు).. ఆపై 'Advanced Novice' (10-16 ఏళ్ల లోపు అమ్మాయిలు) పోటీల్లో సత్తా చాటింది. 2020 నుంచి సీనియర్ విభాగంలో.. భారత్ తరపున బరిలోకి దిగింది. ఆవిధంగా తార 2022, 2023, 2025 సంవత్సరాల్లో భారత జాతీయ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది.
అయితే.. సియోల్లో ఇటీవలే ముగిసిన 'ఫోర్ కాంటినెంట్స్ ఫిగర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025లో 16వ స్థానంతో సరిపెట్టుకుందీ ఈ టీనేజర్. భారత్లో క్రికెట్‌కి ఉన్నంత ఆదరణను పిగర్ స్కేటింగ్‌కి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానంటోంది తార. వచ్చే ఏడాది జరగనున్న 'వింటర్ ఒలింపిక్స్'పై దృష్టి సారించి విజయం సాధించడమే తన లక్ష్యం అని చెబుతోంది. మరీ ఆ యువతారకి ఆల్‌ద బెట్ చెప్పి.. మరిన్ని విజయాలను సొంతం చేసుకుని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుందాం.
Hadn’t heard about Tara Prasad’s accomplishments till a friend recently sent me this clip.
Apparently Tara switched her U.S citizenship to an Indian one in 2019 and has since been our national skating champ three times.
Well done, Tara. I hope you are in the vanguard of… pic.twitter.com/GK4iL4VrVh— anand mahindra (@anandmahindra) March 11, 2025
(చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..)
Comments
Please login to add a commentAdd a comment